9, జులై 2017, ఆదివారం

nancharimadur

నాంచారిమడూర్వరంగల్ జిల్లాతొర్రూర్ మండలానికి చెందిన గ్రామము నాంచారిమడూరు;చరిత్ర ; తెలంగాణ ఉద్యమంలో అనేకమైన పోరాటలు చేసిన ఈ నేల.


Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్


గ్రామ చరిత్ర

తెలంగాణా సాయుధ పోరాటం రోజుల్లో నిజాం కాలంలో మా గ్రామంలోను వారూ కొందరు చావుదెబ్బలు తిన్నారు. కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణా అన్ని గ్రామాల్లో లాగే మా గ్రామంలోను, పెద్ద పెద్ద గడులుతెలంగాణ గడీలు దొరలవి, బురుజు ఉన్నాయి. ఐతే వారి ప్రతిభా సామర్థ్యాలకు తగినంత గుర్తింపు రాకపోవడానికి నాటి సాంఘిక పరిస్థితులే కారణం.

గ్రామం పేరు వెనుక చరిత్ర

నాంచారిమడూర్ సుమారు 1000 ఏండ్ల పైన చరిత్ర ఉన్న గ్రామం. కాకతీయులు కట్టించిన శివాలయం దీనికి సాక్షం...మా ఊరి మద్యలో ఉంది. కాకతీయులు తోవ్వించిన సుమారు 400 ఎకరాల విస్తీరణం, 13 ఫీట్ల లోతు ఉన్న ఊర చెరువు ఉంది.
ప్రస్తుత శివాలయం
నాంచారిమడూర్
మా గ్రామం క్రీ|| పూర్వం ముందు చిన్న పల్లెటూరు మడూగూర్ అంటే గ్రామం పక్కనే నీళ్లతో నిండి ఉండే (మడుగు, చెరువు, కొలను, బొంద, ) ప్రదేశం అని అర్ధం.కళియుగం ఆరంబమైన రోజుల్లోని పూర్వం కాలంలో] ఆదే మడుగు మంచి నీరుకు మా ఊరికి ఆధారం. వానాకాలంలో డయేరియా, కలరా వస్తే ఆరోజుల్లో "ఘత్తర" లేసింది అనేవారు. మా గ్రామంలోని వారు వాన నీరుతో నిండిన ఆ మడుగు నీరు త్రాగడం వలన కలరా సోకింది ఊరిలో చాలా మంది చనిపోయారు. గ్రామ పెద్దలు ఊరును మరో ఏరియాకు "హనుమంతుని మీట్ట" అనే ప్రాంతానికి పాత గ్రామానితూర్పుగా 0.5 కి.మీ. దూరం తరలించారు. మరి కొద్ది రోజులకు "అంగడి చింత" అనే ప్రాంతానికి పాత గ్రామానికి దక్షిణంగా 0.5 కి.మీ. దూరం తరలించారు. అయినా కలరా వ్యాధి బారినపడి పిల్లలు, యువకులు చనిపోవుచున్నారు. అప్పుడు భీ భీ నాంచారి వారసురాలు "నాంచారమ్మ" అనే ఎరుకల సాని "సోది(జాతకం) చెప్పుతాను అంటు ఈ గ్రామం లోకి వచ్చింది. గ్రామ పెద్దలు ఆమెతో “ ఊరిలో చాలా మంది పిల్లలు, యువకులు వ్యాధి బారిన పడి చనిపోవుచున్నారు. దానికి కారణం ఏమిటి నివారణ కూడా నీవే చెప్పమన్నారు. అందుకు ఆమె ఈ గ్రామానికి రెండు సమస్యలు ఉన్నవి ఒకటి ఈ గ్రామానికి బొడ్ర్రాయి లేదు నాపేరు కలిపి "నాంచారి మడూగూర్" అని పెట్టూకుంటే మరో సమస్యకు నివారణ చెప్పూతానంది. గ్రామ పెద్దలు, ప్రజలు అందరు సరేన్ననారు. కొన్నాల్లకు ఆమే చేతనే బొడ్ర్రాయి వేయించారు. ముఖ్యమైన గ్రామ పెద్దలు మరో సమస్యకు నివారణ చెప్పూ అన్నరు " ఓ నిండు గర్భవతి అయిన మహిళను ఓ గోతిలో(గుంట, రంద్రం, బోంద) సజీవంగా పాతిపెట్టాలని ఆ తరువాత ఓ మేకను కూడ బలి ఇవ్వాలని గ్రామంలోని అందరు గోతిని దాటినచో ఈ గ్రామంలో అందరు సుఖసంతోషాలతో ఉంటారని" చెప్పింది నాంచారమ్మ. మేకలను బలి ఇవ్వడం సాదరణ విషయమే కానీ ఆడపిల్ల అందులోను నిండు గర్భవతి అయిన మహిళను అనగానే గ్రామ పెద్దలు కొంత సమయం కావాలన్నారు. అప్పటికి ఇంకా కలరా వ్యాధి బారినపడి మరి కొందరు పిల్లలు, యువకులు చనిపోవుచున్నారు. అప్పుడు గ్రామంలోని గిరిజన పెద్దలు నాంచారమ్మ చెప్పింది చెయ్యాలని నిర్ణయించుకున్నరు. అందులో ముఖ్యమైన వాడు భూక్యా సూర్య నాయక్ నాంచారమ్మను కలిసి గ్రామం పక్కన ఉన్న మా తాండాలో నువ్వు చెప్పినట్లూ చేస్తాం. రేపు రాత్రికి నువ్వు దగ్గరుండి ఆ కారిక్రమాన్ని జరిపించాలని అడిగిండు నాంచారమ్మను.
అన్నట్టు మరో రాత్రికి దగ్గరుండి ఆ కారిక్రమాన్ని జరిపించాలని నాంచారమ్మ తాండాలోకి సూర్య నాయక్ ఇంటికి వచ్చింది. ఆమే చెప్పినట్టు గోతిని ఆరు అడుగులు తవ్వుచున్నారు. బానోత్ హరిచంద్రు నాయక్, హీరానాయక్, మాన్ సింగ్ నాయక్, లాల్ సింగ్ నాయక్ (ఇందులో గూగులోతు వంశం వారు). మేకను పక్కన కట్టేసి ఉంది. పసుపు కుంకుమ ఉన్నాయి." నిండు గర్భవతి అయిన మహిళను తీసుకువచ్చారా" అని అడిగింది నాంచారమ్మ. "తీసుకువచ్చాం కానీ పక్కన ఇంట్లో ఉంది తీసుకురాగానే అరుస్తుంది ఆమేను సజీవంగా పాతి పెట్టేది ఆమెకు తెలియదని పనులు అయ్యాకా తీసుకువస్తాం ఆగమని" అన్నడు సూర్య నాయక్. ఆమే చెప్పినట్టు గోతిని ఆరు అడుగులు తోవ్వుడు అయిపోయింది.
పాతి పెట్టే మహిళను తీసుకురమ్మని చెప్పింది నాంచారమ్మ. తీసుకువస్తాం కాని ఏలా పడుకో పెట్టాలని అడిగాడు సూర్య నాయక్. "తూర్పుగా తల పెట్టించి వెళ్లకిలా పడుకో పెట్టాలని చెప్పింది నాంచారమ్మ. అర్ధం కావడం లేదు పాతి పెట్టే మహిళను తీసుకురాగానే అరుస్తుంది, ముందు ఏలా పడుకో పెట్టాలో చూపించు అని నాంచారమ్మను అడిగిండు సూర్య నాయక్. నాంచారమ్మ మెల్లిగా గోతిలోకి దిగి ఏలా పడుకో పెట్టాలో చూపిస్తూ పడుకుంది. సూర్య నాయక్ మట్టీ పోయాలని అరిచి చెప్పాడూ అక్కడ ఉన్న వారికి.... అప్పుడు అర్ధం అయింది నాంచారమ్మకు నేను నిండు గర్భవతి కధా పాతి పెట్టే మహిళను నేనే అని.
భూక్యా సూర్య నాయక్ నమ్మీంచి ఇంటికి వచ్చిన నిండు గర్భవతిని పాతి పెట్టీన మీ వంశం ఒక చెట్టుకు ఒకటీ, రెండు పిట్టల్లా(ఒక చోట కొన్నిమాత్రమే ఎక్కువ కుటుంబాలుగా ఒకే చోట ఉండలేరని) భూక్యా వంశాన్ని శపించింది. ఆమేకు అర్ధం అయింది ఈ గ్రామం నా బలిదానంతో "నాంచారి మడూగూర్"గా శాశ్వతంగా ఉంటుంది. ప్రతి ఏడూ "శ్రావణమాసం" (జూన్ - జూలై) లో ఏదో ఒకరోజులో ప్రతి గిరిజన తండాలో మేకలను బలి ఇవ్వాలని ఆ గ్రామంలోని అందరు గోతిని దాటినచో ఆ గ్రామంలో అందరు సుఖసంతోషాలతో ఉంటారని" చెప్పింది నాంచారమ్మ.
ఆ ఆనవాయితి గా "దాటుడూ పండుగ""శ్రావణమాసం" (జూన్ - జూలై) లో ఏదో ఒకరోజులో ప్రతి గిరిజన తండాలో మేకలను బలి ఇచ్చి పండుగ చేసుకుంటూన్నారు. మా గ్రామం పేరూ కాల గమనంలో నాంచారి మడూగూర్ కాస్తా నాంచారి మడూర్ అయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి