14, జులై 2017, శుక్రవారం

Rajiv Gandhi/రాజీవ్ గాంధీ/ राजीव गान्धी

రాజీవ్ గాంధీ

వికీపీడియా నుండి

రాజీవ్ గాంధీ
Rajiv Gandhi.gif
మాజీ ప్రధానమంత్రి
1944-1991
పదవీ కాలం
1984-1989
అంతకు ముందువారుఇందిరా గాంధీ
తరువాత వారువి.పి.సింగ్
నియోజకవర్గంఅమేథీ , ఉత్తరప్రదేశ్
వ్యక్తిగత వివరాలు
జననంఆగష్టు 20 , 1944
ముంబై , మహారాష్ట్ర
భారతదేశం భారత్
మరణంమే 21 , 1991
శ్రీపెరుంబుదూరు , తమిళనాడు
రాజకీయ పార్టీCongresssymbol.jpg భారత జాతీయ కాంగ్రెసు
భాగస్వామిసోనియా గాంధీ
సంతానంప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ
నివాసంన్యూ ఢిల్లీ
మతంహిందూ
As of జులై,31, 2008
రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 201944 – మే 211991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు.
రాజీవ్ గాంధీ హత్య, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని తమిళనాడు లోని చెన్నై సమీపంలో గల శ్రీపెరంబదూర్ లో ఎల్.టి.టి.ఇకి చెందిన ఆత్మాహుతి దళం మే 21 1991 న హత్య గావించింది. ఈ ఉదంతంలో సుమారు 14 మంది హతులైనారు.[1] ఈ హత్యకు ప్రధాన సూత్రధారి తెన్మోజి రాజరత్నం. ఈమె థానుగా పిలువబడుతుంది. ఈ హత్యోదంతానికి శ్రీలంక లోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్.టి.టి.ఈ) సంస్థ ప్రధాన కారకులు.[2][3]

విశేషాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

మాజీ ప్రదాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 1991 మే 21 వ తేదిన హత్య గావించాబడ్డారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మే 20 మధాహ్న సమయములో బయలుదేరి భువనేశ్వర్ మీదుగా, ఆంధ్రాప్రదేశ్ లోని కొన్ని నియోజకవర్గాలలో పర్యటించారు.
ఆయన పర్యటనకు వినియొగిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినప్పటికి చివరికి మరమత్తులు చేయించి సాయంత్రం 6.30ని,, వైజాగ్ నుంచి బయలుదేరి చెన్నై చేరుకొన్నారు. సాయంత్రం 8.30ని, లకు స్థానిక కాంగ్రెస్ నాయకురాలు మరకతం చంద్రశేఖర్ గారితో కలసి గ్రాండ్ వెస్ట్రన్ ట్రంక్ (GWT) రోడ్దు ఆలయప్రాంగణములో ఉన్న సభాప్రాంగణానికి చేరుకున్నారు.
విపరీతంగా వచ్చిన జనాన్ని కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు వి.ఐ.పి లను కట్టుదిట్టమైన భద్రత ద్వారా ఆయన్ని కలవటానికి అనుమతించారు.అయినప్పటికి రాజీవ్ గాంధీకి తన కూతురు పాట వినిపించాలని వచ్చిన, మరకతం చంద్రశేఖర్ కూతురు దగ్గర పని చేసే లతకణ్ణన్ అనుమతి పొందిన వారితో పాటుగాథాను, శివరాజన్, హరిబాబులు (దర్యప్తులో ముఖ్యమైన ముద్దాయిలు గుర్తించబడ్డారు) కూడా వెళ్ళారు.థాను రాజీవ్ గాంధీ కాళ్ళకు నమస్కారం చేయటానికి వంగి తన నడుముకు ఉన్న RDX ప్రయోగించింది.ఆ విధంగా రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డారు. ఈ చర్య విచరణ జరపడానికి డి.ఆర్.కార్తికేయన్ (ఐ.పి.ఎస్.) గారి అధ్యక్షతన సిట్ (Special Investigation Team) ను ఏర్పాటు చేశారు.ఈ కమిటి తన విచరణ హరిబాబు (ముద్దాయిలలో ఒకడు) తీసిన ఫొటొలు ఆధారంగా విచరణ ప్రారంభించారు. ఈ దర్యాప్తు బృంద విచారణ ప్రకారం ఈ హత్యలో భాగస్వామ్యులు అందరు LTTE (Liberation Tigers Of Tamil Eelam) కు చెందిన వారుగా గుర్తించింది.అంతేకాక వీరిలో కొందరి దగ్గర దొరికిన సమాచరం ప్రకారం వీరంత రాజీవ్ గాంధీ మీద విపరీతమైన ఆవేశంతో ఉన్నారు. దినికి కారణం శ్రీలంక భద్రత విషయములో జొక్యం చేసుకొని LTTE పై విరుచుకుపడ్డారు.అంతేకాక డి.ఎమ్.కె (DMK) పార్టీ LTTE సహాయపడుతుంది అని ఆ పార్టీ అధికరాన్ని రద్దు చేసి రాస్ట్రపతి పాలన విధించడం.అతి ముఖ్యమైన కారణం రాజివ్ గాంధీ మరల అధికారంలోకి వచ్చి మరల ప్రధానమంత్రి అవటం దాదాపు ఖరార్ అవ్వటం.మరల ఆయన ప్రధాని అయితే LTTE మనుగడ కష్టమని భావించడము. వీరు ముఖ్య ముద్దాయిలు శివరాజన్, శుభలను వీరు ప్రాణాలతో పట్టుకొనలేకపోయారు.[4]
ఐపీఎస్ అధికారి కార్తికేయన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిట్ హత్య జరిగిన ఏడాదిన్నర తర్వాత నివేదిక సమర్పించారు. 500 వీడియో క్యాసెట్లు, లక్ష ఫోటోగ్రాఫులను పరిశీలించి, వేలాదిమంది సాక్షుల్లో 1044 మంది సాక్షుల వాంగ్మూలాలను ఉదహరిస్తూ, 10వేల పేజీల వాంగ్మూలాలు, 1477 వస్తువులు, సాక్షులను కోర్టు ముందుంచి నివేదిక సమర్పించింది.
ఈ కేసును సుప్రీం కోర్ట్ ధర్మాసనం న్యాయమూర్తులు కె.పిథమస్, ది.పి.వాధ్వా, సయ్యద్ షా మొహమ్మద్ ఖ్వాద్రిల ఆధ్వర్యంలో నాలుగు మాసాలు చర్చ అనంతరం 1995 మే 5 న తుది తీర్పుగా కొందరు ముద్దాయిలకు ఉరి శిక్ష, మరి కొందరిని జీవిత ఖైదు విధిస్తు ఇది ఉగ్రవాద చర్య కాదు అని అభిప్రాయపడింది.

Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి