26, నవంబర్ 2017, ఆదివారం

Gandhi account గాంధీగారి ఖాతా

Gandhi account  గాంధీగారి ఖాతా! 



బహుశా.. యావత్ విశ్వంలో.. మహాత్మాగాంధీ అంతటి బ్యాంకింగ్ కస్టమర్ వుండరు 
మరణానంతరం కూడా ఆయన ఖాతాలో డబ్బులు జమ అవుతుండడం దీనికి నిదర్శనం. 
ఈ ‘గాంధీగారి ఖాతా’ అనే పదం, పదప్రయోగం ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ, విస్తృతంగా వాడుకలో వున్న పదం.
ఎవరికన్నా నాబోటివాడికి అప్పు ఇచ్చినప్పుడో, చేబదులు ఇచ్చినప్పుడో.. ఇక అవి తిరిగిరావని ఖాయం చేసుకున్నాక.. ఆ డబ్బులను గాంధీగారి ఖాతాలోకి లెక్కవేసుకోవడం కద్దు.
జాతిపిత పేరిట ఈ నానుడి రావడం చాలా విచిత్రం.
సొతంత్ర సముపార్జనలో భాగంగా గాంధీగారు ఊరూరూ తిరిగి జోలెపట్టారు. పుట్లింటివాళ్లు, మెట్టినింటోళ్లు ఇచ్చిన గాజులు, చెవి దుద్దులు, మంగళసూత్రాలతో సహా గాంధీగారి జోలెలో వేశారు. ఆడది అర్ధరాత్రి స్వేచ్చగా తిరగగలిగే సొంతంత్రాన్ని కాంక్షించి గాంధీగారి ఖాతాలో జమచేశారు. ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా.
గాంధీగారి ఖాతాలో జమచేసిన వాటికి ప్రతిఫలంగా వాళ్లెవరూ వడ్డీ అడగలేదు, అసలు అడగలేదు. కేవలం దేశానికి స్వతంత్రం అడిగారు. మనుషులకు స్వతంత్రం అడిగారు.
గాంధి పుట్టిన దేశమా ఇది అని అప్పుడప్పుడూ పాటలు వస్తుంటాయి. అది మహాత్మాగాంధీ గురించి కాదు. అనేక గాంధీలు పుట్టిన దేశమేనా అని ఒక వ్యంగ్యం అని అనుకుంటాను.
గాంధీగారి ఖాతా అనేది కూడా.. స్విస్ బ్యాంకుల్లోనూ కనిపించని, వెనక్కు తీసుకురాలేని ఖాతా మొత్తం అనుకుంటాను.
ఇంతకూ మన జాతిపిత జోలె పట్టుకుని సేకరించిన మొత్తానికి జమాఖర్చులేమైనా వున్నాయా? అని డౌటనుమానం.
కొల్లాయికట్టిన జాతిపిత లెక్కలు రాయకుండా వుండరు.
అన్ని వివరాలూ వుంటే కూడా జాతిపిత పేరిట గాంధీగారి ఖాతా అని నవ్వేసుకోవడం జాతిద్రోహం కదా!  

17, నవంబర్ 2017, శుక్రవారం

Ayurveda ఆయుర్వేదం

Ayurveda ఆయుర్వేదం ...joke

ఆయుర్వేదంలో ఇన్ని అద్భుతాలు వున్నాయా?  ఏకంగా కనపడకుండా పోవచ్చా?  
వస్తుగుణదీపిక పుస్తకం తిరగేస్తుంటే.. నల్లగుంటగలగర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
గుంటగలగర ఆకు గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆకును కొబ్బరినూనెలో మరిగించి తలకు రాసుకుంటారు. అలాగే ఈ ఆకుతో రోటిపచ్చడి కూడా చేసుకోవచ్చు. భృంగరాజ్ తైలం అని మార్కెట్లో కూడా దొరుకుతుంది.
గుంటగలగరకు అనేక ఔషధ గుణాలు వున్నాయి. అందులో సందేహం లేదు.
నల్లగుంటగలగర విశేషాలను ఇప్పుడు చెప్పుకుందాం.
చిత్రంలో వున్నది మామూలు గుంటగలగర. కృష్ణగుంటగలగర పువ్వులు నీలం రంగులో వుంటాయి.
నల్లగుంటగలగర మొక్క మొత్తాన్ని నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత చూర్ణం చేసి, ప్రతిరోజు ఉదయం సుమారు బేడయెత్తు చూర్ణాన్ని ఆవు పెరుగుతో కలిపి ఒక సంవత్సరం పాటు పుచ్చుకోవాలి.
పాటించాల్సిన నియమాలు:
ఈ సంవత్సర కాలములో నియమనిష్టలతో వుండాలి. లఘువైన శాకాహారాలను భుజించాలి. పులుపు, కారాలను తగ్గించాలి. స్నాన, పాన, భోజన శయనాదులలో నియమం కలిగి వుండాలి. లైంగిక సంభోగములు వుండరాదు.
ఏడాదికాలంలో చేకూరే ఫలితాలు:
1. మొదటి నెలలో సమస్త రోగములు నివారణ అగును 
2. రెండవ నెలలో తెల్లని వెంట్రుకలు నల్లబడును 
3. మూడవ నెలలో బుద్ధికి బలము కలుగును 
4. నాలుగవ నెలలో మనని చూసి శత్రువులు భయపడుదురు 
5. ఐదవ నెలలో మనను అందరూ మర్యాద చేయుదురు 
6. ఆరవ నెలలో మనకు ఐశ్వర్యం కలుగును 
7. ఏడవ నెలలో మన దేహకాంతి భేదించును 
8. ఎనిమిదో నెలలో గొప్పవాళ్లం అవుతాం 
9. తొమ్మిదో నెలలో మనం ఒక్కోసారి కనిపిస్తాం.. ఒక్కోసారి కనిపించం  
10. పదవ నెలలో మననెవ్వరూ కనుగొనజాలరు     (ఎవరన్నా కాలింగ్ బెల్ కొడితే తలుపు తీస్తాంకానీ.. వచ్చిన వాళ్లకు మనం కనపడం అన్నమాట. అప్పులవాళ్లు చెప్పులరిగేలా తిరుగుతుంటారు మన జాడకోసం. పోలీసులు సీసీటీవీ ఫుటేజులను తెగ వెదుకుతారు మన అజాపజాకోసం. )
11. పదకొండవ నెలలో మహా శూరులం అవుతాం 
12. పన్నెండవ నెలలో మహాత్ములం అవుతాం 
..
ఈ సంగతి తెలియగానే.. బాబ్బాబు అదెక్కడ దొరుకుతుందో కాస్త తెచ్చిపెట్టు. ఏడాదిపాటు పాటిస్తాను. నీతో.. ఈ కుక్కలు, పిల్లులు, కోళ్లతో వేగలేకపోతున్నాను. ఎవరికీ కనిపించకుడా మాయమైపోతాను అన్న. మనుషులకు కనబడవేమో కానీ.. కుక్కలు, పిల్లులు, కోళ్లకు కనిపిస్తావేమో అని డౌటనుమానం ఎక్స్ ప్రెస్ చేశాను.

Chiranjeevi చిరంజీవి

Chiranjeevi చిరంజీవి ...

చిరంజీవి- స్వయం క్రుషి: సినీ రంగం లో ప్రవేశించిన 1978 నుంచి 1980 వరకు చిరంజీవి నటించిన సినెమాలు దాదాపు ఎవ్వరికీ తెలియదు. మొదటి 25 సినెమాలు చెప్పమంటే చిరంజీవి నే చెప్పలేడు అంటే అతిశయోక్తి కాదు. 1980 లో తమ కులపోడే కదా అని అల్లు రామలింగయ్య తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశాకే చిరంజీవి కి ఫ్లాట్ ఫార్మ్ దొరికింది, చెప్పుకోటానికి ఒక అడ్రస్ దొరికింది.
భారత చలన చిత్ర రంగం లో అత్యధికం గా ఫుష్ అప్, బ్యాక్ అప్ ఉంది చిరంజీవి ఒక్కడికే. ఒక వైపు పిల్లనిచ్చిన మామ, ఇంకో వైపు బావ మరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్. మరోవైపు ఎంత చెత్త సినెమా లో నటించినా అల్లు అరవింద్ ఆధ్వర్యం లోని అత్యధిక దియోటర్స్. మామూలు చిరంజీవి ని మెగా స్టార్ చిరంజీవి ని చేసింది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ & అల్లు రామలింగయ్య గారే .
చిరంజీవి కి మొదటి అవార్డ్ తెచ్చి పెట్టిన "శుభలేఖ" కానీ ఆ తర్వాత అవార్డ్ తెచ్చి పెట్టి గుర్తింపు ఇచ్చిన "విజేత" కానీ నిర్మించింది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నే.
విజేత సినెమా కి అవార్డ్ రాకముందే చిరంజీవి 80 వరకు సినెమాలు చేశాడు.
దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు కూడా తన కుమారుడి చేత రెండు , మూడూ సినెమాలు తీసి గుర్తింపు రాలేదు అని ఆపేశారు. కానీ, చిరంజీవి కి గుర్తింపు తేవటానికి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ 80 సినెమాల వరకు పుష్ అప్, బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నారు. 1985 లో విజేత సినెమాకి అవార్డ్ వచ్చేంతవరకు చిరంజీవి నటించిన సినెమాలు 80. ఆ తర్వాత 30 సంవత్సరాలలో చిరంజీవి నటించిన సినెమాలు 70.
ఆ తర్వాత కూడా, దియోటర్స్ అన్నీ తమ గుప్పెట్లో ఉన్న ఆ నలుగురు లో ఒకరు అయిన అల్లు అరవింద్ చిరంజీవి సినెమాలకి ఎక్కువ దియోటర్స్ ఇచ్చి బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నారు.
1978 కంటే ముందే లక్షల్లో ఫీజు కట్టి మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో కోర్స్ చేయగలిగినంత డబ్బు చిరంజీవి ఫాదర్ ఇచ్చాడు.
వరుస ప్లాఫ్ లు వచ్చిన ప్రతిసారీ హిట్ అయిన పరభాషా సినెమా ని తెలుగు లో తీయటం చిరంజీవి కి అలవాటు. మొట్టమొదటి సినెమాల్లో ఒకటైన మనవూరి పాండవులు కూడా రీమేక్ సినిమా నే. ఈ మధ్య థాగూర్ సినెమా ముందు ప్లాఫ్ లతో కొట్టుమిట్టాడుతుంటే ఆల్ రడీ మరో హీరో రాజ శేఖర్ కొన్న సినెమా ని మళ్ళీ ఎక్కువ డబ్బులు ఆశ చూపి మచి పూచి మారేడు కాయ చేసి ఠాగూర్ సినెమాని దక్కించుకొని హిట్ కొట్టాడు అని వార్తల్లో చూశాం. గ్యాప్ తర్వాత వచ్చిన చిరంజీవి మళ్ళీ తమిళం లో హిట్ అయ్యిన కత్తి సినెమా నే తెలుగు లో తీచి నటించాడు.
మొత్తం 25 వరకు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన వాటిని తీసుకొని తెలుగు లో నటించాడు చిరంజీవి.
ఏతా వాతా నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. చిరంజీవి వి స్వయం క్రుషి కి సంబందం లేదు. అమితాబ్ బచ్చన్ కూడా అభిషేక్ బచ్చన్ కి కొంతవరకే పుష్ అప్ ఇచ్చాడు. కానీ, చిరంజీవి కి ప్రస్తుతం కూడా అల్లు అరవింద్ ఎక్కువ దియోటర్స్ రూపం లో పుష్ అప్, బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నాడు. 
అన్నీటికంటే ముఖ్యం గా ఆ రోజుల్లో ని రామారావు, నాగేశ్వరావు, క్రిష్ట్న, శోభన్ బాబు, మోహన్ బాబు. ఇంకా, ఆ నలుగురు టాప్ హీరోల్లో బాలక్రిష్న, నాగార్జున, వెంకటేష్ ఒకే సామాజిక వర్గం అవ్వటం వలన మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు చాలా మంది చిరంజీవి కి పుష్ అప్, బ్యాక్ అప్ ఇచ్చి ఆదరించారు. ఆ సామాజిక వర్గం లో పడని వాళ్ళు కూడా చిరంజీవి కి అండ దండలు ఇచ్చి పెద్దోన్ని చేశారు .
ఏది ఏమైనా, స్వయం గా ఎదగని వాళ్ళ పక్కన స్వయం క్రుషి పేరు వాడుతుండటం వలనే స్వయం క్రుషి తో ఎదిగిన ఉదయ కిరణ్ లాంటోళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఎవరో మన మెదళ్లలో నింపిన సమాచారం కాకుండా ఉన్నది ఉన్నట్లు చూడగలిగితే నిజాలు మనకే అవగతం అవుతాయి. భావోద్వేగాన్ని పక్కన పెట్టి నిజం గా స్వయం క్రుషి తో ఎదిగిన వారిని రేపటి పౌరులకి పరిచయం చేయండి.

India ఇండియా భారత్ భారతదేశం

India ఇండియా భారత్ భారతదేశం

మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత?
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల,పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా,అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు,తుష్కరులు,మొఘలులు,సుల్తానులు,నవాబులు,షేక్ లు,పఠాన్ లు,పోర్చుగీస్ వారు,ఫ్రెంచ్ వారు,డచ్ వారు,బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.

8, నవంబర్ 2017, బుధవారం

Coal బొగ్గు Open cast ఓపెన్ కాస్ట్

Coal బొగ్గు Open cast ఓపెన్ కాస్ట్ 


బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ,ఉద్యోగుల కనీస
సౌకర్యాలను కల్పించడముపై కూడా చూపాలి.  ఓపెన్ కాస్ట్
ప్రాజెక్ట్ కార్మికుల ఉద్యోగుల " రోడ్ ప్రయాణ భద్రతను కల్పించాలి. ద్విచక్ర వాహానాలపై షిప్టు సమయాలలో డ్యూటీకి వచ్చి పోతుంటారు. ఆ సమయములో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ లారీలు , ఇసుక ట్రాన్స్ పోర్ట్ లారీలు కూడా నడువడము వలన సెకండ్, నైట్ షిప్టుల కార్మికులు , ఉద్యోగులు భయముతో ప్రయాణించుచున్నారు. ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. షిప్టు
సమయాలలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ లారీలను బంద్ పెట్టాలని
DGMS/ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్శ్ సేప్టీ మార్గదర్శకాలు
ఉన్నాయి. అయిన సింగరేణి యాజమాన్యము పాటించడము లేదు.రోడ్ పై / వెంబడి స్ట్రీట్ లైట్స్ లేవు .
కోల్ ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్ట్ నుండి హాజర్లుపడే సైట్ ఆపీస్ Attendance Office వరకు రోడ్ గుంతలతోను , రోడ్ మద్యన పేరుక పోయిన మట్టి గడ్డలతోను ఉండటము వలన సైకిల్ మోటార్స్ స్లిప్ అయి ప్రమాదాలు జరుగుచున్నవి . ఈ వారము రోజులలో ఇద్దరు కార్మికులు
స్లిపై రోడ్ పై పడ్డారు. గాయాలతో బయటపడినారు .
ఇక మంచి నీళ్లు . బొగ్గు , ఓవర్ బర్డెన్ క్వారీలలో రంజన్
లలో మంచి నీళ్లు పోస్తారు . పై విభాగాలైన క్యాంటిన్ , టీ టైం రెస్ట్ షెల్టర్ లలో ప్రైవేట్ ట్యాంకర్ లతో మంచి నీళ్లను
పోస్తారు. అయితే ఇప్పుడు గోదావరిలో నీటి ప్రవాహము
తక్కువగా ఉన్నందున నీరు కలుషితమయ్యే అవకాశము
ఉన్నది. ఎందుకంటే ? " సింగరేణి రక్షిత మంచి నీటి ఇన్ పిల్ట్రేషన్ గ్యాలరీ వెల్స్ 100 మీటర్ల ఎగువన గోదావరి నదిలో డ్రైనేజీ నీళ్లు కలుస్తాయి. అయితే " రామగుండం
కార్పొరేషన్ రక్షిత మంచి నీళ్ల ఇన్ పిల్ర్టేషన్ గ్యాలరీ వెల్స్
దిగువన డ్రైనేజీ నీళ్లు గోదావరి నదిలో కలుస్తాయి. అంటే
సింగరేణి రక్షిత మంచి నీళ్ల కంటే ----- రామగుండం ఏరియా రక్షిత మంచి నీళ్లు రక్షితమైనవి. పోయిన ఎండ
కాలములో నీళ్లు కలుషితమైతే అప్పటి కరీంనగర్ జిల్లా
కలెక్టర్ స్పందించి సింగరేణి యాజమన్యాన్ని అభిశంషించింది. మందలియడము జరిగింది. స్వయముగా మేనేజుమెంటే సింగరేణి నల్ల నీళ్లను తాగవద్దని ప్రకటించింది.
ఇప్పుడు మేడపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కార్మికులకు
ఉద్యోగులకు రామగుండం కార్పొరేషన్ రక్షిత మంచి నీళ్లను సరఫరా చేయాలి. రోడ్ పైన ఉన్న గుంతలను
ప్యాచ్ వర్క్ ద్వారా లెవల్ చేయాలి. రోడ్ పైన పేరుకపోయిన మట్టి గడ్డలను తొలగించాలి. రోడ్ వెంబడి
స్ట్రీట్ లైట్స్ ను ఏర్పాటు చేయాలి. షిప్ట్ సమయాలలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ , ఇసుక ట్రాన్స్ పోర్ట్ లారీలను బంద్ పెట్టాలని కార్మికులు ,ఉద్యోగులు కోరుచున్నారు.

7, నవంబర్ 2017, మంగళవారం

Elections ఎన్నికలు

Elections ఎన్నికలు

2019 వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికలు రాయలసీమ వాసులకు కొత్త ముఖాలను పరిచయం చేయనున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటున్న వారితోపాటు వారి వారసులు, కుటుంబ సభ్యులు బరిలోకి దిగడమే కాదు.. కొందరు వెనక్కు తగ్గి మరి కొందరు ముందుకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. చివరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్థల మార్పును కోరుకుంటున్నారని వినికిడి. ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చేసి తర్వాత కొడుకు నారా లోకేశ్‌ను తన క్యాబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాల్సిన అవసరం ఉన్నది. పలు నియోజకవర్గాలను పరిశీలనలోకి తీసుకున్నా సొంత సామాజిక వర్గం జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గాలను బాబు పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. అలా కానీ పక్షంలో కుప్పుం నుంచే నారా లోకేశ్‌ను రంగంలోకి దించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సొంత చిత్తూరు జిల్లాలోని సురక్షిత స్థానం 'కుప్పం' వదిలేయడం వల్ల తనయుడు లోకేశ్.. సేఫ్ జోన్‌లో చంద్రబాబు తలపోస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. సీఎంగా చంద్రబాబు తాను కొత్త అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సంకల్పించారని వార్తలొచ్చాయి. ప్రత్యేకించి కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట గట్టిగా వినిపిస్తున్నది. ఇక ఆయన వియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలక్రుష్ణ ఈ దఫా.. హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబుకు ప్రత్యామ్నాయ సీటు నంద్యాల
దీని ప్రకారం నంద్యాల అసెంబ్లీ స్థానం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూమా కుటుంబ సభ్యులకు దక్కే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. తనయుడు లోకేశ్‌కు కుప్పం.. సేఫ్‌గా ఉంటుందని, తన కోసం నంద్యాల సీటును ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని వినికిడి. ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నా పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందే సరికి చంద్రబాబు లెక్కలు, అంచనాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే చంద్రబాబు ఇప్పుడు మదిలో తలెత్తిన వ్యూహానికి కట్టుబడి ఉంటాడా? లేదా? అన్న విషయం వేచి చూస్తే గానీ అర్థం కానీ అంశం.
నల్లారి కిరణ్ కుమార్ రాజకీయ భవితవ్యం ఆసక్తికరమే
కర్నూల్ ఎంపీ సీటు నుంచి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడుతారని వినికిడి. ఇక నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని పోటీలోకి దించుతారన్న విషయం ఇంకా స్పష్టత రానే లేదు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరాగమనం సంకేతాలిస్తున్నారు. ఇప్పటికిప్పుడైతే ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు గానీ.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆసక్తికర పరిణామమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు
కడప నుంచి అవినాశ్ సస్పెన్స్.. షర్మిలకు చాన్స్?
చిత్తూరు జిల్లాతోపాటు కడపకు అనుసంధానమైన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ మిధున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి పోటీ చేసి.. కొడుకుని అసెంబ్లీకి పంపాలని యోచిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇక కడప లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తారా? అన్నది అనుమానమే. వైఎస్ షర్మిల, వైఎస్ భారతిల్లో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిలను ఒంగోలు నుంచి గానీ, విశాఖపట్నం నుంచి గానీ పోటీ చేయించే చాన్స్ కనిపిస్తున్నది.
పోటీ చేయనన్న జేసీ.. కొడుక్కి చాన్స్ లభిస్తుందా?
అనంతపురం జిల్లాలోని రెండు లోక్‌సభా స్థానాల పరిధిలో మార్పులు జరిగే అవకాశాలు పుష్కలం. అనంతపురం స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించేశారు. ఇక ఆయన తన తనయుడ్ని పోటీలోకి దించాలని భావించినా సీఎం చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్నది అనుమానమే. అందునా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో చంద్రబాబు నాయుడుకు రాజకీయ అవసరాలేమీ లేవు. ఈ నేపథ్యంలో వారిని పూర్తిగా పక్కన బెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అనంతపురం లోక్ సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరన్న విషయం స్పష్టత రావాల్సి ఉన్నది. అలాగే హిందూపురం స్థానం నుంచి కూడా కీలక మార్పులు జరుగవచ్చునని భావిస్తున్నారు.
వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి?
ప్రస్తుత ఎంపీ నిమ్మల కిష్టప్ప తన స్థానాన్ని బాలక్రుష్ణ కోసం త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నారట. బాలక్రుష్ణ హిందూపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తే, అసెంబ్లీ స్థానానికి నారా వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు.. నారా లోకేశ్ గానీ, ఆయన భార్య బ్రాహ్మణి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్ పోటీ చేయడం కుదరకపోతే బాలక్రుష్ణ తన అల్లుడి కోసం సీటు త్యాగం చేసి.. లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారని వినికిడి. అయితే దగ్గుబాటి పురందేశ్వరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని హిందూపురం లోక్ సభ సీటు కేటాయించాలని వైఎస్ జగన్ తలపోస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథరెడ్డికి వచ్చే అసెంబ్లీ టిక్కెట్ లభించడం సందేహస్పదమేనని అంటున్నారు. పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ నిమ్మల కిష్టప్ప తన తనయుడిని రంగంలోకి దించాలని యోచిస్తున్నారని వినికిడి.

LPG Gas వంటగ్యాస్‌

LPG Gas వంటగ్యాస్‌ ...

ఇటీవల ప్రకటించినట్లుగానే వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని ప్రకటించినట్లుగానే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగులు ముందుకు సాగుతున్నాయి. పేదల సంక్షేమానికి తిలోదకాలిస్తున్న కేంద్ర సర్కార్.. ఆచరణలో బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలు వాటికి సారథ్యం వహిస్తున్న పారిశ్రామిక యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో అడిగిందే తడువుగా రాయితీలు, పన్ను చెల్లింపుల్లో సబ్సిడీ కల్పిస్తున్నది. ప్రతి నెలా చివరి ఆదివారం 'మన్ కీ బాత్' అనే పేరుతో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన మనస్సులో ఆలోచన ఆలస్యంగా బయటపడుతున్నది.
ప్రతినెలా గ్యాస్‌ ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఈ పెంపు ఎంత అని తెలిస్తే ముక్కుపై వేలేసుకోవాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత 16 నెలల్లో రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.196.41 కోట్ల భారం గ్యాస్‌ వినియోగదారులపై మోపారంటే నమ్మక తప్పదు. గతేడాది ఆగస్టులో సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.567.5 ఉండేది. ఇప్పుడది రూ.808కు చేరింది. ఏతావాతా ఒక సిలిండర్‌పై రూ.240.5 పెరిగింది.
తెలంగాణలో 81.67 లక్షల మందికి సబ్సిడీ
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థల్లో ఇండేన్‌కు 35.28 లక్షలు, భారత్‌ 29.50 లక్షలు, హెచ్‌పీ గ్యాస్‌కు 20.74 లక్షల చొప్పున మొత్తం 85.52 లక్షల గ్యాస్‌ వినియోగదారులున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'గివ్‌ ఇట్‌ అప్‌' పిలుపునకు తెలంగాణలో 3.85 లక్షల మంది సబ్సిడీ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 81.67 లక్షల మంది సబ్సిడీని పొందుతున్నారు. ఈ లెక్కన బండ భారం సుమారు రూ.196.41 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. గ్యాస్‌పైన సబ్సిడీని కేంద్రం నెల నెలా తగ్గించుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను తూ.చ. తప్పకుండా పాటిస్తూ నెలనెల ధరలు పెంచుతున్నది. ఈ నెలలో రూ.4.50 పెంచింది. ఈ విధంగా ఏడాదిలోగా సబ్సిడీ గ్యాస్‌ అనే మాట వినపడకుండా ప్రయత్నిస్తున్నది. ఒకేసారి భారం మోపకుండా దశలవారీగా ప్రజలపై బండ బారం వేస్తూనే ఉన్నది.
16 నెలల్లో 19 సార్లు గ్యాస్ ధర పెంపు
సబ్సిడీ ఎత్తి వేయాలనే యోచనతోనే కేంద్రం నెలనెల ఇలా గ్యాస్‌ ధర పెంచుతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 2016 జూలైలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు ఈ ధరలను 16 నెలల్లో 19 సార్లు సవరించాయి. ఇందులో ఎక్కువ సార్లు పెరుగుదలే ఉండటం గమనార్హం. 2016 ఆగస్టులో రూ.567.5 ఉన్న ధర అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.545.5కి పడిపోయింది. నాటి నుంచి పెరగడమే తప్ప తగ్గలేదు. అదే ఏడాది అక్టోబర్‌లో రూ.568, నవంబర్‌లో 609, డిసెంబర్‌లో రూ.686కు చేరి ఆ ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే ఒక్కో సిలిండర్‌పై రూ.118.5 భారం వేశారు. ఇక 2017 ఆగస్టులో మినహా ఇప్పటి వరకు తగ్గింపు ఊసేలేదు. ఈ ఏడాది జనవరిలో రూ.687 ఉన్న ధర మార్చి నాటికి రూ.847కు చేరడం ఆందోళన కలిగించే అంశం.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.808
కేవలం మూడు నెలల్లోనే సిలిండర్‌పై ఏకంగా రూ.160 బాదేయడం విశేషం. ఆ తరువాత రెండు మూడు నెలలు పదుల్లో తగ్గించి అక్టోబర్‌, నవంబర్‌ నాటికి వందల్లో పెంచేశారు. ప్రస్తుతం గ్యాస్‌ ధర రూ.808 వసూలు చేస్తున్నారు. కాగా, వంటగ్యాస్‌ను సబ్సిడీపై పొందుతున్నవారిలో సాధారణ కుటుంబాలే ఎక్కువ. ప్రభుత్వం నేరుగా పెట్రోలియం సంస్థలకు సబ్సిడీ సొమ్మును సర్దుబాటు చేసి వినియోగదారులకు తక్కువ ధరకే గతంలో సిలిండర్‌ పంపిణీ చేసేది. సబ్సిడీని పెట్రోలియం సంస్థలకు సర్దుబాటు చేయకుండా వినియోగదారుల నుంచి నిర్ణీత సొమ్ము వసూలు చేసి రీయింబర్స్‌మెంట్‌ రూపంలో కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసే విధానం అమలు చేస్తున్నది. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై రూ.90 నుంచి రూ.200 వరకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. అంటే గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం అంతమొత్తాన్ని భరించేది. వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతినెలా గ్యాస్‌పై రూ.4 చొప్పున ధర పెంచాలని నిర్ణయించింది. ఇలా ప్రతినెలా ధర పెంచుతూ పోయి 2018 మార్చి వరకు మొత్తం సబ్సిడీని ఎత్తేయాలని యోచిస్తోంది. గత నెల సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.714 ఉండగా ఈ నెల నుంచి పెరిగిన ధరతో కలిపి రూ.808కు చేరింది.
వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ.400 పెంపు
సబ్సిడీ సిలిండర్‌ ధరతో పోల్చితే నాన్‌ సబ్సిడీ ధర సుమారు రెండింతలు పెరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. గతేడాది ఆగస్టులో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.1,075.5 ఉండేది. ఈ నెల నవంబర్‌లో ఏకంగా 1,464కు చేరింది. గత 16 నెలల కాలంలో అక్షరాల రూ.388.5 పైసలు పెరిగింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దారుణంగా రూ.1,572.5, రూ.1553.5, రూ.1,553.5 పైసలకు ఎగబాకింది. ఇలా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే దాని ప్రభావాన్ని వ్యాపారులు సామాన్య ప్రజలపై వేస్తారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల దెబ్బకు విలవిల్లాడుతున్న సామాన్యులు నెలనెల గ్యాస్‌ ధరలు పెంచడంతో కట్టెల పొయ్యే మేలని భావిస్తున్నారు.
ఇలా నెలనెలా ధరలు పెంచుతున్న కేంద్ర చమురు సంస్థలు
మోడీ ప్రభుత్వం 2014 లోక్‌సభ ఎన్నికల ముందు దళిత, బహుజనుల శ్రేయస్సు కోసం పాటుపడతానని ఇచ్చిన వాగ్దానం తుంగలో తొక్కుతున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికే నోట్లరద్దు, జీఎస్టీతో పేదల అవసరాలకు ఉపయోగపడే పలు వస్తువులపై అదనపు బాదుడు వేసి కొనుగోలు చేయలేని పరిస్థితి. చమురు కంపెనీలు రోజుకో ధర నిర్ణయిస్తూ వాహనాదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నెలనెల గ్యాస్‌ ధర పెంచడం దారుణమని మోడీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత పెరిగిన నిత్యావసరాల ధరలు
పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని గృహిణులు కోరుతున్నారు. తాము పనిచేసే చోట గ్యాస్‌ ధరలు పెంచినట్టు జీతాలు పెంచడం లేదని చెప్పారు. ఓ వైపు కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అందనంత ఎత్తులో ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తరువాత ధరలు తగ్గుతాయని గొప్పలు చెప్పన కేంద్రం.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. గతంలో ఏ సర్కార్‌ ఇంత పెంచలేదు. సామాన్యులు వంటగ్యాస్‌ను వదిలేసి కట్టెల పొయ్యిపై వంటచేయాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడుతున్నారు. కుటుంబానికి అందించే వంటగ్యాస్‌ సిలిండర్‌పై భారం మోపడం అన్యాయమని అంటున్నారు. సబ్సిడీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని అభిప్రాయ పడుతున్నారు.

Divorce విడాకులు

Divorce విడాకులు
Prabhakargoud Nomula

*ఓ* *హిందువు* *మెలుకో,* *నీ* *కర్తవ్యం తెలుసుకో...*
హిందువులను చైతన్య పరచే ఉద్దేశ్యంతో ఈ సమాచారం చేరవేస్తున్నాం. చదవండి, చదివించండి, చట్టపరిధిలో హిందూ హక్కులకై పోరాడండి. మీకు ఎల్లప్పుడు మా తోడ్పాటు ఉంటుంది.
*1.* నీ భార్య(భర్త)గాని వేరే మతం పుచ్చుకున్నా, లేక కూటములకు, దర్గాలకు వెళ్తున్నా, నువ్వు అతడు(అమె) నుండి విడాకులు పోందవచ్చు.(హిందు వివాహ చట్టం సెక్షన్ 13(1)II.
2. నీ భార్యగాని, తల్లిగాని, కుమార్తెగాని దర్గాలకు, కూటములకు వెళ్లుతున్నారా, వీరికి మనోవర్తి చెల్లించనక్కర్లేదు. సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్1956.
3. నీ కోడుకుగాని, కోడలు గాని వేరే మతం పుచ్చుకోన్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలో గాని, మరి ఏ ఇతర హిందూ బంధువుల నుండి గాని, వారసత్వపు హక్కుగాని , వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు.
4. తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్తికి గార్డియన్ గా ఉండే హక్కును కోల్పోతారు. (సెక్షన్ 6, హింతూ మైనార్టీ&గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులుగాని, చుట్టుపక్కల హిందువులు గాని స్వచ్చందందా ముందుకు వస్తే సంబందిత జిల్లా కోర్టు వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే కాదు మత మార్పడుల కార్యక్రమంపై (బాష్టిజం లేదా ముస్లింమతంపై ) ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే, మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆఱ్డర్ ఇచ్చే హక్కు ఉంది.
5. మతం పుచ్చుకున్నBc-A,B,D గ్రూపుల వారు Oc గా పరిగణించబడతారు. అదే విధంగా క్రైస్తవమతం పుచ్చుకున్న Scలు, Bc-cలుగాను, ముస్లిం మతం పుచ్చుకున్న Scలు, Ocలు గాను పరిగణింపబడతారు. అలాగై క్రైస్తవ, లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న STలు Ocలుగా పరిగణించబడతారు.
6. మతం మార్చుకోని కూడా SC, ST, BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పోందుతున్న వాళ్లపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టవచ్చు.
7. SC, ST కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత చర్చికి వెళ్లడం లేదా క్రైస్తవంను నమ్ముకోవడం చేస్తే వారి ప్రమోషన్ వారి పిల్లల సౌకర్యంల నిమిత్తం BC-c మాత్రమే అవుతారు వారు ఇంకా రిజర్వేషన్ సౌకర్యం పోందుతూ వుంటే వారిపై ఎవరైన చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఇటువంచి సమాచారం మీ వద్ద ఉంటే ఫిర్యాదు పోలీసువారికి పంపి వాటి ప్రతి మీ దగ్గరలో ఉన్న మా కార్యకర్తలకు సమాచారం ఇవ్వండి.
8. నిజంగా ఆనాధలు లేకపోయినా ఉన్నట్లు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించడం జరుగుతూనే ఉంటుంది. అటువంటి మతసంస్థలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ దగ్గరలో ఉన్న మా కార్యకర్తలకు కాపీ అందజేయండి. వారు సంబంధిత పోలీస్ మరియు రెవెన్యూ అధికారులతో సంప్రదించి వారిపై చట్టప్రకారం తగు చర్య తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇటీవల బయటపడిన పీటర్ సుబ్బయ్య, సావిత్రమ్మ మొదలైన మిషనరీల సంస్థల కేసులు గమనించండి.
9. మతం మారిన వాళ్ల SC, ST రిజర్వు స్థానాల్లో ఫోటీ చేయరాదు. వారు BC రిజర్వు స్థానాల్లో ఫోటీ చేయవలసి ఉంటుంది. అలా పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఫిర్యాదు కలెక్టర్ కు, సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసుకు పంపిస్తూ
స్థానికంగా ఉన్న మా కార్యకర్తలకు తెలియజేయండి.
10. The A.P Prohibition of Cow slaughter and Animal Preservation Act 1977 (AP Act No.11 of 1977) Section 5,6,10,11 Prevention of cruetly to Animal Act 1960, Animals Act 1960. Moter vechile Act Rules 49-50 Transport Act 1978 And 1989 Rule 253, sub Rule(I) clause (III) ప్రకారం గోహత్య, గోవుల తరలింపు చట్ట విరుద్ధం. కావున ఎక్కడైనా గోవుల హత్యలు గాని, గోవుల తరలింపు గాని జరుగుతున్నట్లైతే మా కార్యకర్తల దృష్టికి తీసుకురండి.
11. 1976సం. నుండి మనదేశంలో విదేశీవిరాళముల నియంత్రణ చట్టం (Act 49/1976) అమలులో ఉంది. స్వచ్ఛంద సెవాసంస్థల పేరుతో, ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్టం ప్రకారం నేరం కాబట్టి అటువంటి సంస్థలపై ఈ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
12. హిందువుల మధ్యలో చర్చి నిర్మాణం చేయరాదు. చేసిన యెడల దగ్గరలో ఉన్న మా కార్యకర్తలకు తెలియపర్చండి.
13. ఎక్కడైన హిందూ స్ర్తీల పై, విద్యార్థినులపై లవ్ జీహాద్ చేస్తున్న సంఘటనలు ఉన్నట్లైతే మా దృష్టికి తీసుకురండి. లవ్ జీహాద్ అనేది ముస్లిం యువకులు అనుసరిస్తున్న ఫంథా. వారి సంఖ్యను పెంచుకోవటం దీని ఉద్ధేశ్యం. మతం మార్చటం కోసం చేసుకునే పెళ్ళిల్లు చెల్లనేరవని ఇటీవల అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును గమనించండి.
14. హిందూ వ్యతిరేకుల వద్ద ఏ విధమైన వ్యాపార లావాదేవీలను జరపకండి.
15. హజ్ యాత్రికులకు కోట్ల రూపాయల ప్రయాణ రాయితీ కల్పిస్తూ, హిందువులు తమ పండుగలకు ఊళ్ళకు వెలుతుంటే రవాణా చార్జీలు పెంచడాన్ని ఖండించండి. హింతూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేస్తూ, ఆ ఆదాయాన్ని ప్రభుత్వం
మరల్చుకోంటుంది. కాని ఇతర మత సంస్థల ఆదాయా వ్యయాలను ఎందుకు పరిశీలించటం లేదు?
16. రహదారుల పై అడ్డంగా ఉన్న నిరుపయోగంలో ఉన్న ప్రార్థన స్థలాలపై కుహానా సెక్యులర్ వాదుల తీరును ఖండించండి.

17, అక్టోబర్ 2017, మంగళవారం

Health ఆరోగ్యం

మనిషి జీవితంలో ఎక్కువ కాలం పని ప్రదేశంలోనే గడిచి పోతుంది.
నోముల ప్రభాకర్ గౌడ్ 
పని ప్రదేశంలోని పర్యవసానాలు నిత్య జీవితం మీద గణనీయమైన ప్రభావం చూపుతయి. వ్యతిరేక పరిస్థితులు ఉన్న యెడల మానసిక ఆరోగ్యం మీద కూడా ఆ దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగ వ్యక్తికి, సంస్థకు ఆ మేరకు నష్టం వాటిల్లుతుంది. ప్రతి 5 గురిలో ఒకరు పని చేసే చోట మానసిక సమస్యతో బాధ పడుతున్నరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) తాజా సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగ పని ప్రదేశంలో 30 కోట్లు పైగా ప్రజలు కుంగుబాటుతో, 26 కోట్లు పైగా ప్రజలు ఆందోళనతో బాధ పడుతున్నరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏటా ఒక లక్ష కోట్ల అమెరికన్ డాలర్ల ఉత్పాదకతను నష్ట పోతున్నది. మానసిక ఆరోగ్యం కోసం పెట్టిన ఒక అమెరికన్ డాలర్ పెట్టుబడి ఆరోగ్య పరంగ, ఉత్పాదన పరంగ నాలుగు అమెరికన్ డాలర్ ల విలువైన సత్ ఫలితాన్ని చేకూర్చ గలదని ఆ అధ్యయనం అంచనా! అందుకే ఈ ఏటి ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ నినాదంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వర్‌ల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ చేత “పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం” ఎంపిక అయింది.
విశ్వ వ్యాప్తంగ ‘శ్రామిక ఆరోగ్యం మీద కార్యాచరణ ప్రణాళిక’ (2008-2017) మరియు ‘మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక’ (2013-2020) లను రూపకల్పన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ! ‘ప్రొటెక్టింగ్ వర్కర్స్ హెల్త్’ శీర్షికన వరుస పుస్తకాలను వెలువరిస్తున్నది. ‘మెంటల్ హెల్త్ గ్యాప్ ఆక్షన్ ప్లాన్’ లో భాగంగ పలు పద్ధతులను, ఐటి ఆధారిత స్వీయ ఉపయోగకర పరికరాలను అభివృద్ధి చేస్తున్నది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైసేషన్ (ఐ ఎల్ ఓ) గత సంవత్సరం ‘ద ప్రొటెక్షన్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎట్ వర్క్’ ప్రచురించింది. డబ్ల్యూ హెచ్ ఓ మరియు ఐ ఎల్ ఓ సంయుక్తంగ 2000 సంవత్సరంలో ‘మెంటల్ హెల్త్ అండ్ వర్క్’ గ్రంథాన్ని ప్రచురించినయి. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ వారు ‘మేనేజింగ్ మెంటల్ హెల్త్ ఇన్ వర్క్ ప్లేస్’ వంటి మాడ్యూల్స్ వెలువరిస్తున్నరు. ‘వర్‌ల్డ్ ఎకనామిక్ ఫోరం’ వారి తాజా మార్గదర్శి కూడా కొన్ని ఉపగమాలను సూచించింది.
మన దేశంలో ఆరోగ్య శాఖ 1982లో ‘జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం’ ప్రారంభించి, 1996లో దానిని జిల్లా స్థాయికి విస్తరించింది. ‘జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం’ అంశాలలో ‘పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం’ కూడా ఉన్నది. 2005 లో మొదలైన జాతీయ ఆరోగ్య మిషన్ లో చేర్చిన అంశాలలో మానసిక ఆరోగ్యం ఒకటి. భారత ప్రభుత్వం 2014లో ‘మానసిక ఆరోగ్య విధానం’ ను ప్రకటించింది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం 1992 సెక్షన్ 3 క్రింద ‘మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ 2017’ ను ఆమోదించింది.
పని ప్రదేశంలో భౌతిక పరిస్థితులు, పని జీవన నాణ్యత, పనిలో ఒత్తిడి, వేధింపులు, నిర్ణయాధికారం, గుర్తింపు, పదోన్నతి, వేతనాలు, పని వేళలు, వ్యక్తి శారీరక ఆరోగ్యం వంటి ఎన్నో అంశాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తయి. అధికారుల వ్యక్తిత్వ వైకల్యాలు, ఆధిపత్య ధోరణి ఉద్యోగి మానసిక ఆరోగ్య విఘాతానికి హేతువులు. అధికారుల వ్యవహార శైలిని సంస్కరించకుండా మిగతా చర్యల వలన ప్రయోజనం శూన్యం. యాజమాన్యాలు ఉద్యోగి మానసిక ఆరోగ్యాన్ని సంక్షేమ కార్యంగ, యాజమాన్య బాధ్యతగ గుర్తించాలె. సైకాలజిస్ట్ లను నియమించుకొని వారి సేవలను ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగ చూడాలె. మానసిక ఆరోగ్యం ఉద్యోగుల మానవ హక్కు. 

16, అక్టోబర్ 2017, సోమవారం

Farmer's set రైతు సమితి

Farmer's set రైతు సమితి
నోముల ప్రభాకర్ గౌడ్
రైతు సమితిలతో హక్కుల రక్షణ
రైతులు అసంఘటితంగా ఉండటం వల్ల వారు తమ హక్కుల గురించి,సమస్యల గురించి ఒక తాటిపైకి వచ్చి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఫలితంగా కొందరు రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు వలస వెళ్లారు. మిగిలిన వారు వ్యవసాయంతో నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ సంఘటిత రంగంలోని సభ్యునికి ఉపాధి దొరకనప్పుడు నిరుద్యోగభృతి లభిస్తుంది. అంతేకాదు సంఘంలో వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లదు. అందుకే వారు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవిస్తారు. కానీ ఇవేవీ అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు ఉండవు. దీన్నిబట్టి మన వ్యవసాయరంగం ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రైతుల ను రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు వారందరిని చట్టబద్ధంగా సంఘటితపరిచే చర్యలు ప్రారంభించడం ఆహ్వానించదగిన పరిణామం.
రాష్ట్రంలో దాదాపు 55లక్షలకు పైగా రైతు కుటుంబాలున్నాయి. ఇం దులో సుమారు 48లక్షలు చిన్న, సన్నకారు కుటుంబాలే. అలాగే రాష్ట్రం లో సగటు భూ కమత పరిమాణం 1.2 హెక్టార్లు. ఇది భారతీయ భూకమత పరిమాణం 1.16 హెక్టార్ల కంటే తక్కువ. రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఆర్థిక సంక్షోభంలో ఉండటానికి అనేక కారణాలున్నాయి. పంట రకం, దాన్ని పండించే తీరును ప్రాథమికంగా పేర్కొనవచ్చు. ఎక్కువమంది రైతు లు వానాకాలం, యాసంగిల్లో పునరావృతంగా ఒకేపంటను సాగు చేస్తున్నారు. రైతులకు వారు పండిస్తున్న పంటల శాతం రాష్ట్రంలో, దేశంలో, అలాగే అంతర్జాతీయంగాను ఎంత మొత్తంలో ఉంటున్నది అన్న అవగా హన ఉండటం లేదు. ఆ పంటల మొత్తం దిగుబడి, వినియోగ అవసరం ఎంత ఉన్నది? అలాగే పంటలను ఎటువంటి సాగు పద్ధతుల ద్వారా సాగుచేస్తున్నారన్న విషయాలపై ప్రాథమిక అవగాహన ఉండదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులపై, ఇక్కడున్న భూకమత పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సాంప్రదాయకంగా, మార్కెట్ ధరలు చూసి అవే పంటలు పునరావృతంగా సాగుచేస్తున్నారు. దీనివల్ల సగటు దిగుబ డి పెరుగుతున్నప్పటికీ భూమి సారం కోల్పోతున్నది. దీంతో చీడపీడలను తట్టుకోవడానికి అధిక మొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. దీనివల్ల సాగు వ్యయం గణనీయంగా పెరుగుతున్నది. దీనికితోడు వచ్చిన దిగుబడికి అనేక సందర్భాల్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇలా ఏటా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి వేలకోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. అలాగే వ్యవసాయ రంగానికి సాగు నీరు అందించడానికి భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. చెరువులను పునరుద్ధరిస్తున్నది. వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నది. దీనివల్ల సగ టు ఉత్పత్తి పెరుగుతుంది. దీనికి అనుగుణంగా తగిన ఫలాలు పొందాలంటే రైతులంతా సంఘటితం కావాలి. కాలానికి, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. రైతులు సంఘటితంగా ఉండటం వల్ల ఏకాలంలో ఎటువంటి పంటలు పండించాలి? ఏ పద్ధతుల ద్వారా పం డించాలి? పండించే పంటకు కనీస మద్దతు ధర ఉన్నదా? అనే సమాచారాన్ని రైతులంతా సమిష్టిగా పంచుకోగల్గుతారు. భవిష్యత్తులో వివిధ పంటల దిగుబడి అంచనా వివరాలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి రైతులంతా సమిష్టిగా ఉంటే సరైన నిర్ణయా లు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా వ్యవసాయ రంగంలో నష్టాలను తగ్గించుకునే వీలు ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది రైతులు నేల రకం, శీతోష్ణస్థితి, నీటి లభ్యత తదితర అంశాలపై అవగాహన లేకుండా మార్కెట్ ధరల ప్రాతిపదికన పంటలను సాగు చేస్తున్నారు. దీనివల్ల నష్టాలకు గురవుతున్నారు. కాబట్టి ఇకముందు ఇలా జరుగకుండా ఉండాలంటే రైతులంతా సంఘటితంగా ఉండాలి. రైతు సమన్వయ సమితిల ద్వారా ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఇది సంపూర్ణంగా జరిగితే రాష్ట్ర వ్యవసాయరంగం సంక్షోభాన్ని అధిగమిస్తుంది.
సగటు కమత పరిమాణం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యపడని అనేక వనరులను రైతులంతా సమిష్టిగా ఉండటం వల్ల సాధించవచ్చు. కొత్తగా వచ్చిన పద్ధతులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల సగటు వ్యవసాయ వ్యయం తగ్గడమే కాకుండా సగటు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రుణ సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉన్నది. ఏదైనా కారణం చేత ఒక రైతు ఆర్థికంగా నష్టపోయినా సంఘటితంగా ఉండటం వల్ల అందరూ కలిసి తమ శక్తి మేరకు ఎంతో కొంత సహాయం చేస్తారు. దీంతో ఆ రైతును ఆర్థికనష్టాల నుంచి బైట పడవేయవచ్చు. అలాగే కాలానికి అనుగుణంగా పంటలను పండిస్తారు. కలిసి మార్కెట్ చేసుకోవడం వల్ల దళారీల జోక్యం తొలిగి సరైన ధరలు పొందవచ్చు. వివి ధ కారణాల చేత పంటను నిల్వ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్మించిన గిడ్డంగుల్లో సమిష్టిగా నిల్వ చేస్తారు. దీంతో నిల్వ, రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలను రైతులు సంఘటితం గా ఉండటం వల్ల పొందవచ్చు. కాబట్టి రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమన్వయ సమితిల్లో స్వచ్ఛందంగా చేరాలి. సమిష్టిగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి.

Kallugita కల్లుగీత

Kallugita కల్లుగీత ...
నోముల ప్రభాకర్ గౌడ్

కల్లుగీతకు ఆధునిక హంగులు
-ఉచితంగా చెట్లు ఎక్కే యంత్రాలు
-శీతలపానీయాలకు దీటుగా నీరా
-సొసైటీలకు 5 ఎకరాల భూమి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కల్లుగీత వృత్తిని ఆధునీకరించి, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. చెట్లు ఎక్కి దిగే సమయాల్లో చాలామంది కిందపడిపోయి చనిపోతున్నారు. శాశ్వత వికలాంగులవుతున్నారు. ఇలాంటి విషాద సందర్భాలలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు చెట్లు ఎక్కే యంత్రాలు ఉచితంగా ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. అధికారులు ఇతర రాష్ర్టాల్లో పర్యటించి, వాటి పనితీరును పరిశీలించారు. భువనగిరిలో నిర్వహించిన ట్రయల్ రన్‌పై ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు సంతృప్తి వ్యక్తంచేశారు. హరితహారం కార్యక్రమంలోనూ ఈత తాటి వనాల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. రెండేండ్లలో 25 లక్షల మొక్కలు నాటటం ఇందుకు నిదర్శనం. కల్లుగీత సొసైటీలకు 5 ఎకరాల భూమి ఇస్తామంటూ కల్లుగీత పాలసీలో స్పష్టంచేసిన ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన భూముల్లో హైబ్రిడ్ మొక్కలు నాటించి, వాటిని గీతకార్మికులే సంరక్షించుకొనే విధంగా కార్యక్రమాలు రూపొందించింది.
కల్లు, ఈత, ఖర్జూర చెట్ల నుంచి తీసే నీరాను నిల్వచేసేందుకు బాట్లింగ్ యూనిట్లు నెలకొల్పి, శీతల పానీయాలకు దీటుగా మార్కెట్‌చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. దీనినుంచి బెల్లం, చక్కర, జామ్, చాక్లెట్స్, ఫామ్ వైన్‌లాంటి అనేక ఉప ఉత్పత్తులు పొందే అవకాశముంది. కల్లులో పోషక విలువలు ఉన్నాయని, క్యాన్సర్‌ను నివారించే గుణం ఉన్నదని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించటం విశేషం. 65 ఏండ్లు నిండినవారికి ఇచ్చే వృద్ధాప్య పింఛన్లను కల్లుగీత కార్మికులకు 50 ఏండ్లు నిండగానే ఇస్తున్నది. చెట్లు ఎక్కి దిగే పనిలో త్వరగా వంట్లో సత్తువ కోల్పోతున్నారన్న ఉద్దేశంతో ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును తగ్గించింది. కల్లుగీత కార్మికులు ప్రభుత్వానికి ఏటా రూ. 15కోట్ల పన్ను కడుతున్నారు. ఒక్కొక్క చెట్టుకు పట్టణాల్లో రూ. 50, గ్రామాల్లో రూ.25 చొప్పున పన్ను చెల్లిస్తున్నారు. చెట్ల యజమానులకూ రూ. 50 నుంచి వంద దాకా చెల్లిస్తున్నారు. వీటిని మాఫీ చేసే ఆలోచనలో ప్రభు త్వం ఉన్నది.

KALWAKURTHY కల్వకుర్తి

KALWAKURTHY కల్వకుర్తి
నోముల ప్రభాకర్ గౌడ్


కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారం.
మూడు దశాబ్దాలుగా మూలుగుతున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారం కాబోతున్నదని కళ్లలో వత్తులు వేసుకొని ఆశతో ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతుల కలలు నిజమవుతున్నవి. ముప్ఫై ఏండ్ల కిందట ప్రారంభించబడి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, కల్వకుర్తి ప్రాంత నాయకుల నిర్లిప్తత వల్ల ఈ ప్రాజెక్టు ప్రగతి నత్తనడకను తలపింపజేసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు గోడమీది రాతలా, నేరవేరని కలలా, లేచిపడిన అలలా మిగిలిపోతుందని అనిపించింది. 2001లో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభించినప్పుడు కల్వకుర్తి ప్రాంతంలో ఆ ఉద్యమం ప్రభావం లేదు. నాడు నేను ఆ ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ప్రాధాన్యాన్ని, ఆవశ్యకతను తెలియజేసినప్పుడు ఈ ప్రాంత నాయకులు నన్ను గేలి చేశారు. ప్రజలు కూడా వారి భ్రమలో ఉండి ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే మనకేం ఒరుగుతుందని భావించారు. ఆనాడే ప్రత్యేక రాష్ట్రం వస్తే మన నిధులు, నీళ్లు వాడుకోవచ్చని చెప్పాను. మన ప్రాంత వనరులన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్నారని చెబితే నన్నొక సంకుచిత మనస్కుడిగా చిత్రీకరించారు. నేడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయిందంటే అది ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ పుణ్యమే. సరైన వర్షాల్లేక, కరువుతో అలమటించే రైతుల పాలిట వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టుపై ఎవ్వరూ సరైన సమయం లో సరైన దృష్టిపెట్టలేదు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఈ ప్రాజెక్టుకు కొంత ప్రాధా న్యం ఇచ్చినా అవి సర్వేల వరకే పరిమితమైంది. ఆ తర్వాత పోతిరెడ్డిపా డు లాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యాన్ని ఇచ్చి మన నాయకుల నిరాసక్తతను ఆసరాగా తీసుకొని కావలసిన నిధులను విడుదల చేయక ప్రాజెక్టులో ప్రగతి ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.
నీళ్లులేక, కరువు కోరల్లో చిక్కిన ఈ ప్రాంత రైతులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి వలసల జిల్లాగా ప్రసిద్ధి గాంచింది. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన బడా భూస్వాములు కూడా వ్యవసాయం లాభసాటి కానందున ఇతర వ్యాపకాల కోసం పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లారు. పల్లెటూర్లన్నీ బోసిపోయిన తరుణంలో నేను నమస్తే తెలంగాణ 2016 డిసెంబర్ 29న వ్యాసంలో రాసినట్లుగా కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామ నివాసి, ఒకనాటి అభ్యుదయ రైతు బందెల రాంచంద్రారెడ్డి ఈ ప్రాంత రైతుల దీనస్థితికి వ్యాకులత చెంది మాలాంటి వారి సహకారంతో కల్వకుర్తి రైతు జేఏసీగా ఏర్పడి ఈ ప్రాజెక్టు పూర్తి కోసం ఉద్యమ కార్యాచరణను ఏర్పర్చుకున్నారు. వినూత్న పద్ధతులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మేము రైతు జేఏసీ ఏర్పడిన తర్వాతే మిగ తా ఈ ప్రాంత ప్రతిపక్ష రాజకీయపార్టీలు మేల్కొని ఉద్యమం పేరుతో యాత్రలు చేపట్టారు. బీజేపీ నాయకుడు కల్వకుర్తి నుంచి శాసనసభకు మహాయాత్ర పేరు పెడితే, కాంగ్రెస్ శాసనసభ్యుడు గ్రామాల్లో పర్యటనలు చేశారు. కాని అవి నామమాత్రమే. అవి వారి ఉనికి కోసం ఆరాట మే తప్ప నిజమైన పోరాటం కాదు. వారు రాజకీయ లబ్ధి కోసం చేస్తే మా కన్వీనర్ బందెల రాంచంద్రారెడ్డి రైతు సమస్యగా ఉద్యమం కొనసాగించారు.
మిగతా ప్రతిపక్ష రాజకీయపార్టీలు నామమాత్రపు పర్యటనలు చేస్తే, మా రైతు జేఏసీ పట్టు వదలని విక్రమార్కునిగా, అలుపెరుగని యోధునిగా పలుకార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా రాంచంద్రారెడ్డి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు, నిరంతరం పర్యటించి, గ్రామాలతోని రైతులను చైతన్యపరిచి ఉద్యమించారు. ఈ విషయంలో ఆయన సీఎం కేసీఆర్‌నే ఆదర్శంగా తీసుకున్నారు. గమ్యం చేరేవరకు మన గమనం ఆగకూడదని పలుమార్లు వెల్లడించారు. మా ఉద్యమానికి ముందు నుంచి ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ సిబ్బంది మంచి స్పందన కనబర్చి, మరిచిపోలేని సహకారమందించారు. ప్రాజెక్టు విలంబనకు కాంట్రాక్టర్ అలసత్వమే కానీ సిబ్బందిది ఏమాత్రం కాదు. ఉద్య మం ఫలితంగా నీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు కూడా బాగా స్పందించి ఈ ప్రాంత టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి, ఒకటిరెండుసార్లు ఎక్కడైతే ప్రాజెక్టు పని పూర్తికావల సి ఉందో అక్కడే రాత్రి సమయంలో నిద్రించి, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి, సంబంధిత ఇంజినీర్లను, సిబ్బందిని అప్రమత్తంచేసి ప్రాజెక్టుకు పూర్తికావడానికి తోడ్పడ్డారు. ఒకనాడు నన్ను గేలి చేసినవారికి తలెత్తుకొని సగర్వంగా సమాధానం చెప్పగలిగే స్థితి లో ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే అది ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ పుణ్య మే.
ఈ విషయంలో ఒకనాడు మాపై, హరీశ్‌రావు పర్యటనలపై అనుమానాలు వ్యక్తం చేసినవారు నేడు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రారంభం నుంచి మాకు సంపూర్ణ సహకారమందించిన ప్రాజె క్టు చీఫ్ ఇంజినీర్ ఖగేందర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ భద్రయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ జాదవ్‌లకు ఈ ప్రాంత ప్రజల తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, చివరి దశలో ఈ ప్రాంత ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆదేశించి ప్రాజెక్టు పనుల పర్యవేక్షింపజేసి, ఏండ్ల తరబడి నీళ్ల కోసం తపించిన ప్రజల దాహా ర్తి తీర్చబోతున్నారు. నేను ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం కల్వకుర్తి దాహం తీరాలె 2016 డిసెంబర్ 29న నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. ఈ వ్యాసం ప్రచురితమైన తర్వాతే ఈ ప్రాంత నాయకుల్లో చలనం కనిపించింది. మా విజ్ఞప్తులను, మా ఆకాంక్షలను, ప్రాజెక్టు పూర్తికోసం చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తెచ్చిన నీటిపారుదల శాఖామంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండేకు మా అభినందనలు. రాజకీయాలకు కొత్త అయిన ప్రాజెక్టు పనులను ఆఖరిదశలో పర్యవేక్షించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా మా అభినందనలకు అర్హుడే.

Single country-single party ఒకే దేశం-ఒకే పార్టీ

Single country-single party  ఒకే దేశం-ఒకే పార్టీ ...
నోముల ప్రభాకర్ గౌడ్

పదకొండు మాసాలైంది యాదగిరిని చూసి, ఆయన లోకం ఆయనది. దాదాపు ఏడాది తర్వాత మొన్న వచ్చిండు. పదకొండు నెలల కిందట ఒక శుభరాత్రి ప్రధాని మోదీజీ అలవోకగా టీవీలో కనిపించి నోట్లరద్దు ప్రకటన చేసిన మరునాడు యాదగిరి ఆందోళనాత్మక వదనంతో, కుందల మొందిన డెందంతో, ఎంతో నీరసంతో వచ్చిండు. యాదగిరి సామాన్యుడు, ఈ దేశంలోని కోట్లాది సామాన్యుల్లో ఒకడు. ఆయన ఇంట్లో దాచుకోవడానికి కోట్లు లేవు, తొడుక్కోవడానికి కోట్లు లేవు. రెండు ప్యాంట్లు, రెండు బుషర్టులతో నడుస్తున్న, గడుస్తున్న జీవితం యాదగిరిది.
నలభై ఏండ్ల కిందట, రేపోమాపో ఎమర్జెన్సీ చీకట్లు కమ్ముకోబోతున్న వేళ ఓ తెలుగు వారపత్రిక సంపాదకులం కూర్చొని మాట్లాడుతున్నం. వచ్చేవారం నుంచే చెప్పుకో దగ్గ మనిషి శీర్షిక ప్రారంభించాలనుకున్నం. వారం వారం ఆ కాలం నన్నే రాయమన్నరు. మొదటివారం ఈ దేశంలోని సామాన్యుడు చెప్పుకోదగ్గ మనిషి. 125 వారాలు, ఆ పత్రిక యజమా ని అలిసి పడిపోయేవరకు, పత్రిక వచ్చినంత వరకు ఈ శీర్షిక కొనసాగింది. అప్పటి చెప్పుకోదగ్గ మనుషుల్లో చివరి ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత న్యాయమూర్తి నాగేంద్రసింగ్, షహనాయి షహన్షా ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ప్రఖ్యాత కార్టూనిస్టు అబూ అబ్రహం. నోట్లరద్దు భయంకరంగా దెబ్బకొడుతుందని 11 నెలల కిందట నవంబర్ 9న బాగా అంటే భయపడ్డ, కుంగిపోయిన సామాన్యుడు యాదగి రి మేధావి కాడు, పెద్ద డిగ్రీలు లేవు. అయినా, నోట్ల రద్దు సర్వరోగ నివారిణి. అవినీతిని అంతం చేస్తుంది, నల్లధనం నడ్డి విరుస్తుంది, టెర్రరిజం అంతమవుతుంది, దేశాభివృద్ధి మార్గంలో పయనిస్తుందంటూ రోజూ జోరుగా జరిగిన మల్టీమీడియా ప్రచారం హోరును యాదగిరి వంటి సామాన్యులు ఎంతమాత్రం విశ్వసించలేదు. యాదగిరీ నువు మన్‌కీ బాత్ వింటే ఇంత నిరాశ - నిస్పృహ ఉండేవి కావు అన్నాను. బైంగన్ బాతో, ఆలూ బాతో చేసుకోవడానికే టైమ్ ఉంటలేదు అన్న డు. అవినీతి 16 వేల రెట్లు పెరిగిందని, పెద్ద మనుషులుగా, నయాషాలుగా కనిపించేవారంతా నీతివంతులు కాదని, కశ్మీరు సరిహద్దుల్లో, కశ్మీరు లోయలో, రాజధాని శ్రీనగర్‌లో ప్రజల సంగతి దేవుడికెరుక భారత సైనిక దళాలకే రక్షణ లేదని, చైనా సరిహద్దులో మన మ్యాప్ ఏ క్షణాన, ఏ విధంగా మారుతుందో మనకే తెలియదని (మీరు భూభాగా ల సంగతి మరిచిపోండి, వాణిజ్యం గురించి మాట్లాడుకుందాం. సీబీ ఎం-పరస్పర విశ్వాసాన్ని పెంచే చర్యలు ముఖ్యమనిని చైనా కామ్రేడ్లు మనకు నీతులు బోధిస్తున్నారు!), నూతన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశం లో ఇంకే రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధిపథంలో పయనించడం లేదని గడిచిన మూడేండ్ల చరిత్రను పరికించిన వాళ్లకు అర్థమవుతుంది.
ఎప్పు డూ భుజనా ఓ పాత సంచీ వేల్లాడుతుండే యాదగిరి సామాన్యుడైనా సందేహాలు ఎక్కువ. మన సైనిక బలగాలన్నీ పాకిస్థాన్ ఆక్రమించకుం డా మిగిల్చిన కశ్మీరును రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి గదా ఇక అటు చైనాతో, ఇటు పాక్‌తో యుద్ధం వస్తే ఎట్లా అన్నడు. అక్కడి తో ఆగలేదు. మనకంటే చిన్నదేశం పాకిస్థాన్‌కు మనకంటే ఎక్కువ అణ్వాస్ర్తాలు ఉన్నయట ఎట్ల అని అధైర్యపడ్డడు. మాటల తూటాలతో, నినాదాల నిప్పులతో మనం చుట్టూరా ఉన్న శత్రువులందరిని మట్టు పెట్టగలమని ఎంత సముదాయించినా యాదగిరి ధైర్యం పెరుగదు.
130 కోట్లకు మించిన భారత ప్రజలు అదృష్టవంతులు. ఇప్పుడు ప్రధాని మోదీజీ నాటి చాయ్‌వాలా కాడు. ఆయనిప్పుడు గరళ కంఠు డు, నీలకంఠుడు! విమర్శల విషాన్ని ఆయన గళంలో దాచిపెట్టారు. చరి త్ర పుటలను కెళ్లగిస్తే విమర్శల పర్వాలు చాలా కనిపిస్తాయి. గాంధీజీ 1915 జనవరిలో దక్షిణాఫ్రికా నుంచి శాశ్వతంగా తిరిగివచ్చి స్వదేశంలో అడుగుపెట్టగానే పలుదిశల నుంచి విమర్శల దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడై ఆధ్యాత్మిక రంగంలో మహా మానవుడుగా ప్రసిద్ధి పొందిన పండిత్ మద న్మోహన్ మాలవీయ 1916లో అనిబిసెంట్ సహాయసహకారాలతో వారణాసిలో (యూపీ) బనారసు హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
ఇప్పుడిది ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. అప్పటి ఇండియా వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ 1916 ఫిబ్రవరి 4న బనారస్ హిం దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిపాడు. (నిజాం ప్రభుత్వం ఉదారంగా ఈ విశ్వవిద్యాలయానికి విరాళం ఇచ్చిందన్న వాస్తవాన్ని చెబితే కొందరిని అలర్జీ బాధిస్తుంది) శంకుస్థాపన సందర్భాన నిర్వహించిన ఒక సమావేశానికి దర్భాంగ మహారాజు అధ్యక్షత వహించాడు. ఆ సమావేశంలో గాంధీజీతోపాటు అనిబిసెంట్, భారత సంస్థానాల రాజు లు, మహారాజులెందరో రాజు వెడలె రవి తేజములలరగ అన్నట్లు పాల్గొన్నారు. గాంధీజీ ప్రసంగిస్తూ రాజులను, మహారాజులను, వారి ఆభరణాలను విమర్శించారు. అనిబిసెంట్‌కు, రాజులకు, మహారాజుల కు కోపం వచ్చి, సమావేశం నుంచి బయటికి వెళ్లారు. గాంధీజీ ప్రసంగంపై విమర్శలు చెలరేగాయి. అప్పటికింకా ఆయన మహాత్ముడు కాలే దు. స్వాతంత్య్ర ఉద్యమంలో, స్వాంతంత్య్రం తర్వాత గాంధీజీ విమర్శలకు గురి కాని రోజు లేదు. విశేషించి మతోన్మాదులు అసహనానికి, తీవ్ర విమర్శలకు ఆయన గురి కావలసి వచ్చింది. 1948 జనవరి 30న మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి గాంధీజీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ చర్చల కారణంగా గాంధీజీ ప్రార్థనా సమావేశానికి ఆలస్యంగా వెళ్లారు. సర్దార్ పటేల్‌కు గాంధీజీతో చర్చలు సంతృప్తి కల్గించలే దు. గాంధీజీ విమర్శలకు గురైన చివరిరోజది. తొలి ప్రధాని జవహర్‌లాల్ ఆయనకు దగ్గరివారు, దూరంవారు అందరూ విమర్శించారు.
ప్రసిద్ధ ఫ్రెంచి సంపాదకుడు టైబర్ మెండెస్ ఒక ఇంటర్వ్యూలో జవహర్‌లాల్‌ను భారతదేశం పరిశ్రమల గురించి అడిగాడు. స్వతంత్ర భారతదేశంలో విమర్శ ప్రధాన పరిశ్రమని నెహ్రూ అన్నారు. విమర్శను గరళంగా భావించి కంఠంలో దాచుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ నాయకుడు, నిర్విరామ తపస్సుతో, సర్వతోముఖ అపూ ర్వ అభివృద్ధి కృషితో స్వర్ణ తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ఉజ్వల చరిత్ర నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కనీసం అయిదారు కంఠాలైనా ఉండాలె.మహా మానవుడుగా ప్రఖ్యాతి పొందిన మదన్మోహన్ మాలవీయ అభిప్రాయాలతో, దృక్పథంతో ఏకీభవించలేకపోయినా నెహ్రూ వంటి వారు ఆయన సమున్నత వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. ఓ కుంభమేళా సందర్భాన బ్రిటిష్ పోలీసుల ఆంక్షలను ధిక్కరించి మదన్మోహన్ మాలవీయ హఠాత్తుగా దూసుకుపోయి గంగానదిలో దుమికారు. ఆయన వెనుక నిల్చుని పరిస్థితిని గమనిస్తున్న యువనేత నెహ్రూ కూడా వెంటనే నదిలో దూకి అందరికీ ఆశ్చర్యం కలిగించారు. మాలవీయ వెంట జండా లు పట్టుకొని వచ్చి నినాదాలు చేసిన వారెవ్వరూ గంగానదిలో దూకలే దు. మహనీయుడు మాలవీయ నేతృత్వం వహించిన, గోవింద్ వల్లభ్ పంత్ వంటి పరిపాలనాదక్షులు సీఎంలుగా నాయకత్వం వహించిన, పలువురు ప్రధానులను తన ప్రతినిధులుగా ఎన్నుకున్న యూపీ దేశం లో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైనా వెనుకబాటుతనంలో, పేదరికంలో, అజ్ఞానంలో, అభివృద్ధిరాహిత్యంలో ప్రస్తుతం ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నది. 60 ఏండ్ల అణచివేతకు, దోపిడీకి గురై మూడున్నర ఏండ్ల కింద ట ఒక మహా నాయకుని సమరశీలంతో, పోరాటపటిమతో అవతరించిన తెలంగాణ ఆ నాయకుని ముఖ్యమంత్రిత్వంలో అద్భుత ప్రగతితో పురోగమిస్తుండగా యూపీ వెనుకకు దూసుకుపోతున్నది. 6 నెలల కిందట రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి బీజేపీ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్తగా ఎన్నికైన శాసనసభలో రాష్ట్రంలోని 20 శాతం ఓటర్ల వర్గానికి పాలకపక్షం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. విశాల రాష్ట్రంలోని అన్నివర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఈరోజు యూపీలో లేదన్నది మరో విశేషం.
గత ఆరు నెలల్లో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇం కో విశేషం ఆ రాష్ట్రం దర్శనీయ స్థలాల పట్టిక నుంచి ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్‌ను తొలిగించి ఆదిత్యనాథ్ పీఠాధిపత్యంలో ఉన్న గోరఖ్‌పూర్ మఠాన్ని చేర్చడం. ఆరు నెలల నుంచి అమలుజరిగిన గణనీయ అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ లేవు గానీ ఎన్‌కౌంటర్ హత్యలు పెరిగాయి, గోవులను చంపుతున్నారంటూ, గో మాంసం తింటున్నారంటూ మనుష్యలను నిర్దాక్షిణ్యంగా వధిస్తున్నారు, బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీ దవాఖాన వంటి ప్రభుత్వ దవాఖానలలో పసిబిడ్డలు లెక్కలేకుండా మరణిస్తున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఈ రోజు విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణలేదు. శిశుమరణాలు, ప్రసూతి మరణాల రేటు యూపీలో పెరిగినంతగా ఇంకే రాష్ట్రం లో పెరుగడం లేదు. నిరక్షరాస్యత రేటు ఘోరంగా హెచ్చుతున్నది. బడులకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతున్నది. పిల్లలు బడులకు రాకుంటే తల్లిదండ్రులను చితకబాదాలంటూ యూపీ విద్యామంత్రి హెచ్చరించాడు. యూపీలో మత సామరస్యం దెబ్బతిని సామాజిక అశాంతి తీవ్రస్వరూ పం ధరిస్తున్నది. ఇదిలా ఉంటే ఇటీవల కేరళలో యోగీజీ గురివింద గిం జ పాత్ర నిర్వహించారు. అక్కడి (కేరళ) సీపీఐ(ఎం) కూటమి ప్రభు త్వం హత్యలను నివారించలేకపోతున్నదని, ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నదని యోగీజీ బాధపడ్డారు.
మార్గమధ్యంలో కర్ణాటక రాష్ట్రంలో, పశ్చిమాన మహారాష్ట్రలో ఇటీవల, ఇంతకుముందు జరిగిన మేధావుల హత్యలు ప్రపంచం దృష్టిలో పడ్డాయి. యోగీజీ, ఆ తర్వాత కేరళ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం, ఆయన వెంట వచ్చిన ఓ కేంద్రమంత్రి కర్ణాటక, మహారాష్ట్ర మేధావుల హత్యల గురించి మాట్లాడలేదు. ప్రధాని మోదీజీ కూడా పెదవి విప్పలేదు. హత్యలు ఎక్కడ జరిగినా ఎవ రైనా ఖండించవలసిందే. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇంకో రాష్ట్రం వెళ్లి అక్కడి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనడం, పరుషంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం, ప్రజాస్వామ్య ఔచిత్యమన్నది ముఖ్యప్రశ్న. ఈ దేశంలోని సామాజిక భిన్నత్వం, వైవిధ్యం పట్ల గౌరవం లేనివారు, ఈ దేశంలో తమది తప్ప మరో పార్టీ ఉండటానికి వీల్లేదు, ఒకే దేశం ఒకే పార్టీ అన్న నిగూఢ సిద్ధాంతంతో రాజకీయాలు నడుపుతున్న వారు, పార్టీ కంటే దేశం ముఖ్యమని అంటూనే పార్టీల పోరాటాలు నడుపుతున్న వారు మాత్రమే భారత రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ముఖ్యమంత్రుల కుమ్మలాటకు, తద్వారా రాష్ర్టాల అంతర్యుద్ధ దుష్ట సంప్రదాయానికి ఆజ్యం పోస్తారు. చివరికి నిన్ననే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.), ప్రపంచబ్యాంకు ఆర్థిక నిపుణులు సైతం యాదగిరి వంటి సామాన్యుల ఆందోళనకు అర్థం ఉందని అంగీకరించారు. నోట్లరద్దు, జీఎస్టీ దుష్ట పరిణామాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తున్నదని సూటిగా చెప్పారు. వీళ్లు రెయిన్‌కోట్లు వేసుకొని స్నానం చేసే వాళ్లు కారు.

Kakatiya Mega Textile Park కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌

Kakatiya Mega Textile Park  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌
నోముల ప్రభాకర్ గౌడ్


మరో ఆర్థిక రాజధాని వరంగల్
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు 22న సీఎం శంకుస్థాపన
రూ. 25 కోట్లతో మడికొండ ఐటీపార్కు విస్తరణ
ఔటర్‌రింగ్ రోడ్డుతో మారనున్న దశ దిశ
వరంగల్ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
డిప్యూటీ సీఎం కడియంతో కలిసి టెక్స్‌టైల్ పార్కు సందర్శన
టెక్స్‌టైల్‌పార్కు లోగో, పైలాన్ ఆవిష్కరణ
మన వస్త్రపరిశ్రమ పోటీ విదేశాలతోనేనని వ్యాఖ్య
వరంగల్ టాస్క్ కేంద్రం ప్రారంభం
స్థానిక విద్యార్థులకు అక్కడే ఉద్యోగావకాశాలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి/నిట్‌క్యాంపస్(వరంగల్), నమస్తే తెలంగాణ: వరంగల్ నగరాన్ని తెలంగాణకు మరో ఆర్థిక రాజధానిగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. రాజధాని హైదరాబాద్ తరువాత వరంగల్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించి, అద్భుతమైన పారిశ్రామికవాడగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. శనివారం వరంగల్ పర్యటనలో భాగంగా నిట్ ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. వరంగల్ అభివృద్ధిపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే వరంగల్ శివారులోని మడికొండ ఐటీపార్కును రూ.25కోట్లతో విస్తరిస్తామని ప్రకటించారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ నెల 22న దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కోయంబత్తూరు తరహాలో వరంగల్‌లో టెక్స్‌టైల్ కళాశాలనూ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణంతో వరంగల్ దశ దిశ మారనున్నాయని కేటీఆర్ తెలిపారు. నిట్‌లో టాస్క్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన పలు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకొన్నారు. ఆ తరువాత కేటీఆర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. జీవితంలో ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. వాటిని దీటుగా ఎదుర్కొన్నప్పుడే యువతలోని అసలైన చాలెంజ్ బయటపడుతుంది. ఉద్యోగం రాలేదని, టెన్త్, ఇంటర్‌లో ఫెయిలయ్యామని, ఇంట్లో అమ్మతిట్టిందని, సెల్‌ఫోన్, బండి కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకొంటున్నారు. మానసికంగా బలంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.
నిట్‌లో, హైదరాబాద్, అమెరికాలోని ఏ కళాశాలలో ఎంత పెద్ద చదువులు చదివినా మానసికంగా దృఢంగా లేకపోతే జీవితంలో రాణించడం కష్టం. నేను ఒక పారిశ్రామికవేత్తను కావాలి, ఒక పరిశ్రమను పెట్టాలి, ఒకటి కనిపెట్టాలి, నా కాళ్లమీద నిలబడి వందమందికి ఉపాధి కల్పించాలంటే ముందుగా మానసిక సంతులనం అవసరం. ఒక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఇక జీవితమే అయిపోయిందని ఆగిపోతే కరెక్ట్ కాదు.. టాస్క్ వరంగల్ రీజినల్ సెంటర్.. చదువులు పూర్తిచేసుకుని నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అన్నింటికీ మీరు సిద్ధపడేవిధంగా తీర్చిదిద్దుతుంది అని అన్నారు. మానసికంగా దృఢంగా ఉండటం అంటే ఏమిటో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ను చూసి తెలుసుకోవాలని వేదికపైనే ఉన్న ఆయన్ని చూపుతూ కేటీఆర్ చెప్పారు. 1987లో హైదరాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వసీంఅక్రమ్ లాంటి ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో గాయపడ్డా, తట్టుకొని నిలబడ్డ శ్రీకాంత్ దృఢచిత్తాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వరంగల్ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయటంతోపాటు, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, టెక్స్‌టైల్ పార్కు, ఐటీపార్కు ఇవన్నీ అభివృద్ధి పర్చడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు వరంగల్‌పై అపారమైన ప్రేమ ఉన్నదని, ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి మాట్లాడుతూ, టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఐటీహబ్ ద్వారా మడికొండలో మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయని, మరికొన్ని కంపెనీలు కూడా వరంగల్‌కు రానున్నాయని దీనిద్వారా ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఇప్పుడున్న ఐటీ పార్కును విస్తరించటంతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఇంకా విస్తరించాలని, అవసరమనుకుంటే కొన్ని నిధులు వెచ్చించి ఐటీటవర్ నిర్మిస్తే ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్‌ను కోరారు.
ఫాం టు ఫ్యాషన్
మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా 1.20లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని మంత్రి చెప్పారు. ఈ పార్కు రెండో దశకోసం 800ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. భూములు కోల్పోయిన రైతులకు టెక్స్‌టైల్ పార్కులో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా పునర్వినియోగ పద్ధతిలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. ఫాం టు ఫ్యాషన్ అన్న ఆలోచనతో టెక్స్‌టైల్‌పార్కును ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. భారతదేశంలో అత్యుత్తమ పత్తి మనదగ్గరే ఉత్పత్తి అవుతున్నదని, 60లక్షల బేళ్లు ఉత్పత్తి అయితే అందులో 10 లక్షల బేళ్లను మాత్రమే మనం వినియోగించుకుంటున్నామని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఇతర రాష్ర్టాల్లో స్థిరపడిన చేనేత కార్మికులతో సమావేశమై వారందరినీ స్వస్థలం తీసుకొస్తామని హామీ ఇచ్చారని, దాంట్లో భాగమే ఈ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. 22న టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన అనంతరం 10నుంచి 12 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోబోతున్నాయని, వారు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు.. ఎంతమందికి ఉపాధి కల్పించనున్నారు అనేది అదే రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. దక్షిణకొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ (మిస్టర్ సంగ్ నేతృత్వంలో)కూడా అదే రోజు ఎంవోయూపై సంతకం చేయబోతున్నదన్నారు. నిష్ణాతులైన పీఎస్‌జీ కోయంబత్తూరు సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, వారితో ఇక్కడే టెక్స్‌టైల్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నామని కూడా మంత్రి చెప్పారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ద్వారా కేంద్రం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్డుతో ఈ పార్కును అనుసంధానిస్తామని తెలిపారు. టెక్స్‌టైల్ పార్కులోనే కాలనీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ టు వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని, భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక సంస్థలు నెలకొల్పామని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని ఆయన చెప్పారు.