అమెరికా అంటే భూలోక స్వర్గం...
అమెరికా అంటే భూలోక స్వర్గం అని భావించటం సర్వ సాధారణం .ఇక్కడ వసతులు అంత బాగా ఉంటాయి .ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉన్నంత వరకు హేపీ .ఇద్దరు ఉద్యోగులే అయితే మరీ హాయి .కావలసి నంత రాబడి .అన్నీ అమర్చుకో వచ్చు .స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోనూ వచ్చు .స్వంత ఇల్లు ఇక్కడ ఏర్పడటం తేలికే .అన్నీ బిల్డర్ చేసి పెడతాడు .ఖర్చులో ఐదో వంతు కాష్ గా కట్టే సమర్ధత ఉండాలి .’loan ‘కూడా వాళ్ళే ఏర్పాటు చేయిస్తారు .వాయిదాలు దీర్ఘ కాలానికి తీసుకొంటారు కనుక తీర్చటం తేలికే అవుతుంది .అయితే స్వంత ఇంటి చాకిరీ కూడా ఎక్కువే .లాన్ను జాగ్రత్తగా మైన్ టైన్ చేస్తారు .కూరగాయలు పండించు కో వచ్చు .కరెంటు పెట్రోలు చౌక .ఎక్కడికి వెళ్ళినా కారు లో వేళ్ళ వచ్చు కారు పొందటమూ తేలికే .సులభ వాయిదాల మీద తీర్చుకో వచ్చు .ఇల్లు బొమ్మరిల్లు లాగా మూడు నెలల్లో నిర్మించేస్తారు .కావాల్సిన మోడల్ ఎన్ను కోవటమే .వలసిన వన్నీ అమర్చు కో వచ్చు .సేల్సు ఉన్న రోజున కొంటె వస్తువు లన్ని చౌకగా వస్తాయి ఫర్నిచర్ తో సహా .ఆఫర్లు చాలా ఉంటాయి .నెట్ లో వెతుక్కొని ఆర్డర్ చేస్తే తక్కువ లోనే ఎలేక్రానిక్స్ పొందచ్చు .”దెయ్యాల పండగ ”(హాలొ వెన్ )రోజుల్లో కొత్త సంవత్సరం క్రిస్మస్ ,ఇండెపెండెన్స్ డే వగైరాలలో క్లియరెన్స్ సేల్సు లో అతి తక్కువ డబ్బులతో అన్నీ కోని అమర్చుకో వచ్చు .పిల్ల చదువులు హాయి .హైస్కూల్ వరకు చదువు, పుస్తకాలు, బస్సు, ఫ్రీ .ఇది ఎంతో ఉపశమనం గా ఉంటుంది .పిల్లలకు ఎప్పటి కప్పుడు పరీక్షలు పెట్టి వారి సామర్ధ్యాన్ని అంచనా వేసి ప్రత్యెక శిక్షణ నిస్తారు .బండ చాకిరి పిల్లలకుండదు .తెలివికీ, క్రియేటివిటీ కే ప్రాధాన్యం .అందులో బాగా చొచ్చుకు పోవచ్చు .లైబ్రరీలు గొప్ప సేవ చేస్తాయి వేసవి లో రీడింగు కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు .స్కూళ్ళు తేరి ఛే సమయం లో ముందు పై తరగతి పుస్తకాలను తెచ్చుకొని చదువు కో వచ్చు .ముఖ్యం గా ఆర్టు కు ప్రాధాన్యత బాగా ఉంటుంది .శక్తి సామర్ధ్యాలను చూపే అవకాశాలుంటాయి .లైబ్రరీ లలో కూడా ప్రత్యెక శిక్షణ నిస్తారు .అయితే డబ్బులు కట్టు కోవాలి .కరాటే, జిమ్నాస్టిక్స్ లలో డబ్బిచ్చి చేరి నేర్చుకో వచ్చు .వారికి మంచి ఎంకరేజ్ మెంట్ ఉంటుంది .భాషా సేవా కేంద్రాలు పోటీలు నిర్వ హించి బహు మతులను అంద జేస్తారు .సమ్మర్ లో y.m.c.a.వాళ్ళు ,హిందూ సెంటర్ వాళ్ళు ప్రత్యెక కోర్సులను నిర్వహించి ఆటా ,పాటా డాన్సు నాటకం వగైరాలను స్విమ్మింగ్ ను నేర్పుతారు .దీనికి పిల్లలు బాగా ఉత్సాహం చూపిస్తారు .అపార్టు మెంట్ల వద్దా ,కమ్మ్యూనిటీ లలో స్విమ్మింగ్పూల్సులలో పిల్లలు వేసవిలో మంచి కాల క్షేపం .సంగీతం నేర్పే వారు డాన్సు నేర్పే వారు లెక్కలు నేర్పే వారు ఉంటారు .మన పిల్లల అభి రుచి ని బట్టి ఏర్పాటు చేసుకో వచ్చు .ఇంటికి వచ్చి కూడా చెప్పే వారున్నారు .
ఇక్కడి మనుష్యులు చాలా స్నేహ శీలం గా అని పిస్తారు .ఎవ్వరి జోలికీ ఎవ్వరూ సాధారణం గా రారు .మనుష్యులలో ఆందోళన కనీ పించదు .స్తిర చిత్తం తో ,ప్రశాంతం గా ఉండటం గమనార్హం .ముసలి వారు కూడా లైబ్రరీలకు కారు నడుపు కొంటూ వచ్చి పుస్తకాలు తీసుకొని వెళ్లి చదువుతారు .షాపింగుకు వస్తారు .వాళ్ళను చూస్తుంటే” అసహాయ శూరులు ”అని పిస్తారు .నవ్వు ముఖం తో పలకరించి ”హాయ్”చెబుతారు .న లాంటి ముసలి వారు కానీ పిస్తే కారు లో వెడుతున్నా నవ్వుతో చేతులతో హాయ్ చెప్పటం వీరి ప్రత్యేకత .మనతో రాసుకు ,పూసుకు తిరక్క పోయినా, మర్యాదనుచక్క గా పాటించటం ఆనందమేస్తుంది .ఆది వారి సంస్కారం .ఇదే అమెరికనిజం అని పిస్తుంది .ఎక్కడైనా ఇలాగే ఉంటారు .హడా విడి హళ్ళూ ,పెళ్ళూ లుండవు .
ఇక్కడి రోడ్లను చూస్తె బలే ముచ్చటగా ఉంటాయి .అసలు రోడ్లు ముందు పుట్టి అమెరికా తర్వాతా పుట్టిందా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది .రోడ్ల మీద ప్రతి మైలుకి గుర్తులు ఊర్లోకి వెళ్ళటానికి ,ఊరి బయటకు రావా టానికి ,ఏ రోడ్డు ఎంత దూరం లో ఉందొ తెలియ జేసే వివరాలు అన్నీ పకడ్బందీ గా ఉంటాయి దీనికి తోడు ఇప్పుడు జియో పొజిషన్ సిష్టం అంటే జి .పి.ఎస్.కూడా వచ్చింది కనుక ఎక్కడికి వెళ్ళా లన్నా రోడ్డు మాప్ తో పనీ లేదు .హాయి గా డైరేక్షన్లు ఫాలో అవుతూ ఎంత దూరమైనా వేళ్ళ వచ్చు .ఇక్కడ గొప్పతనం ఒకటి ఉంది .ఎన్ని గంటలైనా స్వంతకారు లో హాయిగా ప్రయాణించి వెళ్తారు కుటుంబం అంతా ఆనందాన్ని అనుభవించే వీలు .శని ఆది వారాలోస్తే ఎక్కడికో అక్కడికి పిక్నిక్ కో, సైట్ సీయింగ్ కో వెళ్లి ఎంజాయ్ చేస్తారు .ఇండియన్ హోటళ్ళు దాదాపు అన్ని చోట్లా ఉన్నాయి .మన తిండి మనం తినచ్చు .ఉడిపి హోటళ్ళు మద్రాస్ హోటళ్ళు పంజాబీ దాబాలు అన్నీ ఉన్నాయి వెతుక్కొని వెళ్ళాలి అంతే .ఎన్నో ఫ్లై ఓవర్లు ఎటు వెళ్తున్నామో ,ఎటు వస్తున్నామో తెలీకుండా ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి . అమెరికా లో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒకటే స్సేనారి కానీ పిస్తుంది .అవే ఇల్లు .అవే స్టోర్లు .అన్నీ ఒకే మోడళ్ళు .సామ్ స్ , వాల్ మార్టు ,క్రోజర్, కే మార్టు,జె.సి పెన్నీ లలో బట్టలు వస్తువులు చీప్ .ఎలేక్త్రానిక్సు చవక .
ఎంత దూరం ప్రయాణం చేసినా అలుపూ సొలుపు ఉండదు .రోడ్లు ప్రయాణానికి తగి నట్లుంటాయి .రోడ్డుకు ఇరు వైపులా పైన్ ,కోన్ మొదలైన చెట్లు పచ్చ దనం తో పర వశింప జేస్తాయి. కొన్ని చోట్ల మన ఊటీ ,కొడైకెనాల్ లాగా భ లేగా ఉంటాయి .ఇండియా వాళ్లకు ఇక్కడ హాయి .సీతా కాలం భరించటం ఓ కొంత ఇబ్బందే .దానికి సరి పడ దేర్మో వస్త్రాలు కోట్లు బూట్లు తప్పవు .కారు లోంచి బయటికి వెళ్లి నప్పుడే చలి .కారులో హీటు, షాపుల్లో హీటు ఉండనే ఉంటుంది .మిచిగాన్ లాంటి చోట స్నో బాగా పడి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగ జేస్తుంది .అయినా వెంటనే ఉప్పు చల్లి క్లియర్ చేస్తారు .కార్లు తుడుచుకోవాలి .ఫాల్ చలి ప్రాంతాలలో అద్భుతం గా ఉంటుంది .ఆకులు ఎర్రబడి రాలి పోతు సుందరం గా ఉంటుంది .చెట్ల మొదల్ల లో చలికి రక్షణ కోసం చెక్క పొట్టు వేస్తారు .అమెరికా లో ప్రత్యేకం ఒకటేమి టంటే చెట్లు నిటారుగా నే పెరుగు తాయి కాదు కాదు నిటారుగా నే ఉండేట్లు పెంచుతారు .మొక్క నాటిన రోజు నుండి దీనిపై శ్రద్ధ తీసుకోవటం ఆశ్చర్యం గా ఉంటుంది .ఎక్కడా దాదాపు వంకర వృక్షాలు కనీ పించావు .అంతే కాదు చెట్లను నరకటం ఎక్కడా కనీ పించాడు .రోడ్డువేడల్పు చేయటానికో ఇళ్ళ నిర్మాణం అప్పుడో చెట్లను నరుకు తారు .దారి వెంబడి చెట్లను ముట్టుకోరు .కొమ్మ విరిగితే అక్కడి వరకే కోసి మిగతా చెట్టును రక్షిస్తారు .”వృక్షో రక్షతి రక్షితః ”అన్నదాన్ని అమెరికన్లు బాగా పాటిస్తారు .
రోడ్డు ప్రక్కల పూల మొక్కలు, అపార్ట్ మెంట్ల వద్ద పూల మొక్కలు ముచ్చట గా ఉంటాయి .ఏ సీజన్ కు ఆ సీజన్ పూలు పూసే మొక్కలు ,చెట్లను ఎన్నుకొని పెంచుతారు .మొన్నటి దాకా రోడ్ల ప్రక్క చెట్లకు యెర్రని గులాబీ రంగు తలుపు ,పింక్, కలరు పూసి నాయనానంద కరం చేస్తాయి .ఇప్పుడు పొదల్లాగా ఉన్న చెట్లు ముళ్ళ పంది ఆకారం లో సూదుల్లాంటి ఆకులతో భలేగా కనీ పిస్తున్నాయి .రోడ్ల వెంట వెళ్ళే వారికి మానసిక, నాయనానందాన్నిస్తాయి ఇక్కడి చెట్లు .”ఆనందో బ్రహ్మ ”అని పిస్తుంది .పండ్ల చెట్లు రోడ్ల మీద తక్కువే .
పూలోయమ్మ పూలు
ఇక్కడ మాల్సు లో ముఖ్యం గా హోమ్ డిపో, వాల్ మార్ట్ ,గార్డెన్ రిడ్జి ,మొదలైన చోట్ల ఎన్నో రకాల పూల చెట్లను కుండీలలో సంరక్షించి పెంచి అమ్ముతూ ఉంటారు .చేమంతుల్లో ఎన్నో రంగులు ,సైజులు ముచ్చటగా ఉంటాయి .అలాగే బంతి పూలు లు తెలుగు దేశానికే ప్రసిద్ధి అనుకొంటాం .ఇక్కడ కూడా విపరీతం గా బంతి పూలున్నాయి ఇళ్ళల్లో దొడ్ల లో కూడా పెంచుకొంటారు .హూస్టన్ నగరాన్ని ”మాగ్నోలియా ”సిటీ అంటారు .అక్కడ చంపక పుష్పాలు ఎక్కువ .భలే అందం గా ,తెల్లగా పెద్దగా ఉండే పూలు .మనకు హిమాలయాల లోనే లభిస్తాయి .ఇక్కడ శార్లేట్ లోను మాగ్నోలియా అంటే చంపకాలు బాగా ఉన్నాయి .మరువం ,మల్లె కూడా బాగా ఉన్నాయి కరివేప చెట్టు సోర ,బీర ,వంగ మిర్చి టమేటా ,ఆకుకూరలను మన వాళ్ళు పెరట్లో బాగా పండిస్తున్నారు .అలబామా లోని హన్త్స్ విల్ లో మైనేని గారి భార్య సత్య వతి గారు ఎన్నో రకాల కూరలు పండిస్తూ అందరికి ఉచితం గా అందిస్తున్నారు .ఇక్కడ మా అమ్మాయి ,సుబ్బుఇళ్ళల్లో కూరలు బానే పండిస్తున్నారు .కనుక ఇండియా వాళ్ళు ఇక్కడే అన్నీ పండిస్తున్నారు .ఎక్కడో చలి రాష్ట్రాలలో పంటలున్దవేమో కాని మిగిలిన చోట్ల స్తోర్సులలో అన్నీ దొరుకుతాయి .అదే ఊరట .దొరకని కూర ఉండదు .చేసుకొనే ఓపిక లేక పోతే రెడీ మేడ ఫుడ్ రెడీ .కనుక తిండి సమస్య లేదు .
పెట్రోల్ అంటే వీళ్ళ భాష లో ”గాస్ ”.చౌకే .బంకుల దగ్గర నిలబడి గాస్ కొట్టిన్చుకోనక్కర లేదు .ఎవరికి వారు హాయిగా” స్వంతం గా గాస్ కొట్టు కొంటారు” . అదీ దక్షిణ రాష్ట్రాలలో ,ఆది వాసులుండే ప్రాంతాలలో గాలను పెట్రోలు మిగిలిన చోట్ల కంటే నలభై పైసలు తక్కువ .కారణం దీనిపై ఇక్కడి ప్రభుత్వం టాక్సు వెయ్యక పోవటమే .సౌత్ కరోలీనా లో నార్తు కరోలీనా కంటే గాస్ నలభై సెంట్లు తక్కువ .ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు పక్కనే సందు దాటితే వేరుగా ఉంటాయి .అంత కలిసి పోయాయి . బియ్యం పటేల్ బ్రదర్సు లో కొంటారు. భారతీయ వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయి అప్పడాలు వడియాలు ఊరు మిర్చి తో సహా .దీపావళికి వీళ్ళు అన్నీ చాలా తక్కువ రేట్లకు అమ్ముతారు .దీపావళి సామాను అమ్మే దుకాణాలూ ఉన్నాయి స్వంత ఇంటి వాళ్ళు హాయిగా కోని కాల్చు కో వచ్చు .
ఆంధ్రా వాళ్ళు, తమిళ వాళ్ళు అందరు కలిసి మేలసే ఉంటారు .బర్త్ డే పార్టీలు పండుగలు షష్టి పూర్తి మారేజ్ డే లు చక్కగా నిర్వ హించుకొంటారు .మన దేశ సాంప్రదాయాన్ని అప్పుడు బాగా పాటిస్తారు శ్రావణ మాసం నోములు ఆడ వాళ్ళు నోచి వాయనాలిస్తారు కనుక ఆంధ్రా లో ఉన్న భావన కనీ పిస్తుంది .ఇలా అన్ని చోట్లా ఉంటుందని చెప్పలేం .దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కనుక శని ఆది వారాలలో అక్కడికివెల్లి దైవ దర్శనం చేసుకొంటారు .అక్కడ టిఫిన్ సెంటర్లుఉంటాయి . తీర్ధ ప్రసాదాల తో కాల క్షేపం చేయ వచ్చు .అన్ని రకాల దేవుళ్ళను ఒకే కాంప్లెక్సు లో ఉంచుతారు .కనుక టెంపుల్ కాంప్లెక్సు అని పిస్తుంది .పూజారులు కూడా సంప్రదాయ బద్ధం గా పూజలు నిర్వహిస్తారు. కళ్యాణాలు, అభి షెకాలు ధనుర్మాసం ,ఏకాదశి ,దీపావళి ,దసరా ,మొదలైన రోజుల్లో ప్రత్యెక పూజలుంటాయి .కనుక ఇబ్బందేమీ లేదు .గుడిలోనే బర్త్ డే లు ఫంక్షన్లు చేసుకొనే వీలుఉంటుంది .
తలిదండ్రులను వేసవి లో ఇక్కడికి తెచ్చుకొని వారికి ప్రదేశాలు చూపిస్తూ వారితో గడపటానికి ఉత్సాహ పడుతుంటారు .సాఫ్టు వేర్ ఉద్యోగాల వాళ్ళ వేలాది తలి దండ్రులకు అమెరికా వచ్చి చూసే గొప్ప అవకాశాలొచ్చాయి .ఎవరూ ఎప్పుడూ ఊహించని మార్పు .యువకులకు స్వర్గ సీమ అమెరికా ముసలి వారికి కాల క్షేపం ఉండదు .ఏదో వ్యాపకం లేక పోతే ఇబ్బందే .ఇన్ని అవకాశాలు ఉండ బట్టే అమెరికా అంటే మోజు పెరిగింది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి