30, జూన్ 2017, శుక్రవారం

Janga reddy Chendupatla/చందుపట్ల జంగారెడ్డి



మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు నా గురువు గారు చందుపట్ల జంగారెడ్డి చరిత్ర గురించి తెలుగు,English వికీపీడీయాలో  నేను రాశాను.


చందుపట్ల జంగారెడ్డి భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకులు.





జననం, బందుత్వం

రెడ్డిగారు 18 నవంబర్ 1935 న జన్మించాడు, పరకాల గ్రామంలో, పరకాల మండల (ఇప్పుడు తెలంగాణలో) తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నివాసం హన్మకొండలో ఉంటుంన్నారు.
శ్రీమతి. సుదేష్మాను 1953లో వివాహమాడారు.

జీవిత విశేషాలు

తెలంగాణ ప్రాంతానికి హనుమకొండ నుంచే 1984 వరంగల్ జిల్లాలో కాదు అప్పటి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి[2]. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు. ఆ భారతీయ జనతా పార్టీజిల్లాలో మొదటి వ్యక్తి. జంగారెడ్డి గారు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ మరియు 2 డి (టీచర్) బడిపంతులుగా పనిచేశారు.

శాసనసభ్యునిగా

పరకాల నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి ఇండిపెండెంట్ బి. కైలాసం పై గెలిచి శాసనససభలో అడుగుపెట్టారు.

ఓటమి, విజయం

ఇదే పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా మళ్ళి భారతీయ జనసంఘ పార్టీ నుండి 1972లో పోటీచేసి పింగళి ధర్మా రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తరువాత 1978లో మళ్ళీ పింగళి ధర్మా రెడ్డి పై శాసనసభ్యునిగా మళ్ళి భారతీయ జనసంఘ పార్టీ నుండి విజయం సాధించారు జంగారెడ్డి గారు.[3] దీనికి వేదిక మాత్రం శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం అయింది. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం S.C రిజర్వ్ కావడం మూలానా ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గం వారు కావడం వలన పరకాల పక్కనేఉన్న జనరల్ సీటు శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తలపడ్డారు.

చ‌రిత్ర పుటల్లో

1984 లో భాజపా 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది ఒకటి అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా, [ఏకే పటేల్] అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి.

ద‌క్షిణ భార‌త‌దేశం తొలి బీజేపీ ఎంపీ

మాజీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌లో కీలక నేతగా దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు [పివి నర్సింహారావు]పై 54వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి ద‌క్షిణ భార‌త‌దేశం తొలి బీజేపీ తొలి పార్లమెంటు సభ్యుడు హ‌నుమ‌కొండ నుంచే ఎంపిక‌య్యారు చందుప‌ట్ల జంగారెడ్డి[5]. ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి ఆయ‌నే తొలి బీజేపీ ఎంపీ కావ‌డం ఓ రికార్డు. ఆ స‌మ‌యంలో స్థానికుడు కావడం వలన అభిమానంతో జ‌నం జంగారెడ్డిని ఆద‌రించారు. ఆ విజ‌యం చ‌రిత్ర పుటల్లో భ‌ద్రంగా ఉంది

ఎంపీగా ఓటమి

1989,1991,1996లో కాంగ్రెస్‌ పార్టీ నుండి కమాలుద్దీన్‌ అహ్మద్‌ చేతిలో జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి ఓటమి చెందారు...

https://en.wikipedia.org/wiki/Chendupatla_Janga_Reddy



నా గురువు గారు చందుపట్ల జంగారెడ్డి చరిత్ర గురించి తెలుగు,English వికీపీడీయాలో  నేను రాశాను.

Jayaraj జయరాజు

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు జయరాజు చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

జయరాజు చరిత్ర ...

జయరాజు...ప్రజావాగ్గేయకారుల్లో పదునెక్కిన గొంతుక, నీటి చెలిమల్లాంటి తియ్యనైన పాలల్లినోడు. చెట్టు పుట్టలను పాటల్లో ఒంపుకొని పల్లెతల్లిని పలకరించినోడు.

వరంగల్‌ జిల్లా: మండలం: మహబూబాబాద్‌ గ్రామము: గుమ్మనూర్‌ గుముదూర్ లో పాటైపుట్టిండు. తల్లి ఒరిసాలా చెన్నమ్మ, తండ్రి ఒరిసాలా రాజయ్య.

భాల్యం, చదువు

చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. విద్యార్ది దశ నుంచే ప్రశ్నించడం నేర్చుకున్న పోరుశాలి జయరాజు. విద్యార్ది నాయకుడిగా కళాశాల, హాస్టల్ సమస్యల పై పోరాడిండు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజును ఉద్యోగం వరించింది.

ఉద్యోగం

సింగరేణిలో ఫిట్టర్‌ కొలువు చేసినా పోరాట బాటను వీడలేదు. సింగరేణి కార్మికుల సమస్యల పై పోరాడే క్రమంలో లాఠీ దెబ్బలను తిన్నడు. ఎన్నోసార్లు జైలుగడపతొక్కిండు. జైలుకు వెళ్లినా అక్కడ కూడా ఖైదీల సమస్యల పై పోరుచేసిండు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నెలరోజులు చేసిన సమ్మె సింగరేణి చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ప్రభుత్వం సామధానభేద దండోపాయలు ప్రయోగించింది. ఆఖరుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రలోభ పెట్టిండ్రు. అయినా జయరాజ్‌ తన పంథా వీడలేదు.

పాటగానే

పేదలకై బుట్టి పాటలు కైగట్టినోడు.. పాటగానే పుట్టి పాటల్లో పదంలా బతికాలన్నదే జయరాజు ఆశ..శ్వాస.సుకవి జీవించు ప్రజల నాలుకలందు అన్న కవి మాటలకు జయరాజే నిలువెత్తు సాక్ష్యం. జయరాజ్‌ కదిలే పాటల ప్రవాహం. పల్లెపాటలను ఒళ్లంతా నింపు కున్న మర్మయోగి జయరాజు. కల్మశం లేని ఆయన కలం నుంచి జాలువారే పాటలు జీవనదిలా సాగిపోతుంటయి. తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు “ నిన్నెట్టా మరిచిపోదును చేరాల..’ అన్న పాట ఆయన కలం నుంచి పట్టిన తొలి పల్లవి. కాచినపల్లి ఎన్‌కౌంటర్‌ పై రాసిన పాట ప్రతి హృదయాన్ని కదిలించింది. ఈ పాట విన్న ఏ తల్లికైనా... ఏ చెల్లి కైనా కన్నీటి చెమ్మ రావడం ఖాయం. “ ఎక్కడ ఉన్నారో అన్నలు... యాడా ఉన్నారో... నింగీలోన తొంగి చూసే చుక్కలైనారో..’ ఈ పాట జయరాజును లోకాని పరిచయం చేసింది. ఆయన కలం నుంచి తొణికిన ప్రతి పదమూ పాటై పలికింది. చెలకల్లో లేని నీళ్లు రైతు కళ్లల్లో చూసి జయరాజు రాసిన వానమ్మ పాట.. కరువుతో అల్లాడే ప్రతి పల్లెలోన, పనిపాటల్లోనా కష్టజీవికి తోడైనిలిచింది. నీల్లోసుకున్న కంకి నీళ్లాడలేక పాయే అన్న పదం, గుండె గల్ల ఎవరినైనా కదిలిస్తది. అంత సక్కని పాట వానమ్మ పాట. చెంగు చెంగున ఎగిరే కోడె దూడలు కటికోడి కొట్టుకు చేరుతున్నయని వలపోస్తడు జయరాజు. వంద మాటల కంటే ఒక పాట చాలా గొప్పదన్న స్పృహ ఉన్నోడు కాబట్టే...పాట జనం నాడి పట్టుకొని... దశాబ్దాలు గడిచిన వన్నెతరగని పాటలు రాసిండు. అనేక ఉద్యమాలకు సాంస్కృతిక సైనికుడై పనిచేసిండు.

అనేక సార్లు జైలుకు

జయరాజు సింగరేణిపోరాటాలకు సైరనై మోగిండు. ఫలితంగా రాజ్యం అతని మీద కక్ష గట్టి , లాఠీ దెబ్బలు, దొంగకేసుల రుచి చూపించి అనేక సార్లు జైలుకు పంపింది. అయినా ఆ గొంతుక పోరుబాటను మాత్రం వీడలేదు. పోరాట పాటలు రాయడం మాత్రం వదలలేదు. అనేక ఉద్యమ పుట్టుకల్లో , పయానాల్లో ముందుండి పోరాడిన నాయకుడు, గాయకుడు తాను. విప్లవోద్యమం బలంగా ఉన్న రోజుల్లో ప్రజలను ఆ పోరాటాలకు మద్దతు కూడగట్టినయి.

పాటలు

జయరాజు పాటలు. రక్తం ఉడికి, కడుపు రగిలిన తనం తన పాటలంతట కనిపిస్తది. తెలంగాణ బతుకు ఛిధ్రమైన జాడను పాటల్లో పట్టి చూపించిండు.ప్రజల గుండెల్లో చిరకాలం యాదికుండే పాటలు రాసిన జయరాజు విప్లవోద్యమ దృష్ఠితో అనేక పాటలకు ప్రాణం పోసిండు. పోరాడకుంటే బతుకు మారదని, ప్రజలకు దోపిడి మర్మాన్ని విప్పి చెప్పిండు. జయరాజు పాటలు ప్రజలను ఉద్యమ బాటలో నడిపిస్తయి. అంతేకాదు ప్రజలకు చదువు ఎంత ముఖ్యమో తెలుపుతూ అక్షరోద్యమ సమయంలో అద్భుతమైన పాటలు రాసిండు. ఆ పాటలు చదువురాని అనేకమందికి చదువుపట్ల ఆసక్తి కలిగేటట్టు చేసినయి. జయరాజు రాసిన పాటలు అక్షర దీపాలైనయ్‌.

దేని ప్రత్యేకత దానిదే

ఆరిపోని నిప్పు కణికలైనయి.జయరాజు రాసిన పాటల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రతీ పాట ఒక సమగ్రమైన కళాఖండంగా నిలిచింది. “జోలాలీ’’ పాటవింటే వందకోట్ల భారతీయుల కన్నీటి కథ మన కండ్లముందుంటది. ఇంకేమి మారిందరా అని తెలంగాణ గోసను పాటగా ప్రశ్నించే తీరుకు ఒంటి మీది రోమాలు కత్తులవుతయి. జయరాజు పాటల్ల గోడాడే తండ్లాట అట్లా కండ్లముందటికొత్తది. ఆకలి, పేదరికం,నిరక్షరాస్యత, నిరుద్యోగం, పాలకుల పీడనవంటి దీర్ఘకాలిక సమస్యలను పాటగట్టి జనాన్ని పోరుబాట పట్టిచ్చిండు.పల్లె గురించి, తల్లి గురించి, ఉద్యమం గురించి, అక్షరం గురించి, ప్రభుత్వ దుర్మార్గాల గురించి...పడావుపడ్డ భూముల గురించి విభిన్నమైన వస్తువులతో పాటలల్లిన ఘనత జయరాజుది. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలన్న కవి హృదయం తనది. అంతేకాదు వివాహ వ్యవస్థలో లోపాలను, స్త్రీ పడే జీవితకాలపు వేదనను పదాలకు ఎక్కించిన ఉద్యమ గొంతుక జయరాజు. ఉద్యమ రచయితలు స్పృశించని అనేక విషయాలను పాటగా మలిచి తనకాలపు పాటకవుల్లో తనదైన ముద్రను నిలుపుకున్నోడు.

వెండితెరకు

జయరాజు రాసిన పాటలు వెండితెరకు కూడా ఎక్కినయ్‌. కొంత కాలం క్రితం వచ్చిన అడవిలో అన్న సినిమాకు హైలెట్‌గా నిలిచిన వందనాలమ్మ పాటను రాసింది జయరాజే. మాస్‌ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన దండోరా సినిమాలో ఆణిముత్య గీతమైన కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాట రాసిందీ జయరాజే .

Internet ఇంటర్నెట్

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు 

ఇంటర్నెట్ చరిత్ర 

 చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.


ఇంటర్నెట్ని తెలుగులో అంతర్జాలం అని అంటారు



ఇంటర్నెట్

వికీపీడియా నుండి
ప్రాంతీయతని కలుపుతు అంతర్జాలంలోకి చేర్చుతున్న చిత్రం
ఇంటర్నెట్ని తెలుగులో అంతర్జాలం అని అంటారు . ఇంటర్నెట్ (ఆంగ్లం Internet) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు.
ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు.

ఇంటర్నెట్ మాతృక

ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో సేకరించుకోవచ్చు. ఇంటర్నెట్ కంప్యూటర్లకు సమాచారం చేరవేసే అద్భుతమైన సాధనం. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్. ప్రపంచంలోని అన్నిరకాల నెట్ వర్కులన్నింటి వల్ల కమ్యూనికేషన్ ప్రక్రియలో కోట్లాది మంది వ్యక్తులు అనుసంధానంలో ఉంటారు. 
మెషిన్లు శాటిలైట్లు, సర్వర్లు, కంప్యూటర్లు ఒకదానితో మరొక్కటి అనుసంధానించిన అసంఖ్యాకమైన స్టాప్‌వేర్ ప్రొగ్రాంలు ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న బహ్మండమైన నెట్‌వర్క్.. ఇవన్నీ ఇంటర్నెట్‌లో భాగాలే. ప్రతిరోజూ కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే ఆధునాతనమైన కమ్యూనికేషన్ మీడియా ఇంటర్నెట్. వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ పరిపాలనా దాకా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో మన దశ, దిశ గురించి తెలుసుకోవచ్చు. 
ఇంటర్నెట్ మాతృకను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 1973లో ఇంగ్లాండు-నార్వే మధ్య ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రారంభమైంది. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట వాడ కం ప్రారంభమైంది. ప్రతి నిమిషం ఇంటర్నెట్ ద్వారా వేలకోట్ల రూపాయల వ్యాపా ర లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ రంగానికైనా కావలసిన సమాచారం ఇంటర్నెట్‌లో అవలీలగా లభ్యమవుతుంది. 
ప్రపంచ వ్యాప్తంగా వేలాది టీవీ చానళ్లు, వార్తాపత్రికలు అలాగే విద్యార్థుల చదువులు, ఫలితాలు, కౌన్సిలింగ్, రైతులు, మీ సేవా వంటి సేవలు ఇట్లా ఏ రంగాన్ని నెట్‌తో సంబంధం లేకుండా ఊహించుకోలేము.

చరిత్ర

ఇంటర్నెట్ చరిత్ర చాల పెద్దది. అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA)" వారి నిధులతో సృష్టించబడింది.

అంతర్జాలం పని చేసే విధానం

చాలా మందికి ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కి మధ్య ఉన్న తేడా తెలియదు. ఈ రెండింటిని ప్రత్యామ్నాయ పదబంధాలుగా వాడెస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల కొంప ములిగిపోయే నష్టం ఏమీ లేదు కాని ఈ రెండింటికి మధ్య తేడా ఉండడం ఉంది.

ఇంటర్నెట్ వేగం

పీ.సీ లకు మొబైల్ ఫోన్ లకు ఇంటర్నెట్ వేగం రకరకలా విధాలుగా 100 యంబీపీయస్ నుండి శక్తివంతమైన 4జీ(జెనరేషన్), కొన్ని ఏరియాల్లో 5జీ(జెనరేషన్) ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నది

ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్

ఇంటర్నెట్ కనెక్టివిటీతో మొట్టమొదటి ఫోన్ నోకియా 9000 కమ్యూనికేటర్ 1996లో ఫిన్లాండ్‌లో విడుదలైంది. ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్ ఆలోచన ఈ నమూనా నుండి ధరలు పడిపోయే వరకు జనాదరణ పొందలేదు మరియు ఫోన్‌లలో ఇంటర్నెట్‌ను అనుమతించడానికి నెట్‌వర్క్ ప్రొవైడర్‌లు సిస్టమ్‌లు మరియు సేవల అభివృద్ధిని ప్రారంభించారు.

ఇంటర్‌నెట్(అంతర్జాలం)

అంతర్జాలం అంటే ఏమిటో చిన్న ఉదాహరణతో చెప్పడం తేలిక. మన దేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఊళ్లని ఎన్నింటినో కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ గుర్తించిన దేశపటాన్ని చూస్తే అంతా గజిబిజిగా అల్లిక అల్లిన గుడ్డలా గీతలు కనిపిస్తాయి. దీనిని మనం ఇంగ్లీషులో అయితే “రైల్వే నెట్‌వర్క్” (railway network) అంటాం. తెలుగులో కావలిస్తే “వలలా అల్లుకుపోయిన రైలు మార్గాలు” అని అనవచ్చు, లేదా టూకీగా “రైలు మార్గాల వలయం” అనో మరీ టూకిగా “రైలు వలయం” అనో అనొచ్చు.
ఇప్పుడు ఒక్క సారి చరిత్రలో వెనక్కి వెళదాం. మనకి స్వతంత్రం రాక పూర్వం దేశంలో ఉన్న రైలు మార్గాలని బ్రిటిష్ ప్రభుత్వం నడిపేది కాదు; ప్రెవేటు రంగంలో కంపెనీలు నడిపేవి. మద్రాస్ సదరన్ మరాటా రైల్వే వారి మార్గం ఒకటి మద్రాసు నుండి వాల్తేరు వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఎం. ఎస్ .ఎం. రైలు వలయం (MSM rail network) అనేవారు. బెంగాల్ నాగపూర్ రైల్వే వారి మార్గం ఒకటి వాల్తేరు నుండి హౌరా వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు వారికీ చాలా ఉండేవి. వీటన్నిటిని కలిపి బి. ఎన్. ఆర్. రైలు వలయం (BNR rail network) అనేవారు. ఇలాగే “నైజాం రైలు వలయం,” “మైసూర్ రైలు వలయం” వగైరాలు ఉండేవి. ఇవన్నీ వేర్వేరు రైలు వలయాలు. అయినప్పటికీ ఒకరి రైలు బళ్లు మరొకరి పట్టాల మీద ఇబ్బంది లేకుండా నడిచేవి. ఈ రకం ఏర్పాటుని “అంతర్‌వలయం” అనొచ్చు (అంతర్‌జాతీయం లా). అనేక దేశాల ఉమ్మడి సంస్థలకి పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో “ఇంటర్” (inter) అనే విశేషణం వాడతాం. అదే విధంగా అనేక వలయాలని ఉమ్మడిగా ఉపయోగించినప్పుడు ఆ ఉమ్మడి వలయాన్ని “ఇంటర్‌నెట్” అనొచ్చు; లేదా తెలుగులో “అంతర్‌వలయం” అనో “ఉమ్మడి వలయం” అనో పిలవచ్చు. చేపలని పట్టే వలని జాలం అనిన్నీ, పట్టేవాడిని జాలరి అనీ అన్నట్లే, పైన చెప్పిన రైలు మార్గాల అమరికని అంతర్జాలం అనిన్నీ ఈ అంతర్‌జాలాన్ని వాడే వారిని అంతర్‌జాలరులు అనిన్నీ కూడా అనొచ్చు.

వరల్డ్ వైడ్ వెబ్(పపప)

మా ఊరు రైలు స్టేషన్ లో “సామానులని నిల్వ చేసే గిడ్డంగి” (గొడౌను) ఉంది. దీనినే గోదాం అని కాని, మండీ అని కాని అంటారు. మా ఉరుపాటి ఊళ్లన్నిటిలోను ఇలాటి గిడ్డంగులు ఉంటాయి. మా ఊరు నుండి ఎగుమతి చేసే ఖద్దరు బట్టలు, బెల్లం, చింతపండు, అడ్డాకులు, తమలపాకులు, మామిడి పళ్లు, వగైరాలు ఈ గిడ్డంగిలో ఉన్న గదులలో పేర్చేవారు - బండి వచ్చి బరువులు ఎక్కించుకుని మోసుకుపోయేవరకు. ఇలా ప్రతి ఊళ్లోను ఎగుమతులు, దిగుమతులు చెయ్యవలసిన సరకులని దాచడానికి గిడ్డంగి గదులు ఉంటాయి కదా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులని “విశ్వ వ్యాప్త గిడ్డంగుల అల్లిక” అందాం. దీనినే ఇంగ్లీషులో అంటే “వరల్డ్ వైడ్ వెబ్” (World Wide Web) అవుతుంది. ఇక్కడ “వెబ్” అన్న పదం “స్పైడర్ వెబ్” (spider web) లాంటి ప్రయోగం కనుకనున్నూ, “స్పైడర్ వెబ్”ని తెలుగులో “సాలె గూడు” అని కాని, “సాలె పట్టు” అని కాని అంటాము కనుకనున్నూ, “వరల్డ్ వైడ్ వెబ్” (world wide web లేదా WWW) ని “ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు” లేదా “పపప” అనొచ్చు.
రైలు పట్టాలు లేకుండా కేవలం గిడ్డంగులు, ఆ గిడ్డంగులలో సామానులు ఉండి మాత్రం ఏమి లాభం? అలాగే రైలు మార్గాలు ఉండి, వాటి మీద రవాణా చెయ్యడానికి సరుకులు లేకపోతే ఏమి ప్రయోజనం? కనుక రైలు మార్గం లాంటి ఇంటర్‌నెట్టూ, అల్లుకుపోయిన గిడ్డంగులు లాంటి వర్లడ్ వైడ్ వెబ్బూ, రెండూ ఉంటేనే ప్రయోజనం. ఇంటర్‌నెట్ రవాణాకి కావాలి. వెబ్ సరుకులు దాచుకునేందుకు కావాలి. ఈ ఉపమానం ఇంతటితో సమాప్తం.
ఇప్పుడు రైలు మార్గాలకి బదులు సమాచార ప్రసార మార్గాలు – అంటే టెలిఫోను సౌకర్యాలలాంటివి – చూద్దాం. రైలు మార్గాలలాగే ఈ సమాచార ప్రసార మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సమాచార వలయానికి (అంతర్జాలానికి, ఇంటర్‌నెట్‌కి) మన కంప్యూటరుని (మన గిడ్డంగిని లేదా మన వెబ్ పేజిని) తగిలించేమనుకొండి. మనం ఇతరులతో పంచుకోవాలనుకున్న వ్యాసాలు, కథలు, ఛాయాచిత్రాలు, పాటలు, వగైరాలని మన కంప్యూటర్‌లో ఉన్న మన “గిడ్డంగి”లో పెడితే అప్పుడు అవన్నీ ఆ సమాచార వలయంతో లంకించుకున్న వారందరి అందుబాటులోకి వస్తాయి. టూకీగా ఇదీ కథ.
మనం ఇతరులతో పంచుకోదలచిన సమాచారాన్ని కంప్యూటర్‌లో ఎక్కడ దాచుకుంటామో ఆ స్థలం “మన వెబ్‌సైట్” లేదా తెలుగులో “మన గిడ్డంగి” అనో “మన ఆటపట్టు” అనో అందాం. ఈ ఆటపట్టులో ఉండేవి చింతపండు, బెల్లం కాదు - సమాచారం. కనుక ఈ “వెబ్ సైట్” (ఆటపట్టు) ని పుస్తకంలో పేజీలలా అమర్చుకుంటే చదివేవారికి సదుపాయంగా ఉంటుంది. అప్పుడు ప్రతి పేజీని “వెబ్ పేజ్” (web page) లేదా “పట్టు పుట” అని కాని “పట్టు పత్రం” అని కాని అనొచ్చు. పుస్తకానికి ముఖపత్రం ఎలాంటిదో అలాగే ఆటపట్టు (“వెబ్ సైట్”) కి ముఖపత్రం (“హోం పేజి”) అలాంటిది. పుస్తకం కొనేవాడు అట్ట మీద బొమ్మ చూసి కొంటాడు. ఇంట్లోకి వచ్చేవాడు వీధి వాకిలి ఎలా ఉందో చూస్తాడు. కనుక ప్రతి వెబ్ సైట్ కి అందంగా ఉన్న ముఖపత్రం ఒక ముఖ్యమైన అంగం.

డొమెయిన్ నేమ్‌ లేదా ఇలాకా పరిధి

ఇళ్లకి చిరునామాలు లేదా విలాసాలు ఉన్నట్లే ఈ వెబ్ సైట్లకి (ఆటపట్లకి) కూడా చిరునామాలు ఉంటాయి. చిరునామాలో వ్యక్తి పేరో, సంస్థ పేరో ఉండడమే కాకుండా, ఊరు పేరు దేశం పేరు ఉంటాయి అన్న విషయం మరచిపోకండి. వెబ్ సైట్ల చిరునామాని ఇంగ్లీషులో URL (Universal Resource Locator) అంటారు. ఉదాహరణకి http://www.Friendsoftelugu.org అనే చిరునామానే తీసుకుందాం. ఇందులో http అనేది ఇది ఏ రకం వెబ్ సైటో చెబుతుంది. అంటే వెబ్ సైట్లలో రకాలు ఉంటాయన్నమాట. తరువాత ://ని చూడగానే కంప్యూటర్ (బ్రౌజర్) రాబోయేది "ఒకానొక రకం" వెబ్ సైటు విలాసం అని తెలుసుకుంటుంది. ఈ విలాసంలో “మాటకీ మాటకీ మధ్య” చుక్కలు మాత్రమే ఉండొచ్చు (కామాలు, కోలన్లు, వగైరా విరామ చిహ్నాలు నిషిద్ధం). తరువాత Friendsoftelugu అనేది వెబ్ సైటు పేరు. తరువాత చుక్క, ఆ చుక్క తరువాత “ఆర్గ్” (org) - అంటే ఇది ఏ రకం సంస్థో చెబుతోందన్న మాట. దీనిని ఇంగ్లీషులో “డొమైన్ నేం” (domain name) అంటారు; తెలుగులో “ఇలాకా పేరు” అందాం. ఇలాకా అంటే అధికార పరిధి అని అర్థం.
ఎక్కువ తరచుగా తారసపడే ఇలాకా పేరు (domain name) “డాట్ కాం” (.com) ; దీనిని వ్యాపార సంస్థలకి కేటాయించేరు. విద్యాసంస్థలు వాడే ఇలాకాని “డాట్ ఇడియు” (.edu) అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి బయట ఇలాకా పేరు తరువాత ఆయా దేశాల పేర్లు, రెండక్షరాల సంక్షిప్తం రూపంలో, వాడతారు. ఇండియాలో ఉన్న సంస్థల పేర్ల చివర “డాట్ ఇన్” (.in) అని ఉండడం గమనించే ఉంటారు. సాధారణంగా పైన ఉదహరించిన URL చివర /index.html అని మరొక అంశం ఉండొచ్చు. ఒక వెబ్ సైట్ లో ఎన్నో పుటలు పుస్తకరూపంలో అమర్చి ఉన్నాయని అనుకుందాం. అపుడు http://Friendsoftelugu.org/ అనే విలాసం మాత్రమే వాడితే ఆ పుస్తకంలో ఏ పేజీకి వెళ్లాలి? మనం ఏ పేజీకి వెళ్లాలో నిర్ద్వందంగా చెప్పలేదు కనుక కంప్యూటరు మనని “విషయసూచిక” ఉన్న పేజీకి తీసుకెళుతుంది. ఈ విషయసూచిక ఉన్న పేజీ పేరే index.html.
మన ఇంటికి వచ్చేవారంతా వీధి గుమ్మంలోకి వచ్చి తలుపు తడితే బాగుంటుంది కాని పాలవాడు పెరటి గుమ్మంలోకి వచ్చి పెళ్లాంతో సరసాలాడతానంటే ఏమి బాగుంటుంది? అందుకని పట్టు పుటని index.html పేజిగా నిర్మిస్తే మన వెబ్ సైట్‌కి వచ్చేవారందరికీ ముందుగా ముఖపత్రం కనిపిస్తుంది.
ప్రపంచంలోని ముఖ్యమైన డొమైన్ల జాబితాని ఇక్కడ చూడవచ్చు.

తెలుగులో కూడా డొమైన్‌ పేరు

ఇక నుంచి తెలుగులోనూ వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమైన్లపై లాభాపేక్షలేని సంస్థ 'ద ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఆసియాన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌' (ఐసీఏఎన్‌ఎన్‌) భారత్‌కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ బాషలనూ అనుమతించింది. (ఈనాడు3.11.2009)

ఇంటర్నెట్ ఆడ్రస్ లేదా ఐపి అడ్రసు

డొమెయిన్ నేమ్‌ (ఇలాకా పేరు) కీ ఇంటర్నెట్ ప్రోటోకోల్ (IP) ఆడ్రస్ (అంతర్జాల విలాసం) కీ మధ్య తేడా ఉంది. టూకీగా చెప్పాలంటే ఇలాకా పేరు మనుష్యులకి అర్థం అయే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో సృష్టించినది. IP అడ్రస్ యంత్రాలకి అర్థం అయే రీతిలో సృష్టించినది. ఐపి అడ్రసుకు ఉదాహరణలు:
  • 192.168.0.167
  • 203.178.193.23
ఈ సంఖ్యలు మానవులకి అర్థం అవాలని సృష్టించినవి కావు. కాని ప్రతి కంప్యూటరుకి ఈ రకం సంఖ్యలు కేటాయించబడి ఉంటాయి. ఉదాహరణకి మాత్రమే - పైన్ ఇచ్చిన మొదటి ఐపి అడ్రసుకి ఈ దిగువ ఊహించిన విధంగా అర్థం చెప్పుకోవచ్చు: 192 అనేది ఇండియాకి సంకేతం అనుకుందాం. 168 ఉభయ గోదావరి జిల్లాలకి సంకేతం అనుకుందాం. తరువాత వచ్చే 0 మొగల్తుర్రు ఊరుకి సంకేతం అనుకుందాం. చివరన ఉన్న 167 వేమూరి పార్వతీశం గారి ఇంటికి సంకేతం అనుకుందాం. అప్పుడు 192.168.0.167 అనేది బారిష్టరు పార్వతీశం గారి ఇంట్లో కంప్యూటరు అని తెలుస్తుంది. కాని ఈ సంఖ్యలని ఎవరు గుర్తు పెట్టుకోగలరు. అందుకని బారిష్టరు పార్వతీశం తన స్నేహితులకి http://www.Friendsoftelugu.org అనే చిరునామాని ఇస్తారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసినది Friendsoftelugu.org అన్న భాగం. ఇది URLకి IP అడ్రెస్ కి ఉన్న అవినాభావ సంబంధం.

వెబ్ బ్రౌజర్ అంటే ఏమిటి?

ముందు బ్రౌజర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కంప్యూటర్ యుగానికి ముందే ఈ మాట ఇంగ్లీషు భాషలో వాడుకలో ఉంది. గ్రంథాలయానికి వెళ్లినప్పుడు కాని, పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు కాని మనం సాధారణంగా అట్ట మీద బొమ్మ చూసో, పేరు చూసో ఒక పుస్తకాన్ని ఎన్నుకుని విప్పి చూస్తాం. ఒక నిమిషం పోయిన తరువాత ఆ పుస్తకాన్ని తిరిగి బీరువాలో పెట్టెస్తాం. మరొక పుస్తకం తీస్తాం, చూస్తాం, పెట్టెస్తాం. ఈ రకం పనిని “బ్రౌజింగ్” అంటారు. ఈ పని చేసే వ్యక్తిని "బ్రౌజర్" అంటారు. అంటే తెలుగులో “చూడ్డం, పరిశీలించడం, వీక్షించడం,” వగైరా పనులని "వీక్షించడం" అనిన్నీ, ఆ పని చేసే వ్యక్తిని "వీక్షకి" అనిన్నీ అందాం. చీరల కొట్లోకి వెళ్లి మన ఆడవాళ్లు చేసే పనిని కూడా “బ్రౌజింగ్” అనొచ్చు. అంతర్జాలంలో విహరించడానికి ఉపయోగపడే సాధనం కనుక దీనిని తెలుగులో విహరిణి అంటున్నారు.
“వెబ్ బ్రౌజింగ్” అంటే జాల విహారం. అంటే, పైన చెప్పిన పనినే పుస్తకాల దుకాణంలోనో, గ్రంథాలయంలోనో, చీరల కొట్లోనో కాకుండా “పపప” మీద చెయ్యడం. వరల్డ్ వైడ్ వెబ్ (పపప) అంటే ప్రపంచవ్యాప్త పట్టు పుటల సమాహారం అనుకున్నాం కదా. మనం మన ఇంట్లో మన కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పేజీలన్నీటిని ఎలా చూడడం? ఈ పని చెయ్యడానికి ప్రత్యేకంగా రాసిన ఒక క్రమణిక (program) కావాలి. ఈ క్రమణికనే “వెబ్ బ్రౌజర్” అంటారు. వెబ్ బ్రౌజర్ అంటే నిరవాకి (operating system) కాదు, అన్వేషణ యంత్రం (search engine) కాదు. ఈ వెబ్ బ్రౌజర్ అనే క్రమణికకి మనం ఒక "వెబ్ సైటు" చిరునామా ఇస్తే ఆ చిరునామా గల పట్టుపుటలో ఏముందో వెబ్ బ్రౌజర్ తెర మీద చూపిస్తుంది. కనుక దీనిని "పట్టు దర్శని" అనొచ్చు.
మనకి బజారులో రకరకాలైన పట్టు దర్శనులు దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు ఎక్స్‌ప్లోరర్ (Explorer) కి మద్దత్తు ఇస్తే, ఏపిల్ కంపెనీ వారు సఫారీ (Safari) కి మద్దత్తు ఇస్తున్నారు. గూగుల్ కంపెనీ వారు క్రోం (Chrome) ని వెనకేసుకొస్తున్నారు. ఏ కంపెనీకి చెందని జనతా దర్శని పేరు ఫైర్‌ఫాక్స్ (Firefox). ఒకరి గణాంకాల ప్రకారం వీటన్నిటిలోను ఎక్కువ జనాదరణ పొందినవి, ఆ క్రమంలో, క్రోం, ఫైర్‌ఫాక్స్, ఎక్స్‌ప్లోరర్, సఫారీ. తమాషా ఏమిటంటే అన్ని దేశాలలోనూ ఈ జనాదరణ ఒకేలా లేదు. ఇక్కడ చెప్పిన గణాంకాలు బల్ల మీద పెట్టుకుని వాడుకునే కంప్యూటర్ల విషయంలోనే. అరచేతిలో ఇమిడే కంప్యూటర్ల విషయానికి వస్తే సఫారీ ఎక్కువ ఆదరణలో ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక గణాంకాలని గభీమని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు.

ఇంటర్నెట్ లో మనకు లభించే సేవలు

రహదారులు ఉండబట్టి మనకి రవాణా సౌకర్యాలు లభించినట్లే, ఇంటర్నెటు ఉండటం వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు, సేవలు (services) లభిస్తున్నాయి. రహదారురహదారులు వెంబడి టపాలు బట్వాడా చేసినట్లే అంతర్జాలం మీద బట్వాడా అయే టపాలని ఈ-టపా లేక ఈ-మెయిలు అంటారు. ఇక్కడ ఈ అనే అక్షరం ఇంగ్లీషులో Electronic అనే మాటకి సంక్షిప్తం. కావలిస్తే దీనిని తెలుగులో విద్యుత్-టపా లేదా వి-టపా అనొచ్చు.
internet is on smart phone in india from year 2008 so the net usage increses inindia india is one of the hiegest net userfs in the world net is usefull for education and online servies and communicaiton రహదారులు ఉండబట్టే మనం ఇరుగు పొరుగులకి వెళ్ళి బాతాఖానీ కొట్టి రాటానికి వీలయింది. అలాగే ఈ విద్యుత్‌ రహదారిని ఉపయోగించి, ఇల్లు వదలి బయటకి వెళ్ళకుండా బాతాఖానీ కొట్టొచ్చు. ఈ బాతాఖానీనే ఇంగ్లీషులో చాటింగ్ (Chatting) అంటారు.
రహదారులు ఉండబట్టే ఆ రహదారురహదారులు వెంబడి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు, పత్రికలు చదవటానికి సానుకూలం అయింది. అదే విధంగా ఈ అంతర్జాలపు రహదారి వెంబడి మనం ప్రపంచం అంతా "తిరిగి" బహిరంగంగా ఉన్న గ్రంథాలయాలే కాకుండా ఇంటింటా ఉన్న సొంత గ్రంథాలయాలని కూడా దర్శించి విషయ సేకరణ చెయ్యవచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే 'వరల్డ్ వైడ్ వెబ్' అంటారు.
వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం వాడుకనేందుకు వాడే సాఫ్టువేర్ అనువర్తనాన్ని బ్రౌజర్ లేదా విహరిణి అంటారు. అంతెందుకు మీరు ఇప్పుడు చదువుతున్న వికీపిడియా కూడా వరల్డ్ వైడ్ వెబ్ లో బాగమే. వరల్డ్ వైడ్ వెబ్ ను పలకటానికి సులువుగా ఉంటుందని వెబ్ అని పిలుస్తుంటారు.
వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము.
సినిమాలంటే ఇష్టం ఉన్న వారు "మూవీ డేటాబేస్" (IMDB) కి వెళ్లి కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు.
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb)
IMDb logo.svg
వెబ్ చిరునామాimdb.com
వాణిజ్యపరమా?Yes
రకంచిత్రాలు, టెలివిజన్, మరియు వీడియో గేమ్స్ కోసం ఆన్లైన్ డేటాబేస్
నమోదుసభ్యులు చర్చలు, వ్యాఖ్యలు, రేటింగ్, ఓటింగ్లలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఐచ్ఛికం.
దొరకు భాష(లు)English
యజమానిAmazon.com
Created byCol Needham (CEO)
ప్రారంభంఅక్టోబరు 17, 1990; 26 సంవత్సరాలు క్రితం
Alexa ranknegative increase 45 (January 2014)[1]
ప్రస్తుత స్థితిActive

పోర్టల్

రకరకాలసేవలను అందించే ప్రత్యేక వెబ్సైటులను పోర్టల్ అంటారు. పోర్టల్ ని తెలుగులో గవాక్షం అంటున్నారు. ఇవి తెలుగు భాషలో లభ్యమవుతున్నాయి

భిన్నాభిప్రాయాలు

అయితే కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇంటర్నెటు ఒక్క చెడ్డ వ్యవస్థ అనే అభిప్రాయం కలిగి ఉన్నాయి. అవి ఇంటర్నెటులోని కొన్ని భాగాలను తమ దేశాలలో ప్రజలు వాడుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు, చైనాలో ప్రజలు ఎవరు కూడా మీరు చదువుతున్న ఈ వికీపిడియాను చదవలేరు, మార్పులు కూడా చేయలేరు. అంతేకాదు కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంటర్నెటు చాలా కీడు చేస్తుందని భావిస్తుంటారు.

ఇంటర్నెట్ వల్ల కలిగే నష్టాలు

  • ప్రమాదకరమైన సైట్లకు వెళ్ళినట్లయితే, మీ కంప్యూటరుకు వైరస్ సోకి చెడిపోయే ప్రమాదం ఉంది. '
  • అంతర్జాలంలో ఇంకా సమర్ధమయిన monitoring systems లేవు. కనుక చిన్నపిల్లలు పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సైట్లకు వెళ్ళినట్లయితే వారి మనసుల మీద దుష్ప్రభావం పడే అవకాశం ఉంది.

Badangi. షేక్ బందగి చరిత్ర

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు షేక్ బందగి చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.




షేక్ బందగి  చరిత్ర ...

షేక్ బందగి భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సల్పిన గొప్ప పోరాట యోధుడు.
వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కామాడ్డి గూడెంకు చెందిన ఈయన, 60 ఊళ్లకు భూస్వామి అయిన విస్నూర్ దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డిపైసాహసోపేతంగా పోరాడి అనూహ్య విజయం సాధించాడు. కామారెడ్డి గూడెంలో బందగీకి కొంత వ్యవసాయ భూమి ఉండేది. తన పాలివాడు అయిన ఫకీర్ ఆహ్మద్ బందగీ భూమిపై కన్నేసి దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. ఇతడు విస్నూర్ దేశ్‌ముఖ్ అనుచరుడు. బందగీ ఎదురు తిరగడంతో ఫకీర్ ఆహ్మద్ దేశ్‌ముఖ్‌కు ఫిర్యాదు చేశాడు.

కాస్త విపులంగా

షేక్‌బందాగీ సాహెబ్‌ పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీ. ఆయన కుమారుడు ఫకీర్‌అహమ్మద్‌. ఫకీర్‌అహమ్మద్‌ విసూనూర్‌దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి వద్గా ఉద్యోగి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అబ్బాస్‌అలీ విసూనూర్‌ దేశ్‌ముఖ్‌కు నమ్మినబంటుగా మారాడు. 1941లో బందాగీకి అతని పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీకి భూసంబంధామైన వివాదాం తలెత్తింది. జ్యేష్టభాగంగా తనకు లభించిన ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముకున్న అబ్బాస్‌అలీకి తన దాయాదాులు అనుభవిస్తున్న మిగతా భూమిని కూడా కాజేయాలన్న దుర్బుద్థి పుట్టింది. ఆ దుర్బుద్ధికి దేశ్‌ముఖ్‌రామచంద్రారెడ్డి అండదాండలు అందాయి. ఆ రోజుల్లో ' నైజాం క్రిందా ఉన్న దేశ్‌ముఖ్‌లలో నరరూప రాక్షసుడుగా, కలియుగ రావణాసురుడుగా పేరొందిన విసూనూర్‌ దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి, 40 వేల ఎకరాల భూమికి, 60 గ్రామాలకు సర్వాధికారి. ఈ 60 గ్రామాలపై తను చెలాయించని అధికారము అంటూ లేదు. నిర్వహించని దౌర్జన్యం అంటూ లేదాు. నిర్బంధా వెట్టిచాకిరి చెప్పతరం కాదు. గ్రామాలలో గల ప్రతి కులము వారు కులాల వారిగా వెట్టిచాకిరి చెయ్యాలి. ప్రతి పండుగకు, పబ్బానికి మామూళ్ళు ఇచ్చుకోవాలి. వ్యవసాయ పనులకుగాను అన్ని రకాల వెట్టిచాకిరి సేవలు చెయ్యాలి. చివరకు బ్రహ్మణులను కూడా వదాలలేదాు. వీరు విస్తర్లు కుట్టి దొరల ఇండ్లకు సరఫరా చెయ్యాలి. భూస్వాముల, దొరల ఇండ్లలో పనులు చేయుటకు బానిసలుగా బాలికలను పంపే ఆచారము ఈ ఫ్యూడల్‌ దోపిడికెల్లా అతి దారుణమైంది.

గ్రామాలలో

గ్రామాలలో ఎవరైనా ఎక్కడైనా మేకనో, గొర్రెనో కోస్తే దానిలో కొంత ఆ ఊరి దొరకు పంపాలి. 1940లో విస్నూర్ గ్రామములో దేశ్‌ముఖ్‌బంగ్లా నిర్మాణానికి వెట్టి కొరకు మనుషులనే కాక బండి నడిపే కోడెలను (పశువులను) నిర్బంధగా తోలుకెల్లినారు. చందాలు వసూళ్ళు చేయించాడు. ఆనాటి కాలములో పంటచేను, పాడిఆవు, పడుచు బిడ్డ, నడిచేగొడ్డు, నాలుగు కాసులు ఇవన్ని దేశ్‌ముఖ్‌దౌర్జన్యానికి బలి అయ్యేవి. గ్రామాలలో గొడవలు ఏర్పడితే వాటిని దేశ్‌ముఖ్‌గడిలో పరిష్కరించడం అనవాయితి. దేశ్‌ముఖ్‌ఆధీనములో గల గ్రామాలలో సివిల్‌, క్రిమినల్‌కేసులతో సహా స్వంత పోలీసు బలగాలతో సర్వాధికారాలు చెలాయించాడు. అనాడు అతనిని ఎదిరించడం అంటే మృత్యువును ఆహ్వనించినట్టే. తన 60 గ్రామాలలోని ధానిక, భూస్వామ్య మక్తిదారులపై విసూనూర్‌ దేశ్‌ముఖ్‌పెత్తనం చెలాయించాడు. తన ఆధిపత్యాన్ని అంగీకరించని వారి ఆస్తి-పాస్తులిన్ని సర్వనాసనం చేయించేది. ఆతడు సాగించిన దౌర్జన్యాలు ఒక ఎత్తు అయితే, అతని ఏజెంట్లు, గూండాలు సాగించుకున్న పాశవిక నికృష్టాలు, చేసిన హత్యలు మరొక ఎత్తు' (బందాగీ కోర్టుబాట- తెలంగాణా పోరుబాట (1928-40), పేజి.216) అటువంటి భయానక దేశ్‌ముఖ్‌ప్రాపకం సంపాదించిన అబ్బాస్‌అలీకి తమ్ముళ్ళ భూమిని కాజేయడం ఏమాత్రం కష్టం అన్పించలేదు.

బందాగీ కోర్టులో

ఈ కేసు వేసి గెలుపొందడం ఆరోజుల్లో మాములు విషయంకాదు.దేశ్‌ముఖ్ ఫకీర్ ఆహ్మద్‌కు భూమి ఇవ్వాలని బందగీని బెదిరిస్తూ వచ్చాడు. బందగీ ససేమిరా ఇవ్వనంటూ జనగామ కోర్టులో సివిల్ కేసు వేశాడు. అయితే జూలై 17, 1941లో జనగామ తాలూకా మేజివూస్టేట్ తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పును ముందే పసిగట్టిన దేశ్‌ముఖ్ బందగీని చంపమని తన కిరాయి మూకలను పురమాయించాడు. ఒక పథాకం ప్రకారంగా బందాగీ జనగాం కోర్టునుండి బయలుదేరి కామరెడ్డిగూడెం బస్టాండు వద్ద బస్సుదిగి ఇంటికివెళ్లు దారిలో పొంచి ఉన్నగూండాలు విసూనూర్‌ దేశ్‌ముఖ్‌ గూండాలు ఒంటరివాన్నీబందాగీని పాశవికంగ హత్య చేసారు.

వీర మరణం

జనగామ-సూర్యాపేట రహదారిలోని బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళుతున్న బందగీని అంతకు ముందే మాటు వేసిన దేశ్‌ముఖ్ గూండాలు గొడ్డళ్లతో దాడి చేసి, కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. నమ్మిన న్యాయం కోసం ఏ సంఘం అండలేకుండా ప్రాణాలకు తెగించి, రజాకార్ నాయకుడైన విస్నూర్ దేశ్‌ముఖ్‌పై విజయం సాధించి వీర మరణం పొందిన బందగీ తెలంగాణ బిడ్డలకు చిరస్మరణీయుడైనాడు.

Yathirajarao nemurugommula నెమురుగోమ్ముల యెతిరాజారావు

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు 
నెమురుగోమ్ముల యెతిరాజారావు
 చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

నెమురుగోమ్ముల యెతిరాజారావు
 చరిత్ర ...
ఛాయాచిత్రపటం.

వికీపీడియా నుండి

నెమురుగోమ్ముల యెతిరాజారావు

మరణం2000
వడ్డేకొత్తపల్లి
జాతీయతభారతీయుడు
వృత్తిpolitician
రాజకీయ పార్టీతె.దే.పా
స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు.
  • బాల్యం, కుటుంబం
నెమురుగోమ్ముల యెతిరాజారావు (వడ్డేకొత్తపల్లికొడకండ్ల) చిన్న వయస్సు లోనే ఉద్యమాలతోనే వారి జీవితం ఆరంబమైయింది,1940 దశకం లోనే నిజాం రాజుకు జమీనుదార్ విసునూర్ దోర రాపాక రామచంద్రారెడ్డి, వారి కుటుంబం జానమ్మ,బాబు దొర (జగన్మెహన్ రెడ్డి), వారు ప్రజలని హింసలు పెడుతుంటె చలించి గ్రామాల్లో యువకులతో ఉద్యమాలను ఊరూర చేయించిన దైర్యవంతుడు యెతిరాజారావు గారు.

వ్యక్తిగత జీవితం[మూలపాఠ్యాన్ని సవరించు]

ముందునుండి యెతిరాజారావు గారు. కాంగ్రేస్ పార్టీ కార్యకర్త,ఆ పార్టీతో విడిపోతు కలుస్తూతు 1984-85 వరకు సాగింది. 1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVK ప్రసాద్ రావు (ఆంధ్ర) MLA గా గెలిచారు. యెతిరాజారావు గారు తిరిగి కాంగ్రేస్ పార్టీలో చేరి 1959లో సమితి అద్యక్షుడుగా ఎన్నికైయిండు. ( ఆ రోజుల్లో ఆ పదవికి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964) ఆ పదవిలో 3 ఏండ్లు (ముఖ్య అనుచరులు శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు ఉన్నడు) .
దస్త్రం:BeFunky photo 0005.jpg
నెమురుగోమ్ముల యెతిరాజారావూ & విమలా దేవి

రాజకీయ జీవితం[మూలపాఠ్యాన్ని సవరించు]

1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డేకొత్తపల్లి) పై గెలిచారు. దాంతో కాంగ్రేస్ పార్టీలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీయెతిరాజారావూను బహిష్కిరింది.1962 నుండి 1967 వరకు MLA గా పనిచేసారు,1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీబహిష్కిరింది ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నరు. యెతిరాజారావు గారికి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నరు. ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తొర్రూర్) శ్రీ శ్రీరాం అప్పయ్య గారు (పెద్దవంగరకొడకండ్ల). కాని ఉహించని విదంగా భార్య శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారికి (పెద్దింటి ఆడవారు,తెరచాటు ఉండేవారు) టిక్కెట్ ఇప్పించారు. యెతిరాజారావు గారు. నల్ల నర్సింహులు (కమ్యూనిస్ట్ పార్టీ)ను ఓడించి 1967-1972 వరకు MLA గా పనిచేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు. శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీమళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు. అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు గారి ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తొర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు. 1975లోసుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975లో చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీఅభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటిగా 6సార్లు MLA గా గెలిచారు. 2 సార్లు మంత్రిగా అయ్యారు. 1983-84 లో శ్రీ నందమూరి తారకరామారావు "చైయెత్తి జై కొట్టు తెలుగోడా" అంటూ తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్ మొత్తం లోఒక్క ఊపు ఊపారు తెలుగు దేశం పార్టీ స్దాపించి ముఖ్యమంత్రి అయ్యారు.అంతటి రామారావు గాలి లోకూడ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం 85 లో కుందూర్ వెంకట్రాం రెడ్డి దాట్లతెలుగు దేశం పార్టీ అభ్యర్థిని, మన్నూర్ (పూసల)వెంకటయ్య కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని ఓడించి యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ నుండి గెలిచారు. కొద్ది రోజులకె తెలుగు దేశం పార్టీలో చేరారు. రోడ్లు,భవనాల శాఖ మంత్రిగా, దేవాదయ దర్మదయ శాఖ మంత్రిగా అయ్యారు.” చెన్నూర్ టైగర్” "రావు సాబ్ గారు" అని ప్రజలు పిలుచుకునే వారు.

శాశ్వత పనులు

యెతిరాజారావు గారు రాజకీయాల్లోకి వచ్చేనాటికి ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మొత్తం లోఒక్క వరంగల్ - ఖమ్మం రోడ్డూ ఒక్కటే డాంబర్ (తారు) రోడ్డూ మీగతావి అన్ని బండ్ల బాటలే ప్రతి గ్రామానికి మట్టిరోడ్లు మెటల్ రోడ్లు వేయించి, సుమారు 2000 కు పైగా మంచినీటి బోర్లు వేయించిండు, కావాలన్నవారికి పక్క ప్రభుత్వ ఇండ్లు ఇప్పీంచాడు. ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం ప్రజలంటే ప్రాణం.