30, జూన్ 2017, శుక్రవారం

yerrabelli dayakar rao ఎర్రబెల్లి దయాకర్ రావు

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు ఎర్రబెల్లి దయాకర్ రావు చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

ఎర్రబెల్లి దయాకర్ రావు చరిత్ర గురించి ...

ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన సీనీయర్ రాజకీయ నాయకుడు 2016లో తెలుగుదేశంపార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు.

బాల్యం, కుటుంబం

ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన పర్వతగిరిలో జన్మించాడు. ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు. 1964లో ఇతని తండ్రి సమితి అధ్యక్షుడుగా పనిచేశాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గార్కి బంధువు మరియు రాజకీయ శిష్యుడు .

విద్యాభ్యాసం

ఇంటర్మీడీయట్ వరకు అభ్యసించి, వరంగల్లో తండ్రి మిత్రుడు అయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఇంట్లో ఉంటూ డిగ్రీ మధ్యలోనే ఎన్.టి.రామారావు అభిమాన సంఘం నాయకుడుగా పనిచేసిన పరిచయంతో, ఎన్టీ రామారావు సూచనపై చదువు ఆపేసి, రాజకీయాలలో ప్రవేశించి, 1982లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు.

వ్యక్తిగత జీవితం

1983లో తొలిసారి శాసన సభ్యులుగా పోటీచేసి ఓడిపోయారు. రాజకీయ కుటుంబం కావున పర్వతగిరిలో రేషన్ డీలర్ గా పోస్టూ పడింది. ఎర్రబెల్లి దయాకర్ రావు అడిగి అడుగగానే అధికారులు రేషన్ డీలర్ గా అపాయింటుమేంటూ ఇచ్చారు.. మరోక్కరికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంచార్జ్ ఇచ్చి కొద్ది రోజులకే, శాసన సభ్యులుగా పోటీచేసి రేషన్ డీలర్ గా వద్దు అనుకొని, పూర్తిగా పోస్టూ రేషన్ డీలర్ గా మరోక్కరికి అపాయింటుమేంటూ ఇప్పించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు. 1987లో వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పదవి లభించింది. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షులుగా రేషన్ డీలర్స్ యూనియన్ నాయకులు ఆ పదవి ఇచ్చారు ఎర్రబెల్లి దయాకర్ రావుగార్కి, దాంతో ఆ పేరూతోనే చాలా పాపులారిటీ వచ్చింది అనోచ్చు ఎర్రబెల్లి దయాకర్ రావు గార్కి.

రాజకీయ జీవితం

1994లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో వరసగా రెండోసారి ఎన్నికైనారు. 2004లో 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు.కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఇక 2008 ఉప ఎన్నికలలో కూడా వరంగల్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రవీంద్ర నాయక్ ను ఓడించి, తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించి మాస్ లీడర్ గా ఇమేజీ పెంచుకున్నారు. మొత్తం 3 సార్లు శాసన సభ్యులుగా వర్ధన్నపేట నుండి ఎన్నిక కావడమే కాకుండా, 2009,2014లో పాలకుర్తి నుంచి వరసగా 4వసారి డా.నెమురుగోమ్ముల సుధాకర్ రావు సహకారంతో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులైనారు. 2014లో దుగ్యాల శ్రీనివాస్ రావు పై గెలుపొంది పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5వసారి శాసనసభలో ప్రవేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటూకు తోలిబీజం

కరుడుగట్టిన సమక్యవాది నారా చంద్రబాబునాయుడుతో సహా యనమల రామకృష్ణుడు లాంటి లీడర్లను, శాసనసభ సభ్యులను ఒప్పించి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విభజనకు తెలుగుదేశం పార్టీ నుండి 2 సార్లు అనుకూలంగా  తెలంగాణకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాలుగా రెండుగా ఏర్పాటూ చేయుటకు అనుకూలం అని కేంద్రానికి “తీర్మాణం లేఖ“ ఇప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటూకు తోలిబీజం పడింది అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారే 99% కారణం. దీనితో తెలంగాణ ప్రాంతంలోనే పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. ఇతని దూకుడు స్వభావం వలన మీడియా లోను ప్రముఖునిగా పేరు పొందాడు.

బాబ్లీ ప్రాజెక్టు

ప్రాణహిత నదిపై బాబ్లీ ప్రాజెక్టు కడితే మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదికి కేవలం 6 నుండి 8 టీ.యం.సి. ల నీరు ఆగుతుంది. జైలుకు సైతం వెళ్లాడు తెలంగాణఎడారి అవుతుంది అని బాబ్లీ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్ళి నిరసనచేశాడు. దానికి చిత్తశుద్దో రాజకీయలబ్దో కానీ మహారాష్ట్ర పోలీసులతో దెబ్బలు పడిండు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులతో పాటు చంద్రబాబు నాయుడును సైతం మహారాష్ట్రకు బాబ్లీ ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అందరినీ మహారాష్ట్రప్రభుత్వం అరెస్టు చేసి విమానంలో హైదరాబాదుకు పంపారు. దయాకర్ రావు దీనికి నిరసనగా ఢిల్లీలో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోని 2 రైళ్ళ నిండా జనంతో సుమారు 4000 వెయ్యిల మందితో ఢిల్లీలో ధర్నా నిర్వహించి ఓ మంచి రికార్డుగా నమోదు అయింది.

నియోజకవర్గ అభివృద్ధి

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొద్ది గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టారు. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకాలువను తెచ్చారు, గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టారు. చేసిన పనుల వలన పార్టీ జిల్లా అధ్యక్షునిగా రికార్డు ఉంది.

రాష్ట్ర ప్రముఖ నాయకుడు

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటూ నారా చంద్రబాబునాయుడు ఆంధ్రా CM గా వెళ్ళిపోయిడు, సీనీయర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిడు మరియు ఎనుముల రేవంత్ రెడ్డి శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ శాసన సభ్యులు స్టీఫెన్ కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గార్కి తెలంగాణ ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా పాపులారిటీ ఉంది.కానీ

టీఆర్ ఎస్ లో చేరారు

2016లో తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (తెరాస) టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు


https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D

nancharimadu thorrur warangal telangana

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు నాంచారిమడూర్వరంగల్ జిల్లాతొర్రూర్  చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.
నాంచారిమడూర్ చరిత్ర గురించి...


నాంచారిమడూర్వరంగల్ జిల్లాతొర్రూర్ మండలానికి చెందిన గ్రామము నాంచారిమడూరు;చరిత్ర ; తెలంగాణ ఉద్యమంలో అనేకమైన పోరాటలు చేసిన ఈ నేల.

గ్రామ చరిత్ర

తెలంగాణా సాయుధ పోరాటం రోజుల్లో నిజాం కాలంలో మా గ్రామంలోను వారూ కొందరు చావుదెబ్బలు తిన్నారు. కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణా అన్ని గ్రామాల్లో లాగే మా గ్రామంలోను, పెద్ద పెద్ద గడులుతెలంగాణ గడీలు దొరలవి, బురుజు ఉన్నాయి. ఐతే వారి ప్రతిభా సామర్థ్యాలకు తగినంత గుర్తింపు రాకపోవడానికి నాటి సాంఘిక పరిస్థితులే కారణం.

గ్రామం పేరు వెనుక చరిత్ర


నాంచారిమడూర్ సుమారు 1000 ఏండ్ల పైన చరిత్ర ఉన్న గ్రామం. కాకతీయులు కట్టించిన శివాలయం దీనికి సాక్షం...మా ఊరి మద్యలో ఉంది. కాకతీయులు తోవ్వించిన సుమారు 400 ఎకరాల విస్తీరణం, 13 ఫీట్ల లోతు ఉన్న ఊర చెరువు ఉంది.

ప్రస్తుత శివాలయం
నాంచారిమడూర్
మా గ్రామం క్రీ|| పూర్వం ముందు చిన్న పల్లెటూరు మడూగూర్ అంటే గ్రామం పక్కనే నీళ్లతో నిండి ఉండే (మడుగు, చెరువు, కొలను, బొంద, ) ప్రదేశం అని అర్ధం.కళియుగం ఆరంబమైన రోజుల్లోని పూర్వం కాలంలో] ఆదే మడుగు మంచి నీరుకు మా ఊరికి ఆధారం. వానాకాలంలో డయేరియా, కలరా వస్తే ఆరోజుల్లో "ఘత్తర" లేసింది అనేవారు. మా గ్రామంలోని వారు వాన నీరుతో నిండిన ఆ మడుగు నీరు త్రాగడం వలన కలరా సోకింది ఊరిలో చాలా మంది చనిపోయారు. గ్రామ పెద్దలు ఊరును మరో ఏరియాకు "హనుమంతుని మీట్ట" అనే ప్రాంతానికి పాత గ్రామానితూర్పుగా 0.5 కి.మీ. దూరం తరలించారు. మరి కొద్ది రోజులకు "అంగడి చింత" అనే ప్రాంతానికి పాత గ్రామానికి దక్షిణంగా 0.5 కి.మీ. దూరం తరలించారు. అయినా కలరా వ్యాధి బారినపడి పిల్లలు, యువకులు చనిపోవుచున్నారు. అప్పుడు భీ భీ నాంచారి వారసురాలు "నాంచారమ్మ" అనే ఎరుకల సాని "సోది(జాతకం) చెప్పుతాను అంటు ఈ గ్రామం లోకి వచ్చింది. గ్రామ పెద్దలు ఆమెతో “ ఊరిలో చాలా మంది పిల్లలు, యువకులు వ్యాధి బారిన పడి చనిపోవుచున్నారు. దానికి కారణం ఏమిటి నివారణ కూడా నీవే చెప్పమన్నారు. అందుకు ఆమె ఈ గ్రామానికి రెండు సమస్యలు ఉన్నవి ఒకటి ఈ గ్రామానికి బొడ్ర్రాయి లేదు నాపేరు కలిపి "నాంచారి మడూగూర్" అని పెట్టూకుంటే మరో సమస్యకు నివారణ చెప్పూతానంది. గ్రామ పెద్దలు, ప్రజలు అందరు సరేన్ననారు. కొన్నాల్లకు ఆమే చేతనే బొడ్ర్రాయి వేయించారు. ముఖ్యమైన గ్రామ పెద్దలు మరో సమస్యకు నివారణ చెప్పూ అన్నరు " ఓ నిండు గర్భవతి అయిన మహిళను ఓ గోతిలో(గుంట, రంద్రం, బోంద) సజీవంగా పాతిపెట్టాలని ఆ తరువాత ఓ మేకను కూడ బలి ఇవ్వాలని గ్రామంలోని అందరు గోతిని దాటినచో ఈ గ్రామంలో అందరు సుఖసంతోషాలతో ఉంటారని" చెప్పింది నాంచారమ్మ. మేకలను బలి ఇవ్వడం సాదరణ విషయమే కానీ ఆడపిల్ల అందులోను నిండు గర్భవతి అయిన మహిళను అనగానే గ్రామ పెద్దలు కొంత సమయం కావాలన్నారు. అప్పటికి ఇంకా కలరా వ్యాధి బారినపడి మరి కొందరు పిల్లలు, యువకులు చనిపోవుచున్నారు. అప్పుడు గ్రామంలోని గిరిజన పెద్దలు నాంచారమ్మ చెప్పింది చెయ్యాలని నిర్ణయించుకున్నరు. అందులో ముఖ్యమైన వాడు భూక్యా సూర్య నాయక్ నాంచారమ్మను కలిసి గ్రామం పక్కన ఉన్న మా తాండాలో నువ్వు చెప్పినట్లూ చేస్తాం. రేపు రాత్రికి నువ్వు దగ్గరుండి ఆ కారిక్రమాన్ని జరిపించాలని అడిగిండు నాంచారమ్మను.
అన్నట్టు మరో రాత్రికి దగ్గరుండి ఆ కారిక్రమాన్ని జరిపించాలని నాంచారమ్మ తాండాలోకి సూర్య నాయక్ ఇంటికి వచ్చింది. ఆమే చెప్పినట్టు గోతిని ఆరు అడుగులు తవ్వుచున్నారు. బానోత్ హరిచంద్రు నాయక్, హీరానాయక్, మాన్ సింగ్ నాయక్, లాల్ సింగ్ నాయక్ (ఇందులో గూగులోతు వంశం వారు). మేకను పక్కన కట్టేసి ఉంది. పసుపు కుంకుమ ఉన్నాయి." నిండు గర్భవతి అయిన మహిళను తీసుకువచ్చారా" అని అడిగింది నాంచారమ్మ. "తీసుకువచ్చాం కానీ పక్కన ఇంట్లో ఉంది తీసుకురాగానే అరుస్తుంది ఆమేను సజీవంగా పాతి పెట్టేది ఆమెకు తెలియదని పనులు అయ్యాకా తీసుకువస్తాం ఆగమని" అన్నడు సూర్య నాయక్. ఆమే చెప్పినట్టు గోతిని ఆరు అడుగులు తోవ్వుడు అయిపోయింది.
పాతి పెట్టే మహిళను తీసుకురమ్మని చెప్పింది నాంచారమ్మ. తీసుకువస్తాం కాని ఏలా పడుకో పెట్టాలని అడిగాడు సూర్య నాయక్. "తూర్పుగా తల పెట్టించి వెళ్లకిలా పడుకో పెట్టాలని చెప్పింది నాంచారమ్మ. అర్ధం కావడం లేదు పాతి పెట్టే మహిళను తీసుకురాగానే అరుస్తుంది, ముందు ఏలా పడుకో పెట్టాలో చూపించు అని నాంచారమ్మను అడిగిండు సూర్య నాయక్. నాంచారమ్మ మెల్లిగా గోతిలోకి దిగి ఏలా పడుకో పెట్టాలో చూపిస్తూ పడుకుంది. సూర్య నాయక్ మట్టీ పోయాలని అరిచి చెప్పాడూ అక్కడ ఉన్న వారికి.... అప్పుడు అర్ధం అయింది నాంచారమ్మకు నేను నిండు గర్భవతి కధా పాతి పెట్టే మహిళను నేనే అని.
భూక్యా సూర్య నాయక్ నమ్మీంచి ఇంటికి వచ్చిన నిండు గర్భవతిని పాతి పెట్టీన మీ వంశం ఒక చెట్టుకు ఒకటీ, రెండు పిట్టల్లా(ఒక చోట కొన్నిమాత్రమే ఎక్కువ కుటుంబాలుగా ఒకే చోట ఉండలేరని) భూక్యా వంశాన్ని శపించింది. ఆమేకు అర్ధం అయింది ఈ గ్రామం నా బలిదానంతో "నాంచారి మడూగూర్"గా శాశ్వతంగా ఉంటుంది. ప్రతి ఏడూ "శ్రావణమాసం" (జూన్ - జూలై) లో ఏదో ఒకరోజులో ప్రతి గిరిజన తండాలో మేకలను బలి ఇవ్వాలని ఆ గ్రామంలోని అందరు గోతిని దాటినచో ఆ గ్రామంలో అందరు సుఖసంతోషాలతో ఉంటారని" చెప్పింది నాంచారమ్మ.
ఆ ఆనవాయితి గా "దాటుడూ పండుగ""శ్రావణమాసం" (జూన్ - జూలై) లో ఏదో ఒకరోజులో ప్రతి గిరిజన తండాలో మేకలను బలి ఇచ్చి పండుగ చేసుకుంటూన్నారు. మా గ్రామం పేరూ కాల గమనంలో నాంచారి మడూగూర్ కాస్తా నాంచారి మడూర్ అయింది.

29, జూన్ 2017, గురువారం

cabletv dish Settopbox

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు కేబుల్ టీ.వి చరిత్ర... గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను. కేబుల్ టీ.వి చరిత్ర... 

Dish img.jpg
రకముకేబుల్ టీవీ నెట్‌వర్క్
దేశముభారతదేశం భారతదేశము
లభ్యతజాతీయ స్థాయి
యజమానిMSO & కేబుల్ ఆపరేటర్స్
ఆవిర్భావ దినం1995
ఇతరపేర్లుశాటీలైట్ ప్రసారాల చానల్స్
జాలగూడుడి.డి. ఇండియా
cabletv dish Settopbox 

కేబుల్ టీ.వి చరిత్ర...

పూర్వం రాత్రి సమయాల్లో గ్రామాల్లో "తోలు బొమ్మలాట" అని ఓ తెల్లటి తెర పైన బొమ్మలతో కళాకారులు రామాయణంమహా భారతము ఇతిహసాలూ చెప్పేవారు. అప్పటి ఆ ప్రజలకు కాలక్షేపం వినోదం కాగ నవీన యుగంలో 1972 లో డిల్లీలో చిన్నగా ప్రారంబించినా 1984 కలర్ టెలివిజన్లు వచ్చాయి. దూరదర్శన్ ఆంటీనా ప్రసారాలు హైదరాబాదు వి ప్రారంబించిన 1990 తరువాత అంతర్ జాతీయ చానల్స్ శాటీలైట్ ప్రసారాలుప్రారంబించినా 1995 లో ప్రాంతీయా చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ ప్రారంబమైయింది.

కోటి కుటుంబాలు కేబుల్ టీవీ పై

భారత దేశంలో కేబుల్ టీవీ ద్వారా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యక్షంగా 60,000 వెయ్యిల మంది కేబుల్ ఆపరేటర్లుగా వారి వద్ద పనిచేసే వర్కులు, పరోక్షంగా అంటే వైర్ల కంపేనిల వర్కులు, వైర్ల అమ్మకం దార్లు వర్కులు, మీడీయా కూడా ఇలా మరో 2,50,000 మంది అదే విదంగా దేశంలో చూస్తే ఒక కోటి కుటుంబాలు కేబుల్ టీవీ పైన ఆదారపడి ఉన్నాయి.

అంతర్ జాతీయా చానల్స్

అంతర్ జాతీయా ప్రముఖ రేడియో కంపేనీలు శాటీలైట్ ప్రసారాలతో టీవీ చానల్స్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజుల్లోనే అవి ప్రముఖ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ BBC, సిఎన్ఎన్ (CNN), లాంటివి 1980వ దశకంలో ప్రారంబమైనవి. వీటిని అనుసరించి జాతీయా చానల్లు,వీటిని అనుసరించి ప్రాంతీయ చానల్లూ ప్రారంబమైనవి.

జాతీయా చానల్స్

అంతర్ జాతీయా చానల్స్ ఆంగ్లబాష చానల్స్ తో ముఖ్య నగరాల్లో కేబూల్ ఆపరేటర్లు ఢిల్లీముంబాయి,కోల్కతాచెన్నై లాంటి నగరాల్లో కేబూల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు. కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చెందుచున్న భారత్ లోను శాటీలైట్ ప్రసారాలతో టీవీ చానల్స్ వచ్చిన తొలిరోజుల్లోనే భారతీయా ప్రముఖులు అమితాబ్ బచ్చన్ లాంటి వారు జాతీయా చానల్స్ హిందీ బాషలో ATM అని 24 గం||ల మ్యూజిక్ చానల్ మరి కోందరు కూడా హిందీ బాషలో చానల్స్ పెట్టడంతో ద్వితీయా శ్రేణీ నగరాల్లోను కేబూల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు కేబూల్ ఆపరేటర్లు.

ప్రాంతీయా చానల్స్

ప్రపంచం అన్ని దేశాల్లో ముందు అంతర్ జాతీయా ఆంగ్లం,ఆ తరువాత జాతీయా, ఆ తరువాత ప్రాంతీయా చానల్స్ వచ్చాయి. భారత దేశంలో జాతీయా హిందీ చానల్స్ వచ్చాయి. ఆ తరువాత అన్ని భాషల్లో శాటీలైట్ ప్రసారాల ప్రాంతీయా చానల్స్ ప్రారంబించినవి. అవి ఎంటర్ టైంమేంటూ చానల్స్ వరకే పరిమితమైనవి.

వార్తల చానల్స్

అంతర్జాతీయ ఆంగ్లం వార్తాల చానల్స్ ముందు రాగ, తరువాత హింది చానళ్లు. 2000 సంవత్సరం తరువాత అన్ని భాషల్లో వార్తల ఛానల్స్ వచ్చాయి. ప్రతీ భాషలో వార్తా ప్రసారాల 24 గం||ల చానల్లూ ఉన్నవి తెలుగులో 30 వార్తా ప్రసారాల 24 గం||ల చానల్లూ ఉన్నాయి. 2012 నుండి కొత్తవి ఒక ఏడాదికి 4,5 కొత్త వార్తా ప్రసారాల 24 గం||ల చానల్లూ వస్తూనే ఉన్నవి ఇలా సాగుతున్నది. ఇదే దోరని ఇతర భాషల్లోను ఇలానే ఉంది.

చానల్స్ సంఖ్య

చానల్స్ సంఖ్య భారత దేశంలో 400 పైన ప్రసారం అవుచున్నవి. ఇందులో వార్తాల చానల్స్ సంఖ్య చాలా ఏక్కువ, అయిన కూడా కొత్తవి వస్తూనేవున్నవి. ఇంకా కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ప్రసారశాఖ వద్ద కొత్త చానల్ అనుమతి కోరూతు దరఖాస్తూలు పెండిగులో వందల్లో ఉన్నాయి.
భారత ప్రభుత్వం అప్ లింకిగ్(చానల్ ప్రసారం శాటీలైట్ కు పంపే విధానం) కు 2000 సంవత్సరం తరువాత నుండి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజపేయిప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ప్రారంబించింది. అంతకు ముందు సింగపూర్మలేషియా,ఫిలిప్పైన్స్బ్యాంకాక్థాయిలాండ్, మరియూ శ్రీలంక దేశాల్లో నుండి అప్ లింకిగ్ అయ్యేది. 2000 సంవత్సరం తరువాత చానల్స్ మ్యాన్ వల్ నుండి డిజిటల్ రూపం లోకి మారడంతో బ్రాడ్ కాస్టర్(చానల్ యాజమానీ)కు ఖర్చు సగం తగ్గింది. చానల్లు పెట్టడం సులభంగా మారింది.

కేబుల్ ఆపరేటర్ లు

1995 లో ప్రాంతీయా చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ లతో ప్రారంబమైయింది. ప్రతీ చానల్ నూ ప్రజలకు చూపించేందూకు కేబుల్ ఆపరేటర్ సోంత ఖర్చుతో ఒక రిసీవర్, ఒక మాడ్యూలేటర్ అనేవి పెట్టాలి ఖర్చు సుమారు ప్రారంబం దర పది వెయ్యిల నుండి లక్ష రూపాయలు అవుతుంది, ఎన్ని చానల్లూ పెడితే అంత ఖర్చు పెరుగుతుంది.

యం.ఎస్.ఓ

మల్టి సిస్టం ఆపరేటర్ (ఎక్కువ చానల్లు ఉన్నవారు)పెట్టుబడిదారులుగా చానల్స్ సంఖ్య చాలా ఏక్కువ కావడంతో కొద్ది వినియోగదారులు ఉన్నవారు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కావడంతో మల్టి సిస్టం ఆపరేటర్ అవసరం వచ్చింది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా యం.యస్.ఓ.ల నుండి మండలాలు ఇతర జిల్లాల్లోని కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇస్తున్నారు. హైదరాబాదు లోని యం.యస్.ఓ.లు తెలంగాణ లోని అన్ని జిల్లాలకు కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇచ్చారు, ఇంకా మరికొన్ని ఎరియాలకూ ఇస్తూన్నారు.

ఉచితం కాని (చెల్లింపు) చానల్స్

ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కాక టీవీ చూసే వినియోగదారుల నుండీ ఆదాయం కోసం ఒక టీవీకి 1 రూపాయి నుండి 60 రూపాయల వరుకు వసూలు చేసేవి, "చెల్లింపు చానల్స్" అంటారు. కేవలం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కేబుల్ ఆపరేటర్ వద్ద డబ్బులు వసూలు చేయనివి "ఉచిత చానల్స్" అంటారు.

డి.టి.ఎచ్

డైరక్టటూ టూ హోం (చానల్ ప్రసారం శాటీలైట్ నుండి వినియోగదారునికి కేబుల్ ఆపరేటర్ అవసరం లేకుండ) టీవీ చూసే విధానం. ఇతర దేశాల్లో 10%, 20% ఉపయోగిస్తూన్నారు ఇండియాలోను డిష్ టీవీ, టాటాస్కై, డీడీ డైరక్టటూ, రిలయెన్స్, సన్ డైరక్టటూ, ఎయిర్ టెల్, వీడీయోకాన్, సంస్ధలు సేవలు అందిస్తూన్నవి. ఇందూలో కేవలం డీడీ డైరక్టటూ సంస్ధ ఉచిత సేవలు ఇండియాలో వినియోగదారునికి అందిస్తూన్నది.

బుల్లితెర దరహాసం

ఇండియాలో కేబుల్ టీవీ సుమారు 20 కోట్ల ఇండ్లల్లోని టీవీ సెట్ల కనెక్షన్లుకు చేరింది. ఇది కేవలం ఇరువై ఏండ్లల్లోనే సాద్యమైంది. 150 ఏండ్ల చరిత్ర ఉన్న భారతీయా సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) భారతదేశంలో సమాచార మార్పిడులు భారతదేశ టెలిఫోన్ చరిత్ర 1882 జనవరి 28 నుండి ఇప్పటి వరకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) నూట ముప్పై ఏండ్లల్లోను ఈ రిక్డాడును చేరలేదు. కానీ ఇంతకంటే తొందరగా మోభైల్ పోన్లు ఇండియాలో 2000 నుండి 2015 వరకు కేవలం 15 సం||ల్లో హండ్ సేట్ల సంఖ్య 30 కోట్ల సంఖ్య దాటింది. అత్యంత వేగంగా కేబుల్ టీవీ తరువాత విస్తరించిన 2 వ నెట్ వర్కూ మోభైల్ పోన్ రిక్డాడు.

నియంత్రణ వ్వవస్థ

1995లో ప్రభుత్వం TRAI (టెలికాం రెగ్యులేటరీ అధారిటీ అఫ్ ఇండియా) భారతదేశంలో టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ సంస్థలకే కేబుల్ టీవీ నియంత్రిణ కూడా అప్పగించబడింది.
ఈ సంస్థ 1995లో కేబుల్ టీవీ నియంత్రిణ చట్టంగా (నియమ నిబందనలు రూపొందించారు) చేశారు. ఆ చట్టాని 2000 ఆగస్టు 11, 20052011 సం. రాల్లో సవరించబడింది.

సెట్‌టాప్ పెట్టెలు

పార్లమెంటు ఆమోదించిన కేబుల్ టీవీ నెట్ వర్కు సవరణ బిల్లు 2011 . ప్రకారం దేశవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు తమ నెట్ వర్కును డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు సైతం అనలాగ్ సిగ్నల్ నుండి డిజిటల్ సిగ్నల్స్ కు మారాల్సి ఉంటుంది. ఇండియాలో కేబుల్ టీవీ ఇండ్లల్లోని టీవీ సెట్ కనెక్షన్ కు డిజిటల్ సిగ్నల్స్ స్వీకరించడానికి సెట్‌టాప్ పెట్టె (2) అవసరముంటుంది.

సెట్‌టాప్ పెట్టెల కలవరం

2011 లో దేశంలో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2012 నవంబరు 1 తో ముగిసింది. అవి దేశ రాజధాని న్యూఢిల్లీ, ముంబాయీ, కోల్ క్తత,చెన్నైయ్ పట్టణ ప్రాంత కేబుల్ టీవీ వినియోగదారులు కచ్చితంగా సెట్‌టాప్‌బాక్స్‌(ఎస్‌టీబీ) అమర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

పన్నుల వడ్డింపునకే కేబుల్‌టీవీ డిజిటైజేషన్

వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే.. ఇదివరకే వినోదపు పన్ను వడ్డింపు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. డిజిటైజేషన్ ద్వారా కేబుల్ టీవీ చందాదారులకు సంబంధించి పూర్తి పారదర్శకత వస్తుందని, తద్వారా పన్నులు కచ్చితంగా వసూలు అయ్యేందుకు వీలవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి.
డిజిటైజేషన్‌కు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల తయారీవల్ల దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు మేలు చేకూర్చడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ దొరుకుతాయి. టీవీ, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా, యానిమేషన్ వంటి రంగాలు గత రెండేళ్లలో అనూహ్య వృద్ధి సాధించాయి. 2018 నాటికి ఈ రంగాలు రూ.1,78,600 కోట్ల వృద్ధిసాధిస్తాయి. దేశంలో ప్రస్తుతం 800 టీవీ చానెళ్లు, 245 ఎఫ్‌ఎం, 170 కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి.

బుల్లితెర కష్టాలు

సెట్‌టాప్ బాక్స్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్రం పార్లమెంటులో బిల్లును ఆమోదించిది . కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది దీన్ని పాటించాల్సిందే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నుంచి ఆదేశాలు ఉత్తర్వులను పాటించాల్సిందే. మరోపక్క బాక్సులకు దేశంలో తీవ్ర కొరత ఉంది. . సెట్ టాప్ బాక్స్‌లు లేకపోవడంతో అనలాగ్ సంకేతాలు నిలిచిపోయాయి. లక్షల ఇళ్లలో టీవీలు బుల్లితెర వినోదానికి తెరపడింది బాక్స్‌లు బిగించని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతున్నాయి.

రెండో దశలో డిజిటైజేషన్ 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ ఉన్నాయి

రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి డిజిటైజేషన్‌లో భాగంగా 2013 సెప్టెంబరు 18 తో ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు సెట్‌టాప్ బాక్సుల పాట్లు తప్పడంలేదు. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో జనం బేజారవుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో సెట్‌టాప్ బాక్స్‌ల లభ్యతను పరిగణలోకి తీసుకోకుండామార్చి 31ని తుదిగడువుగా విధించడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువు పెంచాలని కోరుతూ కొందరు ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు విశాఖలో పది శాతం మాత్రమే డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్‌టీబీలు అమర్చుకున్నారు.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లోనే..
నాంపల్లి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్‌నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీహిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి.
జంటనగరాల్లో కేబుల్ లెక్కలివే..
మొత్తం కేబుల్ కనెక్షన్లు: సుమారు 30 లక్షలు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నవారు: సుమారు 6 లక్షలు సెట్‌టాప్‌బాక్స్‌ల అవసరం: సుమారు 24 లక్షలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నవి: ఏడు లక్షలు, కొరత: సుమారు 17 లక్షలు సెట్‌టాప్ బాక్స్ ధర: కంపెనీని బట్టి రూ.1250 నుంచి రూ.1500

మూడవ దశ పిబ్రవరి 31 2017 వరకు గడువిచ్చింది

కేబుల్‌ టీవీ వ్యవస్థను డిజిటలైజ్‌ ప్రక్రియ మూడోదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్న మేజర్‌ పంచాయతీలు, టౌన్‌షిప్‌లలో కేబుల్‌ టీవీ ప్రసారాలను 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్‌ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో 186, ఆం«ధ్రప్రదేశ్‌లో 180 పట్టణాల్లో కేబుల్‌ టీవీ ప్రసారాలు డోలాయమానంలో పడ్డాయి ఇందుకు సంబంధించి మూడో దశలో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, అక్కడున్న కేబుల్‌ కనెక్షన్ల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2015 ఏప్రిల్‌లో సమాచారం అందించింది. అయితే డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్‌ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో నిర్ధేశించిన గడువులోగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ సాధ్యం కాలేదు. అరకొర ప్రకటనలే జారీ.. కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ గురించి అరకొర ప్రకటనలు ఇవ్వడం తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వినియోగదారులకు అవగాహన కల్పించడం, మాస్టర్‌ సిస్టమ్‌ ఆపరేటర్ల (ఎంఎస్‌ఓ)లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. గతేడాది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిశాతం వరకు కేబుల్‌ కనెక్షన్లు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకున్నాయి.
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అదనంగా మరో ఇరవై శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 30 శాతం కనెక్షన్లకే సెట్‌టాప్‌ బాక్సులు అమర్చారు . మిగిలిన 70 శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చడం కష్టమే. అనలాగ్‌ కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోతే వినియోగదారుల నుంచి సెట్‌టాప్‌ బాక్సులకు తీవ్రమైన డిమాండ్‌ వస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సులు లభించడం కష్టమే.

నాలుగో దశ తేదీ 2017 మార్చి 31

దేశంలో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ నాలుగో దశకు గడువు తేదీని 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌పై ఎంఎస్‌వో సంఘాలు, కొందరు వ్యక్తులు వేసిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం, సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. డిసెంబరు 31కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటలైజేషన్‌ పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ తేదీ పెంపు వారికి ఇంకా డిజిటల్‌లోకి మారకపోతే వారికి పిబ్రవరి 31వరకు గడువిచ్చింది.ఇక ఈ నెల రోజుల్లో డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సులు లభించడం ఎలా సాద్యమో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పాలి. విదేశాల నుంచి సెట్‌టాప్‌బాక్స్‌ల దిగుమతి నిలిచిపోవడంతో వీటికి తీవ్ర కొరత ఏర్పడింది. గడువును ఆరు నెలలపాటు పెంచాలని కేబుల్ ఆపరేటర్లు కోరుతున్నారు.

నాలుగో దశకు గడువు కేవలం ఒక నెల రోజులు

నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది.

తల తోక లేని ట్రాయ్ నిర్ణయం

డిజిటలైజేషన్‌పై గతంలో ప్రభుత్వం ఎంఎస్‌వోలు భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, 68.84% భారతీయులు (833.1 మిలియన్ల మంది) 6,49,481 వివిధ గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ గ్రామాల పరిమాణం గణనీయంగా మారుతుంది. 236,004 భారత గ్రామాల్లో 500 కన్నా తక్కువ జనాభా ఉండగా, 3,976 గ్రామాలలో 10,000+ జనాభా ఉంది.
నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు 6,49,481 ఫలితంగా గ్రామాలలో అనలాగ్ పద్ధతిలో సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి ప్రసారాలు నిలిచిపోయాయి. కేవలం ఒక నెల రోజులలో డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు[ప్రతి టి.వి కి ] సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
డిజిటైజేషన్

1. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2010 - 1 నవంబరు 2012 వరకు [సుమారు 2 సంవత్సరాలకు పైగా] దేశం ఆర్ధిక నగరాలకు గడువు 2. రెండో దశలో 1 నవంబరు 2012 - 2013 సెప్టెంబరు 18 వరకు[సుమారు 2 సంవత్సరాలకు పైగా] 2 వ శ్రేణీ దేశ ఆర్ధిక నగరంలకు గడువు 3. మూడోదశలో దేశం లోని 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సెప్టెంబరు 2013 - పిబ్రవరి 31, 2017 వరకు[సుమారు 4 సంవత్సరాలకు పైగా]పట్టణంలకు గడువు ఇచ్చిన ప్రభుత్వం. 4. నాలుగో దశ తేదీ పిబ్రవరి 31, 2017 - మార్చి 31 2017 ఆర్ధికంగా వెనుకబడి, విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, అధికంగా వ్యవసాయం మీద ఆధారపడుతారు.అలాటి గ్రామాలు ,చిన్న గ్రామా పంచాయతీలకు కేవలం ఒక నెల రోజుల గడువు.

డిజిటైజేషన్ మన దేశానికి 2020 విజన్

డిజిటైజేషన్ అన్ని శాఖలల్లో బారతదేశానికి 2020 విజన్ గడువు. అన్ని శాఖలల్లో లేని తొందర కేవలం ఒక “‘కేబుల్ టీవీ నెట్ వర్కులపైన“‘ ఎందుకో ...
ఉదాహరణకు స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రభుత్వం ఇప్పటికి 70 ఏండ్లు, డిసెంబరు 2016 లో నివేదిక ప్రకారం 6,522 గ్రామాలు విద్యుత్ లేనివి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. డాక్టర్లు లేని గ్రామాలు కోకొల్లలు.

ఎంఎస్‌వోలు

ప్రభుత్వం నుండి ఏలాంటి ప్రకటన లేదు ఇదే అదనుగా లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లును మల్టీ సిస్టం ఆపరేటర్లు(ఎంఎస్‌వోలు) అతి ఉత్సాహంతో సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి చిన్న కేబుల్‌ ఆపరేటర్లును చాలా ఇబ్బంది పెడుచున్నారు.

గడువును పెంచాలని ఆపరేటర్లు

సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ బాక్స్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ధరలను గణనీయంగా తగ్గించడం, వాటిని విక్రయించేందుకు మరిన్ని కంపెనీలకు అనుమతించడమే సమస్యకు పరిష్కారం ఇప్పుడు బాక్స్‌ల ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా, బాక్స్‌ల కొరత కూడా ఏర్పడుతోంది.అందుకే సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

కార్పోరేట్ సంస్థల ఆశ

కేబుల్ టీవీ నెట్ వర్కులపైన పెట్టుబడి ఎవరికి వారుగా కేబుల్ ఆపరేటర్ వారి ఏరియాల్లో పెట్టారు వీరికి ప్రభుత్వం నుండీ కూడా రక్షణ లేదు. ఇండియాలో సుమారు 1 కోటి కుటుంబాలు దీనిపై బ్రతుకు చున్నారు. ఇంత మంది వెళ్లు ఆదాయాన్ని ఏదో ఒక కొత్త టెక్నాలాజీ కనిపెట్టీ ఆ ఆదాయాని తమకే రావాలని కార్పోరేటు సంస్ధలు కోట్లూ ఖర్చూపెడుతున్నవి.

గడువును పెంచకపోవడానికి కారణం

సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఏళ్లతరబడి పట్టణ ప్రాంతం మందకొడిగా సాగి చిన్నపంచాయతీలకు కేవలం ఒక నెల రోజులు మాత్రమేఇచ్చి గడువును పెంచకపోవడానికి కారణం కార్పోరేట్ సంస్థల హస్తం ఉందని అర్ధం అవుతోంది. డిటిహెచ్ సంస్ధలకు లాభాలు సమకూర్చడానికీ కేబుల్ ఆపరేటర్ల జీవితాలతో ఆడుకునేవిదమైన ...
 తల తోక లేని ట్రాయ్ నిర్ణయం అని గడువు పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు.cabletv dish SettopboxPrabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్ 

Sarvai papanna warangal సర్వాయి పాపన్న

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లును ఏలిన గౌడ మహారాజు సర్వాయి పాపన్న చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను. గౌడ మహారాజు సర్వాయి పాపన్న చరిత్ర ...





సర్వాయి పాపన్న నేటి వరంగల్ జిల్లాజనగాం మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవాడు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.
జననం,బాల్యం
ధూల్మిట్ట శాసనం ప్రకారం ఆగష్టు 181650 నాడు పాపయ్య వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించాడు.
బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘీక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనించేవాడు, తల్లి సర్వమ్మకు ఒక్కకొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవమతస్ధులై (శివభక్తులు) (గౌడు కులం వారు అందరు కూడ) నిత్యం పూజలు సంప్రదాయాలను తరాలుగా వస్తున్న సంప్రదాయా జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వెతిరేకించాడు. కల్లుతాగడం, మాంసం తినడం అలవాటు చేసుకున్నాడు.
స్నేహీతులు
ఇతర కులాల వారితో తిరగడం వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రదాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లుగీయడం కులం పని చేయడం స్నేహీతులు, పాపయ్య కల్లుతాగడం లోకం తీరు చుట్టుప్రక్కల జరుగుచున్న విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లడుకునేవారు.
హైదారాబాదు నైజాం ఆగడాలు
నైజాం సైనికులు భూమి పన్నుల (రకాలు, శిస్తూ) వసూలు విధానం ప్రజలను చాలా హింసాత్మకంగా, ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకల పేర్లతో శిస్తూలు వసూలు చేసేవారు.
కులాల, మతలా పేర్లతో శిస్తూలు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులం వారికి ”తాటిచెట్లకు పన్ను” వేసారు. నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని వేల్లేదారిలో పాపన్న కల్లు అమ్ముకొనే మండువాలో నైజాం సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండ అడిగినా ఇవ్వకుండా హేలనగా నవ్వు కుంటు వెళ్లారు. కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండ వెల్లడం అలా రెండు, మూడు సార్లు అలాగే జరిగింది.
మొదటి తిరుగుబాటు
నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని కల్లు తాగి డబ్బులు ఇవ్వకున్న పాపన్న పెద్దగా పట్టించుకునే వాడు కాదు, నైజాం సైనికులు నా వద్ద కల్లు తాగుచున్నారు రాజు గారి సైనికులు అంటే చాల గౌరవనీయులు.అయీనా సైనికులు శిస్తూలు రాజుగారికి లెక్కెలు అప్పగించాలి కదా కల్లుకు డబ్బులు ఇచ్చిన లెక్కె తగ్గును కద పొనిలే అనుకునేవాడు. ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కల్లు తాగి వెళ్లిపోవుటకు సిద్దం అవుచుండగా కల్లు మండువాకు వస్తున పాపన్న స్నేహితుడు ఒకరు ”దనరాసులు ఉన్న కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద నైజాం సైనికులు వెళ్లిపోవుటకు సిద్దం అయ్యారా” అని సరసంగా అన్నడు.
అందుకు నైజాం సైనికుల్లో ఒకడు పాపన్న స్నేహితున్ని తన్నుటకు కాలుఎత్తాడు. అదిచూసిన ఒక సెకండులో కోపోద్రిక్కుత్తుడైన పాపన్న తన వద్ద కల్లు గీయడానికి ఉపయొగించు గీత కత్తి, మారు కత్తిలో ఒకదాన్నితో ప్రాణ స్నేహితున్ని తన్నుటకు కాలుఎత్తిన సైనికున్ని మెడ నరికాడు, దాంతో మిగాతా సైనికులు పాపన్న మీదికి యుద్దనికి రావడం ఏంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందిచాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికుల గుర్రాలు, వసూలు చేసుకొ రాజుగారి దనరాసులు పేదవారిని పీడీంచి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటు పాపన్న స్నేహితులతో గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. అప్పటి నుండి నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని వేల్లేదారిల్లో పాపన్న, అతని స్నేహీతులతో కలసి తిరుగుబాట్లు ప్రారంబించారు.అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమక్చూకున్నాడు. యుద్దవిద్యలు నేర్చుకున్నాడు పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ఏరియాలో మారుమొగింది గ్రామాల్లోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు.వారికి యుద్దవిద్యలు నేర్పించి, అతి తొందరలోనే 3౦౦౦ మందిని సొంతంగా సైనికులగా సమక్చూకున్నాడు.
భువనగిరి కోటపై తిరుగుబాటు
తెలంగాణాలో నైజాం రాజు యొక్క అప్పటి పాలకుల, అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.
పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడారు. 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండ లను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.
ఒక సామాన్యవ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 - 1705 మధ్యకాలంలో షా పురలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండకోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండకొలనుపాకచేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్హుజూరాబాద్ వరకు విస్తరించింది. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.
పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది నేటికి రూపం మారిన అలానే ఉంది.ఇతర వివరాలు
పాపన్న గెరిల్ల సైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్ధానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. 1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వేళ్ళాడ దీసారు.
మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లును ఏలిన గౌడ మహారాజు సర్వాయి పాపన్న చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.