1, జులై 2017, శనివారం

Warangal Shankar/వరంగల్ శంకర్‌/

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు వరంగల్ శంకర్‌ చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.


Warangal Shankar/వరంగల్ శంకర్‌/ చరిత్ర గురించి...
వరంగల్ శంకర్‌ ప్రముఖ తెలుగు జానపద, సినీ నేపథ్య గాయకుడు.
సంధ్య







బాల్యం, వృత్తి జీవితం

వరంగల్ జిల్లాలో కుమార్ పల్లిలో వరంగల్ శంకర్‌ జన్మించారు. బాల్యమంతా కుమార్ పల్లి, హనుమకొండ లలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అనంతరం జానపద సినీ నేపథ్య గాయకుడుగా ఆర్.నారాయణమూర్తి సినిమాలలో శంకర్‌ అనేక పాటలు పాడారు. దండోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఎర్రసైన్యం భూపోరాటానికి అజ్యం పోసింది. చుండూరు సంఘటనను చిత్రీకరించిన లాల్ సలాం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఆ తరువాత వచ్చిన సినిమాలలో అడవి దివిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, ఒరేయ్ రిక్షా. సినిమాలలో ”మా కంపేనీకీ జీతాలు పెరిగినయి” ”బండెనెక బండి కట్టి పదహారు బండ్లు కట్టి” లాంటి ఎంతో ప్రజాదరణ పొందినవి. తెలుగు సినిమా గాయకుడు.వందేమాతరం శ్రీనివాస్చిత్రతో శంకర్‌ అనేక పాటలు పాడారు. వరంగల్ శంకర్‌, జానపద సినీ నేపథ్య గాయకుడైన దీకొండ సారంగపాణికి సమకాలికుడు.

వివాహం

1990 నుండి సహచర గాయకుడూ సారంగపాణితో వందలాది వేదికలపై, క్యాసెట్లలో జానపద గేయాలు ఆలపించిన కునమల్ల సంధ్య కు, శంకర్‌కు ప్రేమ వివాహం జరిగింది.[1].వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.

ప్రజాదరణ పొందిన పాటలు

వరంగల్ శంకర్ పాడిన కోడిబాయి లచ్చమ్మది, జబ్బకు తుపాకీ, రారండి పోదాము, దళిత పులులు, వూరు మనదిర, ఏకో నారాయణ, వంటి జానపద, సినిమా గేయాలు ఉరుతలుగించగా శంకర్ విరచిత ‘మియ్యారు గుర్రాలు.. మాయారు గుర్రాలు’ అనే పాటతో ఎన్నో సంస్థలు ఆయనకు బిరుదులు, అవార్డులు అందుకున్నారు. తమ జానపద బాణీలతో వరంగల్లు కీర్తిని చాటిన శంకర్ రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలలో ఎన్నో ప్రదర్శనల్ని దిగ్విజయంగా ప్రదర్శించి, ప్రేక్షకుల్ని పరవశింపజే ఎన్నో సంస్థల నుండి అవార్డుల్ని అందుకున్నారు. 1988 నుండి వరంగల్ జిల్లా కళాకారులతో వేదికలపై ,క్యాసెట్లలో జానపద గేయాలు ఆలపించి నిర్వహిస్తూనే అవార్డులు అందుకున్నారు.

బిరుదులు

నిర్విరామ కృషికి, దీక్షాదక్షతలను గుర్తించిన అనేక సంస్థలు ఆయన్ను ఆహ్వానించి ఎన్నో సంస్థలు ఆయనకు ”గానకోకిలా” ”జానపదకోకిలా” బిరుదు ఇచ్చి గౌరవించాయి

విజయవాడ కళాపరిషత్ వారి పురస్కారం ఓరుగల్లుకోకిలా, బిరుదులనిచ్చి సత్కారం చేశాయి
.

ఆశయం

తెలుగు జానపద గేయాలకు పూర్వప్రాభవం తీసుకురావడం.

మరణం

ఆరోగ్యంతోనే ఉన్న శంకర్‌ వరంగల్ లోనే గుండేపోటుతో మరణించారు.

కళను వారస్వతం
తెలంగాణ ఉద్యమంలో పాటకు దక్కిన గౌరవమే.. స్వరాష్ట్రంలో జానపదానికి దక్కింది. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నా జిల్లా వరంగల్లు అంటూ వేదికలపై పాటై నినదించింది. గొంతు విప్పి పాడింది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. జీవిత చదరంగాన్ని, సంసార సాగారాన్ని దాటుకుంటూ వస్తుంది. సంధ్య భర్త వరంగల్ శంకర్‌గా అందరికీ పరిచయమున్న కళాకారుడే.కోడిబాయి లచ్చమ్మది, నీ ఏడు గుర్రాలు, నా ఏడు గుర్రాలు, బండెనక బండి కట్టి అంటూ జానపద పాటలకు ప్రాణం పోసిన దివంగత శంకర్ కళను వారస్వతంగా పుణికి పుచ్చుకుంది. ఉద్యమంలో పాటగా గొంతెత్తిన సంధ్యకు ఈ అవార్డు దక్కడం నిజంగా జానపదానికి గౌరవం దక్కడమే అంటున్నది సంధ్య...

వరంగల్ శంకర్‌ చరిత్ర గురించి ...             Prabhakargoud Nomula నోముల ప్రభాకర్.

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి