4, జులై 2017, మంగళవారం

Pasunuri Dayakar

పసునూరి దయాకర్

వికీపీడియా నుండి
Pasunuri Dayakar
పసునూరి దయాకర్
Pasunuri dayakar.png
పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గంవరంగల్
వ్యక్తిగత వివరాలు
జననం1967 ఆగస్టు 2
బొల్లికుంట సంగెం మండలం: వరంగల్ జిల్లా:
రాజకీయ పార్టీటీఆర్ఎస్
పసునూరి దయాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో విజయం సాధించిన లోక్‌సభ సభ్యుడు. వరంగల్లు (ఎస్.సి) వరంగల్ నుండి ప్రస్తుత 16వ లోక్ సభకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


జీవిత విశేషాలు

ఆయన వరంగల్ జిల్లా సంగెం మండలం లోని బొల్లికుంట గ్రామంలో పసునూరి కమలమ్మ మరియు ప్రకాశం దంపతులకు 1967 ఆగస్టు 2 న జన్మించారు. దయాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన హైదరాబాద్ జేఎన్టీయూలో బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ చదివారు. ఆయన వృత్తి రీత్యా చిత్రకారుడు, తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త.

వృత్తి,సేవ

గ్యాస్ ఏజెన్సి ముందు వృత్తి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణా ఉద్యమంలో తొలి నుంచి సేవలందిస్తున్నారు.

రాజకీయ జీవితం

టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాఫ్ల ఏర్పాటుకు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 2001 నుంచి 2009 వరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు[3]. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్టీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆరెస్ లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల పట్టుసడలని విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్ కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది.

భారీ మేజారిటీ

పసునూటి దయాకర్ 2015 వరంగల్ ఉపఎన్నిక పోరు ఓ రికార్డు. రాష్ట్ర చరిత్రలో భారీ మేజారిటీ నమోదు అయ్యింది. పసునూటికి 6,15, 403 ఓట్లూ రాగ. కాంగ్రేస్కు సర్వే సత్యనారాయణకు 1, 56, 315 ఓట్లూ వచ్చినవి . భారతీయ జనతా పార్టీ డా|| పగిడిపాటి దేవయ్యకు 1,30, 178 ఓట్లూ వచ్చినవి, కాగా పసునూటి ఓట్లూ 4,59,092 భారీ మేజారిటీ నమోదు అయ్యింది.

నోముల ప్రభాకర్ గౌడ్                  
                                                                  Prabhakargoud Nomula.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి