25, జులై 2017, మంగళవారం

Albert Einstein/ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

వికీపీడియా నుండి
ఆల్బర్ట్ ఐన్ స్టీన్
ఐన్ స్టీన్ 1933
[1] (14 మార్చి 1879 – 18 ఏప్రిల్ 1955) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి రెండు స్తంభాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని అభివృద్ధి చేశారు ఐన్ స్టీన్.[2][3] ఆయన తత్త్వశాస్త్రంలో కూడా ప్రభావంతమైన కృషి చేశారు.[4][5] మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టారు ఆయన. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా.[6] 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ఐన్ స్టీన్. క్వాంటం థియరీ పరిణామ క్రమం పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు ఆయన.[7]
ఆయన కెరీర్ మొదట్లో న్యూటన్ మెకానిక్స్ సంప్రదాయ మెకానిక్స్ ను  పునరుర్ధరించలేదని భావించేవారు. దీంతో స్పెషల్ రెలెటివిటి అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1916లో సాధారణ సాపేక్షతపై పేపర్ ప్రచురించారు.  స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీల్లోని సమస్యలపై దృష్టి పెట్టారు ఐన్ స్టీన్. పార్టీకల్ థియరీ, అణువుల చలనాలపై వ్యాఖ్యానం చేశారు ఆయన. ఆయన ఉష్ణ లక్షణాల గురించి చేసిన  పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది. 1917లో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపచేశారు ఐన్ స్టీన్.[8][9]
1933లో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాకా ఆయన అమెరికా వెళ్ళారు. ఆయన జ్యుయిష్ జాతికి చెందినందున తిరిగి జర్మనీ వెళ్ళలేదు.అమెరికాలో బెర్లిన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఆచార్యునిగా  పనిచేశారు. 1940లో అమెరికన్ పౌరసత్వం లభించడంతో అక్కడే  స్థిరపడిపోయారు ఆయన.[10] రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా  అత్యంత శక్తివంతమైన బాంబులపై పరిశోధన జరుగుతోందనీ, ఇది అణుబాంబు తయారీకి దారితీస్తుందని వివరిస్తూ అప్పటి అమెరికా  అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూసెవెల్ట్ కు ఉత్తరం రాశారు ఐన్ స్టీన్. తాను  యుద్ధానికి వ్యతిరేకం కాదనీ, కొత్తగా కనుగొన్న అణుబాంబు ప్రయోగానికి తాను పూర్తి వ్యతిరేకమనీ స్పష్టం చేశారు ఆయన. అణు ఆయుధాలను ఉపయోగించకూడదంటూ బ్రిటన్ కు చెందిన తత్త్వవేత్త బెర్ట్రాండ్  రుసెల్ తో కలసి రుసెల్-ఐన్ స్టీన్ మానిఫెస్టోపై సంతకం చేశారు  ఆయన. 1955లో చనిపోయేంతవరకూ న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సెడ్ స్టడీ సంస్థలో పనిచేశారు ఐన్ స్టీన్.
ఐన్ స్టీన్ 300కు పైగా శాస్త్రీయ పత్రికలు, 150 శాస్త్రీయేతర పత్రికలు ప్రచురించారు.[8][11] 5 డిసెంబరు 2014న విశ్వవిద్యాలయాల్లోని ఐన్ స్టీన్ కు చెందిన 30,000 శాస్త్రీయ పత్రాలను విడుదల చేశారు.[12] చాలా రంగాల్లో ఆయన చేసిన కృషికి తెలివితేటలకు ఆయన పేరు మారుపేరుగా మారింది.[13]

జీవిత సంగ్రహం[మూలపాఠ్యాన్ని సవరించు]

తొలినాళ్ళ జీవితం, చదువు[మూలపాఠ్యాన్ని సవరించు]

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 14 మార్చి 1879న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించారు.[14] ఆయన తండ్రి హెర్మన్ ఐన్ స్టీన్ సేల్స్ మేన్, ఇంజినీర్ గా పనిచేశారు. 1880లో మునిచ్ కు వారి కుటుంబం మారిపోయింది. ఆయన తండ్రీ, బంధువు జాకబ్ కలసి విద్యుత్తు పరికరాలను తయారు చేసే కంపెనీ స్థాపిం[14]

చారు.
ఐన్ స్టీన్ జీవిత కాలక్రమం
1879: జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించారు.
1884–1894: మునిచ్ లోని కాథలిక్ ప్రైమరీ స్కూల్ కు, లుయిట్పోల్డ్ గ్యమ్నసిం స్కూల్ లో చదువుకున్నారు.
1894–1895: ఇటలీలోని పవియాకు వెళ్ళారు.
1895–1896: సిట్జర్ ల్యాండ్ లోని ఆరయులో మిట్టెల్ స్కులే పాఠశాలలో మాధ్యమిక విద్య అభ్యసించారు.
1896: వుర్టెంబర్గ్ పౌరసత్వం వదులుకున్నారు.
1896–1900: జురిచ్ లో పాలిటెక్నిక్ చదువుకున్నారు.
1901: స్విస్ పౌరసత్వం లభించింది.
1902–1909: స్విట్జర్ ల్యాండ్ లోని బెర్నెలో స్విస్ పేటెంట్ కార్యాలయంలో పనిచేశారు.
1902: ఇటలీలోని మిలాన్ లో ఆయన తండ్రి హెర్మన్ ఐన్ స్టీన్ మరణం.
1903: మిలెవా మారిక్ ను పెళ్ళి చేసుకున్నారు.
1905: నాలుగు శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు.
1905: స్విట్జర్ ల్యాండ్ లోని జురిచ్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి అందుకున్నారు.
1907–1916: సాధారణ సాపేక్షిత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు.
1908–1909: బెర్న్ విశ్వవిద్యాలయంలో లెక్చెరర్ గా పనిచేశారు.
1909–1911: జురిచ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు.
1911–1912: ప్రేగ్యులోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు.
1912–1914: ఎథ్ జురిచ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు.
1914: బెర్లిన్ కు తన కుటుంబంతో సహా వెళ్ళిపోయారు ఐన్ స్టీన్. కొన్ని నెలల తరువాత వారి ఇద్దరు కుమారులను తీసుకుని ఆయన భార్య మిలెవా మరిక్ ఆయన వదిలి తిరిగి జురిచ్ కు వెళ్ళిపోయారు (అప్పటికి వారి ఇద్దరు కుమారులు 4, 10 ఏళ్ళ వారు).
1914: స్విస్ పౌరసత్వంతో పాటు, జర్మన్ పౌరసత్వం కూడా లభించింది ఆయనకు.
1914–1933: ప్రషియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యుడయ్యారు.
1914–1932: బెర్లిన్ లోని కైసెర్ విల్హెల్మ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజిక్స్ కు అధ్యక్షునిగా అయ్యారు.
1914–1917: హంబొల్డ్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు.
1916–1918: జర్మన్ ఫిజికల్ సొసైటీకి అధ్యక్షనిగా వ్యవహిరించారు.
1919: మిలెవా మారిక్ కు విడాకులు ఇచ్చిన ఐన్ స్టీన్, తన కజిన్ ఎల్సా లోవెంథాల్ ను వివాహం చేసుకున్నారు.
1920: బెర్లిన్ లోని ఐన్ స్టీన్ గృహంలో ఆయన తల్లి పౌలిన్ మరణించారు.
1921: భౌతికశాస్త్రంలో ఆయన చేసిన కృషికి నోబెల్ బహుమతి అందుకున్నారు.
1933: జర్మన్ పౌరసత్వం వదులుకుని అమెరికా వలస వెళ్ళిపోయారు.
1933–1955: అమెరికాలోని న్యూజెర్సీ, ప్రిన్స్ టౌన్ లో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్వాన్సెడ్ స్టడీలో ప్రొఫెసర్ గా పనిచేశారు.
1936: ఆయన రెండో భార్య ఎల్సా మరణించారు.
1940: స్విస్ పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా లభించింది.
1951: ప్రిన్స్ టౌన్ లోని ఆయన ఇంటిలో సోదరి మజా ఐన్ స్టీన్ మరణించారు.
1955: ప్రిన్స్ టౌన్ లో ఐన్ స్టీన్ మరణించారు.Prabhakargoud Nomula

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి