కొండా సురేఖ | |
---|---|
నియోజకవర్గం | పరకాల అసెంబ్లీ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 19 ఆగస్టు 1965 ఊకల్ |
రాజకీయ పార్టీ | TRS తెలంగాణ రాష్ట్ర సమితి |
నివాసం | వంచనగిరి |
విషయ సూచిక
జీవిత విశేషాలు
ఆమె వరంగల్ జిల్లాకు చెందిన ఊకల్ లో 19 ఆగస్టు 1964 తుమ్మ చంద్రమౌళి రాద దంపతులకు జన్మించారు.
రాజకీయ జీవితం
ఆమె 1955లో మండల పరిషత్ కు ఎన్నికైనారు. 1996లో ఆమె ఆంధ్రప్రదేశ్ పి.సి.సి సభ్యురాలిగా నియమింపబడ్డారు. 1999 లో ఆమె శాయంపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. 1999 లో ఆమె కాంగ్రెస్ లెసిస్లేచర్ పార్టీ కోశాధికారిగానూ, మహిళ మరియు శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగానూ, ఆరోగ్య మరియు ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు.ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా 2000లో నియమింపబడ్డారు.
2004లో శాయంపేట శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైనారు. 2005లో ఆమె మ్యునిసిపల్ కార్పొరేషన్ కు ఎక్స్ అఫీసియో సభ్యురాలిగా ఉన్నారు. 2009 లో పరకాల శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు.
ఆమె వై.యస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆమె మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా కూడా పనిచేసారు. కానీ రాజశేఖరరెడ్డిమరణం తరువాత ఆయన కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి అత్యధిక మెజారీటీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం యివ్వనందున ఆ పదవికి రాజీనామా చేసారు.
జగన్మోహనరెడ్డి కారణంగానూ మరియు రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చడం మూలంగానూ ఆమె జూలై 4 2011 న తన శాసన సభ్య సభ్యత్వానికి రాజీనామా చేసారు.
ఆమె జూన్ 12,2012 న మరల జరిగిన ఉప ఎన్నికలలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో యై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసారు.
జగన్మోహనరెడ్డి పార్టీ సభ్యుల మూలంగా ఆమె జూలై 2913 న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా ఎన్నికైనారు.
వ్యక్తిగత జీవితం
ఆమె వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్రసమితి ఎం.ఎల్.సి అయిన కొండా మురళి ని వివాహమాడారు.[7] వారికి ఒక కుమార్తె శ్రీమతి సుస్మిత పటేల్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి