మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు కేబుల్ టీ.వి చరిత్ర... గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను. కేబుల్ టీ.వి చరిత్ర...
రకము | కేబుల్ టీవీ నెట్‌వర్క్ |
దేశము | భారతదేశము |
లభ్యత | జాతీయ స్థాయి |
యజమాని | MSO & కేబుల్ ఆపరేటర్స్ |
ఆవిర్భావ దినం | 1995 |
ఇతరపేర్లు | శాటీలైట్ ప్రసారాల చానల్స్ |
జాలగూడు | డి.డి. ఇండియా |
cabletv dish Settopbox
కేబుల్ టీ.వి చరిత్ర...
పూర్వం రాత్రి సమయాల్లో గ్రామాల్లో "తోలు బొమ్మలాట" అని ఓ తెల్లటి తెర పైన బొమ్మలతో కళాకారులు రామాయణం, మహా భారతము ఇతిహసాలూ చెప్పేవారు. అప్పటి ఆ ప్రజలకు కాలక్షేపం వినోదం కాగ నవీన యుగంలో 1972 లో డిల్లీలో చిన్నగా ప్రారంబించినా 1984 కలర్ టెలివిజన్లు వచ్చాయి. దూరదర్శన్ ఆంటీనా ప్రసారాలు హైదరాబాదు వి ప్రారంబించిన 1990 తరువాత అంతర్ జాతీయ చానల్స్ శాటీలైట్ ప్రసారాలుప్రారంబించినా 1995 లో ప్రాంతీయా చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ ప్రారంబమైయింది.
కోటి కుటుంబాలు కేబుల్ టీవీ పై
భారత దేశంలో కేబుల్ టీవీ ద్వారా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యక్షంగా 60,000 వెయ్యిల మంది కేబుల్ ఆపరేటర్లుగా వారి వద్ద పనిచేసే వర్కులు, పరోక్షంగా అంటే వైర్ల కంపేనిల వర్కులు, వైర్ల అమ్మకం దార్లు వర్కులు, మీడీయా కూడా ఇలా మరో 2,50,000 మంది అదే విదంగా దేశంలో చూస్తే ఒక కోటి కుటుంబాలు కేబుల్ టీవీ పైన ఆదారపడి ఉన్నాయి.
అంతర్ జాతీయా చానల్స్
అంతర్ జాతీయా ప్రముఖ రేడియో కంపేనీలు శాటీలైట్ ప్రసారాలతో టీవీ చానల్స్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజుల్లోనే అవి ప్రముఖ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ BBC, సిఎన్ఎన్ (CNN), లాంటివి 1980వ దశకంలో ప్రారంబమైనవి. వీటిని అనుసరించి జాతీయా చానల్లు,వీటిని అనుసరించి ప్రాంతీయ చానల్లూ ప్రారంబమైనవి.
జాతీయా చానల్స్
అంతర్ జాతీయా చానల్స్ ఆంగ్లబాష చానల్స్ తో ముఖ్య నగరాల్లో కేబూల్ ఆపరేటర్లు ఢిల్లీ, ముంబాయి,కోల్‌కతా, చెన్నై లాంటి నగరాల్లో కేబూల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు. కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చెందుచున్న భారత్ లోను శాటీలైట్ ప్రసారాలతో టీవీ చానల్స్ వచ్చిన తొలిరోజుల్లోనే భారతీయా ప్రముఖులు అమితాబ్ బచ్చన్ లాంటి వారు జాతీయా చానల్స్ హిందీ బాషలో ATM అని 24 గం||ల మ్యూజిక్ చానల్ మరి కోందరు కూడా హిందీ బాషలో చానల్స్ పెట్టడంతో ద్వితీయా శ్రేణీ నగరాల్లోను కేబూల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు కేబూల్ ఆపరేటర్లు.
ప్రాంతీయా చానల్స్
ప్రపంచం అన్ని దేశాల్లో ముందు అంతర్ జాతీయా ఆంగ్లం,ఆ తరువాత జాతీయా, ఆ తరువాత ప్రాంతీయా చానల్స్ వచ్చాయి. భారత దేశంలో జాతీయా హిందీ చానల్స్ వచ్చాయి. ఆ తరువాత అన్ని భాషల్లో శాటీలైట్ ప్రసారాల ప్రాంతీయా చానల్స్ ప్రారంబించినవి. అవి ఎంటర్ టైంమేంటూ చానల్స్ వరకే పరిమితమైనవి.
వార్తల చానల్స్
అంతర్జాతీయ ఆంగ్లం వార్తాల చానల్స్ ముందు రాగ, తరువాత హింది చానళ్లు. 2000 సంవత్సరం తరువాత అన్ని భాషల్లో వార్తల ఛానల్స్ వచ్చాయి. ప్రతీ భాషలో వార్తా ప్రసారాల 24 గం||ల చానల్లూ ఉన్నవి తెలుగులో 30 వార్తా ప్రసారాల 24 గం||ల చానల్లూ ఉన్నాయి. 2012 నుండి కొత్తవి ఒక ఏడాదికి 4,5 కొత్త వార్తా ప్రసారాల 24 గం||ల చానల్లూ వస్తూనే ఉన్నవి ఇలా సాగుతున్నది. ఇదే దోరని ఇతర భాషల్లోను ఇలానే ఉంది.
చానల్స్ సంఖ్య
చానల్స్ సంఖ్య భారత దేశంలో 400 పైన ప్రసారం అవుచున్నవి. ఇందులో వార్తాల చానల్స్ సంఖ్య చాలా ఏక్కువ, అయిన కూడా కొత్తవి వస్తూనేవున్నవి. ఇంకా కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ప్రసారశాఖ వద్ద కొత్త చానల్ అనుమతి కోరూతు దరఖాస్తూలు పెండిగులో వందల్లో ఉన్నాయి.
భారత ప్రభుత్వం అప్ లింకిగ్(చానల్ ప్రసారం శాటీలైట్ కు పంపే విధానం) కు 2000 సంవత్సరం తరువాత నుండి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజపేయిప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ప్రారంబించింది. అంతకు ముందు సింగపూర్, మలేషియా,ఫిలిప్పైన్స్, బ్యాంకాక్, థాయిలాండ్, మరియూ శ్రీలంక దేశాల్లో నుండి అప్ లింకిగ్ అయ్యేది. 2000 సంవత్సరం తరువాత చానల్స్ మ్యాన్ వల్ నుండి డిజిటల్ రూపం లోకి మారడంతో బ్రాడ్ కాస్టర్(చానల్ యాజమానీ)కు ఖర్చు సగం తగ్గింది. చానల్లు పెట్టడం సులభంగా మారింది.
కేబుల్ ఆపరేటర్ లు
1995 లో ప్రాంతీయా చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ లతో ప్రారంబమైయింది. ప్రతీ చానల్ నూ ప్రజలకు చూపించేందూకు కేబుల్ ఆపరేటర్ సోంత ఖర్చుతో ఒక రిసీవర్, ఒక మాడ్యూలేటర్ అనేవి పెట్టాలి ఖర్చు సుమారు ప్రారంబం దర పది వెయ్యిల నుండి లక్ష రూపాయలు అవుతుంది, ఎన్ని చానల్లూ పెడితే అంత ఖర్చు పెరుగుతుంది.
యం.ఎస్.ఓ
మల్టి సిస్టం ఆపరేటర్ (ఎక్కువ చానల్లు ఉన్నవారు)పెట్టుబడిదారులుగా చానల్స్ సంఖ్య చాలా ఏక్కువ కావడంతో కొద్ది వినియోగదారులు ఉన్నవారు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కావడంతో మల్టి సిస్టం ఆపరేటర్ అవసరం వచ్చింది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా యం.యస్.ఓ.ల నుండి మండలాలు ఇతర జిల్లాల్లోని కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇస్తున్నారు. హైదరాబాదు లోని యం.యస్.ఓ.లు తెలంగాణ లోని అన్ని జిల్లాలకు కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇచ్చారు, ఇంకా మరికొన్ని ఎరియాలకూ ఇస్తూన్నారు.
ఉచితం కాని (చెల్లింపు) చానల్స్
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కాక టీవీ చూసే వినియోగదారుల నుండీ ఆదాయం కోసం ఒక టీవీకి 1 రూపాయి నుండి 60 రూపాయల వరుకు వసూలు చేసేవి, "చెల్లింపు చానల్స్" అంటారు. కేవలం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కేబుల్ ఆపరేటర్ వద్ద డబ్బులు వసూలు చేయనివి "ఉచిత చానల్స్" అంటారు.
డి.టి.ఎచ్
డైరక్టటూ టూ హోం (చానల్ ప్రసారం శాటీలైట్ నుండి వినియోగదారునికి కేబుల్ ఆపరేటర్ అవసరం లేకుండ) టీవీ చూసే విధానం. ఇతర దేశాల్లో 10%, 20% ఉపయోగిస్తూన్నారు ఇండియాలోను డిష్ టీవీ, టాటాస్కై, డీడీ డైరక్టటూ, రిలయెన్స్, సన్ డైరక్టటూ, ఎయిర్ టెల్, వీడీయోకాన్, సంస్ధలు సేవలు అందిస్తూన్నవి. ఇందూలో కేవలం డీడీ డైరక్టటూ సంస్ధ ఉచిత సేవలు ఇండియాలో వినియోగదారునికి అందిస్తూన్నది.
బుల్లితెర దరహాసం
ఇండియాలో కేబుల్ టీవీ సుమారు 20 కోట్ల ఇండ్లల్లోని టీవీ సెట్ల కనెక్షన్లుకు చేరింది. ఇది కేవలం ఇరువై ఏండ్లల్లోనే సాద్యమైంది. 150 ఏండ్ల చరిత్ర ఉన్న భారతీయా సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) భారతదేశంలో సమాచార మార్పిడులు భారతదేశ టెలిఫోన్ చరిత్ర 1882 జనవరి 28 నుండి ఇప్పటి వరకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) నూట ముప్పై ఏండ్లల్లోను ఈ రిక్డాడును చేరలేదు. కానీ ఇంతకంటే తొందరగా మోభైల్ పోన్లు ఇండియాలో 2000 నుండి 2015 వరకు కేవలం 15 సం||ల్లో హండ్ సేట్ల సంఖ్య 30 కోట్ల సంఖ్య దాటింది. అత్యంత వేగంగా కేబుల్ టీవీ తరువాత విస్తరించిన 2 వ నెట్ వర్కూ మోభైల్ పోన్ రిక్డాడు.
నియంత్రణ వ్వవస్థ
1995లో ప్రభుత్వం TRAI (టెలికాం రెగ్యులేటరీ అధారిటీ అఫ్ ఇండియా) భారతదేశంలో టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ సంస్థలకే కేబుల్ టీవీ నియంత్రిణ కూడా అప్పగించబడింది.
ఈ సంస్థ 1995లో కేబుల్ టీవీ నియంత్రిణ చట్టంగా (నియమ నిబందనలు రూపొందించారు) చేశారు. ఆ చట్టాని 2000 ఆగస్టు 11, 2005, 2011 సం. రాల్లో సవరించబడింది.
సెట్‌టాప్ పెట్టెలు
పార్లమెంటు ఆమోదించిన కేబుల్ టీవీ నెట్ వర్కు సవరణ బిల్లు 2011 . ప్రకారం దేశవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు తమ నెట్ వర్కును డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు సైతం అనలాగ్ సిగ్నల్ నుండి డిజిటల్ సిగ్నల్స్ కు మారాల్సి ఉంటుంది. ఇండియాలో కేబుల్ టీవీ ఇండ్లల్లోని టీవీ సెట్ కనెక్షన్ కు డిజిటల్ సిగ్నల్స్ స్వీకరించడానికి సెట్‌టాప్ పెట్టె (2) అవసరముంటుంది.
సెట్‌టాప్ పెట్టెల కలవరం
2011 లో దేశంలో కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2012 నవంబరు 1 తో ముగిసింది. అవి దేశ రాజధాని న్యూఢిల్లీ, ముంబాయీ, కోల్ క్తత,చెన్నైయ్ పట్టణ ప్రాంత కేబుల్ టీవీ వినియోగదారులు కచ్చితంగా సెట్‌టాప్‌బాక్స్(ఎస్‌టీబీ) అమర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
పన్నుల వడ్డింపునకే కేబుల్‌టీవీ డిజిటైజేషన్
వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే.. ఇదివరకే వినోదపు పన్ను వడ్డింపు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. డిజిటైజేషన్ ద్వారా కేబుల్ టీవీ చందాదారులకు సంబంధించి పూర్తి పారదర్శకత వస్తుందని, తద్వారా పన్నులు కచ్చితంగా వసూలు అయ్యేందుకు వీలవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి.
డిజిటైజేషన్‌కు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల తయారీవల్ల దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు మేలు చేకూర్చడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ దొరుకుతాయి. టీవీ, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా, యానిమేషన్ వంటి రంగాలు గత రెండేళ్లలో అనూహ్య వృద్ధి సాధించాయి. 2018 నాటికి ఈ రంగాలు రూ.1,78,600 కోట్ల వృద్ధిసాధిస్తాయి. దేశంలో ప్రస్తుతం 800 టీవీ చానెళ్లు, 245 ఎఫ్‌ఎం, 170 కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి.
బుల్లితెర కష్టాలు
సెట్‌టాప్ బాక్స్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్రం పార్లమెంటులో బిల్లును ఆమోదించిది . కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది దీన్ని పాటించాల్సిందే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నుంచి ఆదేశాలు ఉత్తర్వులను పాటించాల్సిందే. మరోపక్క బాక్సులకు దేశంలో తీవ్ర కొరత ఉంది. . సెట్ టాప్ బాక్స్‌లు లేకపోవడంతో అనలాగ్ సంకేతాలు నిలిచిపోయాయి. లక్షల ఇళ్లలో టీవీలు బుల్లితెర వినోదానికి తెరపడింది బాక్స్‌లు బిగించని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతున్నాయి.
రెండో దశలో డిజిటైజేషన్ 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ ఉన్నాయి
రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి డిజిటైజేషన్‌లో భాగంగా 2013 సెప్టెంబరు 18 తో ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు సెట్‌టాప్ బాక్సుల పాట్లు తప్పడంలేదు. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో జనం బేజారవుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో సెట్‌టాప్ బాక్స్‌ల లభ్యతను పరిగణలోకి తీసుకోకుండామార్చి 31ని తుదిగడువుగా విధించడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువు పెంచాలని కోరుతూ కొందరు ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు విశాఖలో పది శాతం మాత్రమే డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్‌టీబీలు అమర్చుకున్నారు.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లోనే..
నాంపల్లి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్‌నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీహిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి.
జంటనగరాల్లో కేబుల్ లెక్కలివే..
మొత్తం కేబుల్ కనెక్షన్లు: సుమారు 30 లక్షలు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నవారు: సుమారు 6 లక్షలు సెట్‌టాప్‌బాక్స్‌ల అవసరం: సుమారు 24 లక్షలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నవి: ఏడు లక్షలు, కొరత: సుమారు 17 లక్షలు సెట్‌టాప్ బాక్స్ ధర: కంపెనీని బట్టి రూ.1250 నుంచి రూ.1500
మూడవ దశ పిబ్రవరి 31 2017 వరకు గడువిచ్చింది
కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ ప్రక్రియ మూడోదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్న మేజర్ పంచాయతీలు, టౌన్‌షిప్‌లలో కేబుల్ టీవీ ప్రసారాలను 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో 186, ఆం«ధ్రప్రదేశ్‌లో 180 పట్టణాల్లో కేబుల్ టీవీ ప్రసారాలు డోలాయమానంలో పడ్డాయి ఇందుకు సంబంధించి మూడో దశలో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, అక్కడున్న కేబుల్ కనెక్షన్ల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2015 ఏప్రిల్‌లో సమాచారం అందించింది. అయితే డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో నిర్ధేశించిన గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియ సాధ్యం కాలేదు. అరకొర ప్రకటనలే జారీ.. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గురించి అరకొర ప్రకటనలు ఇవ్వడం తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వినియోగదారులకు అవగాహన కల్పించడం, మాస్టర్ సిస్టమ్ ఆపరేటర్ల (ఎంఎస్‌ఓ)లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. గతేడాది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిశాతం వరకు కేబుల్ కనెక్షన్లు సెట్‌టాప్ బాక్సులు అమర్చుకున్నాయి.
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అదనంగా మరో ఇరవై శాతం కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 30 శాతం కనెక్షన్లకే సెట్‌టాప్ బాక్సులు అమర్చారు . మిగిలిన 70 శాతం కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చడం కష్టమే. అనలాగ్ కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే వినియోగదారుల నుంచి సెట్‌టాప్ బాక్సులకు తీవ్రమైన డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్ బాక్సులు లభించడం కష్టమే.
నాలుగో దశ తేదీ 2017 మార్చి 31
దేశంలో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ నాలుగో దశకు గడువు తేదీని 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌పై ఎంఎస్‌వో సంఘాలు, కొందరు వ్యక్తులు వేసిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం, సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. డిసెంబరు 31కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటలైజేషన్ పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ తేదీ పెంపు వారికి ఇంకా డిజిటల్‌లోకి మారకపోతే వారికి పిబ్రవరి 31వరకు గడువిచ్చింది.ఇక ఈ నెల రోజుల్లో డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్ బాక్సులు లభించడం ఎలా సాద్యమో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పాలి. విదేశాల నుంచి సెట్‌టాప్‌బాక్స్‌ల దిగుమతి నిలిచిపోవడంతో వీటికి తీవ్ర కొరత ఏర్పడింది. గడువును ఆరు నెలలపాటు పెంచాలని కేబుల్ ఆపరేటర్లు కోరుతున్నారు.
నాలుగో దశకు గడువు కేవలం ఒక నెల రోజులు
నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది.
తల తోక లేని ట్రాయ్ నిర్ణయం
డిజిటలైజేషన్‌పై గతంలో ప్రభుత్వం ఎంఎస్‌వోలు భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, 68.84% భారతీయులు (833.1 మిలియన్ల మంది) 6,49,481 వివిధ గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ గ్రామాల పరిమాణం గణనీయంగా మారుతుంది. 236,004 భారత గ్రామాల్లో 500 కన్నా తక్కువ జనాభా ఉండగా, 3,976 గ్రామాలలో 10,000+ జనాభా ఉంది.
నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు 6,49,481 ఫలితంగా గ్రామాలలో అనలాగ్ పద్ధతిలో సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి ప్రసారాలు నిలిచిపోయాయి. కేవలం ఒక నెల రోజులలో డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు[ప్రతి టి.వి కి ] సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
డిజిటైజేషన్
1. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2010 - 1 నవంబరు 2012 వరకు [సుమారు 2 సంవత్సరాలకు పైగా] దేశం ఆర్ధిక నగరాలకు గడువు 2. రెండో దశలో 1 నవంబరు 2012 - 2013 సెప్టెంబరు 18 వరకు[సుమారు 2 సంవత్సరాలకు పైగా] 2 వ శ్రేణీ దేశ ఆర్ధిక నగరంలకు గడువు 3. మూడోదశలో దేశం లోని 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సెప్టెంబరు 2013 - పిబ్రవరి 31, 2017 వరకు[సుమారు 4 సంవత్సరాలకు పైగా]పట్టణంలకు గడువు ఇచ్చిన ప్రభుత్వం. 4. నాలుగో దశ తేదీ పిబ్రవరి 31, 2017 - మార్చి 31 2017 ఆర్ధికంగా వెనుకబడి, విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, అధికంగా వ్యవసాయం మీద ఆధారపడుతారు.అలాటి గ్రామాలు ,చిన్న గ్రామా పంచాయతీలకు కేవలం ఒక నెల రోజుల గడువు.
డిజిటైజేషన్ మన దేశానికి 2020 విజన్
డిజిటైజేషన్ అన్ని శాఖలల్లో బారతదేశానికి 2020 విజన్ గడువు. అన్ని శాఖలల్లో లేని తొందర కేవలం ఒక “‘కేబుల్ టీవీ నెట్ వర్కులపైన“‘ ఎందుకో ...
ఉదాహరణకు స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రభుత్వం ఇప్పటికి 70 ఏండ్లు, డిసెంబరు 2016 లో నివేదిక ప్రకారం 6,522 గ్రామాలు విద్యుత్ లేనివి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. డాక్టర్లు లేని గ్రామాలు కోకొల్లలు.
ఎంఎస్‌వోలు
ప్రభుత్వం నుండి ఏలాంటి ప్రకటన లేదు ఇదే అదనుగా లోకల్ కేబుల్ ఆపరేటర్లును మల్టీ సిస్టం ఆపరేటర్లు(ఎంఎస్‌వోలు) అతి ఉత్సాహంతో సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి చిన్న కేబుల్ ఆపరేటర్లును చాలా ఇబ్బంది పెడుచున్నారు.
గడువును పెంచాలని ఆపరేటర్లు
సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ బాక్స్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ధరలను గణనీయంగా తగ్గించడం, వాటిని విక్రయించేందుకు మరిన్ని కంపెనీలకు అనుమతించడమే సమస్యకు పరిష్కారం ఇప్పుడు బాక్స్‌ల ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా, బాక్స్‌ల కొరత కూడా ఏర్పడుతోంది.అందుకే సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు.
కార్పోరేట్ సంస్థల ఆశ
కేబుల్ టీవీ నెట్ వర్కులపైన పెట్టుబడి ఎవరికి వారుగా కేబుల్ ఆపరేటర్ వారి ఏరియాల్లో పెట్టారు వీరికి ప్రభుత్వం నుండీ కూడా రక్షణ లేదు. ఇండియాలో సుమారు 1 కోటి కుటుంబాలు దీనిపై బ్రతుకు చున్నారు. ఇంత మంది వెళ్లు ఆదాయాన్ని ఏదో ఒక కొత్త టెక్నాలాజీ కనిపెట్టీ ఆ ఆదాయాని తమకే రావాలని కార్పోరేటు సంస్ధలు కోట్లూ ఖర్చూపెడుతున్నవి.
గడువును పెంచకపోవడానికి కారణం
సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ ఏళ్లతరబడి పట్టణ ప్రాంతం మందకొడిగా సాగి చిన్నపంచాయతీలకు కేవలం ఒక నెల రోజులు మాత్రమేఇచ్చి గడువును పెంచకపోవడానికి కారణం కార్పోరేట్ సంస్థల హస్తం ఉందని అర్ధం అవుతోంది. డిటిహెచ్ సంస్ధలకు లాభాలు సమకూర్చడానికీ కేబుల్ ఆపరేటర్ల జీవితాలతో ఆడుకునేవిదమైన ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి