సానియా మీర్జా
పూర్తి పేరు | Sania Mirza |
---|---|
దేశము | India |
నివాసము | Hyderabad, Telangana, India |
జననం | నవంబరు 15, 1986 |
ఎత్తు | 1.73 metres (5 ft 8 in) |
కళాశాల | St. Mary's College |
ప్రారంభం | 2003 |
ఆడే విధానం | Right-handed (two-handed backhand) |
బహుమతి సొమ్ము | US $6,570,862[1] |
Singles | |
సాధించిన రికార్డులు | మూస:Tennis record |
సాధించిన విజయాలు | 1 WTA, 14 ITF |
అత్యుత్తమ స్థానము | No. 27 (27 August 2007) |
Grand Slam Singles results | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | 3R (2005, 2008) |
French Open | 2R (2007, 2011) |
వింబుల్డన్ | 2R (2005, 2007, 2008, 2009) |
యు.ఎస్. ఓపెన్ | 4R (2005) |
Other tournaments | |
Olympic Games | 1R (2008) |
Doubles | |
Career record | మూస:Tennis record |
Career titles | 41 WTA, 4 ITF |
Highest ranking | No. 1 (13 April 2015) |
Current ranking | No. 7 (20 March 2017) |
Grand Slam Doubles results | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2016) |
French Open | F (2011) |
వింబుల్డన్ | W (2015) |
US Open | W (2015) |
Other Doubles tournaments | |
Championships | W (2014, 2015) |
Olympic Games | 2R (2008) |
Mixed Doubles | |
Career titles | 3 |
Grand Slam Mixed Doubles results | |
Australian Open | W (2009) |
French Open | W (2012) |
వింబుల్డన్ | QF (2011, 2013, 2015) |
US Open | W (2014) |
Other Mixed Doubles tournaments | |
Olympic Games | SF (2016) |
Last updated on: 20 March 2017. |
సానియా మీర్జా (జననం:1986 నవంబరు 15) భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి[2][3]. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెం.1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు. సానియా కెరీర్ మొదట్నుంచే అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. ఎక్కువ పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణి.[4][5]
ఆమె సింగిల్స్ కెరీర్ లో స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించిన మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి క్రీడాకారిణులపై గుర్తించదగిన విజయాలు నమోదు చేసుకున్నారు. 2007లో సింగిల్స్ లో ప్రపంచవ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచారు. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా క్రీడాకారిణిగా ప్రసిద్ధి చెందారామె. మణికట్టు కు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల సింగిల్స్ కు దూరమయ్యరు. కానీ డబుల్స్ లో ప్రప్రంచ నెం.1 ర్యాంకు సాధించారు[6]. తన కెరీర్ లో 1 మిలియన్ డాలర్ల(ఇప్పుడు 5 మిలియన్ డాలర్లు) సంపాదించడంతో పాటు, ఆరు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టైటిళ్ళను సంపాదించి స్వంత దేశానికి మంచి పేరు తెచ్చారామె. మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లోను ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్_2014లో అర్హత సాధించుకోవడంతో పాటు టైటిల్ కూడా గెలుచారు[7].
గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ మహిళ సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించుకున్నారు. అందులో 6 బంగారు పతకాలు.
అక్టోబరు 2005లో టైం పత్రిక సానియాను "50 హీరోస్ ఆఫ్ ఆసియా"గా పేర్కొంది. ది ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఆమెను "33 విమెన్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్" జాబితాలో చేర్చింది. 2013 నవంబరు 25లో మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణాసియా నుండి యుఎన్ మహిళల సౌహార్ధ అంబాసిడర్ గా సానియాను నియమించారు.
బాల్యం
సానియా మీర్జా 1986 నవంబరు 15లోమహారాష్ట్రలోని ముంబైలో పుట్టారు. తండ్రి ఇమ్రాన్ మీర్జా బిల్డర్, తల్లి నసీమా ముద్రణ రంగ వ్యాపారంలో పనిచేసేవారు. సానియా పుట్టిన కొంత కాలానికి వారు హైదరాబాద్ కు వచ్చేశారు. తన చెల్లులు అనమ్ తో పాటు సానియా సంప్రదాయ కుటుంబంలో పెరిగారు. క్రికెట్ క్రీడాకారుడు గులాం అహ్మద్ కు దూరపు చుట్టం సానియా. పాకిస్థాన్ క్రీడాకారుడు అసిఫ్ ఇక్బాల్ కూడా ఆమెకు దూరపు బంధువే. ఆమె ఆరవ ఏటనే టెన్నిస్ ఆడటం ప్రారంభించారు. సానియా మొదటి కోచ్ ఆమె తండ్రి కాగా తరువాత రాగర్ అండ్రసన్ వద్ద నేర్చుకున్నారు.
హైదరాబాద్ఃలోని నసర్ స్కూల్ లో చదువుకున్న ఆమె, సెయింట్ మెరిస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 2008 డిసెంబరు 11న చెన్నైలో ఎం.జి.ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి ఇన్సిటిట్యూట్ ఆమెకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ విభాగంలోడాక్టరేట్ ఇచ్చి గౌరవించింది[8]. సానియా ఈతలో కూడా ప్రావిణ్యురాలు
టెన్నిస్ కెరీర్
2001-2003: జూనియర్ ఐటిఎఫ్ సర్కూట్ లో విజయం
సానియా మీర్జా తన ఆరవ ఏటనే టెన్నిస్ ఆడటం మొదలుపెట్టినా వృత్తిగా స్వీకరించింది మాత్రం 2003లోనే. ఆమె తండ్రే మొదటి గురువు. జూనియర్స్ విభాగంలో సానియా సింగిల్స్ లో 10, డబుల్స్ లో 13 గెలిచారు. అలీసా క్లెయ్బనివాతో కలసి 2003 వింబుల్డన్ ఛాంపియన్ షిప్ లో బాలికల డబుల్స్ గెలిచారు సానియా. సనా భంబ్రి తో కలసి 2002 యూఎస్ ఓపెన్ బాలికల డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారామె. 2001 ఏప్రిల్ లో ఐటిఎఫ్ సర్క్యూట్ లో 15ఏళ్ల వయసులో తొలిసారిగా సీనియర్స్ విభాగంలో అడుగుపెట్టిన ఆమె అతి కొద్ది సమయంలోనే చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేశారు.2001లో పూణేలో క్వార్టర్ ఫైనల్స్ లోనూ, ఢిల్లీలో ఆడిన సెమీ ఫైనల్స్ లోనూ ఆమె మంచి ప్రతిభ కనిపరిచారు. 2002లో మొదట అపజాయాలు రుచి చూసినా, తరువాత స్వంత నగరం హైదరాబాద్ లోనూ, ఫిలిప్పీన్స్ లోని మనీలాలోనూ ఆమె వరుసగా మూడు టైటిల్స్ చేజిక్కించుకున్నారు.
ఫిబ్రవరి 2003 లో, ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ హైదరాబాద్ ఓపెన్ లో మొదటిసారి డబ్ల్యూటిఎ టోర్నమెంట్ లో ఆడారు సానియా. ఆస్ట్రేలియాకు చెందిన ఇవీ డోమినికోవిక్ తో 6-2, 1-6, 2-6 తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత వారంలో, క్వాటర్ లేడీస్ ఓపెన్ లో చెకోస్లోవేకియాకు చెందిన ఓల్గా బ్లోహోటవా పై గెలిచి మొదటి రౌండుకు ఎంపికయ్యారు. ఫెడ్ కప్ పోటీల్లో మూడు వరుస మ్యాచ్ లను గెలిచి భారతదేశాన్ని మంచి స్థానంలో నిలిపారు ఆమె. దక్షిణ కొరియా లోని బుసాన్ నగరంలో జరిగిన 2002 ఆసియా క్రీడల్లో మిశ్రమ డబుల్స్ లో లెండర్ పీస్ తో కలసి భారత్ కు కాంస్య పతకం సాధించారు. హైదరాబాద్ లో జరిగిన 2003 ఆఫ్రో-ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు గెలుచుకున్నారు సానియా.
2004-2005: డబ్ల్యూటిఎ సర్క్యూట్, గ్రాండ్ స్లాం టోర్నమెంట్లలో విజయం
స్వంత నగరంలో జరిగిన 2004 ఎపి పర్యాటక శాఖ హైదరాబాదు ఓపెన్ పోటీల్లో నిజానికి ఆమెది వైల్డ్ కార్డ్ ప్రవేశం. మొదటి రౌండులో వరుస విజయాలతో ఉన్న నికోల్ ప్రాట్ కు 6-4, 3-6, 2-6 తేడాతో గట్టి పోటీ ఇచ్చినా ఓడిపోయారు. కానీ అదే పోటీల్లో లైజెల్ హుబర్ తో కలిసి డబుల్స్ ఆడి గెలిచారామె. ఈ గెలుపుతో కసబ్లన్స్ లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ సార్ లా ప్రిన్సెస్ లల్లా మెరియం పోటీల్లో వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించినా ఎమీలీ లాయిట్ చేతిలో మొదటి రౌండ్ లోనే ఓడిపోయారు.
ఐటిఎఫ్ సర్క్యూట్ లో, పాం బీచ్ గార్డెన్స్ ఛాలెంజర్ పోటీల్లో సెసిల్ కరటంటచేవాతో ఆడి రన్నర్ అప్ గా నిలిచారు సానియా. 2004లో 6 ఐటిఎఫ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. 2005లో ఆస్ట్రేలియా ఓపెన్ లో కిండీ వాట్ సన్, పెట్రా మాండులా లను మొదటి, రెండవ రౌండ్లలో ఓడించి, మూడవ రౌండుకు చేరుకున్నారు. సెరీనా విలియమ్స్ చేతిలో మూడవ రౌండులో ఓటమి చవిచూశారామె. 2005 ఎపి పర్యాటక శాఖ హైదరాబాద్ ఓపెన్ లో చివరి రౌండులో ఎలోనా బొన్డారెన్కో పై 6-4, 5-7, 6-3 తేడాతో గెలిచి డబ్ల్యూటిఎ టైటిల్ గెలిచిన మొదటి భారత మహిళగా నిలిచారు సానియా. వరుస విజయాలతో ఉన్న సానియా 2005 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ లో యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ను ఓడించారు. 2005 వింబుల్డన్ ఛాంపియంషిప్స్ లో రెండవ రౌండులో స్వెట్లానా కుజ్నెట్సోవా చేతిలో అతి తక్కువ తేడాతో ఓడిపోయారు.
ఆగస్టులో అక్యురా క్లాసిక్ లో మొరిగామి పై మూడవ రౌండులో గెలిచి 2005 ఫారెస్ట్ హిల్స్ టెన్నిస్ క్లాసిక్ లో రెండవసారి డబ్ల్యూటిఎ ఫైనల్స్ కు చేరుకున్నారు. లూసి సఫరోవాతో గెలిచి 2005 యూఎస్ ఓపెన్ లో గ్రాండ్ స్లాం టోర్నమెంట్ లో నాల్గవ రౌండుకు చేరిన మొదటి భారత మహిళగా నిలిచారు. మాషోనా వాషింగ్టన్, మారియా ఎలీనా కెమరిన్, మరియన్ బార్టోలీలను ఓడించి 16వ రౌండ్ కు చేరుకున్నారు. జపాన్ ఓపెన్ లో విల్మేరి కాస్టెల్ల్వి, ఐకో నకమురా, వెరా జ్వోనరెవాలను ఓడించి సెమీఫైనల్స కు చేరుకున్నారు ఆమె. సెమీ ఫైనల్స్ లో టాటియానా గొలోవిన్ ను గెలిచి డబ్ల్యూటిఎ న్యూకమర్ ఆఫ్ ది ఇయర్ గా పేరు పొందారు సానియా.
2006-2007: టాప్ 30 విజయాలు
2006 ఆస్ట్రేలియా ఓపెన్ ప్రవేశంతో గ్రాండ్ స్లమ్ ఈవెంట్ లో ఆడిన మొదటి భారత మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. మిచెల్ క్రాజిక్ తో ఆడి ఓడిన ఆమె బెంగళూరు ఒపెన్ లో హ్యూబర్ తో కలసి కామిలీ పిన్ పై గెలిచి డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో మార్టినా హింగిస్ తో ఓడిపోయారు. ఇండియన్ విల్లెస్ మాస్టర్స్ లో మూడవ రౌండులో ఎలెనా డెమెంటివా చేతిలో ఓటమి పాలయ్యారు. 2006 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లాం లోనూ అనాస్టాసియా మిస్కినా తో ఓడిపోయారు.
ఆమె తరువాతి టోర్నమెంట్ డి.ఎఫ్.ఎస్ క్లాసిక్ లో అలోనా బొండరెంకో, షెనాయ్ పెర్రీలను ఓడించి మూడవ రౌండుకు చేరుకున్నారు. కానీ మెలిన్ టు చేతిలో ఓడిపోయారు సానియా. సింసిన్నెటి మాస్టర్స్ లో పాటీ షిండెర్, ఎలినా డెమెంటివాలను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు. 2006 యూఎస్ ఓపెన్ లో రెండవ రౌండుకు చేరుకున్నారామె. సన్ ఫీస్ట్ ఓపెన్ లో మర్టినా హింగిస్ ను ఓడించి రెండవ రౌండుకు ప్రవేశం చేజిక్కించుకున్నరు. హుబర్ తో కలసి డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. హోన్సల్ కొరియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్ కు కూడా చేరారామె. డిసెంబరు లో డోహా ఆసియా క్రీడల్లో మూడు పతకాలను గెలుచుకున్నారు. మిశ్రమ డబుల్స్ లో బంగారు పతకం, మహిళల సింగిల్స్ లో వెండి పతకాన్ని సాధించుకున్నారామె.
2006లో, స్వెట్లనా కుజ్నెట్సోవా, నాడియా పెట్రోవా, మార్టినా హింగిస్ లపై వరుసగా 10 విజయాలు సాధించారు సానియా[9]. పాటియాలో జరిగిన 2007 ఆస్ట్రేలియా ఓపెన్ లో సెమీఫైనల్స్ కు చేరడంతో పాటు, బెంగళూరు టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరి 2007ను మంచి విజయాలతో మొదలు పెట్టారు ఆమె. 2007 ఫ్రెంచి ఓపెన్ లో రెండవ రౌండుఓ అనా ఇవనొవిక్ కు మంచి పోటీనిచ్చారు. 2007 వింబుల్డన్ ఛాంపియన్ షిప్ లో రెండో రౌండు నదియా పెట్రోవా తో ఆడి ఓడిపోయారు. 2007 ఆమె కెరీర్ లో మలుపుగా చెప్పుకోవచ్చు. 2007 యూఎస్ ఓపెన్ సిరీస్ లో 8వ స్థానం దక్కించుకోవడంతో సానియా సింగిల్స్ లో ప్రపంచ 27వ నెంబర్ ర్యాంకు లో నిలిచారు
శాన్ డియాగో లో జరిగిన టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనెల్స్ కు, సినిసిన్నాటో లో సెమీఫైనల్స్ కు, స్టాన్ఫోర్డ్ లో ఫైనల్స్ కు కూడా చేరుకున్నారు. షాహర్ పీర్ తో కలసి సినిసిన్నాటోలో డబుల్స్ టైటిల్ ను గెలిచారు. 2007 యూఎస్ ఓపెన్ లో అన్నా చక్వతడ్జే పై గెలిచి కొద్ది వారాల్లోనే మూడోసారి మూడవ రౌండుకు చేరుకుని రికార్డు సృష్టించారు. డబుల్స్ లో మహేష్ భూపతి తో కలసి క్వార్టర్ ఫైనల్స్, మహిళల డబుల్స్ లో బెతనే మాటెక్ తో కలసి ఆడి క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు. 2007లో నాలుగు డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు సానియా.
2008-2009: గ్రాండ్ స్లమ్ మిశ్రమ డబుల్స్ ఛాంపియన్ షిప్
నెం.6 సీడ్ గా హోబర్ట్ లో సానియా క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు. ఫ్లావియా పెన్నెట్టా చేతిలో మూడు సెట్లలో ఓటమి పాలయ్యారు. 2008 ఆస్ట్రేలియా ఓపెన్ లో కూడా మూడవ రౌండుకు చేరారు. కానీ వీనస్ విలియమ్స్ చేతిలో 7-6(0), 6-4, 5-3 తేడాతో ఓడిపోయారు. ఆస్ట్రేలియా ఒఫెన్ మిక్స్డ్ డబుల్స్ లో మహేష్ భూపతి తో కలిసి ఆడి రన్నర్ అప్ గా నిలిచారు. సన్ టైంటైన్, నెన్డ్ జిమోన్జిక్ ల చేతిలో ఓడిపోయారు.
పిటిటి పటాయా ఓపెన్ నుండి ఎముక నొప్పి వల్ల ఆమె వెనుతిరిగాల్సి వచ్చింది. ఇండియన్ వెల్స్ లో సీడ్ నెం.21గా ప్రవేశించి, సీడ్ నెం.9 షహర్ పేర్ ను ఓడించారు. కానీ సీడ్ నెం.5 డనియెలా హంటుచోవా చేతిలో ఓడిపోయారు.బర్మింగ్‌హామ్ లో జరిగిని టోర్నమెంటులో మరీనా ఎరకోవిక్ తో రెండో రౌండు ఆడి వెనుదిరిగారు సానియా. 2008 వింబుల్డన్ ఛాంపియన్ షిప్ లో మరియా జోస్ మార్టినెజ్ సాంచెజ్ చేతిలో 6-0, 4-6, 9-7 తేడాతో ఓడిపోయారు ఆమె.
బీజింగ్ లో నిర్వహించిన 2008 వేసవి ఒలంపిక్స్ లో సానియా భారత్ తరఫున ఆడారు. ఈ పోటీలో ఇవెటా బెనెసోవాతో ఓడిపోయారు. ఒలంపిక్స్ లో కుడిచేతి మణికట్టు దెబ్బ వల్ల ఆమె సింగిల్స్ లో ఆడే అవకాశం కోల్పోయారు. డబుల్స్ లో సునీతారావుతో కలసి మొదటి రౌండు గెలిచిన సానియా రెండో రౌండులో రష్యా పై ఒడిపోయారు. 2008లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లమ్ వంటి కీలక పోటీల్లో మణికట్టు దెబ్బ వల్ల వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆమెకు. సానియా కెరీర్ లో 2008 నత్తనడకన సాగింది.
మూరెల్లా హొబార్ట్ ఇంటర్నేషనల్ లో ఫ్రాంకెసా స్కివోన్, సానియా డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు. 2009ఆస్ట్రేలియా ఓపెన్ లో మార్టా డెమొచొవ్సకా పై మొదటి రౌండులో గెలిచిన ఆమె రెండవ రౌండులో నాడియా పెట్రోవా తో ఆడారు. డబుల్స్ లో వనియా కింగ్ తో కలసి డబుల్స్ ఆడిన సానియా మొదటి రౌండులోనే వెనుదిరిగారు. మహేష్ భూపతి తో కలసి నతేలీ డిచే, యాండీ ర్యామ్ లను 6-3, 6-1 తేడాతో ఫైనల్స్ లో గెలిచి 2009 ఆస్ట్రేలియా ఓపెన్ లో మిశ్రమ డబుల్స్ లో మొదటి గ్రాండ్ స్లాన్ని గెలుచుకున్నారు ఆమె
బ్యాంకాక్ లో జరిగిని పటయా విమెన్స్ ఓపెన్ టోర్నమెంట్లో ఫైనల్స్ కు చేరుకున్న సానియా 7-5, 6-1 తేడాతో వేరా జ్వోనెర్వా చేతిలో ఓడిపోయారు. అదే టోర్నమెంటులో డబుల్స్ లో సెమీస్ కు చేరారు. బి.ఎన్.పి పెరిబస్ ఓపెన్ లో ఫ్లవియా పెన్నెట్టాతో రెండో రౌండులో ఓడారు. మైమి మాస్టర్స్ పోటీల్లో మత్లిడే జాన్సన్ తో ఆడి మొదటి రౌండులోనే వెనుదిరిగారు. డబుల్స్ ఈవెంట్ లో తన భాగస్వామి చాంగ్ చియా జంగ్ తో కలసి సెమీఫైనల్స్ వరకు చేరుకున్నారు. ఎం.పి.ఎస్ గ్రూప్ ఛాంపియన్ షిప్స్ లో మీర్జా మొదటి రౌండు ఓడిపోయినా, డబుల్స్ లో చాంగ్ తో కలసి టైటిల్ సాధించారు. గలీనా వస్కొబొవాలో నిర్వహించిన 2009 ఫ్రెంచ్ ఓపెన్ లో మొదటి రౌండులోనే ఓడిపోయారు ఆమె. 2009 ఏగొన్ క్లాసిక్ లో సెమీఫైనల్స్ కు చేరిన సానియా మెగ్డలెనా రైబార్కోవా చేతిలో ఓడిపోయారు. 2009 వింబుల్డన్ ఛాంపియన్ షిప్స్ లో ఆన్నెలెనా గ్రోనెఫెల్డ్ పై మొదటి రౌండులో గెలిచారు. రెండో రౌండులో సొరానా కిర్స్టా ఆమెను ఓడించారు. డబుల్స్ లోను, మిశ్రమ డబుల్స్ లో కూడా ఓటమిని చవి చూశారు సానియా.
లెక్సింగ్టన్ ఫిఫ్త్ థర్డ్ బ్యాంక్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ లో వరుస విజయాలతో టైటిల్ ను సొంతం చేసుకున్నారు సానియా. కెనడా లో జరిగిన తరువాతి రెండు టోర్నమెంట్లలో మిశ్రమ ఫలితాలు సాధించారు. ఒడ్లుం బ్రౌన్ వాన్ కౌర్ ఓపెన్ లో ఫైనల్స్ కు చేరి స్టీఫెన్ డుబొయిస్ చేతిలో ఓటమి పాలయ్యారు. రోజెర్స్ కప్ లో హెడి ఎల్ తబఖ్ పై రెండో రౌండులో గెలిచారు ఆమె.
యూఎస్ ఓపెన్ లో ఒల్గా గొవొర్ట్సా ను మొదటి రౌండులో ఒడించిన సానియా తరువాత ఫ్లవియా పెన్నెట్టా చేతిలో ఓడిపోయారు. డబుల్స్ ఈవెంట్ లో రెండో రౌండులో ఫ్రాన్సెసాతో కలసి డబుల్స్ ఆడిన ఆమె షహర్ పీర్, గిసెలా డుల్కో ల పై ఓటమి పాలయ్యారు. జపాన్ లోని టోక్యో లో నిర్వహించిన టోరయ్ పాన్ పసిఫిక్ ఓపెన్ కు ఎంపిక అయినా జాంగ్ జీ చేతులో మొదటి రౌండులోనే ఓటమి పాలయ్యారు. ఒసాకా లో షాహర్ పీర్, విక్టోరియా కుటుజోవాలపై గెలిచుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్ లో 2వ స్థానంలో కొనసాగుతున్న మరియాన్ బార్టోలీపై 6-4, 2-0 తేడాతో గెలిచారామె. సెమీఫైనల్స్ లో మాత్రం ఫ్రాన్సెసా షియావోన్ తో ఆడి ఓటమి పాలయ్యారు.
2010:పోరాటాలు-గాయాలు
ఆక్లాండ్ లో జరిగిన ఎ.ఎస్.బి క్లాసిక్ లో స్టెఫెనీ వొగెలె పై మొదటి రౌండులో విజయం సాధించారు సానియా. కానీ రెండో రౌండులో ఫాన్సెసా స్కియవొన్ చేతిలో ఓడిపోయారు. మూరిల్లా హోబర్ట్ ఇంటర్నేషనల్, 2010 పిటిటి పటయా ఓపెన్ లో ఆమె మొదటి రౌండులోనే వెనుదిరిగారు. ఫిబ్రవరి లో, 2010 పిటిటి పటయా ఓపెన్ లో టట్జానా మాలిక్ తో 6-3, 4-6, 3-6 తేడాతో ఓటమి పాలయ్యరు. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ లో కూడా అనెబెల్ మదీనా గార్రిగస్ చేతిలో మొదటి రౌండులోనే ఓడిపోయారు. కుడి చేతి దెబ్బ వల్ల సోనీ ఎరిక్సన్ ఓపెన్, బి.ఎన్.పి పరిబాస్ ఓపెన్, ఫామిలీ సర్కిల్ కప్ లలో ఆడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ దెబ్బ వల్లే 2010 ఫ్రెంచ్ ఓపెన్ కు కూడా దూరం కావాల్సి వచ్చింది.
2010 ఏగొన్ క్లాసిక్ లో రెండో రౌండులో టమరినా టానాసుగమ్ చేతిలో ఓడిపోయారు. ఈస్ట్ బోర్న్ లో మొదటి రౌండులో వెనుదిరిగారు. ఏగొన్ జిబి ప్రో-సిరీస్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఓడ్లం బ్రౌన్ వాన్ కౌర్ ఓపెన్ లో కూడా రెండో రౌండులోనే ఓటమి పాలయ్యారు సానియా. సిన్సిన్నాటి మాస్టర్స్, రోగర్స్ కప్ లకు ఎంపికయ్యారు ఆమె. 2010 యూస్ ఓపెన్ లో మిచెల్ లార్చర్ డి బ్రిటోపై మొదటి రౌండులో విజయం సాధించారు. రెండో రౌండులో మాత్రం అనస్టసియా పావ్ల్యాచెన్కోవా చేతిలో ఓటమి పాలయ్యారు.
సెప్టెంబరులో 2010 గాంగ్జు ఇంటర్నేషనల్ విమెన్స్ ఓపెన్ లో సిరిస్ లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. టాస్కెంట్ ఓపెన్ లో మొదటి రౌండులోనే వెనుదిరిగారు. బిజిఏ లక్సెంబర్గ్ ఓపెన్ ను డ్రా చేసుకుని, ఓఇసి టైపే లేడీస్ ఓపెన్ లో మొదటి రౌండు కైవసం చేసుకున్నారు. డబుల్స్ లో గాంగ్జు పోటీలను గెలుచుకుని, టైపేలో రన్నరప్ గా నిలిచారు ఆమె. అక్టోబరులో 2010 కామన్ వెల్స్ ఆటల్లో భారత్ తరఫున ఆడిన సానియా బ్రిటానీ టీయి(కూక్ దీవులు), మరీన ఎరెకోవిక్(న్యూజిలాండ్), ఓలివియా(ఆస్ట్రేలియా) లను ఓడించి ఫైనల్స్ కు చేరారు. ఫైనల్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన అనస్టాసియా రోడియోనోవా చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచారు. డబుల్స్ లో రష్మీ చక్రవర్తితో కలసి సెమీఫైనల్స్ వరకు చేరుకుని, ఆస్ట్రేలియాకు చెందిన అనస్టాసియా రోడియోనోవా, సాలీ పీర్స్ ల చేతిలో సెమీఫైనల్స్ ఓడిపోయారు. సానియా, రష్మీ చక్రవర్తి, స్వదేశీయిలు పూజాశ్రీ వెంకటేశా, నిరుపమ సంజీవ్ లతో కలసి కాంస్య పతకం సాధించారు.
నవంబరులో 2010 ఏషియన్ గేమ్స్ లో భారత్ తరఫున ఆడారు సానియా. మొదటి రౌండులో చాన్ వింగ్ యాయును, జాంగ్ షుయాయ్ లను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు. టమరైన్ టనసుగాన్ని ), ఓడించారు. సెమీఫైనల్స్ లో అక్గుల్ అమన్మురడోవా చేతిలో 7-6(7), 3-6, 4-6 తేడాతో ఓడి, కాంస్యం సాధించారు. మిశ్రమ డబుల్స్ లో విష్ణు వర్ధన్ తోకలసి చాన్ యంగ్ జాన్, యాంగ్ త్సంగ్ హువాలపై ఓడి వెండి పతకం సంపాదించుకున్నారు సానియా. డిసెంబరులో, దుబాయ్ ఆల్ హబ్టూర్ టెన్నిస్ ఛాలెంజ్ లో క్సెనియా పెర్వక్, జులియా జార్జస్, ఎవ్జెనియా రోడినా, బోజానా జొవెనొస్కిలను ఓడించి టోర్నమెంట్ గెలుచుకున్నారు సానియా.
2011-2012 డబుల్స్ స్పెషలైజేషన్
141 ర్యాంకుతో ఉన్న సానియా ఎ.ఎస్.బి క్లాసిక్ లో సబిన్ లిసికి చేతిలో ఓడి టోర్నమెంటు నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. డబుల్స్ లో రెనటా వొరకోవా తో కలసి జెచ్ రిపబ్లిక్ పోటీల్లో సెమీఫైనల్స్ కు చేరిన సానియా కటరినా స్రెబొట్నిక్, క్వెటా పెస్చికెల చేతిలో ఓడిపోయారు. 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో బెల్జియానికి చెందిన ప్రపంచ నెం.1 క్రీడాకారిణి జస్టిన్ హిన్ చేతిలో మొదటి రౌండులో ఓడిపోయారు. డబుల్స్ లో వరాకోవాతో కలసి ఆడారు సానియా. కానీ డబుల్స్ లో కూడా మొదటి రౌండులోనే వెనుదిరిగారు.
దుబాయ్ టెన్నిస్, కతర్ లేడీస్ ఓపెన్ లలో ఆమె వైల్డ్ కార్డ్ ప్రవేశాన్ని పొందారు. రెండు ఈవెంట్లలోనూ సానియా రెండో రౌండు దాటి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. మార్చి లో జరిగిన ప్రీమియర్ మాండిటరీ ఈవెంట్లు రెండిట్లో కూడా రెండో రౌండుకు చేరుకున్నారు సానియా. ప్రీమియర్ మాండిటరీ డబుల్స్ టైటిల్ ను గెలిచారు ఆమె. కాలిఫోర్నియా లో జరిగిన ఈ పోటీల్లో వెస్నినాతో కలసి బెతనె మాటెక్ సాండ్స్, మెగన్ షాగునెస్సీలను గెలివడంతో ఈ టైటిల్ విజేతగా నిలిచారు సానియా.
చర్లస్టాన్ లో నిర్వహించిన ఫామిలీ సర్కిల్ కప్ ఈవెంట్లో ప్రీమియర్ లెవెల్ లో పాల్గొన్నారు సానియా. సింగిల్స్ లో మొదటి ప్రీమియర్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు ఆమె. డబుల్స్ లో వెస్నినాతో కలసి టైటిల్ ను గెలుచుకున్నారు. 11వ డబ్ల్యూటిఎ టూర్ డబుల్స్ టైటిల్ ను కూడా గెలిచారు సానియా.
2011 ముటుయా మాడ్రిడ్ ఓపెన్ లో డబుల్స్ పార్టనర్ ఎలెనా వెస్నెనా చేతిలో మొదటి రౌండు ఓడిపోయారు సానియా. కానీ డబుల్స్ లో అమె తోనే కలసి మూడవ రౌండు వరకు చేరుకున్నారు. వెన్నునొప్పి కారణంగా 2011 స్పార్టా ప్రాగ్ ఓపెన్ లో అలెక్సాండ్రా క్రునిక్ చేతిలో మొదటి రౌండులోనే వెనుదిరిగారు. తరువాత 2011 ఇంటర్నేషనక్స్ డీ స్ట్రాస్ బోర్గ్ పోటీల్లో కూడా ఎలిజ్ కార్నెట్ చేతిలో మొదటి రౌండులోనే ఓడిపోయారు.
ఫ్రెంచ్ ఓపెన్ లో క్రిస్టినా బరోయిస్ ను మొదటి రౌండులో ఓడించారు సానియా. రెండో రౌండు డబుల్స్ లో అగ్నిస్జెకా రడ్వంస్కా చేతిలో ఓటమి చవి చూశారు. గ్రాండ్ స్లమ్ లో ఫైనల్స్ లో వెస్నినాతో కలసి రన్నరప్ గా నిలిచారు. ఈ విజయం ఆమె కెరీర్ లో మైలు రాయిగా నిలిచింది.[10]
గడ్డిపరచిన టెన్నిస్ కోర్టు సీజన్ లో 2011 ఏగోన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సానియా సింగిల్స్, డబుల్స్ లో మొదటి రౌండులోనే వెనుదిరిగారు. ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ది ఛాంపియన్ షిప్స్ లో ఆమె మొదటిసారి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. సానియాతో కలసి డబుల్స్ ఆడే ఆమె పార్టనర్ వెస్నినా సింగిల్స్ లో ఓడిపోయినా డబుల్స్ వారిద్దరూ కలసి 13 వ సీడ్ లో కొనసాగుతున్న డెనియెలా హంటుచోవాలను ఓడించారు. క్వార్టర్ ఫైనల్స్ లోస్పెయిన్ కు చెందిన క్రీడాకారిణులు న్యురియా లగొస్ట్రా వివెస్, అరంటెక్సాపారా సంటోంజాలపై ఆధిక్యం సాధించారు. సింగిల్స్ లో విర్జినె రజానో చేతిలో అతి తక్కువ స్కోరు తేడాతో ఓడిపోయారు సానియా.
తరువాత యూఎస్ ఓపెన్ తో సహా ఆమె ఆడిన అయిదు పోటీల్లోనూ మొదటి రౌండును దాటలేక పోయారు. వేరే రెండు పోటీల్లో ఎంపిక రౌండ్లలో రెండు విజయాలు నమోదు చేసుకున్నారు. డబుల్స్ లో మాత్రం ఆమె మంచి ప్రదర్శన కనపరిచారు. యారొస్లావా షెడోవాతో కలసి రెండో సీడ్ లో కొనసాగుతున్న ఓల్గా గొవొర్ట్సోవా, అలా కుడ్రువవ్ట్సా లను ఓడించి డి.సి టైటిల్ ను గెలుచుకున్నారు సానియా.
దక్షిణ కాలిఫోర్నియా ఓపెన్ లో వెస్నినాతో కలసి సానియా డబుల్స్ ఈవెంట్లో మొదటి రౌండులోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఎలెనా బొవినా, జెహెంగ్ జి లతో ఆడిన వీరు మొదటి సెట్ లో 5-2 తేడాతో ఉన్నప్పటికీ మిగిలిన సెట్లలో ఓటమి పాలయ్యారు. 2011 రోగర్స్ కప్ లో కూడా ఇటలీ క్రీడాకారిణులు సారా ఎర్రిని, రోబర్టా వినిసిలపై ఓటమి పాలయ్యారు.
ఫ్లషింగ్ మెడోస్ లో సానియా, వెస్నినా ప్రీక్వార్టర్స్ పోటీల్లో ఓడిపోయారు. 2011లో సింగిల్స్ లో ఆమె చూపిన విశేష కృషికి ఫలితం అన్నట్టుగా తిరిగి సింగిల్స్ లో టాప్ 60 జాబితాలో ర్యాంకు సంపాదించుకున్నారు సానియా.
న్యూజిలాండ్, అకులాండ్ లో నిర్వహించిన ఎ.ఎస్.బి క్లాసిక్ లో 2012 సీజన్ లో 104వ ర్యాంకుతో నిలిచారు సానియా. ఎంపిక పోటీల్లో క్కో వెండెవెగ్ చేతిలో క్లిష్టమైన మ్యాచ్ లో ఓడిపోయారు ఆమె. డబుల్స్ లో ఎలెనా వెస్నినాతో కలసి సెమీఫైనల్స్ వరకు చేరిన మీర్జా అక్కడ జులియా గార్జెస్, ఫ్లావియా పెన్నెటాల పై మాత్రం ఆధిక్యం సాధించలేకపోయారు. సిడ్నీ లో జరిగిన టోర్నమెంటులో డబుల్స్ లో మొదటి రౌండులోనే వెనుదిరిగారు.
ఆస్ట్రేలియా ఓపెన్ లో ట్స్వెంటానా పిరొంకోవా చేతిలో 4-2, 2-6 తేడాతో ఓడిపోయారు. సానియా ఎలెన వెస్నినాతో కలసి తన మూడో గ్రాండ్ స్లమ్ ఆడారు. మిశ్రమ డబుల్స్ లో మహేశ్ భూపతితో కలసి తన 4వ గ్రాండ్ స్లమ్ సెమీఫైనల్స్ కు చేరుకున్నారు ఆమె.
చైనా లోని షెంజన్ లో జరిగిన ఫెడ్ కప్ లో భారత్ తరఫున ఆడిన సానియా సింగిల్స్ లో జాంగ్ లింగ్ ను ఓడించి 2013 ఫెడ్ కప్ ఆసియా/ఒషియానియా జోన్ గ్రూప్1 లో చేరుకున్నారు. 2011 ఫ్రెంచి ఓపెన్ తరువాత పిటిటి పటాయా ఓపెన్ లో తన మొదటి డబ్ల్యూటిఎ మ్యాచ్ ను గెలుచుకున్నారు ఆమె. డబుల్స్ లో ఆస్ట్రేలియాక్రీడాకారిణి అనాస్టాసియా రోడియోనోవా తో కలసి తన 13ఫ డబ్ల్యూటిఎ టైటిల్ ను గెలుచుకున్నారు సానియా.
డోహాలో జరిగిన క్వార్టర్ లేడీస్ ఓపెన్ నుండి పటయా డబుల్స్ ఓపెన్ ఆడాల్సి రావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. డబుల్స్ లో రెండో రౌండులో ఓడిపోయారు. దుబాయ్ లో జరిగిన ఈవెంట్ లో మొదటి ఎంపిక రౌండులోనే ఓడిపోయారు సానియా. బిఎండబల్యూ మలేషియా ఓపెన్ డబుల్స్ లో మీర్జా, వెస్నినా రన్నరప్స్ గా నిలిచారు.
ఇండియన్ వెల్స్ లో నిర్వహించిన డబుల్స్ ప్రీమియర్-లైన్ అప్ లో సానియా క్వార్టర్స్ కు చేరుకున్నారు. సింగిల్స్ లో రెండో రౌండుకు కూడా ఎంపికయ్యారు. ఐరోపా మట్టి కోర్టు(క్లే కోర్ట్) సీజన్ లో 2012 ఎస్ట్రోల్ ఓపెన్ లో ఆమె అనస్టసియా రొడియోనోవాతో కలసి డబుల్స్ సెమీఫైనలిస్ట్ గా నిలిచారు. మద్రిద్, రోమ్ నగరాల్లో జరిగిన ఈవెంట్లలో డబుల్స్ లో రెండో రౌండులో వెనుదిరిగారు. మే నెలలో నిర్వహించిన 2012 బ్రసెల్స్ ఓపెన్ లో వరుసగా మూడు రౌండ్లలో మంచి విజయాలు నమోదు చేసుకున్నారు. అదే ఈవెంటులో డబుల్స్ టైటిల్ ను కూడా చేజిక్కించుకున్నారు.
ఫ్రెంచి ఓపెన్ లో మహిళల డబుల్స్(మాటెక్ సాండ్స్), మిశ్రమ డబుల్స్( భూపతిలతో) ఆడారు ఆమె. డబుల్స్ లో ఆమె మొదటి రౌండులోనే వెనుదిరిగినా, మిశ్రమ డబుల్స్ లో టైటిల్ ను చేజిక్కించుకున్నారు. 2012 జూన్ 7న మహేష్ భూపతి తో కలసి పోలాండ్ కు చెందిన సంటియగో గొంజెల్జా, క్లుడియా జాన్స్ లను ఫైనల్స్ లో 7-6(7/3), 6-1 తేడాతో ఓడించారు ఆమె.
2012 ఏగొన్ క్లాసిక్ పోటీల్లో సానియా డబుల్స్ లో వెనుదిరిగారు.[11] 2012 ఏగోన్ ఇంటర్నేషనల్ లో సింగిల్స్ లోను, డబుల్స్ లోనూ మొదటి రౌండు ఎంపికయ్యారు ఆమె.
2012 వింబుల్డన్ ఛాంపియన్ షిప్స్ లో సానియా, అమెరికా క్రీడాకారిణి మాటెక్ సాండ్స్ లు మహిళల డబుల్స్ పోటీల్లో మూడో రౌండు వరకు చేరుకున్నారు. ఆ రౌండులో వారు విలియమ్స్ సిస్టర్స్ తో తలపడ్డారు[12]. 2012 జూన్ 26 లో లండన్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్ కు సానియా వైల్డ్ కార్డ్ ప్రవేశం పొందారు. యూ.ఎస్.ఎ డబ్ల్యూటిఎ ప్రీమియర్ ఈవెంట్ లో సానియా, మాటెక్ సాండ్స్ మొదటి రౌండులోనే వెనుదిరిగారు.
ఒలింపిక్స్ మహిళల డబుల్స్ పోటీల్లో సానియా, రష్మీ చక్రవర్తీ చైనా క్రీడాకారిణుల చేతిలో ఓడిపోయారు[13]. లియాండర్ పేస్, సానియా కలసి మిశ్రమ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ లో గట్టి పోటీ ఇచ్చినా వెనుదిరిగారు. ప్రీమియర్ అత్యవసర పోటీల్లో సాండ్స్ తో కలసి సానియా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నా అక్కడా ఓడిపోయారు[14].
అక్టోబరు 2012లో అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ ఖన్నాకు సానియా చేసిన విజ్ఞప్తి కారణంగా "ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్ షిప్" మహిళల పోటీల విజేతకు పురుషులతో సమానంగా బహుమతి సొమ్మును పెంచారు[15]. ఇక నుంచీ అన్ని జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లలోనూ మహిళా విజేతలకు పురుషులతో సమానంగా బహుమతి ఉంటుందని అనిల్ ప్రకటించడం విశేషం[15].
2013-2014: టాప్ 5 డబుల్స్ విజయాలు
2013 సీజన్ లో బ్రిస్ బేన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో సానియా, సాండ్స్ లు టైటిల్ ను గెలుచుకున్నారు.ఆస్ట్రేలియా ఓపెన్ లో మొదటి రౌండులోనే వెనుదిరిగారు ఈ జంట. కానీ సానియా 2013 ఆస్ట్రేలియా ఓపెన్ మిశ్రమ డబుల్స్ లో బాబ్ బ్రయాన్ తో కలసి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఫిబ్రవరి దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ లో మీర్జా, సాండ్స్ డబుల్స్ టైటిల్ ను గెలిచారు. ఫ్రెంచి ఓపెన్ లో మాత్రంఅనస్టసియా, లూసిల చేతిలో ఓటమి పాలయ్యారు. ది ఛాంపియన్ షిప్స్ లో ఆర్ 16 లోనూ వీరు ఓడిపోయారు. చైనా క్రీడాకారిణి జాంగ్ జి తో కలసి న్యూ హావెన్ టైటిల్ గెలుచుకున్నారు సానియా. యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్స్ లో వీరిద్దరూ ఆస్ట్రేలియా క్రీడాకారిణుల చేతిలో ఓడిపోయారు.టోక్యో పోటీల్లో ఆమె కారా బ్లాక్ తో కలసి టైటిల్ ను సాధించుకున్నారు. ప్రపంచ్ నెం.1 ర్యాంకులో కొనసాగుతున్న సారా ఎరాని, రోబర్టా విన్సిలను ఓడించి చైనా ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నారు ఈ జంట. ఆ తరువాత 2013లో ఇతర క్రీడాకారిణులతో కలసి సానియా 5 డబ్ల్యూటిఎ టైటల్స్ ను సంపాదించుకున్నారు.
2014 ఏపియా ఇంటర్నేషనల్ సిడ్నీ పోటీల్లో కారా బ్లాక్ తో కలసి ఆడిన సానియా మొదటి రౌండులోనే వెనుదిరిగారు. 2014 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ లో ఆమె, కారా బ్లాక్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. మిశ్రమ డబుల్స్ ఈవెంట్ లో రొమేనియా కు చెందిన హోరా లు కలసి ఫైనల్స్ వరకు చేరుకుని, టైటిల్ గెలవలేదు.
2014 క్వాటర్ టోటల్ ఓపెన్ లో సానియా కారా బ్లాక్ లు క్వార్టర్ ఫైనల్స్ లో వెనుదిరిగారు. 2014 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ లో మీర్జా, బ్లాక్ లు మొదటి రౌండులోనే ఓడిపోయారు. 2014 బి.ఎన్.పి పరిబాస్ ఓపెన్ లో ఈ జంట మొదటిసారి డబ్ల్యూటిఎ డబుల్స్ ఫైనల్ కు చేరుకున్నారు. 2014 సోనీ ఓపెన్ టెన్నిస్ లో వీరు సెమీఫైనల్స్ కు చేరారు. 2014 పోర్షే టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ లో రన్నరప్స్ గా నిలిచారు ఈ క్రీడాకారిణులు. 2014 పోర్చుగల్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నారు సానియా, బ్లాక్.
2014 ముటుయా మాడ్రిడ్ ఓపెన్, 2014 ఇంటర్నేషనల్ బి.ఎన్.ఎల్ డి ఇటాలియా, 2014 ఫ్రెంచ్ ఓపెన్ లలో సానియా, బ్లాక్ వరుసగా మూడుసార్లు క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. 2014 ఫ్రెంచ్ ఓపెన్ మిశ్రమ డబుల్స్ ఈవెంట్ లో అమె, టోరియా రెండో రౌండులో వెనుదిరిగారు. 2014 ఏగోన్ క్లాసిక్ లో సానియా, బ్లాక్ సెమీఫైనల్స్ లో ఓడిపోయారు. 2014 ఏగోన్ ఇంటర్నేషనల్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారీ జంట. 2014 వింబుల్డన్ ఛాంపియన్ షిప్స్ లో రెండో రౌండులోనే వెనుదిరిగారు వీరిద్దరు.
2014 యూఎస్ ఓపెన్ లో సెమీఫైనల్స్ కు చేరిన సానియా, బ్లాక్ జంట మార్టిన హింగిస్, ఫ్లవియా పెన్నెట్టా చేతిలో ఓటమి పాలయ్యారు. అదే ఓపెన్ పోటీల్లో మిశ్రమ డబుల్స్ లో బ్రునో సోరెస్ తో కలసి ఆడిన సానియా టైటిల్ ను గెలుచుకున్నారు. ఈ గెలుపుతో ఆమె కెరీర్ లో గ్రాండ్ స్లమ్ లో మూడవ మిశ్రమ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు ఆమె.
ఇన్ఛోన్, కొరియా17వ ఆసియా క్రీడల్లో సానియా ఒక బంగారు, కాంస్య పతకాలను సాధించారు. మిశ్రమ డబుల్స్ లో సాకేత్ మైనేనితో కలసి ఆడి బంగారు పతకం, మహిళల డబుల్స్ లో ప్రతానా తోంబ్రేతో కలసి ఆడి కాంస్యం అందుకున్నారు. డబ్ల్యూటిఎ ఫైనల్స్ ను గెలిచి సానియా, బ్లాక్ తమ కెరీర్ లో అత్యుత్తమ గెలుపునందుకున్నారు. హ్సిఎహ్ సు వె, పెంగ్ షుయిలను 6-1, 6-0 తేడాతో ఓడించారు ఈ జంట. అప్పటికి 41సంవత్సరాల డబ్ల్యూటిఎ టోర్నమెంట్ చరిత్రలో అతి భారీ తేడాతో గెలిచిన సందర్భం ఇదే కావడం విశేషం.
ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ ఈ మ్యాచ్ తమ ఇద్దరి కెరీర్లలోనూ అతి పెద్ద విజయంగా నిలిస్తుందనీ, తమ పార్టనర్ షిప్ లో ఇంత విజయం సాధించడం ఒకరి ఆటపై మరొకరికి ఉన్న అవగాహనే ముఖ్యకారణమని వివరించారు. కారా బ్లాక్ తనకు మంచి స్నేహితురాలని, అంతకన్నా మించి తనకు ఆమె సోదరి వంటిదని, ఆమె నుంచి ఎన్నో నేర్చుకున్నానని విలేఖరుల సమావేశంలో సానియా తెలిపారు.
నవంబరు 2014 అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ మిశ్రమ డబుల్స్ లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్, రోహన్ బొప్పన్నా, అనా ఇవనోవిక్, ఫ్రెంచి క్రీడాకారుడు గేల్ మోంఫిల్స్ తదితరులతో సానియా ఆట తీరు అభిమానులను ఆకట్టుకుంది[16]. ఐపిటిఎల్ 2014 లో భారత్ గెలుపుకు ఆమె చాలా కీలకమైన పాత్ర పోషించారు[17]
2015: నెం.1 డబ్ల్యూటిఎ డబుల్స్ ర్యాంకు, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ డబుల్స్ ఛాంపియన్ గా ఎదిగిన సమయం[మూలపాఠ్యాన్ని సవరించు]
2015 లో డబుల్స్ ర్యాంకింగ్ లో సానియా 6వ ర్యాంకుతో మొదలయ్యారు. కారా బ్లాక్ 2015లో ఎక్కువగా పోటీల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకోవడంతో గ్జయీ సు వీ(Hsieh Su-wei) తో కలసి చాలా మ్యాచ్ లు ఆడారు సానియా[18] 2015 బ్రిస్బనె ఇంటర్నేషనల్ లో సెమీఫైనల్స్ వరకు చేరుకున్నారీ జంట. కానీ సెమీస్ లో కెరోలిన్ గార్కియా, కాటారినా స్రెబొట్నిక్ ల చేతిలో 6-4, 6-7(1), [8-10] తేడాతో ఓడిపోయారు.
Wikimedia Commons has media related to Sania Mirza. |
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి