10, ఆగస్టు 2017, గురువారం

God దేవుడు


దేవుడు


వికీపీడియా నుండి
దేవుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు,1))సర్వాంతర్యామి,2)నిష్కలంకుడు 3) మానవుల పాపాలను క్షమించే వాడు,4) నిజమైన మార్గాన్ని చూపించేవాడు ,5)పాపములను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు, ,6)నడిపేవాడు,7)దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే,8)ఆధికాలమున ఒక్కడే దేవుడు అంతకాలము ఒక్కడే దేవుడు,9)ఎటువంటి పాపము లేనివాడు,10)పాపము చేయనివాడు11)జన్మ పాపము కర్మ పాపము లేనివాడు,12)సథ్యమును బోధించువాడు. దేవున్ని మరచి అనగా సృష్కకర్తను మరచి సృష్టిని పూజించుట వలన ఏమి లభము, సృష్టిని పూజించుట వలన అధి నిన్ను అజ్ఞానములొకి,పాపములోనికి తీసుకపొతుంది. "ఫ్ర్యాంకి"
బొద్దు పాఠ్యం
వ్యాసముల క్రమము
దేవుడు


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితము
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతములలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతములో
సిక్కు మతములో · బౌద్ధమతములో



దేవుడు లేదా దైవం ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.[1]ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు. బహుదేవతారాధకులుధార్మిక వేత్తలు, (Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామిసర్వజ్ఞుడుకరుణామయుడుసర్వలోకాల ప్రభువుసృష్టికర్త మరియు అంతములేనివాడు.
మెనూ
0:00
దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.[1] ఈ పేర్లన్నీ హిందూమతముయూదమతముక్రైస్తవ మతముఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్,[2] అల్-ఘజాలి,[3] మరియు మైమోనిడ్స్, ఆపాదించారు.[2] మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.[4] మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, మరియు దేవుని ఉనికిని ప్రశ్నించారు. న


"దేవుడు" నిర్వచనం

దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.
"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".[పోతన భాగవతం: గజేంద్ర మోక్షం]

భాషా విశేషాలు

తెలుగు భాషలో దేవుడు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[5] దేవుడు నామవాచకంగా God. A deity, దేవతవేలుపు అని అర్ధం. దేవ విశేషణంగా ఉపయోగిస్తారు. Of God, దేవుని యొక్క. దేవకాంచనము ఒక రకమైన చెట్టు Bauhinia purpurea. దేవత అనే పదాన్ని దేవుళ్ళలో స్త్రీలకు వాడతారు A deity, generally a goddess; but also a god. గ్రామదేవత అనగా the village goddess. దేవతరువు అనగా కల్పవృక్షము. దేవతాజీవము n. A godlike or harmless creature. ఉదా: "ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా." వేమన పద్యం. దేవతాడిచెట్టు n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగి చెట్టు. దేవత్వము లేదా దైవత్వము అనగా Divinity, deification, apotheosis. దేవదత్తము అర్జునుని శంఖము పేరు. దేవదత్తుడు మరియు యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారు లేదా దేవదారువు n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారల దేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి n. A dancing girl employed in a temple. దేవనాగరి n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము n. Divinity, దేవత్వము. దేవమణి n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడి విశేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. కాస్తుభము. (q. v.) దేవమాతృకము అనగా A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము n. The car or vehicle of a god, దేవతా విమానము. దేవర అనగా God. దేవుడు కాకుండా A lord or master స్వామి అని కూడా వాడతారు. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటి దేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు దేవాజీవి or దేవాజీవుడు అనగా గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము n. A temple, గుడిదేవాలయము. దేవవర్ధకి n. The "artist of the gods," a title of Visvakarma. దేవసరులు n. A sort of grain. దేవాంబరము n. A sort of cloth. దేవాదాయము n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము అనగా The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాం ప్రియుడు n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. దేవి n. A goddess, particularly Parvati పార్వతి. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.

దేవుని రూపం

మూడు వాదాలున్నాయి:
  • 1. రూపరహితుడు - నిర్గుణ నిరాకారుడు
  • 2. రూపరహితుడు - సాగుణ నిరాకారుడు
  • 3. సరూపుడు - సాగుణ సాకారుడు

వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం

  • రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-- వేటూరి
  • మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
  • దేవుడికేం హాయిగ ఉన్నాడు-ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
  • పిల్లలూ దేవుడూ చల్లనివారే
  • రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
  • ఎంతో రసికుడు దేవుడు
  • మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరధి

వివిధ మతాలలో నమ్మకాలు

యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఏకేశ్వరుణ్ణి నమ్ముతారు. దేవుడిని యెహోవా, అల్లాహ్ అని సంబోధిస్తారు.
క్రైస్తవులు త్రితత్వాన్ని నమ్ముతారు (అనగా దేవుడు, పరిశుద్ధాత్మ, క్రీస్తు). అరబ్ క్రైస్తవులు దేవున్ని అల్లాహ్ అందురు. "అల్లాహ్ అల్ ఆబా" అనగా "God the Father" అని, "ఐబ్న్ అల్లాహ్" అనగా "దేవుని పుత్రుడు" అని అర్థాలు ఉన్నాయి. క్రీస్తు దేవుని బిడ్డ కనుక అరబ్ క్రైస్తవులు క్రీస్తుని ఇబ్న్ అల్లాహ్ అంటారు. యూదులు ముస్లింల లాగ ఏకైక దేవున్ని నమ్ముతారు (దేవుని విషయములో యూదులు, ముస్లింలు మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి).

దేవుడున్నాడా, లేడా?

ఇది ఒక సంక్లిస్టమైన ప్రశ్న. ఎందుకంటే ఇది ఈ ప్రశ్న ఉత్పన్నమైనపుడు మతపరమైన విశ్వాసాలతో ముడిపెట్టి చాలా మంది సమాధానం చెబుతూ ఉంటారు. కాని సైన్స్ ప్రకారం చూస్తే దేవుడి ఉనికి లేదా దైవత్వానికి సంబంధించి చర్చ ఎక్కడా చూడము. అంటే దేవుడు అనే పదం కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించినది మాత్రమే తప్ప శాస్త్రానికి ( Science)సంబంధింనది కాదు. సైన్స్ ప్రకారం చూసినపుడు దేవుడు లేడనే సమాధానం వస్తుంది. కాని నూటికి తొంబై శాతం మంది తాము చదివిన శాస్త్రంకంటే మతాన్ని, మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం వలన "దేవుడు" ఉనికి మానవ సమాజంలో సజీవంగా ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు సమాధానం-మతపరంగా ఉన్నాడు. సైన్స్ ప్రకారం లేడు. కాని విశ్వాన్ని నడిపించే ఓ అద్రుశ్య శక్తి మాత్రం ఉంది. అదే COSMIC ENERGY
మనిషికి మనిషే మిత్రువు
మనిషికి మనిషే శత్రువు
మనిషికి మనిషే దేవుడు
మనిషికి మనిషే దెయ్యము
విశ్వదాభిరామ వినురవేమ .................
ఈ పద్యము వేమన శతకంలో ఉన్నాదా? లేక నేటి మానవిక కవి సృస్టేనా?. మహానుభావుల జాబు కోసం ఎదురుసూస్తునాను .

ఒకే దేవుడా?

okay devudu vunnadu e lokamlo ma yokka swachamaina manasunay, mana paramathanay, enkokariki sahayam cheyadamay divamm

వివిధ భక్తుల భావనలు


దేవుడు ఆడా?మగా?

వివిధ తెగల, మరియు జానపద నిర్వచనాలు

  • ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు. అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
  • ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.
  • "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళలో ప్రజలు ఎప్పుడో పాడారు.

ఇవి కూడా చూడండి

త్రిమూర్తులు

వికీపీడియా నుండి
హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

త్రిమూర్తులు
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.

త్రిమూర్తులు యాదగిరి గుట్టదారిలోని సురేంద్రపురి నందు


వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.

హళెబీడులో హొయసలేశ్వరస్వామి మందిరంలో త్రిమూర్తుల శిల్పాలు.

విశేషాలు

  • ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
  • ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.
  • బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు. ఆదిని నిర్గుణస్వరూపుఁడు అయిన ఈశ్వరుఁడు (శుద్ధబ్రహ్మము లేక శుద్ధచైతన్యము) "బహుస్స్యాం" అని సంకల్పించి సృష్టి చేయ ఉద్యమించెను. ఈ సంకల్పస్థితియందు ఆబ్రహ్మము ప్రకృతిపురుషస్వరూపుఁడు అగుచు సత్వరజస్తమోగుణాత్మకుఁడై ఉండెను. ఆస్వరూపమునందు అతఁడు శబళబ్రహ్మము లేక మాయావచ్ఛిన్నచైతన్యము అనఁబడును. అది అతనికి మాయోపాధిచే అనఁగా ప్రకృతి సంబంధముచేత కలిగెను. మాయ అన విచిత్రసృష్టికి హేతువు: ప్రకృతి అన మహదాది వికారములకు కారణము. ఇది జ్ఞానవిరోధిగా ఉండుటవలన ఆవిద్య అనియు చెప్పఁబడును. అట్టి ప్రకృతి సంబంధముగల శబళబ్రహ్మ స్వరూపమునందు (అనఁగా కేవల సంకల్పస్థితియందు) సత్వరజస్తమోగుణములు మూఁడును సమములు అయి ఉండును. సత్వము జ్ఞానసుఖములను వానియందు ఇచ్చను పుట్టించుచు ఉంది. ఇది విష్ణురూపము అయ్యెను. రజస్సు రాగతృష్ణలయందు సంగమమును పుట్టించుచు ఉంది. ఇది చతుర్ముఖబ్రహ్మ స్వరూపము అయ్యెను. తమస్సు విపరీతజ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచు ఉంది. ఇది లయ కారణము అగుటవలన రుద్రస్వరూపము అయ్యెను. ఆసంకల్పస్థితి వదలి ఈశ్వరుఁడు సృష్టిక్రియారూపుఁడు కాఁగానే ఈసత్వరజస్తమోగుణములకు వైషమ్యము కలిగెను. అదియే మహత్తత్వ స్వరూపము. అది సాత్వికము రాజసము తామసము అని మూఁడువిధములు కలది. ఆస్థితియందు బ్రహ్మము సూత్రబ్రహ్మము (లేక అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము) అనఁబడును. ఈస్వరూపమున అతఁడు నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియించెను. ఆ స్రష్టృసృజ్య తాదాత్మ్యస్వరూపమైన బ్రహ్మము విరాడ్రూపము అనఁబడు జ్ఞానమాత్రతాదాత్మ్య స్వరూపము విష్ణుస్వరూపము.
విరాడ్రూపస్థితియందు చిత్స్వరూపమైన జ్ఞానమును వృత్యవచ్ఛిన్యచైతన్యము అందురు; జ్ఞానశూన్యమై వికారాస్పదమై ఉండుదానిని విషయావచ్ఛిన్నచైతన్యము అందురు. అట్లు విరాట్సరూపుఁడు అయిన బ్రహ్మమువలన నుండి ప్రపంచసృష్టి కలిగెను. ఎట్లు అనిన:
1. తమస్సృష్టి. తమస్సు - మోహము - మహామోహము - తమిస్రము - అంధతమిస్రము; ఇందుండి చేతనములేని స్థావరసృష్టి కలిగెను.
2. తిర్యక్సృష్టి. పశుపక్ష్యాదులు.
3. దేవసృష్టి. తుష్టాత్ములై నిత్యానందులై కేవల సాత్వికభూతులైనవారు ఈసృష్టియందు పుట్టిరి. "నహదేవా అశ్నంతి నపిబంతి ఏతదేవామృతం దృష్ట్వాతృప్యతి" అని సాత్వికమునకు ప్రమాణము.
4. అర్వాక్సృష్టి. తమ ఉద్రేకులు అయి దుఃఖబహుళములు కలిగి కర్మశీలులు అయిన మనుష్యుల సృష్టి.
5. అనుగ్రహసృష్టి. ఇది సాత్వికతామసమిశ్ర గుణములు కల జంతురాశి సృష్టి.
6. కౌమారసృష్టి. ఇది ప్రాకృతము వైకృతము అని రెండువిధములు. ఈసృష్టియందే సనత్కుమారాదులు పుట్టినది.
ఈయాఱును మహాత్సృష్టి, పంచతన్మాత్రసృష్టి, పంచభూతేంద్రియసృష్టి అను మూటితో చేరి తొమ్మిది సృష్టులు అగుచు ఉన్నాయి. ఇది నవవిధిసృష్టి వివరణము.
ఈ సత్వరజస్తమో గుణాత్మకులైన త్రిమూర్తులు తమతమ అంశములను ఒకరొకరు పంచుకొనియు ఉందురు. ఆస్థితియందు వారికి నామాంతరములు ఉన్నాయి. అవి విష్ణువ్యూహము, బ్రహ్మవ్యూహము, రుద్రవ్యూహము అనఁబడును.
విష్ణ్వంశము బ్రహ్మాంశము రుద్రాంశము వి. ప్రద్యుమ్నుఁడు సంకర్షణుఁడు అనిరుద్ధుఁడు బ్ర. మనువు దక్షుఁడు యముఁడు రు. మృడుఁడు భవుఁడు హరుఁడు

ఇవి కూడా చూడండి

బ్రహ్మ


హిందూ సంప్రదాయంలో స్థానం


కమలంపై బ్రహ్మ
సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పంఅంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు.

ప్రస్థావన

త్రిమూర్తులలో ఒక్కఁడు.
తొల్లి కల్పావసానమున సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారబంధురముగ ఉండువేళ ఆజలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయియై యోగనిద్రను తేలుచు ఉండి వరాహరూపమును ఒంది తన దంష్ట్రాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపఁగా ఇతఁడు ఆపంకజోదరుఁడు అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎఱిఁగి ఆదేవుని నాభికమలమునందుండి వెడలివచ్చి జగత్సృష్టి ఒనర్ప ఆరంభించెను. కనుక ఇతనికి పంకజభవుఁడు అను నామము కలిగెను.
ఇతఁడు చతుర్ముఖుడు. తొలుత ఇతనికి అయిదు ముఖములు ఉండెను. ఒక కాలమునందు త్రిమూర్తులు కొలువుతీరి ఉండఁగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖులు అగు శివబ్రహ్మలు ఇరువురిని చూచి ఇతఁడు శివుఁడు ఇతఁడు బ్రహ్మ అని తెలిసికోలేక పిమ్మట శివుని కనుసైఁగచేత ఎఱిఁగి చేరఁబోయెను. అప్పుడు శివుడు తన భార్యకు ఇంత భ్రమ పుట్టుటకు కారణము బ్రహ్మకును అయిదు తలలు ఉండుటయె కదా అని అతని తలలో ఒకటిని శివుడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుడు కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయునట్లు శపించెను. ఆబ్రహ్మహత్యాపాపము పోవుటకై విష్ణువుయొక్క ఉపదేశమున శివుడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్రచేయుచు కాశిక్షేత్రమునకు రాగా అచట ఆపాపమువలన విముక్తుడు అయ్యెను.
ఇతని విధి సృష్టిచేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో తొమ్మండ్రు ప్రజాసృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అనబడిరి. వారు మరీచి, అత్రి, అంగిరసుఁడు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, భృగువు, వసిష్ఠుఁడు, దక్షుఁడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుడు, సనందనుడు, సనత్సుజాతుఁడు, సనత్కుమారుడు, బుభుడునారదుడుహంసుడుఅరుణియతి మొదలు అగువారు ముఖ్యులు. వీరు అందఱును ఊర్ధ్వరేతస్కులు అయి సృష్టియందు ఇచ్ఛలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుచు ఉందురు.
బ్రహ్మయొక్క ఛాయవలన కర్దముడు పుట్టెను. భ్రూమధ్యమువలన అర్ధనారీశ్వరుడు అగు రుద్రుడు పుట్టెను.
ఈ ప్రజాపతుల యొక్కయు, మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలువిధములుగ చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నరీతిని బ్రహ్మయొక్క అంగుష్ఠమున దక్షుఁడును, నాభిని పులహుడును, కర్ణముల పులస్త్యుడును, త్వక్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున అంగిరసుడును, ప్రాణమున వసిష్ఠుఁడును, మనమున మరీచియు, కన్నులయందు అత్రియు పుట్టిరి. మఱియు నారదుఁడు ఊరువులను, దక్షిణస్తనమువలన ధర్మమును, వెన్నువలన అధర్మ మృత్యువులును, ఆత్మను కాముడును, భ్రూయుగళమున క్రోధుడును పుట్టినట్లు చెప్పి ఉంది. ఇదిగాక బ్రహ్మ తన దేహమునుండి సరస్వతి జనింపగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామాతురుడు అయి భార్యగా చేసికొనెను.

బ్రహ్మ మానస పుత్రులు

ప్రధాన కథ

  • బ్రహ్మ విసిరిన పద్మం
పుష్కరతీర్థం ఆవర్భవించిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మేరు పర్వతం మీద శ్రీనిధానం అనే ఓ శిఖరం ఉంది.

మత సంప్రదాయాలు

పేర్లు, అవతారాలు

గ్రంధాలూ, పురాణాలూ

దేవాలయాలు


పుష్కర్ లోని బ్రహ్మదేవుడు

చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం.
బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్థించినా, బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది అజ్మీర్ దగ్గరలోని పుష్కర్వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం ఉంది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉంది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది కంబోడియా లోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం.


Nomula Prabhakar Goud

విష్ణువు

వికీపీడియా నుండి

ద్వారకా తిరుమలలో శ్రీ మహావిష్ణువు శిల్పం.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకడు. బ్రహ్మనుసృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవంసంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.[1] యజుర్వేదంఋగ్వేదంభాగవతంభగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.
విష్ణు సహస్రనామ స్తోత్రం[7]లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది - నీలమేఘశ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించినవాడు, శ్రీదేవి, భూదేవిలచే కొలువబడుచున్నవాడు, శ్రీవత్సచిహ్నమును, కౌస్తుభమును, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు.
యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు. అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యముగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుతాడు.

పాలసముద్రంలో శేషశయనుడైన విష్ణువు, పాదసేయుచున్న శ్రీదేవి, నాభి పద్మంలో బ్రహ్మ - 1870 నాటి చిత్రం

    విశ్వం, విష్ణుః వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః


    13 వశతాబ్దంలో కాంబోడియాకు చెందిన విష్ణువు విగ్రహం
    "విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్ధం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్ధాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్ధం. "వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్‌ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామ పదాలు హిందూ సంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్ధానికి అతీతుడు. (He is not limited by space, time or substance.) [11]
    భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి -
    • జగం ఎవనిచే జనిస్తుంది? ఎవ్వనిలో ఉంటుంది? ఎవ్వనిలో అంతమవుతుంది?
    • పరమేశ్వరుడు (అందరికీ దేవుడు) ఎవ్వడు?
    • అంతటికీ మూలం ఎవ్వడు?
    • మొదలు, మధ్య, తుది లేనివాడు (అనంత మూర్తి) ఎవ్వడు?
    • అంతా తానైనవాడెవ్వడు?
    • ఆత్మ భవుడు (తనంత తానే జనించినవాడు),
    అయితే సామాన్య పూజాదిక సంప్రదాయాలలోను, విశేషించి శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోను శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు, శేష శయనుడు, శ్రీలక్ష్మీ సమేతుడు, నీలమేఘ శ్యాముడు, పరిపూర్ణుడు అయిన పురుషోత్తమునిగా ఆరాధింపబడుతాడు.

    వేదాలలో విష్ణువు


    గరుఢారూఢులైన లక్ష్మీనారాయణులు - 1730 నాటి చిత్రం
    నాలుగు వేదాలు హిందూమతానికి మూలగ్రంధాలని చెప్పవచ్చును. వీటిలో అన్నింటికంటే పురాతనమైనదని భావించే ఋగ్వేదంలో విష్ణువును స్తుతిస్తూ ఐదు సూక్తులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంతభాగం విష్ణువును గురించి ఉంది. వేదాలలో విష్ణువును గురించి మూడు ముఖ్యలక్షణాలు తరచు ప్రస్తావింపబడినాయి - (1) మూడు పెద్ద అంగలు వేసినవాడు (త్రివిక్రముడు). మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు (2) పెద్ద శరీరం కలిగినవాడు (వరాహమూర్తి). జగత్తంతా వ్యాపించి ఉంటాడు. (3) యువకుడు, నవ యవ్వనుడు. ఇంకా విష్ణువు తన గుర్రాలను (రోజులను) వాటి ఆరు పేర్లతో (ఋతువులతో) చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పబడింది. విష్ణువు స్వభావంలో మరొక ముఖ్యాంశం ఇంద్రునితో స్నేహం. వృత్రాసురునితో యుద్ధం చేసేటపుడు, అనంతర రాక్షస సంహారంలోను ఇంద్రునికి విష్ణువు సహకరించాడు.[12].
    ఒక వివరణ ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి. దేవతలు ఓడిపోయినా గాని ఏదో ఒక ఉపాయం వలన చివరికినెగ్గుకొచ్చేవారు అని ఐతరేయ బ్రాహ్మణములో ఉంది. శతపథ బ్రాహ్మణములో ఒక కథ ప్రకారం యుద్ధానంతరం విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకొన్నారు. అప్పుడు విష్ణువు లోకాలను, వేదాలను, వాక్కును తన మూడడుగులతో ఆక్రమించాడు. అదే వామనావతారము. శతపథ బ్రాహ్మణములో "ఏమూష" అనే పేరుగల వరాహం భూమిని నీటినుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. తైత్తరీయ సంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారమని ఉంది. అదే వరాహావతారము. శతపథ బ్రాహ్మణములో మనువునుప్రళయంనుండి ఒక చేప కాపాడుతుంది అని ఉంది. అదే మత్స్యావతారము. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే కూర్మావతారముయజ్ఞో వై విష్ణుః - అనగా యజ్ఞము విష్ణు స్వరూపము - అని వేదంలో చెప్పబడింది.[12]
    ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... -- సృష్టి ప్రారంభంలో పరమపురుషుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అతడు సృష్టి చేయాలనుకొన్నాడు. అప్పుడు నారాయణుని శరీరంనుండి హిరణ్యగర్భుడు పుట్టాడు.. ...
    ఋగ్వేదంలో ఇలా ఉంది -
    అథ నిత్యో నారాయణః, బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః,నారాయణ ఏవేదగ్‌ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః,న ద్వితీయోఽస్తి కశ్చిత్, య ఏవం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి, ఏతద్యజుర్వేద శిరోఽధీతే -- నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్నిదిశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము..

    పురాణేతిహాసాలలో విష్ణువు

    మత సాంప్రదాయాలు

    అద్వైతంలో విష్ణువు

    విశిష్టాద్వైతంలో విష్ణువు

    విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[12]
    నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి
    1. అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
    2. విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
    3. వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
    4. సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
    5. అంతర్యామి - సకల జీవనాయకుడు.
    భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు - (1) అభిగమనము (2) ఉపాదానము (3) ఇజ్యము (4) స్వాధ్యాయము (5) యోగము

    ద్వైతంలో విష్ణువు

    ఇతర సంప్రదాయాలు

    అవతారాలు


    విష్ణుమూర్తి విశ్వరూపం
    1. మత్స్యావతారము
    2. కూర్మావతారము
    3. వరాహావతారము
    4. నరసింహావతారము
    5. వామనావతారము
    6. పరశురామ అవతారము
    7. రామావతారము
    8. కృష్ణావతారము
    9. బుద్ధావతారం
    10. కల్కి అవతారము

    గ్రంథాలూ, పురాణాలూ

    దేవాలయాలు

    ఆచారాలు, పండగలు

    ప్రార్థనలు, స్తోత్రాలు

    ఇవి కూడా చూడండి



    •  శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.[1]
      శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు.[2]శైవంవైష్ణవంశాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు[3].
      శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు) మరియు రూపాతీతుడు.

        వ్యుత్పత్తి


        పుట్టుక
        [మూలపాఠ్యాన్ని సవరించు]ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.
        శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే ఆందరు దేవతలు శివారదకులే.విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగారదన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు.
        మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉంది.

        శివుని రూపం

        పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

        రెండు స్వరూపాలు

        శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. ఆవి రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జగ్రత్తగా పరిశిలిస్తే మహదేవుణ్ణి రెండు రుపాలలో గమనిస్తాము.

        హిందూ సాంప్రదాయంలో స్థానం


        Dakshinamurti Shiva sculpture on the southern entrance of the Madurai Meenakshi Temple
        ప్రధాన వ్యాసం: దక్షిణామూర్తి
        దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. శివుని 
        • ఆదిదేవుడు
        • రుద్రుడు
        • పరమశివుడు
        • గంగాధరుడు
        • గౌరీపతి
        • నటరాజు
        • కైలాసాధిపతి
        • పశుపతి
        • గరళకంఠుడు
        • హరుడు

        గ్రంథాలూ, పురాణాలూ

        దేవాలయాలు

        ప్రధాన వ్యాసం: శివాలయం
        శివుని లింగరూపములోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తున్నది. శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు. మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపములోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు. శివలింగాలు నాలుగు రకాలు. అవి దైవికాలు, ఆర్షకాలు, బాణలింగాలు, మానుషాలు.
        ( శ్రీశైలం 6.వ. భాస్కర క్షేత్రమని నిరూపించ బడినది / సిరిపురపు మల్లికార్జునశర్మ- శ్రీశైలంప్రాజెక్టు. )
        

        ఆచారాలు, పండగలు

        భాస్కర క్షేత్రాలు

        భాస్కర క్షేత్రాలు పది. అవి-
        1. కాశీ
        2. పుష్పగిరి,
        3. కాంచీ,
        4. నివృత్తి (శృంగేరి),
        5. అలంపురి,
        6. శ్రీశైలం,
        7. శ్రీ విరూపాక్షం (హంపి),
        8. సేతు (రామేశ్వరం),
        9. కేదర్నాథ్,
        10. గోకర్ణం.
        11. ఖమ్మం
        12. అమరావతి

        పంచ కేదారాలు

        కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. కాఠ్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.

        కేదారినాధ్

        ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిధియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

        తుంగనాధ్

        పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

        రుద్రనాధ్

        పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనదిగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

        మధ్య మహేశ్వర్

        పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

        కల్పనాధ్

        పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.

        ప్రార్థనలు, స్తోత్రాలు

        ఇవి కూడా చూడండి

      కామెంట్‌లు లేవు:

      కామెంట్‌ను పోస్ట్ చేయండి