30, జూన్ 2017, శుక్రవారం

yerrabelli dayakar rao ఎర్రబెల్లి దయాకర్ రావు

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు ఎర్రబెల్లి దయాకర్ రావు చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

ఎర్రబెల్లి దయాకర్ రావు చరిత్ర గురించి ...

ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన సీనీయర్ రాజకీయ నాయకుడు 2016లో తెలుగుదేశంపార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు.

బాల్యం, కుటుంబం

ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన పర్వతగిరిలో జన్మించాడు. ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు. 1964లో ఇతని తండ్రి సమితి అధ్యక్షుడుగా పనిచేశాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గార్కి బంధువు మరియు రాజకీయ శిష్యుడు .

విద్యాభ్యాసం

ఇంటర్మీడీయట్ వరకు అభ్యసించి, వరంగల్లో తండ్రి మిత్రుడు అయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఇంట్లో ఉంటూ డిగ్రీ మధ్యలోనే ఎన్.టి.రామారావు అభిమాన సంఘం నాయకుడుగా పనిచేసిన పరిచయంతో, ఎన్టీ రామారావు సూచనపై చదువు ఆపేసి, రాజకీయాలలో ప్రవేశించి, 1982లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు.

వ్యక్తిగత జీవితం

1983లో తొలిసారి శాసన సభ్యులుగా పోటీచేసి ఓడిపోయారు. రాజకీయ కుటుంబం కావున పర్వతగిరిలో రేషన్ డీలర్ గా పోస్టూ పడింది. ఎర్రబెల్లి దయాకర్ రావు అడిగి అడుగగానే అధికారులు రేషన్ డీలర్ గా అపాయింటుమేంటూ ఇచ్చారు.. మరోక్కరికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంచార్జ్ ఇచ్చి కొద్ది రోజులకే, శాసన సభ్యులుగా పోటీచేసి రేషన్ డీలర్ గా వద్దు అనుకొని, పూర్తిగా పోస్టూ రేషన్ డీలర్ గా మరోక్కరికి అపాయింటుమేంటూ ఇప్పించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు. 1987లో వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పదవి లభించింది. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షులుగా రేషన్ డీలర్స్ యూనియన్ నాయకులు ఆ పదవి ఇచ్చారు ఎర్రబెల్లి దయాకర్ రావుగార్కి, దాంతో ఆ పేరూతోనే చాలా పాపులారిటీ వచ్చింది అనోచ్చు ఎర్రబెల్లి దయాకర్ రావు గార్కి.

రాజకీయ జీవితం

1994లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో వరసగా రెండోసారి ఎన్నికైనారు. 2004లో 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు.కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఇక 2008 ఉప ఎన్నికలలో కూడా వరంగల్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రవీంద్ర నాయక్ ను ఓడించి, తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించి మాస్ లీడర్ గా ఇమేజీ పెంచుకున్నారు. మొత్తం 3 సార్లు శాసన సభ్యులుగా వర్ధన్నపేట నుండి ఎన్నిక కావడమే కాకుండా, 2009,2014లో పాలకుర్తి నుంచి వరసగా 4వసారి డా.నెమురుగోమ్ముల సుధాకర్ రావు సహకారంతో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులైనారు. 2014లో దుగ్యాల శ్రీనివాస్ రావు పై గెలుపొంది పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5వసారి శాసనసభలో ప్రవేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటూకు తోలిబీజం

కరుడుగట్టిన సమక్యవాది నారా చంద్రబాబునాయుడుతో సహా యనమల రామకృష్ణుడు లాంటి లీడర్లను, శాసనసభ సభ్యులను ఒప్పించి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విభజనకు తెలుగుదేశం పార్టీ నుండి 2 సార్లు అనుకూలంగా  తెలంగాణకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాలుగా రెండుగా ఏర్పాటూ చేయుటకు అనుకూలం అని కేంద్రానికి “తీర్మాణం లేఖ“ ఇప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటూకు తోలిబీజం పడింది అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారే 99% కారణం. దీనితో తెలంగాణ ప్రాంతంలోనే పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. ఇతని దూకుడు స్వభావం వలన మీడియా లోను ప్రముఖునిగా పేరు పొందాడు.

బాబ్లీ ప్రాజెక్టు

ప్రాణహిత నదిపై బాబ్లీ ప్రాజెక్టు కడితే మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదికి కేవలం 6 నుండి 8 టీ.యం.సి. ల నీరు ఆగుతుంది. జైలుకు సైతం వెళ్లాడు తెలంగాణఎడారి అవుతుంది అని బాబ్లీ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్ళి నిరసనచేశాడు. దానికి చిత్తశుద్దో రాజకీయలబ్దో కానీ మహారాష్ట్ర పోలీసులతో దెబ్బలు పడిండు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులతో పాటు చంద్రబాబు నాయుడును సైతం మహారాష్ట్రకు బాబ్లీ ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అందరినీ మహారాష్ట్రప్రభుత్వం అరెస్టు చేసి విమానంలో హైదరాబాదుకు పంపారు. దయాకర్ రావు దీనికి నిరసనగా ఢిల్లీలో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోని 2 రైళ్ళ నిండా జనంతో సుమారు 4000 వెయ్యిల మందితో ఢిల్లీలో ధర్నా నిర్వహించి ఓ మంచి రికార్డుగా నమోదు అయింది.

నియోజకవర్గ అభివృద్ధి

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొద్ది గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టారు. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకాలువను తెచ్చారు, గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టారు. చేసిన పనుల వలన పార్టీ జిల్లా అధ్యక్షునిగా రికార్డు ఉంది.

రాష్ట్ర ప్రముఖ నాయకుడు

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటూ నారా చంద్రబాబునాయుడు ఆంధ్రా CM గా వెళ్ళిపోయిడు, సీనీయర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిడు మరియు ఎనుముల రేవంత్ రెడ్డి శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ శాసన సభ్యులు స్టీఫెన్ కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గార్కి తెలంగాణ ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా పాపులారిటీ ఉంది.కానీ

టీఆర్ ఎస్ లో చేరారు

2016లో తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (తెరాస) టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు


https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి