17, అక్టోబర్ 2017, మంగళవారం

Health ఆరోగ్యం

మనిషి జీవితంలో ఎక్కువ కాలం పని ప్రదేశంలోనే గడిచి పోతుంది.
నోముల ప్రభాకర్ గౌడ్ 
పని ప్రదేశంలోని పర్యవసానాలు నిత్య జీవితం మీద గణనీయమైన ప్రభావం చూపుతయి. వ్యతిరేక పరిస్థితులు ఉన్న యెడల మానసిక ఆరోగ్యం మీద కూడా ఆ దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగ వ్యక్తికి, సంస్థకు ఆ మేరకు నష్టం వాటిల్లుతుంది. ప్రతి 5 గురిలో ఒకరు పని చేసే చోట మానసిక సమస్యతో బాధ పడుతున్నరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) తాజా సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగ పని ప్రదేశంలో 30 కోట్లు పైగా ప్రజలు కుంగుబాటుతో, 26 కోట్లు పైగా ప్రజలు ఆందోళనతో బాధ పడుతున్నరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏటా ఒక లక్ష కోట్ల అమెరికన్ డాలర్ల ఉత్పాదకతను నష్ట పోతున్నది. మానసిక ఆరోగ్యం కోసం పెట్టిన ఒక అమెరికన్ డాలర్ పెట్టుబడి ఆరోగ్య పరంగ, ఉత్పాదన పరంగ నాలుగు అమెరికన్ డాలర్ ల విలువైన సత్ ఫలితాన్ని చేకూర్చ గలదని ఆ అధ్యయనం అంచనా! అందుకే ఈ ఏటి ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ నినాదంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వర్‌ల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ చేత “పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం” ఎంపిక అయింది.
విశ్వ వ్యాప్తంగ ‘శ్రామిక ఆరోగ్యం మీద కార్యాచరణ ప్రణాళిక’ (2008-2017) మరియు ‘మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక’ (2013-2020) లను రూపకల్పన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ! ‘ప్రొటెక్టింగ్ వర్కర్స్ హెల్త్’ శీర్షికన వరుస పుస్తకాలను వెలువరిస్తున్నది. ‘మెంటల్ హెల్త్ గ్యాప్ ఆక్షన్ ప్లాన్’ లో భాగంగ పలు పద్ధతులను, ఐటి ఆధారిత స్వీయ ఉపయోగకర పరికరాలను అభివృద్ధి చేస్తున్నది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైసేషన్ (ఐ ఎల్ ఓ) గత సంవత్సరం ‘ద ప్రొటెక్షన్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎట్ వర్క్’ ప్రచురించింది. డబ్ల్యూ హెచ్ ఓ మరియు ఐ ఎల్ ఓ సంయుక్తంగ 2000 సంవత్సరంలో ‘మెంటల్ హెల్త్ అండ్ వర్క్’ గ్రంథాన్ని ప్రచురించినయి. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ వారు ‘మేనేజింగ్ మెంటల్ హెల్త్ ఇన్ వర్క్ ప్లేస్’ వంటి మాడ్యూల్స్ వెలువరిస్తున్నరు. ‘వర్‌ల్డ్ ఎకనామిక్ ఫోరం’ వారి తాజా మార్గదర్శి కూడా కొన్ని ఉపగమాలను సూచించింది.
మన దేశంలో ఆరోగ్య శాఖ 1982లో ‘జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం’ ప్రారంభించి, 1996లో దానిని జిల్లా స్థాయికి విస్తరించింది. ‘జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం’ అంశాలలో ‘పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం’ కూడా ఉన్నది. 2005 లో మొదలైన జాతీయ ఆరోగ్య మిషన్ లో చేర్చిన అంశాలలో మానసిక ఆరోగ్యం ఒకటి. భారత ప్రభుత్వం 2014లో ‘మానసిక ఆరోగ్య విధానం’ ను ప్రకటించింది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం 1992 సెక్షన్ 3 క్రింద ‘మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ 2017’ ను ఆమోదించింది.
పని ప్రదేశంలో భౌతిక పరిస్థితులు, పని జీవన నాణ్యత, పనిలో ఒత్తిడి, వేధింపులు, నిర్ణయాధికారం, గుర్తింపు, పదోన్నతి, వేతనాలు, పని వేళలు, వ్యక్తి శారీరక ఆరోగ్యం వంటి ఎన్నో అంశాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తయి. అధికారుల వ్యక్తిత్వ వైకల్యాలు, ఆధిపత్య ధోరణి ఉద్యోగి మానసిక ఆరోగ్య విఘాతానికి హేతువులు. అధికారుల వ్యవహార శైలిని సంస్కరించకుండా మిగతా చర్యల వలన ప్రయోజనం శూన్యం. యాజమాన్యాలు ఉద్యోగి మానసిక ఆరోగ్యాన్ని సంక్షేమ కార్యంగ, యాజమాన్య బాధ్యతగ గుర్తించాలె. సైకాలజిస్ట్ లను నియమించుకొని వారి సేవలను ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగ చూడాలె. మానసిక ఆరోగ్యం ఉద్యోగుల మానవ హక్కు. 

16, అక్టోబర్ 2017, సోమవారం

Farmer's set రైతు సమితి

Farmer's set రైతు సమితి
నోముల ప్రభాకర్ గౌడ్
రైతు సమితిలతో హక్కుల రక్షణ
రైతులు అసంఘటితంగా ఉండటం వల్ల వారు తమ హక్కుల గురించి,సమస్యల గురించి ఒక తాటిపైకి వచ్చి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఫలితంగా కొందరు రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు వలస వెళ్లారు. మిగిలిన వారు వ్యవసాయంతో నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ సంఘటిత రంగంలోని సభ్యునికి ఉపాధి దొరకనప్పుడు నిరుద్యోగభృతి లభిస్తుంది. అంతేకాదు సంఘంలో వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లదు. అందుకే వారు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవిస్తారు. కానీ ఇవేవీ అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు ఉండవు. దీన్నిబట్టి మన వ్యవసాయరంగం ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రైతుల ను రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు వారందరిని చట్టబద్ధంగా సంఘటితపరిచే చర్యలు ప్రారంభించడం ఆహ్వానించదగిన పరిణామం.
రాష్ట్రంలో దాదాపు 55లక్షలకు పైగా రైతు కుటుంబాలున్నాయి. ఇం దులో సుమారు 48లక్షలు చిన్న, సన్నకారు కుటుంబాలే. అలాగే రాష్ట్రం లో సగటు భూ కమత పరిమాణం 1.2 హెక్టార్లు. ఇది భారతీయ భూకమత పరిమాణం 1.16 హెక్టార్ల కంటే తక్కువ. రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఆర్థిక సంక్షోభంలో ఉండటానికి అనేక కారణాలున్నాయి. పంట రకం, దాన్ని పండించే తీరును ప్రాథమికంగా పేర్కొనవచ్చు. ఎక్కువమంది రైతు లు వానాకాలం, యాసంగిల్లో పునరావృతంగా ఒకేపంటను సాగు చేస్తున్నారు. రైతులకు వారు పండిస్తున్న పంటల శాతం రాష్ట్రంలో, దేశంలో, అలాగే అంతర్జాతీయంగాను ఎంత మొత్తంలో ఉంటున్నది అన్న అవగా హన ఉండటం లేదు. ఆ పంటల మొత్తం దిగుబడి, వినియోగ అవసరం ఎంత ఉన్నది? అలాగే పంటలను ఎటువంటి సాగు పద్ధతుల ద్వారా సాగుచేస్తున్నారన్న విషయాలపై ప్రాథమిక అవగాహన ఉండదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులపై, ఇక్కడున్న భూకమత పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సాంప్రదాయకంగా, మార్కెట్ ధరలు చూసి అవే పంటలు పునరావృతంగా సాగుచేస్తున్నారు. దీనివల్ల సగటు దిగుబ డి పెరుగుతున్నప్పటికీ భూమి సారం కోల్పోతున్నది. దీంతో చీడపీడలను తట్టుకోవడానికి అధిక మొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. దీనివల్ల సాగు వ్యయం గణనీయంగా పెరుగుతున్నది. దీనికితోడు వచ్చిన దిగుబడికి అనేక సందర్భాల్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇలా ఏటా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి వేలకోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. అలాగే వ్యవసాయ రంగానికి సాగు నీరు అందించడానికి భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. చెరువులను పునరుద్ధరిస్తున్నది. వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నది. దీనివల్ల సగ టు ఉత్పత్తి పెరుగుతుంది. దీనికి అనుగుణంగా తగిన ఫలాలు పొందాలంటే రైతులంతా సంఘటితం కావాలి. కాలానికి, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. రైతులు సంఘటితంగా ఉండటం వల్ల ఏకాలంలో ఎటువంటి పంటలు పండించాలి? ఏ పద్ధతుల ద్వారా పం డించాలి? పండించే పంటకు కనీస మద్దతు ధర ఉన్నదా? అనే సమాచారాన్ని రైతులంతా సమిష్టిగా పంచుకోగల్గుతారు. భవిష్యత్తులో వివిధ పంటల దిగుబడి అంచనా వివరాలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి రైతులంతా సమిష్టిగా ఉంటే సరైన నిర్ణయా లు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా వ్యవసాయ రంగంలో నష్టాలను తగ్గించుకునే వీలు ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది రైతులు నేల రకం, శీతోష్ణస్థితి, నీటి లభ్యత తదితర అంశాలపై అవగాహన లేకుండా మార్కెట్ ధరల ప్రాతిపదికన పంటలను సాగు చేస్తున్నారు. దీనివల్ల నష్టాలకు గురవుతున్నారు. కాబట్టి ఇకముందు ఇలా జరుగకుండా ఉండాలంటే రైతులంతా సంఘటితంగా ఉండాలి. రైతు సమన్వయ సమితిల ద్వారా ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఇది సంపూర్ణంగా జరిగితే రాష్ట్ర వ్యవసాయరంగం సంక్షోభాన్ని అధిగమిస్తుంది.
సగటు కమత పరిమాణం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యపడని అనేక వనరులను రైతులంతా సమిష్టిగా ఉండటం వల్ల సాధించవచ్చు. కొత్తగా వచ్చిన పద్ధతులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల సగటు వ్యవసాయ వ్యయం తగ్గడమే కాకుండా సగటు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రుణ సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉన్నది. ఏదైనా కారణం చేత ఒక రైతు ఆర్థికంగా నష్టపోయినా సంఘటితంగా ఉండటం వల్ల అందరూ కలిసి తమ శక్తి మేరకు ఎంతో కొంత సహాయం చేస్తారు. దీంతో ఆ రైతును ఆర్థికనష్టాల నుంచి బైట పడవేయవచ్చు. అలాగే కాలానికి అనుగుణంగా పంటలను పండిస్తారు. కలిసి మార్కెట్ చేసుకోవడం వల్ల దళారీల జోక్యం తొలిగి సరైన ధరలు పొందవచ్చు. వివి ధ కారణాల చేత పంటను నిల్వ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్మించిన గిడ్డంగుల్లో సమిష్టిగా నిల్వ చేస్తారు. దీంతో నిల్వ, రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలను రైతులు సంఘటితం గా ఉండటం వల్ల పొందవచ్చు. కాబట్టి రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమన్వయ సమితిల్లో స్వచ్ఛందంగా చేరాలి. సమిష్టిగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి.

Kallugita కల్లుగీత

Kallugita కల్లుగీత ...
నోముల ప్రభాకర్ గౌడ్

కల్లుగీతకు ఆధునిక హంగులు
-ఉచితంగా చెట్లు ఎక్కే యంత్రాలు
-శీతలపానీయాలకు దీటుగా నీరా
-సొసైటీలకు 5 ఎకరాల భూమి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కల్లుగీత వృత్తిని ఆధునీకరించి, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. చెట్లు ఎక్కి దిగే సమయాల్లో చాలామంది కిందపడిపోయి చనిపోతున్నారు. శాశ్వత వికలాంగులవుతున్నారు. ఇలాంటి విషాద సందర్భాలలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు చెట్లు ఎక్కే యంత్రాలు ఉచితంగా ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. అధికారులు ఇతర రాష్ర్టాల్లో పర్యటించి, వాటి పనితీరును పరిశీలించారు. భువనగిరిలో నిర్వహించిన ట్రయల్ రన్‌పై ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు సంతృప్తి వ్యక్తంచేశారు. హరితహారం కార్యక్రమంలోనూ ఈత తాటి వనాల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. రెండేండ్లలో 25 లక్షల మొక్కలు నాటటం ఇందుకు నిదర్శనం. కల్లుగీత సొసైటీలకు 5 ఎకరాల భూమి ఇస్తామంటూ కల్లుగీత పాలసీలో స్పష్టంచేసిన ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన భూముల్లో హైబ్రిడ్ మొక్కలు నాటించి, వాటిని గీతకార్మికులే సంరక్షించుకొనే విధంగా కార్యక్రమాలు రూపొందించింది.
కల్లు, ఈత, ఖర్జూర చెట్ల నుంచి తీసే నీరాను నిల్వచేసేందుకు బాట్లింగ్ యూనిట్లు నెలకొల్పి, శీతల పానీయాలకు దీటుగా మార్కెట్‌చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. దీనినుంచి బెల్లం, చక్కర, జామ్, చాక్లెట్స్, ఫామ్ వైన్‌లాంటి అనేక ఉప ఉత్పత్తులు పొందే అవకాశముంది. కల్లులో పోషక విలువలు ఉన్నాయని, క్యాన్సర్‌ను నివారించే గుణం ఉన్నదని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించటం విశేషం. 65 ఏండ్లు నిండినవారికి ఇచ్చే వృద్ధాప్య పింఛన్లను కల్లుగీత కార్మికులకు 50 ఏండ్లు నిండగానే ఇస్తున్నది. చెట్లు ఎక్కి దిగే పనిలో త్వరగా వంట్లో సత్తువ కోల్పోతున్నారన్న ఉద్దేశంతో ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును తగ్గించింది. కల్లుగీత కార్మికులు ప్రభుత్వానికి ఏటా రూ. 15కోట్ల పన్ను కడుతున్నారు. ఒక్కొక్క చెట్టుకు పట్టణాల్లో రూ. 50, గ్రామాల్లో రూ.25 చొప్పున పన్ను చెల్లిస్తున్నారు. చెట్ల యజమానులకూ రూ. 50 నుంచి వంద దాకా చెల్లిస్తున్నారు. వీటిని మాఫీ చేసే ఆలోచనలో ప్రభు త్వం ఉన్నది.

KALWAKURTHY కల్వకుర్తి

KALWAKURTHY కల్వకుర్తి
నోముల ప్రభాకర్ గౌడ్


కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారం.
మూడు దశాబ్దాలుగా మూలుగుతున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారం కాబోతున్నదని కళ్లలో వత్తులు వేసుకొని ఆశతో ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతుల కలలు నిజమవుతున్నవి. ముప్ఫై ఏండ్ల కిందట ప్రారంభించబడి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, కల్వకుర్తి ప్రాంత నాయకుల నిర్లిప్తత వల్ల ఈ ప్రాజెక్టు ప్రగతి నత్తనడకను తలపింపజేసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు గోడమీది రాతలా, నేరవేరని కలలా, లేచిపడిన అలలా మిగిలిపోతుందని అనిపించింది. 2001లో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభించినప్పుడు కల్వకుర్తి ప్రాంతంలో ఆ ఉద్యమం ప్రభావం లేదు. నాడు నేను ఆ ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ప్రాధాన్యాన్ని, ఆవశ్యకతను తెలియజేసినప్పుడు ఈ ప్రాంత నాయకులు నన్ను గేలి చేశారు. ప్రజలు కూడా వారి భ్రమలో ఉండి ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే మనకేం ఒరుగుతుందని భావించారు. ఆనాడే ప్రత్యేక రాష్ట్రం వస్తే మన నిధులు, నీళ్లు వాడుకోవచ్చని చెప్పాను. మన ప్రాంత వనరులన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్నారని చెబితే నన్నొక సంకుచిత మనస్కుడిగా చిత్రీకరించారు. నేడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయిందంటే అది ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ పుణ్యమే. సరైన వర్షాల్లేక, కరువుతో అలమటించే రైతుల పాలిట వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టుపై ఎవ్వరూ సరైన సమయం లో సరైన దృష్టిపెట్టలేదు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఈ ప్రాజెక్టుకు కొంత ప్రాధా న్యం ఇచ్చినా అవి సర్వేల వరకే పరిమితమైంది. ఆ తర్వాత పోతిరెడ్డిపా డు లాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యాన్ని ఇచ్చి మన నాయకుల నిరాసక్తతను ఆసరాగా తీసుకొని కావలసిన నిధులను విడుదల చేయక ప్రాజెక్టులో ప్రగతి ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.
నీళ్లులేక, కరువు కోరల్లో చిక్కిన ఈ ప్రాంత రైతులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి వలసల జిల్లాగా ప్రసిద్ధి గాంచింది. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన బడా భూస్వాములు కూడా వ్యవసాయం లాభసాటి కానందున ఇతర వ్యాపకాల కోసం పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లారు. పల్లెటూర్లన్నీ బోసిపోయిన తరుణంలో నేను నమస్తే తెలంగాణ 2016 డిసెంబర్ 29న వ్యాసంలో రాసినట్లుగా కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామ నివాసి, ఒకనాటి అభ్యుదయ రైతు బందెల రాంచంద్రారెడ్డి ఈ ప్రాంత రైతుల దీనస్థితికి వ్యాకులత చెంది మాలాంటి వారి సహకారంతో కల్వకుర్తి రైతు జేఏసీగా ఏర్పడి ఈ ప్రాజెక్టు పూర్తి కోసం ఉద్యమ కార్యాచరణను ఏర్పర్చుకున్నారు. వినూత్న పద్ధతులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మేము రైతు జేఏసీ ఏర్పడిన తర్వాతే మిగ తా ఈ ప్రాంత ప్రతిపక్ష రాజకీయపార్టీలు మేల్కొని ఉద్యమం పేరుతో యాత్రలు చేపట్టారు. బీజేపీ నాయకుడు కల్వకుర్తి నుంచి శాసనసభకు మహాయాత్ర పేరు పెడితే, కాంగ్రెస్ శాసనసభ్యుడు గ్రామాల్లో పర్యటనలు చేశారు. కాని అవి నామమాత్రమే. అవి వారి ఉనికి కోసం ఆరాట మే తప్ప నిజమైన పోరాటం కాదు. వారు రాజకీయ లబ్ధి కోసం చేస్తే మా కన్వీనర్ బందెల రాంచంద్రారెడ్డి రైతు సమస్యగా ఉద్యమం కొనసాగించారు.
మిగతా ప్రతిపక్ష రాజకీయపార్టీలు నామమాత్రపు పర్యటనలు చేస్తే, మా రైతు జేఏసీ పట్టు వదలని విక్రమార్కునిగా, అలుపెరుగని యోధునిగా పలుకార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా రాంచంద్రారెడ్డి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు, నిరంతరం పర్యటించి, గ్రామాలతోని రైతులను చైతన్యపరిచి ఉద్యమించారు. ఈ విషయంలో ఆయన సీఎం కేసీఆర్‌నే ఆదర్శంగా తీసుకున్నారు. గమ్యం చేరేవరకు మన గమనం ఆగకూడదని పలుమార్లు వెల్లడించారు. మా ఉద్యమానికి ముందు నుంచి ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ సిబ్బంది మంచి స్పందన కనబర్చి, మరిచిపోలేని సహకారమందించారు. ప్రాజెక్టు విలంబనకు కాంట్రాక్టర్ అలసత్వమే కానీ సిబ్బందిది ఏమాత్రం కాదు. ఉద్య మం ఫలితంగా నీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు కూడా బాగా స్పందించి ఈ ప్రాంత టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి, ఒకటిరెండుసార్లు ఎక్కడైతే ప్రాజెక్టు పని పూర్తికావల సి ఉందో అక్కడే రాత్రి సమయంలో నిద్రించి, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి, సంబంధిత ఇంజినీర్లను, సిబ్బందిని అప్రమత్తంచేసి ప్రాజెక్టుకు పూర్తికావడానికి తోడ్పడ్డారు. ఒకనాడు నన్ను గేలి చేసినవారికి తలెత్తుకొని సగర్వంగా సమాధానం చెప్పగలిగే స్థితి లో ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే అది ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ పుణ్య మే.
ఈ విషయంలో ఒకనాడు మాపై, హరీశ్‌రావు పర్యటనలపై అనుమానాలు వ్యక్తం చేసినవారు నేడు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రారంభం నుంచి మాకు సంపూర్ణ సహకారమందించిన ప్రాజె క్టు చీఫ్ ఇంజినీర్ ఖగేందర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ భద్రయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ జాదవ్‌లకు ఈ ప్రాంత ప్రజల తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, చివరి దశలో ఈ ప్రాంత ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆదేశించి ప్రాజెక్టు పనుల పర్యవేక్షింపజేసి, ఏండ్ల తరబడి నీళ్ల కోసం తపించిన ప్రజల దాహా ర్తి తీర్చబోతున్నారు. నేను ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం కల్వకుర్తి దాహం తీరాలె 2016 డిసెంబర్ 29న నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. ఈ వ్యాసం ప్రచురితమైన తర్వాతే ఈ ప్రాంత నాయకుల్లో చలనం కనిపించింది. మా విజ్ఞప్తులను, మా ఆకాంక్షలను, ప్రాజెక్టు పూర్తికోసం చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తెచ్చిన నీటిపారుదల శాఖామంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండేకు మా అభినందనలు. రాజకీయాలకు కొత్త అయిన ప్రాజెక్టు పనులను ఆఖరిదశలో పర్యవేక్షించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా మా అభినందనలకు అర్హుడే.

Single country-single party ఒకే దేశం-ఒకే పార్టీ

Single country-single party  ఒకే దేశం-ఒకే పార్టీ ...
నోముల ప్రభాకర్ గౌడ్

పదకొండు మాసాలైంది యాదగిరిని చూసి, ఆయన లోకం ఆయనది. దాదాపు ఏడాది తర్వాత మొన్న వచ్చిండు. పదకొండు నెలల కిందట ఒక శుభరాత్రి ప్రధాని మోదీజీ అలవోకగా టీవీలో కనిపించి నోట్లరద్దు ప్రకటన చేసిన మరునాడు యాదగిరి ఆందోళనాత్మక వదనంతో, కుందల మొందిన డెందంతో, ఎంతో నీరసంతో వచ్చిండు. యాదగిరి సామాన్యుడు, ఈ దేశంలోని కోట్లాది సామాన్యుల్లో ఒకడు. ఆయన ఇంట్లో దాచుకోవడానికి కోట్లు లేవు, తొడుక్కోవడానికి కోట్లు లేవు. రెండు ప్యాంట్లు, రెండు బుషర్టులతో నడుస్తున్న, గడుస్తున్న జీవితం యాదగిరిది.
నలభై ఏండ్ల కిందట, రేపోమాపో ఎమర్జెన్సీ చీకట్లు కమ్ముకోబోతున్న వేళ ఓ తెలుగు వారపత్రిక సంపాదకులం కూర్చొని మాట్లాడుతున్నం. వచ్చేవారం నుంచే చెప్పుకో దగ్గ మనిషి శీర్షిక ప్రారంభించాలనుకున్నం. వారం వారం ఆ కాలం నన్నే రాయమన్నరు. మొదటివారం ఈ దేశంలోని సామాన్యుడు చెప్పుకోదగ్గ మనిషి. 125 వారాలు, ఆ పత్రిక యజమా ని అలిసి పడిపోయేవరకు, పత్రిక వచ్చినంత వరకు ఈ శీర్షిక కొనసాగింది. అప్పటి చెప్పుకోదగ్గ మనుషుల్లో చివరి ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత న్యాయమూర్తి నాగేంద్రసింగ్, షహనాయి షహన్షా ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ప్రఖ్యాత కార్టూనిస్టు అబూ అబ్రహం. నోట్లరద్దు భయంకరంగా దెబ్బకొడుతుందని 11 నెలల కిందట నవంబర్ 9న బాగా అంటే భయపడ్డ, కుంగిపోయిన సామాన్యుడు యాదగి రి మేధావి కాడు, పెద్ద డిగ్రీలు లేవు. అయినా, నోట్ల రద్దు సర్వరోగ నివారిణి. అవినీతిని అంతం చేస్తుంది, నల్లధనం నడ్డి విరుస్తుంది, టెర్రరిజం అంతమవుతుంది, దేశాభివృద్ధి మార్గంలో పయనిస్తుందంటూ రోజూ జోరుగా జరిగిన మల్టీమీడియా ప్రచారం హోరును యాదగిరి వంటి సామాన్యులు ఎంతమాత్రం విశ్వసించలేదు. యాదగిరీ నువు మన్‌కీ బాత్ వింటే ఇంత నిరాశ - నిస్పృహ ఉండేవి కావు అన్నాను. బైంగన్ బాతో, ఆలూ బాతో చేసుకోవడానికే టైమ్ ఉంటలేదు అన్న డు. అవినీతి 16 వేల రెట్లు పెరిగిందని, పెద్ద మనుషులుగా, నయాషాలుగా కనిపించేవారంతా నీతివంతులు కాదని, కశ్మీరు సరిహద్దుల్లో, కశ్మీరు లోయలో, రాజధాని శ్రీనగర్‌లో ప్రజల సంగతి దేవుడికెరుక భారత సైనిక దళాలకే రక్షణ లేదని, చైనా సరిహద్దులో మన మ్యాప్ ఏ క్షణాన, ఏ విధంగా మారుతుందో మనకే తెలియదని (మీరు భూభాగా ల సంగతి మరిచిపోండి, వాణిజ్యం గురించి మాట్లాడుకుందాం. సీబీ ఎం-పరస్పర విశ్వాసాన్ని పెంచే చర్యలు ముఖ్యమనిని చైనా కామ్రేడ్లు మనకు నీతులు బోధిస్తున్నారు!), నూతన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశం లో ఇంకే రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధిపథంలో పయనించడం లేదని గడిచిన మూడేండ్ల చరిత్రను పరికించిన వాళ్లకు అర్థమవుతుంది.
ఎప్పు డూ భుజనా ఓ పాత సంచీ వేల్లాడుతుండే యాదగిరి సామాన్యుడైనా సందేహాలు ఎక్కువ. మన సైనిక బలగాలన్నీ పాకిస్థాన్ ఆక్రమించకుం డా మిగిల్చిన కశ్మీరును రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి గదా ఇక అటు చైనాతో, ఇటు పాక్‌తో యుద్ధం వస్తే ఎట్లా అన్నడు. అక్కడి తో ఆగలేదు. మనకంటే చిన్నదేశం పాకిస్థాన్‌కు మనకంటే ఎక్కువ అణ్వాస్ర్తాలు ఉన్నయట ఎట్ల అని అధైర్యపడ్డడు. మాటల తూటాలతో, నినాదాల నిప్పులతో మనం చుట్టూరా ఉన్న శత్రువులందరిని మట్టు పెట్టగలమని ఎంత సముదాయించినా యాదగిరి ధైర్యం పెరుగదు.
130 కోట్లకు మించిన భారత ప్రజలు అదృష్టవంతులు. ఇప్పుడు ప్రధాని మోదీజీ నాటి చాయ్‌వాలా కాడు. ఆయనిప్పుడు గరళ కంఠు డు, నీలకంఠుడు! విమర్శల విషాన్ని ఆయన గళంలో దాచిపెట్టారు. చరి త్ర పుటలను కెళ్లగిస్తే విమర్శల పర్వాలు చాలా కనిపిస్తాయి. గాంధీజీ 1915 జనవరిలో దక్షిణాఫ్రికా నుంచి శాశ్వతంగా తిరిగివచ్చి స్వదేశంలో అడుగుపెట్టగానే పలుదిశల నుంచి విమర్శల దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడై ఆధ్యాత్మిక రంగంలో మహా మానవుడుగా ప్రసిద్ధి పొందిన పండిత్ మద న్మోహన్ మాలవీయ 1916లో అనిబిసెంట్ సహాయసహకారాలతో వారణాసిలో (యూపీ) బనారసు హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
ఇప్పుడిది ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. అప్పటి ఇండియా వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ 1916 ఫిబ్రవరి 4న బనారస్ హిం దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిపాడు. (నిజాం ప్రభుత్వం ఉదారంగా ఈ విశ్వవిద్యాలయానికి విరాళం ఇచ్చిందన్న వాస్తవాన్ని చెబితే కొందరిని అలర్జీ బాధిస్తుంది) శంకుస్థాపన సందర్భాన నిర్వహించిన ఒక సమావేశానికి దర్భాంగ మహారాజు అధ్యక్షత వహించాడు. ఆ సమావేశంలో గాంధీజీతోపాటు అనిబిసెంట్, భారత సంస్థానాల రాజు లు, మహారాజులెందరో రాజు వెడలె రవి తేజములలరగ అన్నట్లు పాల్గొన్నారు. గాంధీజీ ప్రసంగిస్తూ రాజులను, మహారాజులను, వారి ఆభరణాలను విమర్శించారు. అనిబిసెంట్‌కు, రాజులకు, మహారాజుల కు కోపం వచ్చి, సమావేశం నుంచి బయటికి వెళ్లారు. గాంధీజీ ప్రసంగంపై విమర్శలు చెలరేగాయి. అప్పటికింకా ఆయన మహాత్ముడు కాలే దు. స్వాతంత్య్ర ఉద్యమంలో, స్వాంతంత్య్రం తర్వాత గాంధీజీ విమర్శలకు గురి కాని రోజు లేదు. విశేషించి మతోన్మాదులు అసహనానికి, తీవ్ర విమర్శలకు ఆయన గురి కావలసి వచ్చింది. 1948 జనవరి 30న మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి గాంధీజీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ చర్చల కారణంగా గాంధీజీ ప్రార్థనా సమావేశానికి ఆలస్యంగా వెళ్లారు. సర్దార్ పటేల్‌కు గాంధీజీతో చర్చలు సంతృప్తి కల్గించలే దు. గాంధీజీ విమర్శలకు గురైన చివరిరోజది. తొలి ప్రధాని జవహర్‌లాల్ ఆయనకు దగ్గరివారు, దూరంవారు అందరూ విమర్శించారు.
ప్రసిద్ధ ఫ్రెంచి సంపాదకుడు టైబర్ మెండెస్ ఒక ఇంటర్వ్యూలో జవహర్‌లాల్‌ను భారతదేశం పరిశ్రమల గురించి అడిగాడు. స్వతంత్ర భారతదేశంలో విమర్శ ప్రధాన పరిశ్రమని నెహ్రూ అన్నారు. విమర్శను గరళంగా భావించి కంఠంలో దాచుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ నాయకుడు, నిర్విరామ తపస్సుతో, సర్వతోముఖ అపూ ర్వ అభివృద్ధి కృషితో స్వర్ణ తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ఉజ్వల చరిత్ర నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కనీసం అయిదారు కంఠాలైనా ఉండాలె.మహా మానవుడుగా ప్రఖ్యాతి పొందిన మదన్మోహన్ మాలవీయ అభిప్రాయాలతో, దృక్పథంతో ఏకీభవించలేకపోయినా నెహ్రూ వంటి వారు ఆయన సమున్నత వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. ఓ కుంభమేళా సందర్భాన బ్రిటిష్ పోలీసుల ఆంక్షలను ధిక్కరించి మదన్మోహన్ మాలవీయ హఠాత్తుగా దూసుకుపోయి గంగానదిలో దుమికారు. ఆయన వెనుక నిల్చుని పరిస్థితిని గమనిస్తున్న యువనేత నెహ్రూ కూడా వెంటనే నదిలో దూకి అందరికీ ఆశ్చర్యం కలిగించారు. మాలవీయ వెంట జండా లు పట్టుకొని వచ్చి నినాదాలు చేసిన వారెవ్వరూ గంగానదిలో దూకలే దు. మహనీయుడు మాలవీయ నేతృత్వం వహించిన, గోవింద్ వల్లభ్ పంత్ వంటి పరిపాలనాదక్షులు సీఎంలుగా నాయకత్వం వహించిన, పలువురు ప్రధానులను తన ప్రతినిధులుగా ఎన్నుకున్న యూపీ దేశం లో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైనా వెనుకబాటుతనంలో, పేదరికంలో, అజ్ఞానంలో, అభివృద్ధిరాహిత్యంలో ప్రస్తుతం ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నది. 60 ఏండ్ల అణచివేతకు, దోపిడీకి గురై మూడున్నర ఏండ్ల కింద ట ఒక మహా నాయకుని సమరశీలంతో, పోరాటపటిమతో అవతరించిన తెలంగాణ ఆ నాయకుని ముఖ్యమంత్రిత్వంలో అద్భుత ప్రగతితో పురోగమిస్తుండగా యూపీ వెనుకకు దూసుకుపోతున్నది. 6 నెలల కిందట రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి బీజేపీ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్తగా ఎన్నికైన శాసనసభలో రాష్ట్రంలోని 20 శాతం ఓటర్ల వర్గానికి పాలకపక్షం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. విశాల రాష్ట్రంలోని అన్నివర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఈరోజు యూపీలో లేదన్నది మరో విశేషం.
గత ఆరు నెలల్లో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇం కో విశేషం ఆ రాష్ట్రం దర్శనీయ స్థలాల పట్టిక నుంచి ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్‌ను తొలిగించి ఆదిత్యనాథ్ పీఠాధిపత్యంలో ఉన్న గోరఖ్‌పూర్ మఠాన్ని చేర్చడం. ఆరు నెలల నుంచి అమలుజరిగిన గణనీయ అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ లేవు గానీ ఎన్‌కౌంటర్ హత్యలు పెరిగాయి, గోవులను చంపుతున్నారంటూ, గో మాంసం తింటున్నారంటూ మనుష్యలను నిర్దాక్షిణ్యంగా వధిస్తున్నారు, బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీ దవాఖాన వంటి ప్రభుత్వ దవాఖానలలో పసిబిడ్డలు లెక్కలేకుండా మరణిస్తున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఈ రోజు విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణలేదు. శిశుమరణాలు, ప్రసూతి మరణాల రేటు యూపీలో పెరిగినంతగా ఇంకే రాష్ట్రం లో పెరుగడం లేదు. నిరక్షరాస్యత రేటు ఘోరంగా హెచ్చుతున్నది. బడులకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతున్నది. పిల్లలు బడులకు రాకుంటే తల్లిదండ్రులను చితకబాదాలంటూ యూపీ విద్యామంత్రి హెచ్చరించాడు. యూపీలో మత సామరస్యం దెబ్బతిని సామాజిక అశాంతి తీవ్రస్వరూ పం ధరిస్తున్నది. ఇదిలా ఉంటే ఇటీవల కేరళలో యోగీజీ గురివింద గిం జ పాత్ర నిర్వహించారు. అక్కడి (కేరళ) సీపీఐ(ఎం) కూటమి ప్రభు త్వం హత్యలను నివారించలేకపోతున్నదని, ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నదని యోగీజీ బాధపడ్డారు.
మార్గమధ్యంలో కర్ణాటక రాష్ట్రంలో, పశ్చిమాన మహారాష్ట్రలో ఇటీవల, ఇంతకుముందు జరిగిన మేధావుల హత్యలు ప్రపంచం దృష్టిలో పడ్డాయి. యోగీజీ, ఆ తర్వాత కేరళ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం, ఆయన వెంట వచ్చిన ఓ కేంద్రమంత్రి కర్ణాటక, మహారాష్ట్ర మేధావుల హత్యల గురించి మాట్లాడలేదు. ప్రధాని మోదీజీ కూడా పెదవి విప్పలేదు. హత్యలు ఎక్కడ జరిగినా ఎవ రైనా ఖండించవలసిందే. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇంకో రాష్ట్రం వెళ్లి అక్కడి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనడం, పరుషంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం, ప్రజాస్వామ్య ఔచిత్యమన్నది ముఖ్యప్రశ్న. ఈ దేశంలోని సామాజిక భిన్నత్వం, వైవిధ్యం పట్ల గౌరవం లేనివారు, ఈ దేశంలో తమది తప్ప మరో పార్టీ ఉండటానికి వీల్లేదు, ఒకే దేశం ఒకే పార్టీ అన్న నిగూఢ సిద్ధాంతంతో రాజకీయాలు నడుపుతున్న వారు, పార్టీ కంటే దేశం ముఖ్యమని అంటూనే పార్టీల పోరాటాలు నడుపుతున్న వారు మాత్రమే భారత రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ముఖ్యమంత్రుల కుమ్మలాటకు, తద్వారా రాష్ర్టాల అంతర్యుద్ధ దుష్ట సంప్రదాయానికి ఆజ్యం పోస్తారు. చివరికి నిన్ననే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.), ప్రపంచబ్యాంకు ఆర్థిక నిపుణులు సైతం యాదగిరి వంటి సామాన్యుల ఆందోళనకు అర్థం ఉందని అంగీకరించారు. నోట్లరద్దు, జీఎస్టీ దుష్ట పరిణామాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తున్నదని సూటిగా చెప్పారు. వీళ్లు రెయిన్‌కోట్లు వేసుకొని స్నానం చేసే వాళ్లు కారు.

Kakatiya Mega Textile Park కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌

Kakatiya Mega Textile Park  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌
నోముల ప్రభాకర్ గౌడ్


మరో ఆర్థిక రాజధాని వరంగల్
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు 22న సీఎం శంకుస్థాపన
రూ. 25 కోట్లతో మడికొండ ఐటీపార్కు విస్తరణ
ఔటర్‌రింగ్ రోడ్డుతో మారనున్న దశ దిశ
వరంగల్ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
డిప్యూటీ సీఎం కడియంతో కలిసి టెక్స్‌టైల్ పార్కు సందర్శన
టెక్స్‌టైల్‌పార్కు లోగో, పైలాన్ ఆవిష్కరణ
మన వస్త్రపరిశ్రమ పోటీ విదేశాలతోనేనని వ్యాఖ్య
వరంగల్ టాస్క్ కేంద్రం ప్రారంభం
స్థానిక విద్యార్థులకు అక్కడే ఉద్యోగావకాశాలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి/నిట్‌క్యాంపస్(వరంగల్), నమస్తే తెలంగాణ: వరంగల్ నగరాన్ని తెలంగాణకు మరో ఆర్థిక రాజధానిగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. రాజధాని హైదరాబాద్ తరువాత వరంగల్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించి, అద్భుతమైన పారిశ్రామికవాడగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. శనివారం వరంగల్ పర్యటనలో భాగంగా నిట్ ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. వరంగల్ అభివృద్ధిపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే వరంగల్ శివారులోని మడికొండ ఐటీపార్కును రూ.25కోట్లతో విస్తరిస్తామని ప్రకటించారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ నెల 22న దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కోయంబత్తూరు తరహాలో వరంగల్‌లో టెక్స్‌టైల్ కళాశాలనూ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణంతో వరంగల్ దశ దిశ మారనున్నాయని కేటీఆర్ తెలిపారు. నిట్‌లో టాస్క్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన పలు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకొన్నారు. ఆ తరువాత కేటీఆర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. జీవితంలో ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. వాటిని దీటుగా ఎదుర్కొన్నప్పుడే యువతలోని అసలైన చాలెంజ్ బయటపడుతుంది. ఉద్యోగం రాలేదని, టెన్త్, ఇంటర్‌లో ఫెయిలయ్యామని, ఇంట్లో అమ్మతిట్టిందని, సెల్‌ఫోన్, బండి కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకొంటున్నారు. మానసికంగా బలంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.
నిట్‌లో, హైదరాబాద్, అమెరికాలోని ఏ కళాశాలలో ఎంత పెద్ద చదువులు చదివినా మానసికంగా దృఢంగా లేకపోతే జీవితంలో రాణించడం కష్టం. నేను ఒక పారిశ్రామికవేత్తను కావాలి, ఒక పరిశ్రమను పెట్టాలి, ఒకటి కనిపెట్టాలి, నా కాళ్లమీద నిలబడి వందమందికి ఉపాధి కల్పించాలంటే ముందుగా మానసిక సంతులనం అవసరం. ఒక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఇక జీవితమే అయిపోయిందని ఆగిపోతే కరెక్ట్ కాదు.. టాస్క్ వరంగల్ రీజినల్ సెంటర్.. చదువులు పూర్తిచేసుకుని నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అన్నింటికీ మీరు సిద్ధపడేవిధంగా తీర్చిదిద్దుతుంది అని అన్నారు. మానసికంగా దృఢంగా ఉండటం అంటే ఏమిటో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ను చూసి తెలుసుకోవాలని వేదికపైనే ఉన్న ఆయన్ని చూపుతూ కేటీఆర్ చెప్పారు. 1987లో హైదరాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వసీంఅక్రమ్ లాంటి ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో గాయపడ్డా, తట్టుకొని నిలబడ్డ శ్రీకాంత్ దృఢచిత్తాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వరంగల్ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయటంతోపాటు, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, టెక్స్‌టైల్ పార్కు, ఐటీపార్కు ఇవన్నీ అభివృద్ధి పర్చడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు వరంగల్‌పై అపారమైన ప్రేమ ఉన్నదని, ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి మాట్లాడుతూ, టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఐటీహబ్ ద్వారా మడికొండలో మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయని, మరికొన్ని కంపెనీలు కూడా వరంగల్‌కు రానున్నాయని దీనిద్వారా ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఇప్పుడున్న ఐటీ పార్కును విస్తరించటంతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఇంకా విస్తరించాలని, అవసరమనుకుంటే కొన్ని నిధులు వెచ్చించి ఐటీటవర్ నిర్మిస్తే ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్‌ను కోరారు.
ఫాం టు ఫ్యాషన్
మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా 1.20లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని మంత్రి చెప్పారు. ఈ పార్కు రెండో దశకోసం 800ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. భూములు కోల్పోయిన రైతులకు టెక్స్‌టైల్ పార్కులో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా పునర్వినియోగ పద్ధతిలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. ఫాం టు ఫ్యాషన్ అన్న ఆలోచనతో టెక్స్‌టైల్‌పార్కును ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. భారతదేశంలో అత్యుత్తమ పత్తి మనదగ్గరే ఉత్పత్తి అవుతున్నదని, 60లక్షల బేళ్లు ఉత్పత్తి అయితే అందులో 10 లక్షల బేళ్లను మాత్రమే మనం వినియోగించుకుంటున్నామని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఇతర రాష్ర్టాల్లో స్థిరపడిన చేనేత కార్మికులతో సమావేశమై వారందరినీ స్వస్థలం తీసుకొస్తామని హామీ ఇచ్చారని, దాంట్లో భాగమే ఈ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. 22న టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన అనంతరం 10నుంచి 12 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోబోతున్నాయని, వారు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు.. ఎంతమందికి ఉపాధి కల్పించనున్నారు అనేది అదే రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. దక్షిణకొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ (మిస్టర్ సంగ్ నేతృత్వంలో)కూడా అదే రోజు ఎంవోయూపై సంతకం చేయబోతున్నదన్నారు. నిష్ణాతులైన పీఎస్‌జీ కోయంబత్తూరు సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, వారితో ఇక్కడే టెక్స్‌టైల్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నామని కూడా మంత్రి చెప్పారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ద్వారా కేంద్రం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్డుతో ఈ పార్కును అనుసంధానిస్తామని తెలిపారు. టెక్స్‌టైల్ పార్కులోనే కాలనీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ టు వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని, భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక సంస్థలు నెలకొల్పామని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని ఆయన చెప్పారు.

Kalesvaram కాళేశ్వరం

Kalesvaram కాళేశ్వరం
నోముల ప్రభాకర్ గౌడ్


కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారంపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీచేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేసింది. పనుల నిలిపివేతకు సహేతుక కారణాలు చెప్పకుండానే ఎన్జీటీ ధర్మాసనం ఈ నెల 5వ తేదీన ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొంది. ప్రాజెక్టు పనులను నిలిపివేస్తే రోజుకు రూ.100 కోట్ల నష్టంవాటిల్లే అవకాశం ఉన్నదని, కాంట్రాక్టర్లు నష్టపరిహారం అడిగితే మరింత అధికంగా ప్రజాధనం దుర్వినియోగమవుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, నీటిపారుదలశాఖ తరపున కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ బీ హరిరాం వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. ఎన్జీటీ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని అభ్యర్థించారు. గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు అని, బహుళార్థక ప్రాజెక్టు కోణంలోనే రూపకల్పన చేసినప్పటికీ ప్రస్తుతానికి తాగునీటి కోసం నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులూ అవసరం లేదని, అనుమతులు తీసుకున్న తర్వాతే సాగునీటి ప్రాజెక్టుగా తదుపరి నిర్మాణాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును ఆపేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని, అనుమతులు లేవనే కారణంచూపుతూ హై కోర్టులో పిటిషన్లు దాఖలుచేశారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు హయత్‌యుద్దీన్ తప్పుడు వివరాలతో ఎన్జీటీని ఆశ్రయించారని వివరించారు. అటవీప్రాంతంలో ప్రాజెక్టు పనులను చేపట్టడంలేదని, అటవీశాఖ అనుమతులు తీసుకున్నతర్వాతే చేపడుతామని విచారణ సందర్భంగా ఎన్జీటీ ధర్మాసనానికి వివరించినట్టు పేర్కొన్నా రు. ఎన్జీటీ సహేతుక కారణాలు చెప్పకుండా పనుల నిలిపివేతపై జారీచేసిన ఉత్తర్వులు తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం సభ్యుల్లో ఒకరు ఈ నెల 8 వ తేదీన పదవీ విరమణ చేశారని, సమయం లేకపోవడంతో కారణాలను ప్రస్తావించలేదని పేర్కొనడం సమంజసం కాదని వివరించారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ద్వి సభ్య ధర్మాసనం విచారించనుంది.

Potireddipadu పోతిరెడ్డిపాడు

Potireddipadu పోతిరెడ్డిపాడు
నోముల ప్రభాకర్ గౌడ్

పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ తప్పుల కుప్ప
-తేలని వరద లెక్కలు.. 2,500 నుంచి 3 వేల క్యూసెక్కుల తేడా
-రెండుసార్లు బోర్డు ఇంజినీర్ల్ల పరిశీలనలో కొలిక్కిరాని లెక్కలు
-పాత గేట్లను మూసేయాలని కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ సర్కారు భారీఎత్తున అక్రమంగా తరలించుకుపోతున్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఏర్పాటుచేసిన టెలిమెట్రీ లెక్కలు తేల్చలేకపోతున్నది. ఆ ఒక్క పరికరంతో నదిలాంటి పోతిరెడ్డిపాడు ప్రవాహాన్ని లెక్కించడం సాధ్యం కావటంలేదని తేలింది. పోతిరెడ్డిపాడు దిగువన 12.265 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన సెన్సర్ల ద్వారా నమోదవుతున్న డిశ్చార్జికి, వాస్తవ డిశ్చార్జికి పొంతన లేదని బోర్డు ఇంజినీర్ల బృందం ఈనెల 4-6 తేదీల్లో పర్యటించి తేల్చింది. గురు, శుక్రవారాల్లో మరో బృందం పర్యటించింది. ఏడీసీపీ(అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) ద్వారా డిశ్చార్జికి, సెన్సర్ల ద్వారా నమోదవుతున్న డిశ్చార్జికి పొంతన కుదురడంలేదని మళ్లీ తేల్చింది. ఏడీసీపీ ద్వారా సుమారు 2,500 నుంచి 3,000 వేల క్యూసెక్కుల డిశ్చార్జి నమోదవుతుండగా, తక్కువ డిశ్చార్జిని ఆంధ్రప్రదేశ్ అధికారులు రిజిస్టర్‌లో నమోదుచేస్తున్నారు. దీంతో కృష్ణాజలాలు అక్రమంగా శ్రీశైలం నుంచి కృష్ణా అవతలిబేసిన్‌కు తరలిపోతున్నాయి. వాస్తవంగా పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే 12వేలపైచిలుకు క్యూసెక్కుల డిశ్చార్జిని లెక్కించే సామర్థ్యం అక్కడ ఏర్పాటుచేసిన సెన్సర్లకు లేదని, మరోవైపు ఒక్కచోటనే టెలిమెట్రీ ఏర్పాటుచేస్తే పోతిరెడ్డిపాడు పూర్తి డిశ్చార్జిని గుర్తించడం సాధ్యంకాదని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. బనకచర్ల వద్ద పోతిరెడ్డిపాడు కాల్వ మూడుపాయలుగా విడిపోతున్నది. ఈ మూడు మార్గాల్లో ఒక్కోటి, పోతిరెడ్డిపాడు 600 మీటర్ల దగ్గర మరో టెలిమెట్రీ ఏర్పాటుచేస్తే తప్ప లెక్కలు తేలవని స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక బోర్డు ఇంజినీర్లు కొందరు తలపట్టుకోగా, ఆంధ్రప్రదేశ్ ఆశించిందే నెరవేరిందంటూ బోర్డులోని కొందరు సూత్రధారులు సంబురపడుతున్నారు.
ఒప్పందం అమలుచేయరేం?
టెలిమెట్రీ గందరగోళంపై కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు లేఖ రాశారు. డిశ్చార్జిలో తేడాలను బోర్డు ఇంజినీర్లు గుర్తించినందున వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. టెలిమెట్రీ ఏర్పాటుచేసిన వారంరోజుల్లోనే వినియోగంలోకి తేవాలని మెకట్రానిక్స్ కంపెనీతో బోర్డు చేసుకున్న ఒప్పందంలో ఉన్నదని గుర్తుచేశారు. గత నెల 22న బోర్డు వెబ్‌సైట్‌లో లెక్కలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, అధికారికంగా వినియోగంలోకి ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. గత నెల 19న పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల మొదలైనప్పటి నుంచి రోజువారీ డిశ్చార్జి లెక్కలు తీయాలి. వాస్తవ డిశ్చార్జికి అనుగుణంగా టెలిమెట్రీ పరికరాన్ని అమర్చాలి. పోతిరెడ్డిపాడు పాతగేట్ల నుంచి భారీగా లీకేజీ అవుతున్నందున, ఆ షట్టర్లను మూసివేయాలి అని లేఖలో డిమాండ్ చేశారు. టెలిమెట్రీ ఏర్పాటుచేసిన మెకట్రానిక్స్ కంపెనీ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో బ్లాక్‌లిస్టులో పెట్టాలని బోర్డును గతంలోనే తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌చేసిన విషయం తెలిసిందే. అయినప్ప టికీ చర్యలు తీసుకోని బోర్డు గత సభ్య కార్యదర్శి సమీర్‌ఛటర్జీ, ఆ కంపెనీకి తుదిబిల్లులు చెల్లించాలని రెండు రాష్ర్టాల నీటిపారుదలశాఖకు లేఖలు రాయడం గమనార్హం.

Kidney కిడ్నీలు

Kidney  కిడ్నీలు 
నోముల ప్రభాకర్ గౌడ్ 

కిడ్నీలు అనారోగ్యం బారిన ప‌డ్డాయ‌ని తెలిపే ల‌క్ష‌ణాలు ఇవే..
మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌టికి పంప‌డంలో కిడ్నీలు చాలా ముఖ్య‌మైన పాత్ర పోషిస్తాయి. ఇవి ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కిడ్నీలు ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన ప‌డతాయి. అలాంటి సంద‌ర్భాల్లో మ‌న శ‌రీరం కొన్ని ల‌క్షణాల‌ను మ‌న‌కు తెలియ‌జేస్తుంది. వాటిని గుర్తించ‌డం ద్వారా కిడ్నీలు అనారోగ్యం బారిన ప‌డ్డాయ‌ని తెలుసుకోవ‌చ్చు. దీంతో స‌రైన స‌మ‌యంలో స్పందించి చికిత్స చేయించుకునేందుకు వీలుంటుంది. మ‌రి కిడ్నీలు అనారోగ్యం బారిన ప‌డ్డాయ‌ని ఎలా తెలుసుకోవ‌చ్చంటే...
1. కిడ్నీలు ఎర్రరక్త కణాల సంఖ్య పెరిగేలా చేసే ఎరిథ్రోప్రోయిటిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తాయి.. ఈ హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోతే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనీమియా వ్యాధి వస్తుంది. అలా ఎనీమియా వచ్చిందంటే కిడ్నీల పనితీరు సక్రమంగా లేదు అని భావించవచ్చు.
2. ఎనీమియా (రక్త హీనత) తీవ్రం అయితే మొదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి మనిషికి ఏ పని చేయబుద్ధికాక బద్ధకంగా తయారు అవుతారు. దేని మీద దృష్టిపెట్టబుద్ధి కాదు.. మతిమరపు వస్తుంది. ఇలాంటి లక్ష‌ణాలు ఉన్నా కిడ్నీలు అనారోగ్యానికి గుర‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు.
3. కిడ్నీ కి ఏవిధమైన జబ్బులు సోకినా మోకాళ్ళు, కీళ్ళు కాళ్ళు ఉబ్బిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
4. మూత్ర విసర్జన లో నియంత్రణ‌ కోల్పోవడం, తరచుగా మూత్ర విసర్జన జ‌ర‌గ‌డం, లేదంటే మూత్రం తక్కువగా రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, రంగు మారడం, నురగ తో కూడిన మూత్రం ఇవన్నీ కిడ్నీ లు వ్యాధికి గురయ్యాయి అనే లక్షణాలుగా గుర్తించవచ్చు.
5. కిడ్నీలుండే చుట్టుప్రక్కల నొప్పిగా ఉంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానించవచ్చు.
6. ఏదైనా ఆహార పదార్ధం తింటే వాటి రుచి లోహం రుచి అనిపిస్తే కిడ్నీలు దెబ్బతిన్నట్లు భావించవచ్చు.
7. తరచుగా రాషెష్, దురద, మంటలు వంటివి వచ్చినా కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అన్నమాట.
8. రక్తం లో మలినాలు చేరినా చర్మం పొడిబారుతుంది. దీంతో కిడ్నీ వ్యాధికి గుర‌య్యార‌ని తెలుసుకోవాలి.
9. కిడ్నీ వ్యాధులు వెన్ను భాగంలో నొప్పిని కలిగిస్తాయి.
10. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడితే వెన్ను భాగపు కింద బాగం నుంచి గజ్జల ప్రాంతం వరకూ నొప్పి కలుగుతుంది.
పైన చెప్పిన ల‌క్ష‌ణాలు గ‌న‌క క‌నిపిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా లేవ‌ని తెలుసుకోవాలి. దీంతో వైద్యున్ని సంప్ర‌దిస్తే త‌గు చికిత్స తీసుకుని కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

Telangana Palamuru తెలంగాణ పాలమూరు

Telangana Palamuru తెలంగాణ పాలమూరు ...Prabhakar Goud Nomula

తెలంగాణ: పాలమూరు జిల్లాకు.. ముఖ్యంగా కల్వకుర్తికి దీపావళి పండుగ నాలుగు రోజుల ముందే వచ్చింది. కరువులు, వలసలు, ఆకలిచావులకు కేరాఫ్‌గా ఉన్న కల్వకుర్తి నీటి గోస తీరుతున్నది. కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి ఈ నియోజకవర్గానికి తక్షణం 30 వేల ఎకరాలకు సాగునీరందనున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామశివారులో 122 కిలోమీటరు వద్ద కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని మంత్రి హరీశ్‌రావు ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు.

పాలమూరుకు పట్టిన పీడ విరగడ చేస్తానని, ప్రాజెక్టులు పూర్తిచేసి బీడు పొలాలకు నీళ్లు రప్పిస్తానని అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ శపథం చేశారు. ఆ మేరకు చర్యలు తీసుకొన్నారు. ఆయన ఆదేశాలందిన వెంటనే భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దూకారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఫలితంగా కల్వకుర్తి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగింది. ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి ఆదివారం నుంచి 30 వేల ఎకరాలకు నీళ్లు పారుతాయి. మిగతా పనులు పూర్తయితే మరో 70 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ పొడవు 160 కిలోమీటైర్లెనా ఇదివరకెన్నడూ 85 కిలోమీటర్ల దూరానికి మించి నీళ్లు పారలేదు.
ఇప్పుడు 122 కిలోమీటర్ల దాకా కల్వకుర్తి కాలువల్లో నీళ్లొచ్చాయి. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు తొలిసారిగా ఈ ప్రాజెక్టు నీళ్లను చూస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 2014 జూన్ వరకు పదేండ్లలో గత ప్రభుత్వాలు రూ.2716.23 కోట్లు ఖర్చు చేయగా, తెలంగాణ సర్కారు ఈ మూడేండ్లలోనే రూ.1121.17 కోట్లు ఖర్చు చేసింది. ఈ నియోజకవర్గానికి నీరందించడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆవంచ అక్విడక్టు పనులన్నీ పూర్తి అయ్యాయి. ఈ రబీ కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కల్వకుర్తి మండలంలో 33 వేలు, ఆమనగల్లు మండలంలో 2800, మాడుగుల మండలంలో 18,700, వెల్దండ మండలంలో 16,600 ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది.

Annoma సీతాఫలాలు

Annoma సీతాఫలాలు


సీతాఫలాలతో జ్యూస్, ఐస్‌క్రీం
అధ్యయనానికి మహారాష్ట్ర వెళ్లనున్న ఉద్యానశాఖ అధికారులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శీతాకాలంలో నోరూరించే మధుర ఫలాలు సీతాఫలాలు. పండ్ల రూపంలో రుచిని ఆస్వాదించే సీతాఫలాలను జ్యూస్ (గుజ్జు), ఐస్‌క్రీంగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను రాష్ట్ర ఉద్యానశాఖ పరిశీలిస్తున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో సీతాఫలాల జ్యూస్, ఐస్‌క్రీంను తయారుచేస్తున్నారు. వీటిని అరబ్ దేశాలకు ఎగుమతిచేసి అక్కడి పరిశ్రమలు లాభాలను ఆర్జిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మొత్తం ఐదు నెలలు ఈ పండ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో తోట పంటగా మాత్రం రైతులు సాగుచేయడం లేదు. మహారాష్ట్రలోని పుణెలో సీతాఫలాల జ్యూస్, ఐస్‌క్రీం తయారుచేసే పరిశ్రమలు 36 వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన యంత్రాలకు తక్కువ వ్యయం కావడంతో రాష్ట్ర ఉద్యానశాఖ దీనిపై దృష్టిసారించింది. పుణెలో సీతాఫలాల జ్యూస్, ఐస్‌క్రీం తయారీ పరిశ్రమల నిర్వహణను అధ్యయనం చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.
ఈ మేరకు దీపావళి తర్వాత అధికారుల బృందం పుణెకు వెళ్లనున్నట్టు ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామ్‌రెడ్డి నమస్తే తెలంగాణకు తెలిపారు. పుణెలో ఒక్కో పరిశ్రమ ఏడాదికి రూ.8 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నది. గంటకు మూడు టన్నుల చొప్పున ప్రతి రోజు 16 గంటలపాటు సీతాఫలాల నుంచి గుజ్జును తీసే యంత్రాలు ఉన్నాయి. 50 టన్నుల సీతాఫలాలనుంచి 60 శాతం గుజ్జు లభిస్తున్నది. కేజీ జ్యూస్, ఐస్‌క్రీం ధర రూ.180 వరకు పలుకుతుంది. ఏటా రూ.8.1 కోట్లు ఆదాయం లభిస్తుండగా, వీటిలో రూ.2.25 కోట్ల వరకు జ్యూస్, ఐస్‌క్రీం తయారీ ప్రాసెసింగ్ ఖర్చును కంపెనీలు ఖర్చుచేస్తున్నాయి. దీంతో పరిశ్రమల యజమానులకు ఏటా రూ.4 కోట్ల వరకు లాభాలు వస్తాయని పుణెకు చెందిన ఫ్రాడెన్ ఫుడ్స్ నిర్వాహకులు తెలిపారు. ఇరాన్, ఇరాక్, కువైట్ లాంటి దేశాలకు ఫ్రాడెన్ ఫుడ్స్ వంటి సంస్థలు ఎగుమతి చేస్తున్నాయి.

Projects ప్రాజెక్టులు

రికార్డుస్థాయిలో ప్రాజెక్టులకు అనుమతులు
-శరవేగంగా సాగుతున్న నిర్మాణాలు
-పర్యావరణ రక్షణకు అవసరమైన చర్యలు
-ప్రాణహిత ఎకో-వంతెనలపై నెగ్గిన రాష్ట్రం వాదన
-అనుమతులపై అటవీశాఖ స్పెషల్‌డ్రైవ్

మూడేండ్ల క్రితం దాకా నీటిపారుదల ప్రాజెక్టులంటే.. గ్రానైట్‌రాళ్లపై పేర్లు చెక్కించుకొని.. దానికో తెరకట్టి తాడుతో తొలిగించి.. ఫొటోలు దిగి ఆహాఓహో అంటూ వందిమాగధబృందం చేసే ప్రచారార్భాటాలతో జనాన్ని మభ్యపెట్టడం తప్ప మరొకటి జరుగలేదు. ఉమ్మడిరాష్ట్రంలో పర్యావరణ, అటవీఅనుమతులు రాక ఏండ్ల తరబడి.. పనులు మొదలుకాని ప్రాజెక్టులు ఎన్నో.. 2014 జూన్ 2తరువాత ఈ పరిస్థితిలో అనూహ్యంగా మార్పువచ్చింది. రికార్డుస్థాయిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేస్తున్నాయి. కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నా అన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాగు, తాగునీటి ప్రాజెక్టులతోపాటు రహదారుల నిర్మాణాలు, వైద్య, ఆరోగ్యయూనిట్ల ఏర్పాట్లు చకచకా జరుగటం చూస్తుంటే పక్కరాష్ర్టాలు ఔరా అంటున్నాయి. ప్రాజెక్టుల పనుల్లో జాప్యంలేకుండా అటవీశాఖ ప్రత్యేకడ్రైవ్‌ను నిర్వహిస్తున్నది. ప్రతి శుక్రవారం భేటీ అయి కేంద్రస్థాయిలోని అనుమతులపై పర్యవేక్షిస్తున్నది. ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్‌ఝా అధికారులకు స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర వివాదాలకు తావివ్వరాదని ఆదేశాలిచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఏ ప్రాజెక్టుచేపట్టినా పర్యావరణపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఫలితంగా దాదాపు 244ప్రాజెక్టులకు పైగా అటవీ అనుమతులను సాధించింది. వీటిలో 137ప్రాజెక్టులకు మొదటి దశ అనుమతులు వచ్చాయి. మరో 37ప్రాజెక్టులకు తుదిదశ అనుమతులు వచ్చాయి. 70ప్రాజెక్టుల కోసం అవసరమైన ప్రక్రియ పూర్తయింది. అటవీమార్గాల్లో డబుల్‌లేన్ రోడ్లను, నీటిపైప్‌లను నిర్మిస్తున్నది. నష్టపోతున్న అడవులను తిరిగి సృష్టించడానికి కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ (కంపా) కింద ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయిస్తున్నది.
కాళేశ్వరం రికార్డు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 3168హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాల్సి వచ్చింది. సాధారణంగా 100హెక్టార్ల కంటే ఎక్కువ భూమి బదలాయింపునకు అటవీ, పర్యావరణ అనుమతులకోసం కనీసం ఏడాది పడుతుంది. కానీ ప్రభుత్వం చకాచకా నిబంధనలన్నింటినీ పూర్తిచేయడంతో 40రోజుల్లోనే అనుమతులు సాధ్యమయ్యాయి. ఇది దేశంలో అన్ని ప్రాజెక్ట్‌లలో రికార్డు సమయంగా చరిత్రకెక్కింది.
నెగ్గిన రాష్ట్రం వాదన-తగ్గిన 300 కోట్ల భారం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్- ప్రాణహిత ప్రాజెక్టులో పర్యావరణ అనుమతుల కోసం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో రాష్ట్ర అధికారుల వాదన నెగ్గింది. మొదట టైగర్ కారిడార్‌లో 18ఎకో-వంతెనలను నిర్మించాలని పట్టుబట్టిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) చివరకు 9వంతెనల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఒక్కో ఎకో-వంతెన వెడల్పును వంద నుంచి 50మీటర్లకు తగ్గించడానికి అంగీకరించింది. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్ల భారం తగ్గింది. ప్రాణహిత ప్రాజెక్టులో భాగమైన తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంలో భాగంగా ఆసిఫాబాద్ కాగజ్‌నగర్ టైగర్ కారిడార్‌లో పెద్దపులులు, వన్యప్రాణుల సంచారానికి ఆటంకంలేకుండా వీటిని నిర్మిస్తారు. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి కాగజ్‌నగర్ డివిజన్‌లో 622 హెక్టార్ల అటవీభూమి అవసరమవుతున్నది. బెజ్జూరు, గూడెం, కడంబ,హెట్టి రిజర్వ్‌ఫారెస్టుల్లో బరాజ్‌ల పనులు జరుగనున్నాయి.
అభయారణ్యాలలోనూ మిషన్ భగీరథకు లైన్‌క్లియర్
మిషన్‌భగీరథకు రికార్డుస్థాయిలో కేంద్రంనుంచి అటవీ,పర్యావరణ అనుమతులు లభించాయి. 92ప్యాకేజీలలో 60కి పైగా అటవీ అనుమతులు లభించడం విశేషం. అభయారణ్యాలలో 23ప్యాకేజీలుగా ఉన్న పనులకు నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ పూర్తిస్థాయిలో అనుమతినిచ్చింది. అభయారణ్యాల్లో నిలిచిపోయిన 1,580కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. అచ్చంపేట-అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, పోచారం, శివారం, ప్రాణహిత, కిన్నెరసాని, ఏటూరునాగారం, కవ్వాల్ టైగర్ కారిడార్‌లో పైప్‌లైనుపనులకు అనుమతులు వచ్చాయి. వివిధ ప్రాజెక్టుల కింద 158 అటవీ ప్రాంతాల్లో పనులను చేపట్టడానికి ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలను పంపారు.

Milk paneer పాల‌క్ ప‌నీర్

ప‌నీర్ తిన‌క‌పోతే.. ఈ ప్ర‌యోజ‌నాలు మిస్ అవుతారు తెలుసా..


పాల‌తో త‌యారు చేసే ప‌నీర్ గురించి చాలా మందికి తెలుసు. దీన్ని వెజ్‌, నాన్ వెజ్ ప్రియులు అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ప‌నీర్‌తో చాలా ర‌కాల వంట‌కాలు చేసుకోవ‌చ్చు. ఎలా చేసినా ప‌నీర్‌తో చేసిన వంట‌కాలు చాలా మందికి న‌చ్చుతాయి. అయితే దీన్ని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..? పాల‌కు నిమ్మ‌రసం, వెనిగ‌ర్‌, సిట్రిక్ యాసిడ్ వంటి ప‌దార్థాల‌ను క‌లిపి పాలలో ఉండే ప‌దార్థాల‌ను వేరు చేస్తారు. ఆ ప‌దార్థాల‌ను అనంత‌రం వ‌స్త్రంలో చుట్టి పిండుతారు. దీంతో అందులో ఉండే నీరు పోయి దృఢ‌మైన ప‌దార్థం ప‌నీర్ ఏర్ప‌డుతుంది. అయితే ప‌నీర్ మ‌న శ‌రీరానికి మంచిదేనా..? దాన్ని తీసుకోవ‌చ్చా..? తింటే ఏమ‌వుతుంది..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
పాల‌తో తయారు చేసే ప‌నీర్ తీసుకోవ‌డం మంచిదే. దాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు మ‌న‌కు పౌష్టికాహారం కూడా అందుతుంది. ప‌నీర్ వ‌ల్ల క‌లిగే లాభాలు ఇవే...
1. ప‌నీర్‌లో ఉండే పొటాషియం గుండె జ‌బ్బుల‌ను రాకుండా చేస్తుంది. రెగ్యుల‌ర్‌గా ప‌నీర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో గుండె వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. దీనికి తోడు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ర‌క్తంలో ఉండే లిపిడ్స్ శాతం త‌గ్గుతుంది.
2. ప‌నీర్ లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి వాటిని పోగొడుతుంది. అంతేకాదు, శ‌రీర జీవ క్రియ‌లు క్ర‌మ‌బ‌ద్ద‌మ‌వుతాయ‌. దీని వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు.
3. పనీర్ లో కాల్షియం, ఫాస్పరస్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సంబంధ స‌మ‌స్య‌ల‌ను, దంత‌ సమస్యలను పోగొడుతాయి. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. ప‌నీర్‌లో ఉండే విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముక‌లు దృఢంగా ఎదిగేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు పోతాయి.
4. పిల్ల‌ల‌కు ప‌నీర్ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఎదుగుతున్న పిల్ల‌ల‌కు మంచి ఆహారంగా పనీర్ ఉప‌యోగప‌డుతుంది. అంతేకాదు, పిల్ల‌ల‌కు చ‌క్క‌ని పోష‌ణ ల‌భిస్తుంది. శ‌క్తి అందుతుంది. త‌ద్వారా వారు అన్ని అంశాల్లోనూ రాణిస్తారు.
5. విట‌మిన్ బి, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు పోతాయి. వెంట్రుక‌లు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చ‌ర్మ స‌మ‌స్య‌లు రావు. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.
6. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌ను రాకుండా అడ్డుకునే గుణాలు ప‌నీర్‌లో ఉన్నాయి. క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా చూసే గుణాలు ఇందులో ఉన్నాయి.
7. ప‌నీర్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తాయి. దీని వ‌ల్ల వారి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.
8. గ‌ర్భిణీలు ప‌నీర్‌ను తీసుకుంటే క‌డుపులో ఉన్న బిడ్డ‌కు చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది. పుట్ట‌బోయే బిడ్డ‌లో జ‌న్యు ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావు.
9. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య రాదు.

Peanuts శనగలు

శనగలను నానబెట్టిన నీటిని పారబోస్తున్నారా..? ఇది చదివితే అలా చేయరు..

శ‌న‌గ‌ల‌తో మ‌నం అనేక వంట‌కాలు చేసుకుంటాం. వీటితో కూరలు చేస్తారు, గుగ్గిళ్లలా చేసుకుని తింటారు. పలు పిండి వంటలు చేస్తారు. ఇంకా ఎన్నో ఆహారాల్లో శనగలను వేస్తారు. అయితే ఎలా వేసినా శనగలను ముందుగా కొన్ని గంటల పాటు నానబెట్టాకే ఆహార పదార్థాల్లో వేస్తారు. ఈ క్ర‌మంలో శనగలను నానబెట్టాక వాటిని తీసి ఆ నీటిని మాత్రం పారబోస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే శనగలను నానబెట్టిన నీరు కూడా మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగలను నానబెట్టిన నీటిని తాగితే అందులో ఉండే ఐరన్ శరీరానికి అందుతుంది. దీంతో రక్తం బాగా పెరగడమే కాదు, శరీరానికి శక్తి బాగా అందుతుంది. నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి దూరమవుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. ఎంత పనిచేసినా అలసట రాదు.
2. ఈ నీటిని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ కంట్రోల్ అవుతుంది.
3. వ్యాయామం చేసే వారికి ఈ నీరు చాలా మంచిది. కండరాలు త్వరగా పెరుగుతాయి. కొత్త కణజాలం నిర్మాణమవుతుంది. మజిల్స్ బిల్డ్ అవుతాయి. శారీరక దృఢత్వం ఏర్పడుతుంది.
4. శనగలను నానబెట్టిన నీరు మధుమేహం ఉన్న వారికి ఔషధమనే చెప్పవచ్చు. ఈ నీటిని తాగితే వారి రక్తంలో ఉన్న షుగర్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
5. ఫైబర్ ఎక్కువగా అందడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరుగుతుంది. పొట్టు చుట్టూ ఉండే కొవ్వు పోయి స్లిమ్‌గా అవుతారు. అధిక బరువు తగ్గుతారు.
6. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా, చురుగ్గా పనిచేస్తుంది. చదువుకునే వారికి ఎంతో మంచి డ్రింక్‌గా ఉపయోగపడుతుంది. చదువుల్లో విద్యార్థులు రాణిస్తారు.
7. చర్మ సమస్యలు పోతాయి. చర్మంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు ఉండవు. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
8. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు పోతాయి. వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
9. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. దంతాలు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన పోతుంది. చిగుళ్లు దృఢంగా ఉంటాయి.
10. శనగలను నానబెట్టిన నీటిని తాగితే క్యాన్సర్ కణాలు నాశనమవుతాయి. ఆ కణాలు పెరగవు. క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కునే ఔషధ గుణాలు ఈ నీటిలో ఉన్నాయి.

Krishna కృష్ణ Jurala జూరాల SRSP ఎస్సారెస్పీ Nijansagar నిజాంసాగర్‌

సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు

- ఎగువ నుంచి తగ్గుముఖం పట్టిన వరద
- శ్రీశైలంలో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు
నమస్తే తెలంగాణ: నల్లమల కొండల మధ్య నుంచి కృష్ణమ్మ సాగర్ వైపు పరుగులు పెడుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో నాలుగు రోజులుగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఎగువ నుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగడంతో క్రమంగా గేట్లు ఎత్తి భారీగా నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి శనివారం ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేయగా ఆదివారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో తగ్గుతుండటంతో ఒక్కో గేటు మూసి వేస్తున్నారు. ఆదివారం రాత్రి కేవలం రెండు గేట్ల ద్వారా దిగువకు 1,43,565 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇందులో రెండు గేట్ల ద్వారా 55,140 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 74,350 క్యూసెక్కులు, ఎత్తిపోతల ద్వారా 14,075 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,43,565 క్యూసెక్కులు బయటకు వదులుతున్నారు. కాగా ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,26,210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. ప్రస్తుతం 883.90 అడుగుల (209.59 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
జూరాలలో 16 గేట్లు ఎత్తివేత
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జూరాలకు కృష్ణమ్మ తరలివస్తున్నది. ఆదివారం ఉదయం 6 గంటలకు 15గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మధ్యా హ్నం 3 గంటలకు ఇన్‌ఫ్లో 1,21,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,09,048 క్యూసెక్కులుగా నమోదైంది. సాయంత్రం 4 గంటలకు మరో గేటు ఎత్తారు. రాత్రి 9 గంటల సమయంలో జూరాలకు ఇన్‌ఫ్లో 1,07,000క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,17,721క్యూసెక్కులు నమోదవుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిల్వ 9.398 టీఎంసీలు ఉంది. ఎగువనున్న ఆల్మట్టిలో 128.19 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 23,830 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 23,830 క్యూసెక్కులు ఉన్నది. నారాయణపూర్‌లో 37.06 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఇన్‌ఫ్లో 36,983 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 42,225 క్యూసెక్కులుగా ఉన్నది.
నిండుతున్న నాగార్జునసాగర్..
నాగార్జునసాగర్:
నాగార్జునసాగర్ డ్యాంలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి 547.70 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం గేట్లు, జలవిద్యుత్ కేంద్రాల నుంచి నీరు సాగర్‌కు తరలివస్తున్నది. ఎగువ నుంచి మధ్యాహ్నం వరకు 2,12,288 క్యూసెక్కుల నీరు రాగా రాత్రికి కాస్త తగ్గి 1,84,266గా ఇన్‌ఫ్లో నమోదు కాగా ఔట్‌ఫ్లో 1,650 క్యూసెక్కులు ఉన్నది. సాగర్ రిజర్వాయర్‌లో నీటినిల్వ 204.739 టీఎంసీలకు చేరుకుంది.
మూసీకి 2,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు 2,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 2,664 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటిమట్టం 644.60 అడుగులు (4.36 టీఎంసీలు) ఉంది. డిండి ప్రాజెక్టు నీటిమట్టం 15.5 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు ఉంది.
ఎస్సారెస్పీకి భారీగా వరద
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 46,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో వస్తున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1079.90 అడుగులు (51.319) టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద కాల్వకు 7,955 క్యూసెక్కులు, కాకతీయ కాల్వకు 50 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వకు 100 క్యూసెక్కులు, గుత్ప అలీసాగర్ ఎత్తిపోతలకు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మొత్తం 8,375 క్యూసెక్కులు ఔట్‌ఫ్లోగా నమోదవుతున్నది.
నిజాంసాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
నిజాంసాగర్, నమస్తే తెలంగాణ: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 20,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.803 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1396.08 అడుగులు (7.662 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Jurala
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జూరాల ప్రాజెక్టుకు వరద పెరిగింది. సోమవారం రాత్రి 2,02,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవటంతో మునుపెన్నడూ లేని విధంగా 31 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఔట్‌ఫ్లో 2,24, 017 క్యూసెక్కులుగా నమోదవుతున్నది. స్పిల్ వే ద్వారా 1,89,994 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి ద్వారా 32వేల క్యూసెక్కులు, కాలువలకు వదులుతున్న నీటిని కలుపుకొని 2,24,017 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలలో 9.480 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎగువనున్న ఆల్మట్టిలో 1228.19 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 78,363 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 73,363 క్యూసెక్కులు ఉన్నది. నారాయణపూర్‌లో 35.38 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 83,609 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 99,746 క్యూసెక్కులుగా ఉన్నది.
nagarjunasagar
శ్రీశైలం నుంచి నాలుగు గేట్ల ద్వారా..
అచ్చంపేట, నమస్తే తెలంగాణ : శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు 4 గేట్లను ఎత్తి దిగువన సాగర్‌కు 2,21,572 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 2,76,188 క్యూసెక్కులు శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను సోమవారం సాయంత్రం 884అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210.032 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా 27501 క్యూసెక్కుల నీటితో 103 మెగావాట్ల సామర్థ్యం, ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటితో 150 మెగావాట్ల సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్‌కు 2,21,572 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే పోతిరెడ్డిపాడుకు 11వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 1013 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకు 1600క్యూసెక్కులు మొత్తం కలిపి 1,66,340 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొసాగుతున్నది.
నాగార్జునసాగర్‌కు జలకళ
నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. సోమవారం సాయ్రంతానికి 552 అడుగులతో 215.540 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి రావడంతో వచ్చే వరదను ఎప్పటికప్పుడు రేడియల్ క్రస్ట్ గేట్లు నుంచి, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,07,959 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1650 క్యూసెక్యుల నీరు విడుదలవుతోంది. ఇదిలా ఉండగా మూసీ ప్రాజెక్టుకు రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. రెండు గేట్ల ద్వారా 2293 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మొత్తం 645 అడుగుల మట్టానికి గాను ప్రస్తుతం 644.50 అడుగుల నీరుంది.
ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 12,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.31 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 1079.90 అడుగులు 52.010 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాల్వలు, లిఫ్ట్‌లకు 9,285 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు.
నిజాంసాగర్‌లో పెరుగుతున్న నీటి మట్టం
నిజాంసాగర్, నమస్తే తెలంగాణ: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22,612 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 క్యూసెక్కులు) కాగా, ప్రస్తుతం 1397.82 అడుగులు (9,156 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 1683 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 696.250అడుగులు (6.659టీఎంసీల) వద్ద ఉంది. కుడి కాలువ ద్వారా 17 క్యూసెక్కులను వదులుతున్నారు.
ఎల్లంపల్లి గేట్ల మూసివేత
అంతర్గాం : ఎల్లంపల్లి జలాశయానికి వరద తగ్గటంతో గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం 586 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 19.508 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

The mystery of creation సృష్టి రహస్యం

The mystery of creation సృష్టి రహస్యం

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పులవల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా కులాలప్రాధాన్యం వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాల్లో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరుగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్నిదూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని భేదాలొచ్చాయి.

ఏది ఆర్య ధర్మమో, ఏది ఆర్ష ధర్మమో, ఏది కాదో నిర్ణయించే అర్హత ఎంతవరకుందో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆలోచించుకోవడం మంచిదేమో! ఉదా హరణకు సృష్టి రహస్యం పరిపూర్ణంగా సమగ్రంగా విప్పగలవారెవరైనా ఉన్నారా? పోనీ తమకు తెలుసని ఇంతవరకు ఎవరైనా అనగలిగారా? సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెం దింది కదా? అయినప్పటికీ రోబోలను తయారుచేయగలిగారే కానీ మానవ శరీర నిర్మాణానికి అసలుసిసలు నమూనా ఎవరైనా చేయగలిగారా? టెస్ట్‌ట్యూబ్ బేబిని పుట్టిం చగలిగారు కాని, వీర్యం, అండం కలయిక లేకుండా దాన్ని సాధించగలిగారా? సృష్టి ఆది నుంచీ కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, ఆచరణలు, మంచీ-చెడు లు.. ఇలా ఎన్నో సంప్రదాయాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. వాటిలోంచి ఈకకు ఈక, తోక కు తోకా లాగి, పాండిత్య ప్రదర్శన చేసి, సనాతన పద్ధతులను, సంస్కృతీ సంప్రదాయా లను, ఈసడించడం సమంజసం కాదేమో ఆలోచించుకోవడం మంచిది.అనాదిగా సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో ఎవరెవరు ఎటు వంటి ధర్మాలను ఆచరించారనేదే ప్రధానం. వాటిని భావితరాలవారు ఎలా అర్థం చేసు కోవాలనేది ముఖ్యం. మన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, హిందూ ధర్మశాస్ర్తాలు చెప్పిందంతా బూటకమని వాదించేకన్నా అందులోని ధర్మాలను, అధర్మాలను అవగా హన చేసుకోవడమూ ముఖ్యం. మన ప్రాచీన గ్రంథాల్లో ఎప్పుడూ-ఎక్కడా ఫలానా కులం వారే అధికులని చెప్పబడలేదు.
ఎన్నో పాత్రల ద్వారా, సంభాషణల ద్వారా ఎన్నో ధర్మాలను వివరించడం జరిగింది.
ఇటీవలి కాలంలో ఆ రచయితకు ఐనదానికీ, కానిదానికీ బ్రాహ్మ ణులను ఆడిపోసు కోవడం పరిపాటైంది. ప్రతి వ్యవహారాన్ని బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణ కులంతో ముడిపెట్టి విమర్శలు చేయడం తగనిపని. బ్రాహ్మణాధిక్యత అనే పదాలను కూడా తరచూ వాడటం మంచిది కాదు. ఆయన వాదనకు పనికొచ్చే బ్రాహ్మణ శాస్ర్తాలు, బ్రాహ్మణ్యం మిగిలిన విషయాలకు ఎందుకు పనికి రాదో అర్థంకాదు. బ్రాహ్మణులను ఆధ్యాత్మిక ఫాసిస్టులని దుర్మార్గపు రాతలు రాయ డం సరికాదు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏమా త్రం తెలియని ఇతడు తన నోటికొచ్చినట్టు మాట్లాడ టం సమంజసం కాదు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణా లు వాడుకలో ఉన్నాయి. సమాజం అభివృద్ధి చెంది న నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, నాలుగు కాదు-నలభై తరగతులుగా మనమంద రం మన మన విధుల ను నిర్వహించడం లేదా? ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబి లోనియాలతో సహా, చైనా దేశంలోనూ ఉండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తిదారులుగా, బానిసలుగా విభజిం చారు. అలానే ప్రాచీన ఇరా న్‌లో పిస్త్రీ అనే నాలుగు వర్ణాలుండేవి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉన్న వర్తమానకాలంలో కూడా మనిషికి-మనిషికి మధ్య వ్యత్యాసాలు కొన్ని విషయాల్లో లేవా? ప్రభు త్వ ప్రైవేట్ సర్వీసుల్లో ఒకటవ తరగతి, రెండవ తరగతి, మూడు, నాలుగు తరగతుల ఉద్యోగులని విభజన లేదా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారికీ, అటెం డర్‌కూ రాజ్యాంగపరంగా ఒకేరకమైన హక్కులిచ్చిన ప్పటికీ, వారిద్దరికీ మధ్య వ్యత్యాసాలు లేవా? ఇం జినీరునూ, డాక్టరునూ, గుమాస్తాను, దినసరి కూలీ ని, ఒకేరకంగా అన్ని విషయాల్లోనూ చూస్తు న్నా మా? దీనికి కారణం, ఇప్పటి మూలాలు ఆర్థిక మైన వైతే, నాటి కాలంలో మూలాలు మరోరకంగా ఉన్నా యి. దేశ కాలమాన పరిస్థితులకనుగుణంగా మార్పు లు చోటుచేసుకుంటున్నాయి. ఆ మార్పులో మంచి ఉంది, చెడు ఉంది. కమ్యూనిజం వచ్చిన చైనా, రష్యా దేశాల్లో కూడా ఈ తేడాలున్నాయి.
ఇక కులమంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే నివాసం. వర్ణాలు వేరు, జాతు లు వేరు. వర్ణం అనే మాట వర్గాన్ని సూచిస్తే, జాతి అనేది కులాన్ని సూచిస్తుంది. ఇంగ్లీష్‌లో చెప్పుకోవా లంటే క్లాస్, కాస్ట్ అన్నమాట. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలు గు గానే ఉండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతు ర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అదెలా రూపాంతరం చెందినప్పటికీ, అదొక సామా జిక అవసరాన్ని, బాధ్యతను ఆ కాలం నాటి అవస రాలకు అనుగుణంగా నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధపడాల్సిన అవసరంలేదు. గర్వపడాల్సిన అవ సరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు.
బ్రాహ్మణుల విషయానికొస్తే, సమాజం వారికి అప్పగించిన బాధ్యతను వారు సక్రమంగా శక్తివం చన లేకుండా నిర్వహించారు. వారు కుల వ్యవస్థను ఏనాడూ పెంచి పోషించలేదు. సమాజం అవసరాల నేపథ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ. అదే సామాజిక అవసరం నేపథ్యంలో బ్రాహ్మణులు పాలన, మంత్రాంగం, పురోహితాల వైపు దృష్టి మర ల్చారు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం పనిచేసే పంచ ప్రధానులలో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణు లుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ అయింది. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితం గా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రం థంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమవాసుల పునః కలయిక వల్ల ఏర్పడిన కులం గా బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రం థాల్లో లభ్యమైన వాటిని భద్రపరిచింది వారేనని, దాని విలువ అపారమని పేర్కొన్నారు. ఇలాంటి నేప థ్యంలో తమ బతుకేదో తాము బతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పుచేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడ టం సబబేనా?.
ఒకనాడు సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల స్థితిగతు లు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారతదేశంలో పతాక దశకు చేరుకుంది. మండల కమిషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూను కుపోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృచ్ఛికంగా జరి గిందేమీ కాదు. సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటిష్‌వారికి మొద ట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సం ప్రదాయక భవబంధాల నేపథ్యంలో దేశప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలుచడంలో కీలకపాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడిచేయాలన్న ఆలోచ న ఆంగ్లేయులకు కలుగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటిష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బతీయాలని భావించిం ది. చదువుకున్న బ్రాహ్మణుల మూలా న, భారతదే శంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం ఉందని భావించింది బ్రిటిష్ ప్రభుత్వం. జాతీయో ద్యమం లో పెద్దఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుం డా నాయకత్వం వహించడం వారి అనుమా నాన్ని మరింత దృఢపరిచింది.
వాస్తవానికి శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుం ది ప్పుడు. ఈ మార్పులవల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదు లుగా కులాల ప్రాధాన్యం వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాల్లో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరుగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరే కతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాల ని, వెనుకబడిన కులాలని, దళితులని భేదాలొచ్చా యి.

Ivanka ఇవాంక , ముత్యాలనగరం

ముత్యాల నగరం.. పారిశ్రామికవేత్తలకు వరం
దేశానికి ఎంట్రప్రెన్యూర్‌షిప్ కేంద్రంగా హైదరాబాద్..
అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా ...

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముత్యాలనగరంగా పేరున్న హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రతీకగా మారబోతున్నదని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా పేర్కొన్నారు. నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఒకప్పుడు ముత్యాలకు ప్రసిద్ధి పొందగా.. రానున్న రోజుల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు కేంద్రంగా మారనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నవంబర్ 28 నుంచి 30 తేదీల మధ్య జరుగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)పై అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె కథనాన్ని రాశారు. ఈ సందర్భంగా నగరానికి చారిత్రకంగా, పారిశ్రామికంగా ఉన్న ప్రత్యేకతలను వివరించారు. రాష్ట్రం సులభ వాణిజ్య విధానంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భాగ్యనగరం అనుకూలమైన ప్రాంతంగా అభివర్ణించారు.
టీహబ్, ఐఎస్బీలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నెలకొల్పారని చెప్పారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగూల్, యాపిల్, ఉబెర్ వంటి సంస్థలు అతి పెద్దకార్యాలయాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని వివరించారు. భారత్ అమెరికాల మధ్య ైద్వెపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏండ్లయిన సందర్భంగా భారత్ సులభవాణిజ్య విధానానికి అనుగుణంగా అనేక మార్పులు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. జీఈఎస్‌లో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం- అందరికి సౌభాగ్యం అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగడానికి, వారిలో అవగాహన పెరుగడానికి, సందేహాలను తీర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.
వెస్టిన్ హోటల్‌లో ఇవాంక బస
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ నవంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఉంటారు. మాదాపూర్‌లోని రహేజా ఐటీ పార్కులోని వెస్టిన్ హోటల్‌లో ఆమెకు బస ఏర్పాటు చేశారు. అమెరికా అధికారులు ఇప్పటికే హోటల్‌ను పరిశీలించారు. భద్రత, వసతులపరంగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు జరిగే హెచ్‌ఐసీసీకి వెస్టిన్ హోటల్ మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీఈఎస్ 2017 సదస్సుకు హాజరయ్యేందుకు పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవడానికి గడువు సోమవారంతో ముగియనుంది. http://ges2017.gov.in/entrepreneurs.php లో దరఖాస్తు చేసుకోవాలని నీతిఆయోగ్ అధికారులు తెలిపారు.

Singur సింగూరు

Singur సింగూరు.
సింగూరు నుంచి నిజాంసాగర్‌లోకి విడుదలవుతున్న తొమ్మిది టీఎంసీల నీరు
-ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 2.31 లక్షల ఎకరాల్లో పంటల సాగు
-ఫలించిన మంత్రులు పోచారం, హరీశ్ కృషి.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతుల హర్షం

మెతుకుసీమలో ఇది కొత్త చరిత్ర. సింగూరు, నిజాంసాగర్‌ల కింద రెండు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీరివ్వడం స్వరాష్ట్రం సాధించిన మరో చారిత్రాత్మక విజయం. తెలంగాణ ఆత్మ కలిగిన నేత ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో రుజువుచేసిన గొప్ప పరిణామం. శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడిన అద్భుత సన్నివేశం. బీళ్లు పడిన నేలలు జలకళతో పులకించే శుభతరుణం. ఇది తెలంగాణ అంతా సంబురాలు జరుపుకోవలసిన సందర్భం. ఆత్మగౌరవ ప్రకటనకు ఇది మరో ప్రతీక. మేము మళ్లీ పొలాలు చేసుకుంటమనుకోలేదు. మా భూములు ప్రాజెక్టుల నీళ్లతో తడుస్త్తయనుకోలేదు. మన రాష్ట్రం, మన నాయకత్వం ఉంటే ఏం జరుగుతదో ఇప్పుడు అర్థమైతుంది అని మెదక్ జిల్లా అభ్యుదయ రైతు ఒకరు ఆనందంతో చెప్పారు. నిజమే! వ్యవసాయానికి తొమ్మిది టీఎంసీల విడుదలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం.. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పొలాలకు పునర్జన్మ!!
సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, బాన్సువాడ రూరల్:రెండో పంట, మూడో పంట అన్న పదాలు తెలంగాణ ఎప్పుడూ వినలేదు. ఇక మెదక్, నిజామాబాద్ జిల్లాల సంగతి చెప్పనవసరం లేదు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద కొంతకాలం రెండో పంటకు నీరు వచ్చేది. చాలాకాలంగా అక్కడా పొలాలు బీళ్లు పడిపోయాయి. సింగూరు ప్రాజెక్టును జంటనగరాలకు తాగునీరు, మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు నిజాంసాగర్ కింద ఆయకట్టు స్థిరీకరణకు నిర్మించారు. గత మూడు దశాబ్దాల్లో సమైక్య ప్రభుత్వాలు ఒక్క పంటకు కూడా నీరివ్వలేదు. సింగూరు జలాలన్నీ జంటనగరాల తాగునీటికేనన్న పేరుతో మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతాంగానికి అన్యాయం చేస్తూ వచ్చారు. నగరానికి కృష్ణా జలాలు తెచ్చిన తర్వాత కూడా సింగూరు జలాలను మెదక్ ప్రజలకు ఇవ్వలేదు. జంటనగరాలకు కృష్ణానీటిలో కేటాయింపులు చేయించి, తగిననన్ని జలాలను ఎప్పుడో హైదరాబాద్‌కు తరలించాల్సింది. జంటనగరాలకు నీటి కేటాయింపులు చేయించాలన్న సోయే సమైక్య ప్రభుత్వాలకు గానీ, ఆ ప్రభుత్వాల్లో పనిచేసిన కాంగ్రెస్, టీడీపీ నాయకులకుగానీ లేకపోయింది. మెదక్, నిజామాబాద్ రైతులకు అండగా నిలబడాలన్న ప్రయత్నం ఏరోజూ వారు చేయలేదు. తేలికగా, అందుబాటులో ఉందన్న పేరుతో సింగూరును జంటనగరాలకు అంకితం చేశారు. దీంతో మంజీరా నది పొడవున ఉన్న మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పొలాలు నీళ్లు లేక గొడ్డుపోయాయి. ఐదెకరాలు, పదెకరాలు భూమి ఉన్న రైతులు కూడా పొట్ట చేతబట్టుకుని పట్నాలకు వలసపోవలసిన పరిస్థితి. ఎప్పుడు కరువొచ్చినా మెదక్, నిజామాబాద్ జిల్లాలు విలవిల్లాడేవి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు ఆ దృశ్యం సమూలంగా మారిపోనున్నది.