ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్
చైనా అని సాధారణంగా పిలువబడే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి.[16] 130 కోట్ల (1.3బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉంది. చైనారాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై (shangai).చైనా ఏక పార్టీ పాలిత దేశం.[17] చైనాలో 22 భూభాగాలు ఉన్నాయి., వీటిలో 5 స్వయం ప్రతిపత్తి (అటానిమస్) కలిగిన భూభాగాలు, నాలుగు డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీలు (బీజింగ్, తియాజిన్, షాంగై మరియు చాంగ్క్వింగ్), రెండు స్వయంపాలిత భూభాగాలు (హాంగ్‌కాంగ్ మరియు మాకౌ) ఉన్నాయి. పి.ఆర్.సిలో ఉన్న ఫ్రీ ఏరియా ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగాలను రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో ఉన్నాయి. తైవాన్, కిన్మెన్, మత్సు, ఫ్యూజియన్ మరియు దక్షిణాసియా అధీనంలో ఉన్న ద్వీపాలు రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది.
భౌగోళికం
9.6 మిలియన్ల వైశాల్యంతో చైనా వైశాల్యపరంగా ఆసియాలో రెండవ స్థానంలో ఉంది.[19] చైనా భౌగోళికంగా విస్తారమైన మరియు వైవిధ్యంగా ఉంటుంది. మంగోలియన్ మంచూరియన్ సోపాన అరణ్యాలు (స్టెప్ ఫారెస్ట్) మరియు గోబీ ఎడారి మరియు తక్లమకన్ ఎడారి, ఉత్తరంలో ఉన్న ఉప ఉష్ణమండల అరణ్యాలు ఉన్నాయి. హిమాలయ, కరకొరం, పామిర్ పర్వతాలు మరియు తియాన్ షాన్ పర్వతావళి (ఇవి చైనాను దక్షిణాసియా మరియు మధ్య ఆసియా నుండి వేరుచేస్తున్నాయి) ఉన్నాయి. టిబెట్ నుండి ప్రవహిస్తున్న యాంగ్త్జె నది మరియు ఎల్లో నది (ప్రపంచంలో ఆరవ పెద్దనది) ఉన్నాయి. పసిఫిక్ సముద్రతీరంలో ఉన్న చైనా సముద్రతీరం పొడవు 4,500 కి.మీ. సముద్రతీరం వెంట బొహై సముద్రం, యెల్లో సముద్రం, తూర్పు చైనా సముద్రం మరియు దక్షిణ చైనా సముద్రం ఉన్నాయి.
సంస్కృతి
చైనా సంస్కృతి అతి పురాతనమైనది. చైనా ప్రపంచపు పురాతనమైనది. ఉత్తర చైనా మైదానాన్ని పచ్చ నది ఫలవంతం చేస్తుంది. చైనా రాజకీయ చరిత్రలో వంశపారంపర్య రాజవంశాలు ఉన్నాయి. ఆరంభకాలంలో క్రీ.పూ 2800 లో పచ్చ నదీతీరంలో సెమీ మిథలాజికల్ రాజవంశం పాలించింది. క్రీ.పూ 221 నుండి క్విన్ రాజవంశం చైనాలోని పలుప్రాంతాలను స్వాధీనపరచుకుంది. తరువాత రాజ్యం విస్తరించబడి పలుమార్లు సంస్కరించబడింది. 1911 లో క్విన్ సామ్రాజ్యాన్ని త్రోసివేసి చైనా రిపబ్లిక్ (1912-1949) అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్లొంగిపోయిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ చైనా ప్రధాన భూభాగంలోని కుయోమింతాంగ్‌ను ఓడించి 1948 అక్టోబరు 1న రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించించింది. క్యుమింతాంగ్ తిరిగి ప్రస్తుత తైపే వద్ద రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైనా సంక్లిష్టమైన, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగి ఉంది.[20][21] 1978లో చైనాలో ఆర్థిక సంస్కరణలు జరిగినప్పటి నుండి, అతివేగంగా జి.డి.పి. అభివృద్ధి చేసిన దేశాలలో ఒకటిగా చైనా గుర్తింపు పొందింది. 2014గణాంకాలను అనుసరించి నామినల్ జి.డి.పి. అభివృద్ధిలో చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది. అతిపెద్ద మొత్తంలో సరుకులను ఎగుమతి చేసే దేశాలలో చైనా రెండవస్థానంలో ఉంది.[22] అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలలో చైనా ఒకటి. అత్యధిక సంఖ్యలో సైనిక బృందాలను కలిగి ఉన్న దేశాలలో కూడా చైనా ఒకటి.[23][24]1971 నుండి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పి.ఆర్.సి) ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కలిగి ఉంది. చైనా, వరల్డ్ ట్రేడ్ ఆర్త్గనైజేషన్, ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కార్పొరేషన్, బి.ఆర్.ఐ.సి.ఎస్, ది షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్, ది బి.సి.ఐ.ఎం, మరియు జి-20 మేజర్ ఎకనమీస్ వంటి పలు ఫార్మల్ మరియు ఇంఫార్మల్ బహుళజాతి సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది. చైనా గొప్పశక్తిగా, అలాగే ఆసియాలో అతిపెద్ద శక్తిగా గుర్తించబడుతోంది. విమర్శకులు చైనా అపార సామర్థ్యం గల దేశంగా అవతరించగలదని భావిస్తున్నారు.[25][26]
భాష
గడులు.. గీతలు.. బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా,సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వారు ఈ భాషను 'మండారిన్' అని పిలుస్తారు. అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు 56,000 గుర్తులు (కేరక్టర్లు) ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా మాత్రం 3,000 గుర్తులు వాడతారు. ఇవి వస్తే 99 శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే. చైనా అక్షరాలు రాయడానికి కనీసం 1 నుంచి గరిష్ఠంగా 64 గీతలు గీయాల్సిఉంటుంది![27]
చరిత్ర
ప్రధాన వ్యాసం: చైనా చరిత్ర
చరిత్రకాలానికి ముందు
పురాతత్వ పరిశోధకులు ఆరంభకాల హోమినీడ్లు 2,50,000 మరియు 2.24 మిలియన్ సంవత్సరాల ముందు చైనాలో నివసించారని భావిస్తున్నారు.[29] జౌకౌడియన్ (ప్రస్తుత బీజింగ్) లోని ఒక గుహలో క్రీ.పూ 6,80,000 - 7,80,000 మద్య నివసించిన హోమినీడ్ శిలాజాలు లభించాయి. [30] పీకింగ్ మాన్ హోమో ఎరెక్టస్‌కు (మొదటిసారిగా అగ్నిని ఉపయోగించిన మానవుడు) ఒక ఉదాహరణ.[31] పీకింగ్ మాన్ ప్రదేశంలో 18,000-11,000 హోమో సాపైంస్ కాలానికి చెందిన అవశేషాలు కూడా లభించాయి.[32] క్రీ.పూ 7,000 కాలానికి ముందు నుండి ప్రోటో- రైటింగ్ ఉనికిలో ఉందని తెలుస్తుంది.[33] దామెయిడ్ సమీపంలో 5,800-5,400 కాలానికి చెందిన దడివాన్ సంస్కృతి మరియు 5 మిలియన్ల సంవత్సరాలకు ముందు నాటి బొంపొ సంస్కృతి విలసిల్లిందని తెలుస్తుంది.[34].కొంతమంది పరిశోధకులు క్రీ.పూ 7 మిలియన్ సంవత్సరాలకు ముందున్న జైహూ చిహ్నాలు అతిపురాతనమైనవని భావిస్తున్నారు.[33]
Early dynastic rule
చైనా సంప్రదాయం అనుసరించి క్రీ.పూ 2100 సంవత్సరాలకు చెందిన క్సియా రాజవంశం చైనాను పాలించిన మొదటి రాజవంశంగా భావిస్తున్నారు. [35] 1959లో హెనన్‌లో ఎర్లిటౌ సంస్కృతికి చెందిన కాంస్య యుగం (బ్రోంజ్ ఏజ్) నాటి అవశేషాలను పరిశోధించిన చరిత్రకారులు ఇది పురాణకాలానికి చెందిన సామ్రాజ్యం అని భావిస్తున్నారు.[36] ఇది నిరూపితం చేయబడకుండా ఉంది. ఈ ప్రాంతం క్సియా సామ్రాజ్యంలోనిదై ఉండాలి లేక సమకాలీన మరొక సంస్కృతికి చెందినదని భావిస్తున్నారు.[37] తరువాత షాంగ్ వంశం గురించి సమకాలీన రికార్డుల ద్వారా లభించిన సమాచారం నమోదైన సమాచారంలో ఆరంభకాలం నాటిదని భావిస్తున్నారు.[38] షంగ్ రాజవంశం తూర్పు చైనాలోని యెల్లోనదీ మైదానాన్ని క్రీ.పూ 11- 7శతాబ్ధాలలో పాలించారు.[39] షంగ్ రాజవంశానికి చెందిన ఒరాకిల్ బోన్ స్క్రిప్ట్ (ఒరాకిల్ ఎముకల వ్రాత) (క్రీ.పూ 1200) [40] మరియు ఆధునిక చైనా లిపిసంబంధిత పూర్వీకుల వ్రాతలు లభించాయి.[41]
ఝౌ వంశం
షంగ్ వంశం మీద విజయం సాధించి ఝౌ రాజవంశం క్రీ.పూ 7-5 శతాబ్ధాల మధ్య పాలన సాగించింది. క్రమంగా భూస్వాములు రాజ్యపాలన చేపట్టారు. ఝౌ వంశం బలహినపడిన తరువాత పలు స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. తరువాత వసంతం మరియు హేంతకాలాలో రాజ్యాలమధ్య 300 సంవత్సరాల కాలం నిరంతర యుద్ధాలు సాగాయి. తరువాత క్రీ.పూ 5-3 శతాబ్ధాల కాలంలో సాగించిన యుద్ధాల మధ్య 7 శక్తివంతమైన రాజ్యాలు అవతరించాయి. ఈ రాజ్యాలకు ప్రత్యేకంగా రాజు, మంత్రివర్గం మరియు సైన్యం ఉన్నాయి.
Imperial China
క్రీ.పూ 221 నాటికి క్విన్ రాజవంశం ఇతర ఆరు రాజ్యాల మీద విజయం సాధించిన తరువాత రాజ్యాలమధ్య యుద్ధాలకు ముగింపు లభించింది. తరువాత మొదటి సమైక్య చైనా సామ్రాజ్యం అవతరించింది. క్విన్ షి హంగ్ తనకు తానే మొదటి క్విన్ చక్రవర్తిగా ప్రకటించికుని చైనా అంతటా సంస్కరణలు చేపట్టాడు. సంస్కరణలలో చైనీస్ భాషను ప్రవేశపెట్టడం, కొలతలు, కొలపరిమాణాలు, కరెంసీ మరియు బండి ఇరుసుల పొడవు నిర్ణయించడం మొదలైనవి ప్రధానమైనవి. తరువాత 15 సంవత్సరాలకు క్విన్ షి హంగ్ మరణం తరువాత క్విన్ రాజవంశం అధికారం కోల్పోయింది. తరువాత అథోరిటేరియన్ పోలీస్ నాయకత్వంలో రాజ్యమంతటా తిరుగుబాటు తలెత్తింది. .[42][43]
హాన్ రాజవంశం
తరువత క్రి.పూ 206 నుండి క్రీ.శ 220 వరకు పాలించిన హాన్ రాజవంశం సంస్కృతి ప్రజలలో వ్యాపించి ప్రస్తుత కాలం వరకు నిలిచి ఉంది. [42][43] హాన్ వంశం పాలనలో దక్షిణ కొరియా, వుయత్నాం, మంగోలియా మరియు మధ్య ఆసియా ప్రాంతాలలో సైనిక చర్యలు కలహాలు అధికరించాయి. అలాగే మధ్య ఆసియాలో సిల్క్ రోడ్డు స్థాపనకూడా సాధ్యం అయింది. పురాతన ప్రపంచంలో హాన్ చైనా అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉండేది. [44] హాన్ రాజకుటుంబీకులు ఆచరించిన కంఫ్యూషియనిజం ప్రజలలో ప్రాచుర్యం పొదింది. క్విన్ చట్టాలు, అధికారిక నియమాలను వదిలి హాన్ సరికొత్త పాలనా విధానాలను ప్రవేశపెట్టింది. [45]
హాన్ పాలన తరువాత
హాన్ పాలన ముగింపుకు వచ్చిన తరువత ప్రజలలో ఐకమత్యం విచ్ఛిన్నమై సరికొత్తగా మూడు రాజ్యాలు అవతరుంచాయి.[46] క్రీ.శ 581లో చైనా సుయీ రాజవంశం నాయకత్వంలో సమైక్యపరచబడింది. గొగుర్యేవో - సుయీ యుద్ధాలలో [[క్రీ.శ్ 598-614) సుయీ ఓడిపోవడంతో సుయీ పాలన ముగింపుకు వచ్చింది.[47][48] తరువాత తంగ్ మరియు సాంగ్ రాజవంశాలు, చైనా సాంకేతికం మరియు సంస్కృతి స్వర్ణయుగంలో ప్రవేశించింది.[49] 8వ శతాబ్ధంలో ఆన్ షి తిరుగుబాటు దేశాన్ని వినాశనం చేయడమే కాక సామ్రాజ్యాన్ని బలహీనపరచింది.[50]ప్రపంచంలో పేపర్ కరెంసీ ప్రవేశపెట్టిన మొదటి ప్రభుత్వంగా సాంగ్ సామ్రాజ్యం ప్రత్యేకత సంతరించుకుంది. .[51] 10-11 శతాబ్ధాలలో చైనా ప్రజల సంఖ్య రెట్టింపై 100 మిలియన్లు చేరుకుంది. మధ్య మరియు దక్షిణ చైనాలో వరిపంట అధికరించడం మరియు ప్రజలకు విస్తారంగా ఆహారం లభించడం జనసంఖ్య అధికరించడానికి కారణాలలో ఒకటి అయింది. సాంగ్ పాలనలో తత్వశాస్త్రం మరియు కళలు వర్ధిల్లాయి. ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ, పోట్రెయిట్ కొత్త స్థాయికి చేరుకుని పక్వం మరియు సరికొత్త సమీకరణ సాధించాయి.[52] ప్రజలు కళాఖాండాలను దర్శించడం వారి కళాఖాండాలను వ్యాపారదృష్టితో పరిశీలించడం ఆరంభం అయింది.సాంగ్ పాలనా కాలంలో నియో కంఫ్యూషియనిజం మరియు తాంగ్ పాలనలో బుద్ధిజం ప్రాబల్యత సంతరించుకున్నాయి.[53]
మంగోల్ దండయాత్ర
13వ శతాబ్ధంలో చైనాను మంగోల్ సామ్రాజ్యవాదుల దాడికి గురైంది. 1271 నాటికి మంగోల్ వీరుడు కుబ్లైఖాన్ యువాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1279లో యువాన్ శేధభాగాన్ని అంతటినీ జయించింది. మంగోల్ దండయాత్రకు ముందు చైనా పౌరుల సంఖ్య 120 మిలియన్లు అయింది. 1300 నాటికి గణాంకాలు చైనా పౌరుల సంఖ్యను 60 మిలియన్లుగా నమోదు చేసింది. [54] ఝుయువాన్ జంగ్ అనే కర్షకుడు 1368లోయువాన్ సామ్రాజ్యాన్ని త్రోసి మింగ్ సామ్రాజ్య స్థాపన చేసాడు. మింగ్ పాలనలో చైనా మరొక స్వర్ణయుగాన్ని చూసింది. ఆ సమయంలో చైనా ప్రపంచంలో శక్తివంతమైన నౌకానిర్మాణం చేసింది. చైనా ఆసమయంలో కళలు మరియు సంస్కృతి అభివృద్ధితో సంపన్నమైన ఆర్థికవ్యవస్థను కలిగి ఉండేది. జంగ్ హీ నాయకత్వంలో ప్రపంచదేశాలన్నింటినీ చైనీయులు అన్వేషణ సాగించారు.[55] మింగ్ సామ్రాజ్యం ఆరంభంలో నైనా రాజధాని నాంజింగ్ నుండి బీజింగ్‌కు తరకించబడింది.మింగ్ పాలనా కాలంలోవాంగ్ యాంగ్ మింగ్ మొదలైన తత్వవేత్తలు కొంత విమర్శకు గురైయ్యారు.నియో కంఫ్యూషియనిజం వ్యక్తిత్వవాదం మరియు నైతికవాదంతో మరింత విస్తరించింది..[56]
సమైఖ్య తిరుగుబాటు దళాలు
1644లో బీజింగ్ సమైక్య తిరుగుబాటు దళాల వశం అయింది. తిరుగుబాటు దళాలకు మింగ్ యువ అధికారి నాయకత్వం వహించాడు. చివరి మింగ్ చక్రవర్తి చాంగ్ ఝెన్ చక్రవర్తి నగరం స్వాధీనం చేసుకున్న తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. మంచు క్విన్ సామ్రాజ్య సైనికాధికారి వూ సంగూ స్వల్పకాల పాలన చేసిన షన్ రాజవంశానికి చెందిన లీని తొలగించి బీజింగ్‌ను స్వాధీనం చేసుకుని మింగ్ రాజధానిని చేసుకుని పాలన సాగించాడు.
End of dynastic rule
చైనలో చివరి రాజరిక వ్యవస్థ 1644లో ఆరంభమై 1912తోకొసనసాగింది. విజయవంతం అయిన సామ్రాజ్యంగా క్వింగ్ పాలనలో క్వింగ్ వ్యతిరేకత, హైజిన్ (సముద్ర నిషేధం) మరియు సిద్ధాంతిక సాహిత్య విచారణ మొదలైనవి నిరంకుశ అణిచివేతకు గురైయ్యాయి.[57][58] 19వ శతాబ్ధంలో చైనా పశ్చిమ సామ్రాజ్యవాద దాడులను అనుభవించింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ తో మొదటి ఓపియం యుద్ధం (1838-42) మరియు రెండవ ఓపియం యుద్ధం తరువాత చైనా అసంబద్ధమైన ఒప్పందాలలో సంతకం చేయడం, నష్టపరిహారం చెల్లించడం, విదేశాలకు అదనపు భూభాగం ఇవ్వడం మరియు హాంగ్ కాంగ్‌ను బ్రిటన్‌కు వదలడం మొదలైనవి రాజరిక వ్యవస్థను దెబ్బతీసాయి.[59] 1842లో నాన్‌కింగ్ ఒప్పందం, 1894- 95 మొదటి జపాన్- సీనో యుద్ధం కొరియన్ ద్వీపకల్పంలో క్వింగ్ రాజరిక వ్యవస్థా ప్రాబల్యాన్ని తగ్గించాయి. అలాగే తైవాన్ జపాన్ స్వతంత్రంగా వ్యవహరించడం ఆరంభం అయింది.[60]
క్వింగ్ రాజవంశం
1850 - 1860 మద్య కాలంలో క్వింగ్ మిలియన్ల ప్రజల మరణానికి కారణం అయిన రాజ్యాంగ అశాంతికి, దక్షిణ చైనాను కదిలించిన విఫలమైన తైపింగ్ తిరుగుబాటుకు సాక్ష్యంగా నిలిచింది. పుంటి హక్కా క్లాన్ యుద్ధాలు (1855-67), నిజాన్ తిరుగుబాటు (1851- 78), మియో తిరుగుబాటు (1854- 73), పంతే తిరుగుబాటు (1856-73) మరియు దుంగన్ తిరుగుబాటు (1862-77), విజయవంతం అయిన 1860 స్వశక్తి ఉద్యమం 1880-1890 లమద్య వరుస సైనిక చర్యలతో అణిచివేయబడ్డాయి.
చైనీస్ వలసలు
19వ శతాబ్ధంలో సంభవించిన ఉత్తర చైనా కరువు (నార్తెన్ చైనా ఫామైన్ 1876-79) వంటి ఉపద్రవంలో 9-13 మిలియన్ల మంది ప్రజల మరణానికి గురైయ్యారు. నష్టాలు ఉపద్రవల కారణంగా చైనీయులలో పెద్ద ఎత్తున వలసలు ప్రారంభం అయ్యాయి. దీనిని గొప్ప చైనా వససలుగా వర్ణించారు.[61] 1898లో ఆధునిక రాజ్యాంగ స్థాపన కొరకు గంగ్సు చక్రవర్తిచే వందరోజుల సంస్కరణలు చేపట్టబడ్డాయి. ఈ సస్కరణలను చక్రవర్తిని డోవాగర్ సిక్స్ చేత నిరోధించబడ్డాయి. యాంటీ వెస్టర్న్ బాక్సర్ రిబెల్లియన్ (1899-1901) కారణంగా సామ్రాజ్యం మరింత బలహీనపడింది. చక్రవర్తిని డొవాగర్ సిక్స్ పలు ప్రతిష్ఠత్మకమైన సంస్కరణలు చేపట్టినప్పటికీ 1911-12లో క్వింగ్ సామ్రాజ్యం అంతరించింది. తరువాత రిపబ్లిక్ ఆఫ్ చైనా (1912-49) అవతరించింది.
Republic of China (1912–49)
1912 జనవరి 1 రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడింది.క్యూమింతాంగ్‌కు చెందిన సన్-యాత్-సెన్ (నేషనలిస్ట్ పార్టీ) అధ్యక్షునిగా నియమించబడ్డాడు. [62] అయినప్పటికీ తరువాత అధ్యక్షపదవి పూర్వపు క్వింగ్ జనరల్‌కు యుయాన్ షికైకు ఇవ్వబడింది. యువాన్ షికై 1915 లో తననుతాను చైనాచక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తరువాత ఆయన స్వంతసైన్యం వ్యతిరేకత మరియు ప్రముఖులఖండన సింహాసనాన్ని వదిలి తిరిగి రిపబ్లిక్ స్థాపించవలసిన పరిస్థితి ఎఉదురైంది.[63]
షికై మరణం తరువాత
1916లో చైనా రాజకీయంగా విభజనకు గురైంది. చైనా బీజ్ంగ్ ఆధారిత ప్రభుత్వం అధికారంలో తక్కువగా ఉన్నా అంతర్జాతీయ గుర్తింపును కలిగి ఉంది. చైనాలోని అత్యధికభూభాన్ని ప్రాంతీయ యుద్ధవీరుల హస్థగతం అయింది.[64][65] 1920లో క్యూమింతాంగ్ " నార్తెన్ ఎక్స్పెడిషన్ " పేరిట దేశాన్ని తిరిగి సమైక్యం చేసాడు.[66][67] క్యూమింతాంగ్ దేశరాజధానిని నాంజింగ్‌కు తరలించాడు. క్యూమింతాంగ్ యాత్-సెన్- డాక్టరిన్ పేరిట రాజకీయ శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టి చైనాను ఆధునిక ప్రజాపాలనకు తీసుకువచ్చాడు.
రెండవ సినో - జపాన్ యుద్ధం
1937-1945 జరిగిన సినో- జపాన్ యుద్ధం క్యుమింతాంగ్ మరియు కమ్యూనిస్ట్ పార్టీలమద్య అసౌకర్యమైన కూటమి కలగడానికి దారితీసింది. జపాన్ సైన్యం చైనాపౌరులకు వ్యతిరేకంగా పలు యుద్ధనేరాలు మరియు దారుణాలకు పాల్పడింది. యుద్ధం మిలియన్లకొద్దీ చైనాపౌరుల మరణానికి సాక్ష్యంగా నిలిచింది.[71]జపాన్ ఆక్రమణ సమయంలోనాంజింగ్‌లో మాత్రమే 2,00,000 మంది చైనీయులు మూకుమ్మడి హత్యలకు గురైయ్యారు.[72] యుద్ధసమయంలో చైనా, యు.కె యు.ఎస్ మరియు సోవియట్ యూనియన్‌లను " ట్రూస్టిప్ ఆఫ్ ది పవర్ఫుల్ " అని [73] మరియు ఐక్యరాజ్యసమితి చేత " బిగ్ ఫోర్ "గా అభివర్ణించబడింది.[74][75] రెండవ ప్రపంచ యుద్ధంలో కూటని దేశాలలో చైనా మిగిలిన మూడు దేశాలతో కలిసి " ఫోర్ పోలీస్ మెన్ " అని వర్ణించబడింది. రెండవ ప్రపంచయుద్ధంలో విజయం సాధించిన దేశాలలో చైనా కూడా ఒకటిగా పరిగణించబడింది.[76][77] 1945లోజపాన్ లొంగిపోయిన తరువాత పెస్కడోర్స్‌తో చేర్చిన తైవాన్ తిరిగి చైనావశం చేయబడింది. చైనా విజయం సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచినప్పటికీ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం వలన కలుగిన నష్టాలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. క్యూమింతాంగ్ మరియు మద్య అవిశ్వాసం కొనసాగడం 1947 అంతర్యుద్ధానికి దారితీసింది. రాజ్యంగం తిరిగి పునఃస్థాపితం చేయబడింది. యుద్ధానంతర పరిణామాలు రిపబ్లిక్ ఆఫ్ చైనా అంతటా అశాంతి నెలకొనడానికి దారితీసాయి.[78]
People's Republic of China (1949–present)
1948లో చైనా అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ చైనాలోని అత్యధికమైన భూభాగాన్ని వశపరచుకున్నది. క్యూమింతాంగ్ దేశం విడిచి పారిపోయాడు. రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారం తైవాన్, హైనాన్ మరియు సమీపంలో ఉన్న ద్వీపాలకు పరిమితం అయింది. కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ మావో జెడాంగ్ " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" స్థాపన చేసినట్లు ప్రకటించాడు. [79]1950లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హైనాన్‌లో నిలిచి రిపబ్లిక్ నుండి భూభాగాలను వేరుచేయడానికి మరియు టిబెట్ను ఆక్రమించడానికి ప్రయత్నించింది.
మావో పాలన
మావో పాలనలో 1-2 మిలియన్ల భూస్వాములను హతమార్చి చేపట్టబడిన వ్యవసాయసంస్కరణలు కర్షకుల ఆదరణను పొందాయి.[83] మావో నాయకత్వంలో చైనా స్వతంత్ర పారిశ్రామిక ఆధారితమైన ఆర్ధికవ్యవస్థను మరియు అణ్వాయుధ సంపత్తిని సాధించింది. [84] తరువాత చైనా పౌరుల సంఖ్య 550 నుండి 900 ల మిలియన్లకు చేరుకుంది.[85] మావో ఆర్ధిక మరియు సాంఘిక సంస్కరణల చేసినప్పటికీ " గ్రేట్ చైనీస్ ఫామైన్ "గా వర్ణించబడిన కరువు సమయంలో 45 మిలియన్ల మరణాలు సంభవించాయి. 1958-1961 మద్య సాగిన కరువులో మిలియన్లకొద్దీ ప్రజలు ఆకలితో మరణించారు.[86] 1966లో మావో కూటమి ఆరంభించిన సస్కృతిక విప్లవం రాజకీయ ప్రతీకారం మరియు సాంఘిక తిరుగుబాటుకు దారితీసింది. ఈ సంఘర్షణలు 1976లో మావో మరణంతో ముగింపుకు వచ్చాయి.[87]
సాంస్కృతిక విప్లవం
మావో మరణం తరువాత డెంగ్ క్సియోపింగ్ అధికారం చేపట్టి ఆర్ధిక సంస్కరణలు చేసాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తరువాత చైనా సోషలిజ ఆధారిత ప్రత్యేకమైన స్వంత పాలనావిధానం ఏర్పాటు చేసుకుంది.[88] 1982లో చైనాలో ప్రస్తుత రాజ్యాంగవిధానం ప్రవేశపెట్టబడింది. 1989లో తైనాన్మెన్ స్క్వేర్ నినాదాలు నిరంకుశంగా అణిచివేయబడ్డాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవిమర్శలకు దారితీసి పలుదేశాలు చైనా ప్రభుత్వానికి వ్యతురేకంగా వైవిధ్యమైన నిర్ణయాలు తీసుకున్నాయి.[89]
జైగ్ జెమిన్ - లి పెంగ్ మరియు రోంగ్
1990లో దేశరాజకీయాలకు జియాంగ్ జెమిన్, లీ పెంగ్ మరియు ఝు రాంగ్జి నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో చైనా 150 మిలియన్ల వ్యవసాయదారుల ఆర్ధికపరిస్థితి మెరుగై బీదరికం నుండి వారు వెలుపలికి వచ్చారు. అలాగే చైనా జి.డి.పి 11.2% అభివృద్ధి చెందింది.[90][91]2000లో హూ జింటో మరియు వెన్ జింటో ఆధ్వర్యంలో ఆర్ధికాభివృద్ధి సాధించింది. 2001లో చైనా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " భాగస్వామ్యం వహించింది. చైనాపౌరుల జీవనస్థితి వేగవంతంగా అభివృద్ధిదశలో ముందుకుసాగింది. అయినప్పటికీ కేంద్రీకృతమైన రాజకీయాధికారం శక్తివంతంగా మారింది. [96] 2012 లోవాంగ్ లిజున్ సంభవం తరువాత దశాబ్ధకాల కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మార్పులు సంభవించాయి.[97] 18వ కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో క్సి జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీగా హ్యూజింటోని నియమించాడు.[98][99] క్సి జింపింగ్ నాయకత్వంలో చైనాప్రభుత్వం ఆర్థికసంస్కరణలను చేపట్టింది.[100][101] ఆర్థిక సంస్కరణలు నిర్మాణాత్మక అస్థిరత మరియు అభివృద్ధి మాంధ్యానికి దారితీసాయి. క్సి-లి నాయకత్వం సంస్కరణలలో ఒకే ఒక బిడ్డ మరియు ఖైదు విధానాన్ని ప్రవేశపెట్టింది.[106]
Geography
Political geography
ప్రపంచదేశాలలో భూవైశాల్యపరంగా చైనా రెండవ స్థానంలో ఉంది.[107]మొదటిస్థానంలో రష్యా ఉంది. అయినా భూభాగం మరియు జలభాగం కలిసిన వైశాల్యపరంగా చైనా మూడు లేక నాల్గవస్థానంలో ఉంది. రష్యా,కెనడా మరియు అమెరికాసమ్యుక్తరాష్ట్రాల మొత్తం వైశాల్యం మొదటి మూడుస్థానాలలో ఉందని భావిస్తున్నారు. [lower-alpha 9] చైనా మొత్తం వైశాల్యం 96,00,000 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 9,600,000 km2 (3,700,000 sq mi).[108] ఇది ఎంసైక్లోపీడియా బ్రిటానికా అంచనా అనుసరించి 95,72,900 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 9,572,900 km2 (3,696,100 sq mi) [109] ఐక్యరాజ్యసమితి ఇయర్ బుక్ అనుసరించి 9596961చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 9,596,961 km2 (3,705,407 sq mi),[6] సి.ఐ.ఎ వరల్డ్ బుక్ అంచనా అనుసరించి 9596961 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 9,596,961 km2 (3,705,407 sq mi) [8] చైనాలోని యాలు ముఖద్వారం నుండి గల్ఫ్ ఆఫ్ తొంకిన్ మద్యదూరం 22117 కి.మీ ఉంటుందని అంచనా. 22,117 km (13,743 mi) .[8] చైనా సరిహద్దు దేశాల సంఖ్య రష్యా కాక 14 ఉన్నాయి.[110] చైనా తూర్పు ఆసియా వరకు విస్తరించి ఉంది. చైనా సరిహద్దులో వియత్నాం, లావోస్ మరియు బర్మాదేశాలు మరియు ఆగ్నేయ ఆసియాదేశాలైన భారతదేశం, భూటాన్, నేపాల్మరియు పాకిస్థాన్ ఉన్నాయి. [lower-alpha 10] దక్షిణాసియా దేశాలైనఆఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్, కిర్గిజికిస్థాన్ ఉన్నాయి. మద్య ఆసియాదేశాలైనరష్యా, మంగోలియా మరియు ఉత్తర కొరియా ఉన్నాయి. అదనంగా చైనా సముద్రసరిహద్దులలో జపాన్, వియత్నాం, ఫిలిప్పైంస్ మరియు దక్షిణ కొరియా ఉన్నాయి.
Landscape and climate
చైనా 18° నుండి 54° ఉత్తర అక్షాంశం మరియు 73° నుండి 135° తూర్పు రేఖాంశంలో ఉంది. తూర్పున యెల్లో సీ మరియు తూర్పుచైనా సీ సారవంతమైన మైదానాలతో నిండి జసాంధ్రత అధికంగా కలిగి ఉంది. ఉత్తరంలో మంగోలియన్ మైదానం పచ్చికబయళ్ళతో పచ్చగా ఉంటుంది. దక్షిణచైనా పర్వతప్రాంతం మరియు దిగువ పర్వతావళి అత్యధికంగా ఉంటుంది. మద్య తూర్పు ప్రాంతం చైనాలోని యెల్లోనదీమైదానం మరియు యంగ్త్జె అనే రెండు నదీమైదానాల మద్యఉంటుంది. అదనంగా చైనాలో క్సి, మెకాంగ్, బ్రహ్మపుత్ర మరియు అమూర్ నదులు ప్రవహిస్తున్నాయి. పశ్చిమంలో హిమాలయ పర్వతశ్రేణి ఉంటుంది. ఉత్తర చైనాలో తక్లమకన్ ఎడారి మరియు గోబీ ఎడారి ఉన్నాయి. చైనా నేపాల్ సరిహద్దులో ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా గుర్తించబడుతున్న ఎవెరెస్ట్ శిఖరం (సముద్రమట్టానికి 8,848 మీ) ఉంది.[111] చైనాలోని అత్యంత దిగువ ప్రాంతంలోని తుర్పాన్ డిప్రెషన్‌లో ఉన్న అయిడింగ్ సరసు (సముద్రమట్టానికి -15 మీ దిగువన ఉంది) ప్రంపంచంలో అత్యంత దిగువన ఉన్న ప్రాంతాలలో మూడవ స్థానంలో ఉందని గుర్తించబడుతుంది.[112] చైనా వాతావరణాన్ని డ్రై సీజన్ మరియు వెట్ మాంసూన్ ఆధిక్యత చేస్తుంది. అది శీతాకాలం మరియు వేసవి కాలం మద్య వ్యత్యాసం అధికరించడానికి కారణం ఔతుంది. ఎగువ నుండి శీతాకాలంలో ఉత్తర పవనాలు చల్లని మరియు పొడిగాలులు వీద్తుంటాయి. వేసవిలో దక్షిణ సముద్రతీరం నుండి వెచ్చని తేమగాలులులు వీస్తుంటాయి.[113] చైనా వాతావరణం ఒక్కొక ప్రంతానికి ఒక్కోలా వౌవిధ్యంగా ఉంటుంది. వైవిధ్యమైన భౌగోళిక స్థితి ఇందుకు ప్రధానజారణంగా ఉంది. చైనాలో పర్యావరణ వివాదాలలో ఏడారుల విస్తరణ ఒకటి. గోబీ ఎడారి స్థితి ఇందులో ప్రధానమైనది.[114][115] 1970 నుండి ఇసుకతుఫానుల వేగాన్ని తగ్గించడానికి చెట్లవరుసలను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తర చైనాలో వసంతకాలంలో ఆసియన్ ధూళితుఫానుల కారణంగా నిరంతర కరువు, వ్యవసాయసనస్యలు ఎదురౌతూనే ఉన్నాయి. ధూళితుఫానులు చైనాలోనే కాక పొరుగున ఉన్న కొరియా మరియు జపాన్‌లలో కూడా వ్యాపిస్తూ ఉంటాయి. చైనా పర్యావరణ సంస్థ 2007 సెప్టెంబరు నివేదికలో ధూళితుఫానుల కారణంగా చైనా సాలీనా 4,000 ఎకరాలను నష్టపోతున్నదని తెలియజేసింది.[116] చైనాతో ఇతరదేశాల సంబంధానికి నీటి నాణ్యత, భూ ఊచకోత మరియు జనసంఖ్యాభివృద్ధి నియంత్రణ మొదలైనవి ప్రాధాన్యత కలిగిన విషయాలుగా ఉన్నాయి. హిమాలయాలలోని గ్లాసియర్లు కరగడం వలన లభిస్తున్న విస్తారమైన జలం కోట్లాదిప్రజలు జీవించడానికి ఆధారంగా ఉంది. [117]
Biodiversity
అత్యధికంగా వైవిధ్యం కలిగిన 17 దేశాలలో చైనా ఒకటి.,[118]పర్యావరణ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఉండడం మరియు ఇండోమాలయ మరియు పాలియార్కిటిక్ ప్రాంతంలో ఉండడం ఇందుకు ఒక కారణం. చైనాలో 34,687 జాతుల జంతువులు మరియు వాస్కులర్ మొక్కలు చైనాను ప్రపంచదేశాలలో బయోడైవర్శిటీ కలిగిన దేశాలలో మూడవస్థానంలో నిలిపింది. మొదటి రెండు స్థానాలలో బ్రెజిల్ మరియు కొలంబియా దేశాలు ఉన్నాయి.[119] 1992 జూన్ 11 న చైనా " రియో డీ జనెరియో "లో జరిగిన " కాంవెంషన్ ఆన్ బయోడైవర్శిటీ మీద సంతకం చేసి1993 జనవరి 5న సమావేశంలో భాగస్వామ్యం వహించింది.[120]2010 సెప్టెంబరు 10న జరిగిన సమావేశం తరువాత చైనా " బయోడైవర్శిటీ ఏక్షన్ ప్లాన్ " తయారుచేసింది.[121] చైనాలో 551 జాతుల క్షీరదాలు ఉన్నాయి. క్షీరదాల సంఖ్యలో చైనా అంతర్జాతీయంగా మూడవస్థానంలో ఉంది.[122] 1221 జాతుల పక్షులు ఉన్నాయి. పక్షిజాతులతో చైనా అంతర్జాతీయంగా చైనాను ఎనిమిదవ స్థానంలో ఉంది.[123] 424 సరీసృపాలతో [124] మరియు 333 జాతుల ఉభయచరాలతో చైనా అంతర్జాతీయంగా ఏడవ స్థానంలో ఉంది.[125] జీవవైవిధ్యం అధికంగా ఉన్న చైనాలో హోమోసేపియన్ జాతికి చెందిన గిరిజనులు అత్యధికసంఖ్యలో ఉన్నారు. చైనాలో ఉన్న జంతువులలో 840 జాతులు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. మానవ నివాసాల అవసరం, కాలుష్యం మరియు అహారపదార్ధాలను అధికంగా పండించవలసిన అవసరం, ఔషధాల మూలికల ఉపయోగం మరియు జంతువుల ఉన్ని ఉపయోగం కారణంగా జతువులు అతరించిపోతున్న స్థితికి చేరుకున్నాయి. [126] అంతరించిపీతున్న జంతువులు 2005 నుండి చట్టబద్ధంగా సంరక్షించబడుతున్నాయి. దేశంలో 2,349 అభయారణ్యాలు ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 149.95 మిలియన్ హెక్టారులు ఉంటుంది. ఇది చైనా వైశాల్యంలో 15% ఉంటుంది.[127] చైనా 32,000 వస్కులర్ మొక్కలు [128] మరియు అనేక అడవి జాతివృక్షాలు ఉన్నాయి. ఉత్తర భూభాగంలో కోల్డ్ కోనిఫెరస్ చెట్లు అధికంగా ఉన్నాయి. ఇవి దుప్పి మరియు ఆసియన్ ఎలుగు మరియు 120 పక్షిజాతులకు ఆధారంగా ఉన్నాయి..[129] దిగువన ఉన్న మాయిస్టర్ కోనిఫర్ అరణ్యాలలో దట్టమైన వెదురుపొదలు ఉన్నాయి. ఎగువన జూనీపర్ మరియు టాక్సస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వెదురు పొదల స్థానాన్ని రోడోడెండ్రాన్ చెట్లు ఆక్రమించాయి. దక్షిణ మరియు మద్య చైనాలో ఉప ఉష్ణమండల జాతి చెట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 1,46,000 జాతుల చెట్లు ఉన్నాయి.[129] యున్నన్ మరియు హైనన్ ద్వీపాలలో ఉష్ణమండల మరియు సీజనల్ వర్షారణ్యాలు ఉన్నాయి. ఇక్కడ చైనాలోని జంతువులు మరియు వృక్షాలలో నాగువవంతు ఉన్నాయి.[129] చైనాలో 10,000 జాతుల శిలీంధ్రాలు [130] మరియు 6,000 జాతుల హైఘర్ ఫంగీ నమోదు చేయబడ్డాయి.[131]
Environmental issues
సమీపకాలంలో చైనా పర్యావరణ వివాదాలను ఎదుర్కొంటున్నది.[132][133] 1979 పర్యావరణ క్రమబద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చట్టాలు రూపొందించబడ్డాయి. కఠినమైన చట్టాలు అమలుచేయడంలో అలసత్వం ఏర్పడింది. చట్టాలను ప్రాంతీయప్రజలు మరియు ప్రభుత్వ అధికారులు గౌరవించలేదు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఇందుకు కారణం.[134] నగర వాయుకాలుష్యం అనారోగ్య సమస్యలకు కారణం ఔతుంది. 2013ప్రపంచబ్యాంకు అంచనాలను అనుసరించి చైనాలో అత్యధిక జనసాంధ్రత కలిగిన 20 నగరాలు ఉన్నాయని భావిస్తున్నారు.[135] ప్రపంచదేశాలలో చైనా అత్యధికంగా కార్బండయాక్సైడ్ వెలువరిస్తున్న దేశంగా భావిస్తున్నారు.[136] దేశానికి జలసంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. 298 మిలియన్ల గ్రామీణ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందడం లేదని అంచనా. [137] అలాగే చైనా నదులలో 40% పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్ధాలు వ్యవసాయ వ్యర్ధాల కారణంగా కలుషితమౌతున్నాయని2011 గణాంకాలు వివరిస్తున్నాయి.[138] కాలుష్యసమస్యల కారణంగా ఈశాన్యచైనా ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు.[139][140] చైనా " రిన్యూవబుల్ ఎనర్జీ కమర్షియలైజేషన్ " (పునరుత్పాదక శక్తి వ్యాపారీకరణ) కొరకు అత్యధికంగా పెట్టుబడి చేసిన దేశంగా గుర్తించబడుతుంది. 2011లో చైనా ఇందు కొరకు 52 బిలియన్ల అమెరికడాలర్లను పెట్టుబడి చేసింది.[141][142][143] చైనా రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రాంతీయ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రణాళికల కొరకు అత్యధికంగా వ్యయంచేస్తూ ఉంది.[144][145] 2009 నాటికి చైనా ఖర్చుచేస్తున్న విద్యుత్తులో 17% రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా లభించిందని భావిస్తున్నారు. జలవిద్యుత్తు ప్రణాళికల నుండి చైనా 197 గిగాబైట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుందని అంచనా.[146] 2011లో చైనా ప్రభుత్వం 618.55 బిలియన్ల అమెరికా డాలర్లు వాటర్ ఇంఫ్రాస్ట్రక్చర్ మరియు డిసాలినేషన్ ప్రణాళిక కొరకు మంజూరు చేసింది.2020 నాటికి వరద నివారణ నిర్మాణాలు పని చేసుకుని కరువును నివారించగకమని ప్రభుత్వం భావిస్తుంది.[139][147] 2013లో చైనా 277 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో పంచవర్ష ప్రణాళిక ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా ఉత్తరచైన అభివృద్ధి కొరకు కృషిచేస్తుందని అంచనా.[148]
రాజకీయాలు
ప్రంపంచంలో బహిరంగంగా సోషలిజాన్ని బలపరుస్తున్న దేశాలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఒకటి. చైనీస్ ప్రభుత్వవిధానం వైవిధ్యమైన కమ్యూనిస్టు సోషలిస్టు విధానాన్ని అనుసరిస్తున్నట్లు వర్ణించబడుతుంది. కానీ చైనా నియంతృత్వ మరియు సంస్థాగత సమ్మిశ్రిత పాలనా విధానం అనుసరిస్తుంది.[149] అనేక కట్టుబాట్ల మద్య ఇంటర్నెట్ (ఇంటర్నెట్ సెంసార్ చేయడంపట్ల వ్యతిరేకత ఉంది), పత్రికా స్వాతంత్ర్యం, అసెంబ్లీ స్వాతంత్ర్యం, పిల్లలను పొందే స్వతంత్రం, ఫ్రీ ఫార్మేషన్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ మరియు మతస్వాతంత్ర్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి[150] చైనా ప్రస్తుత రాజకీయ మరియు ఆర్థిక విధానాలను వారి నాయకులచేత " పీపుల్స్ డెమొక్రటిక్ డిక్టేటర్‌షిప్", సోషలిజం విత్ చైనీస్ కారెక్టరిస్టిక్స్, మరియు సోషలిస్ట్ మార్కెట్ ఎకనమిగా మార్చబడవచ్చని భావిస్తున్నారు. [151]
Communist Party
చైనా దేశం కమ్యూనిస్టు పార్టీచేత పాలించబడుతుంది.[152] పీపుల్స్ రిపబ్లిక్ ఎన్నికలు వారసత్వవిధానంలో నిర్వహించబడుతున్నాయి. లోకల్ పీపుల్స్ కాంగ్రెస్ నేరుగా ఎన్నుకొనబడుతుంది. ఆఫ్ చైనాలో ఉన్నత స్థాయిలో ఉన్న పీపుల్స్ కాంగ్రెస్ మరియు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులను క్రిందస్థాయి సభ్యులుగా పీపుల్స్ కాంగ్రెస్ చేత పరోక్షంగా ఎన్నుకొంటారు.[153] రాజకీయ విధానం వికేంద్రీకరణ మరియు ప్రాంతీయ ఉపప్రాంతీయ నాయకులు గనీయమైన స్వయంప్రతిపత్తి కలిగి ఉంటారు.[154] నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మరియు చైనీస్ పీపుల్స్ పొలిటకల్ పార్టీలకు చెందున ( పీపుల్స్ రిఓబ్లిక్ ఆఫ్ చైనాలోని రాజకీయ పక్షాలు) డెమొక్రటిక్ పార్టీలుగా భావించబడుతున్నాయి.[155]
1970లో బీజింగ్‌లో నిర్వహించబడున నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమేవేశాలు మూసిన తలుపుల వెనుక నిర్వహించబడ్డాయి. చైనా స్వతంత్రంగా వ్యవహరించడం ఆరంభం అయిన తతువాత రాజకీయ వాతావరణంలో కట్టుదిట్టాలు సడలించిన కారణంగా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ కొంత స్వతంత్రంగా వ్యవహరించడం మొదలైంది. చైనా లెనినిస్ట్ విధానాలు కలిగిన " డెమొక్రటిక్ సెంట్రలిజం " అనుసరించింది.[156] అయినప్పటికీ ఎన్నికైన నేషనల్ కాంగ్రెస్ సభ్యులను " రబ్బర్ స్టంప్ " (నామమాత్రపు అధికారాలు కలిగినది)!గానే భావిస్తున్నారు.[157] ఏకపార్టీ దేశంగా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ అంతిమ నిర్ణయాధికారం కలిగి ఉంటాడు. మార్చి మాసంలో 82 మిలియన్ల సభ్యులున్న కమ్యూనిస్టు పార్టీ సెక్రెటరీ జిపింగ్-59 అత్యంత శక్తివంతమైన అధ్యక్షపదివిని హూ జింటో నుండి చేపట్టాడు.[158]}}
Government
పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షడు దేశానికి నామమాత్రపు అధ్యక్షత వహిస్తాడు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెరిమోనియల్ కార్యక్రమాలలో పాల్గొనడం మొదలైన అలంకారప్రాయమైన విధినిర్వహణా బాధ్యతలు నిర్వహిస్తాడు. అఫ్హ్యక్షుని కార్యాలయం ప్రతిష్ఠాత్మకమైనది. అధ్యక్షుడు దేశానికి నాయకత్వం వహిస్తాడు. 1982 నుండి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుని అధికారం మరియు విధులను పునఃస్థాపితం చేసి ఆయనను దేశాధిపతిగా గుర్తించింది. అయినప్పటికీ అధ్యక్షుడు అమెరికన్ అధ్యక్షుని వంటి అధికారాలు కలిగి ఉండక అలంకారప్రాయమైన అధికారాలు కలిగి ఉంటాడు. చైనా అధ్యక్షుని భారతదేశ అధ్యక్షుడు మరియు యునైటెడ్ కింగ్డం రాజు లేక రాణితో పోల్చవచ్చు.[159]}} పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రీమియర్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. నలుగురు సహాయ ప్రీమియర్లతో స్టేట్ కౌంసిల్ ఆఫ్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మంత్రులు మరియు కమిషన్ల మీద ఆధిపత్యం వహిస్తాడు. కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ మరియు సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ క్సి జింపింగ్ తనను సర్వోత్తమ నాయకునిగా చేసుకున్నాడు.[98] ప్రీమియర్ లీ కెక్వియంగ్ (సి.పి.సి పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సీనియర్ సభ్యుడు) ఉన్నత నిర్ణయాధికారం కలిగి ఉంటాడు. [160] రాజకీయ స్వాతంత్ర్యానికి కొన్ని చర్యలు తీసుకొనబడ్డాయి. బహిరంగ ఎన్నికలు గామం మరియు నగర స్థాయిలో నిర్వహించబడుతున్నాయి.[161][162] ఏది ఏమైనా పార్టీ ప్రభుత్వ నియామకాలలో శక్తివంతమైన నియంత్రణాధికారం కలిగి ఉంటారు.[163][164] అయినప్పటికీ ప్రభుత్వానికి మరియు దేశనిర్వహణకు ప్రజలు మద్దతుగా నిలిచారు. 2011 గణాంకాలను అనుసరించి 85%-95% ప్రజలు ప్రభుత్వపాలన పట్ల సంతృప్తి వ్యక్తంచేసారు.[165]
Administrative divisions
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 22 ప్రాంతాలుగా విభజించబడింది. అదనంగా తైవాన్ ప్రాంతం చేర్చబడింది. తైవాన్ ప్రాంతాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 23 ప్రాంతంగా భావించబడుతుంది. అయినప్పటికీ తైవాన్ ప్రాంతం మీద రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆధిపత్యం కలిగి ఉండడం వివాదాస్పదంగా ఉంది.[166] చైనాలో స్వయంప్రతిపత్తి కలిగిన ఉపవిభాగాలు ఉన్నాయి. ఉపవిభాగాలు అల్పసంఖ్యాక సమూహాలకు ప్రత్యేకించబడ్డాయి. ఇందులో 4 మునిసిపాలిటీల ఆధీనంలో, మరియు ప్రత్యేక నిర్వహణాప్రాంతాలు (వీటి రాజకీయ స్వయంప్రతిపత్తి ఉంది) ఉన్నాయి. ఈ 22 ప్రాంతాలు, 4 మునిసిపాలిటీలు, 5 స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలు ప్రధాన చైనా భూభాగంగా పరిగణించబడుతున్నాయి. హాంగ్ కాంగ్ మరియు మకయు ప్రాంతాలు ఇందుకు అతీతంగా ఉన్నాయి. పి.ఆర్.సి నియంత్రణలో ఉన్న ప్రాంతాలను ఆర్.ఒ.సి ప్రభుత్వం చేత గుర్తించబడలేదు.
విదేశీ విధానం
పి.ఆరి.సి 171 దేశాలతో దౌత్యసంబంధాలను కలిగి ఉంది.embassies in 162|పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దౌత్యకార్యాలయా జాబితా. 162 దేశాలలో చైనాకు దౌత్యకార్యాలయాలు ఉన్నాయి.[167] దౌత్యకార్యాలయాల చట్టబద్ధతను రిపబ్లిక్ ఆఫ్ చైనా మరియు కొన్ని ఇతర దేశాలలో వివాదాద్పదంగా ఉంది. పరిమితమైన గుర్తింపు కలిగిన అతిపెద్ద మరియు జసాంధ్రత కలిగిన దేశంగా చైనా భావించబడుతుంది.1971లో ఐక్యరాజ్య సమితి సభ్యత్వానికి ఆర్.పి.సి స్థానంలో పి.ఆర్.సి నియమించబడింది. ప్రస్తుతం. ఐక్యరాజ్యసమితి శాశ్వతసభ్యత్వం కలిగిన 5 దేశలలో చైనా ఒకటి.[168] గతంలో చైనా అలీన దేశాలకు చైనా సభ్యత్వం కలిగి నాయకత్వం వహించింది. చైనా ఇప్పటికీ తనను అభివృద్ధిచెందుతున్న దేశాలకు న్యాయవాదిగా భావిస్తుంది.[169]బ్రెజిల్,రష్యా,భారతదేశం మరియుదక్షిణాఫ్రికాతో చైనా బి.ఆర్.సి.ఎస్ సభ్యత్వం కలిగి ఉంది. న ఈ దేశాలు అంతర్జాతీయ ప్రధాన ఆర్థికశక్తిగా ఎదుగుతున్నాయి. 2011 బి.ఆర్.సి.ఎస్ సమావేశాలకు (చైనా లోని సన్యా మరియు హైనన్‌లో జరిగాయి) చైనా ఆతిథ్యం ఇచ్చింది.[170] వన్- చైనా- పాలసీ విధానాం అనుసరించి తైవాన్ మీద చైనా ఆధిపత్యాన్ని అంగీకరించాలని షరతువిధిస్తూ చైనా ఇతరదేశాలతో దౌత్యసంభధాలను అభివృద్ధిచేస్తూ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో అధికార సంబంధాలు కలిగి ఉంటుంది. తైవాన్‌తో ఇతరదేశాలు దౌత్యసంబంధాల విషయమై ప్రయత్నించిన పలు సందర్భాలలో చైనా తైవాన్ మీద తమకున్న ఆధిపత్యాన్ని ప్రకటిస్తూనే ఉంది.[171] ప్రత్యేకంగా ఆయుధాల విక్రయాల విషయాలలో చైనా ఇది స్పష్టం చేస్తుంది. [172] ప్రస్తుత చైనా విధానాలు ఝౌ ఎన్లై రూపొందించిన " ఫైవ్ పాలసీస్ ఆఫ్ పీస్ఫుల్ కో ఎక్జిస్టెంస్ " ఆధారితం మరియు " హార్మొనీ విటౌట్ యూనిఫార్మిటీ " (సైద్ధాంతిక విభేదాలున్న దేశాలతో దౌత్యసంబంధాలు) విధానం అనుసరించి ఉంటాయి. [173] ఈ విధానం చైనాను పశ్చుమ దేశాలు అపాయకర దేశాలని భావిస్తున్న జింబావే, ఉత్తర కొరియా మరియు ఇరాన్ వంటి దేశాలకు మద్దతు తెలపడానికి అవకాశం కల్పిస్తుంది.[174] చైనా రష్యాతో సన్నిహిత ఆర్థిక మరియు సైనిక సంబంధాలు కలిగి ఉంది.[175] యు.ఎన్ సెక్యూరిటీ కౌంసిల్ వోటింగ్ సమయంలో రెండు దేశాలు ఏకీకృత అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉంటాయి.[176][177][178]
వాణిజ్యసంబంధాలు
సమీప దశాబ్ధాలలో చైనా " ఫ్రీ ట్రేడ్ ఏరియా " లను అభివృద్ధిచేయడం మరియు పొరుగున ఉన్న ఆసియాదేశాలతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రధానపాత్ర వహించింది.2004లో మొదటి " ఈస్ట్ ఆసియా సమ్మిట్ " ప్రతిపాదన చేసింది.[179] ఈ.ఏ.ఎస్.లో ఆసియన్ ప్లస్ త్రీ, ఇండియా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ఉన్నాయి. ఈ.ఏ.ఎస్ ప్రారంభ సమావేశం2005లో నిర్వహించబడింది. చైనా రష్యా మరియు మద్య ఆసియా రిపబ్లిక్కులతో కలిసి షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్‌కు నిధిని సమకూరుస్తుంది. 2001 డిసెంబరు 1 నుండి చైనా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ "లో సభ్యత్వం కలిగి ఉంది.2000లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ చైనాతో " పర్మనెంట్ నార్మల్ ట్రేడ్ రిలేషంస్ " (శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాలకు (ఇతర దేశాలకు చైనా అదే విలువతో వస్తువులను ఎగుమతి చేసే సుంకాలతో కల్పించడం) అంగీకారం తెలిపింది. [180] చైనా అత్యధికంగా వస్తువుల అధికంగ యునైటెడ్ స్టేట్స్ ఎగుమతి చేస్తుంది.[181] 2010లో యు.ఎస్. రాజకీయవేత్తలు చైనా యుయాన్ తక్కువ విలువైనదని అది చైనాకు వాణిజ్య అవకాశం అధికంగా ఇస్తుందని వాదించింది.[182][183][184] సమీప కాలంలో చైనా " ఆఫ్రికన్ దేశాలతో వాణిజ్యం మరియు పస్పర సహకారం " విధానం అనుసరిస్తుంది. [185][186][187] 2012లో సినో- ఆఫ్రికన్ ట్రేడ్ మొత్తం విలువ 160 బిలియన్ల అమెరికన్ డాలర్లు. [188] చైనా అదనంగా ప్రధాన దక్షిణ అమెరికన్ దేశాలతో ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. బ్రెజిల్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటూ అర్జెంటీనాతో వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉంది.[189][190]
Territorial disputes
అదనంగా తైవాన్ వివాదంతో చైనా ఇతర అంతర్జాతీయ భూభాగ వివాదాలు కలిగి ఉంది. 1990 నుండి చైనా సినో- ఇండియన్ సరిహద్దు వివాదం, మరియు నిర్ణయించబడని భూటాన్ సరిహద్దు పరిష్కారాల కొరకు ప్రయత్నిస్తుంది. చైనా తూర్పు మరియు దక్షిణ చైనా లోని స్కార్బోరో షోయల్ మరియు సెంకకు ద్వీపాల వివాదం వంటి పలు వివాదాలను ఎదుర్కొంటూ ఉంది. [191][192] 2014మే 21న అధ్యక్షుడు క్సి షంఘై సమావేశంలో మాట్లాడుతూ చైనా భూభాగ వివాదాలు శాంతివంతంగా పరిష్కరించాలని సూచించాడు.[193]
=Emerging superpower status
చైనా క్రమంగా శక్తివంతమైన సూపర్ పవర్‌గాప్రశంశించబడితుంది. విమర్శకులు చైనా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న సైనిక శక్తి, అత్యంత అధికమైన జనసంఖ్య మరియు అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ ప్రాముఖ్యత గమనిస్తూ ఉన్నారు. 21వ శతాబ్ధంలో చైనా అంతర్జాతీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. [26][194]ఇతరులు ఆర్థికలోపం మరియు జనసంఖ్యాభివృద్ధి కారణంగా చైనా శతాబ్ధ ఆభివృద్ధి కుంటుబడగలదని భావిస్తున్నారు. [195][196] కొందరు సూపర్ పవర్‌కు వివరణ అడుగుతున్నారు. చైనా బృహత్తర ఆర్థికం కారణంగా సూపర్ పవర్ అర్హత పొందలేదని భావిస్తున్నారు. చైనా సైనిక మరియు సంస్కృతిక ప్రభావంలో యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించలేదని భావిస్తున్నారు. [197]
Sociopolitical issues, human rights and reform
చైనా డెమొక్రటిక్ ఉద్యమం సాంఘిక కార్యకర్తలు మరియు కొంతమంది కమ్యూనిస్టు సభ్యులు సాంఘిక మరియు రాజకీయ సంస్కరణల అవసరాన్ని గుర్తించారు. 1970 నుండి ఆర్థిక మరియు సాంఘిక కట్టుబాట్లు గణనీయంగా సడలించబడ్డాయి. రాజకీయ స్వాతంత్ర్యం ఇప్పటికీ పటిష్ఠంగా పరిమితం చేయబడి ఉంది. చైనా రాజ్యాంగ నిర్మాణంలో వాక్స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, పౌరహక్కులు, న్యాయవిచారణ, మతస్వాతంత్ర్యం, అంతర్జాతీయ సమస్యలు మరియు ఆస్తి హక్కులు రూపొందించబడ్డాయి. అయినప్పటికీ ఇవి సాధారణంగా న్యాయవిచారణ సమయంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం ఔతూ ఉన్నాయి.[198][199] చైనా ప్రభుత్వ విధానాలు మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ పాలన సహించడం విషయంలో విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఉపన్యాసాలు మరియు సమాచారం మీద నిఘా. అంతర్జాలం మీద నిఘా విషయాలలో విమర్శలు ఉన్నాయి.[200][201] మూకుమ్మడి ప్రదర్శనలు సాధారణంగా అడ్డగించబడుతుంటాయి. [202] 2005లో " రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ " నివేదికలో చైనా 159వ (మొత్తం దేశాలదంఖ్య 167) స్థానంలో ఉంది. ఇది పత్రికాస్వాతత్రం స్థితిని తెలియజేస్తుంది. [203] 2014లో మొత్తం 180 దేశాలలో చైనా 175వ స్థానంలో ఉంది.[204] చైనా నగరాలకు గ్రామీణ వలసప్రజలు ద్వితీయస్థాయి పౌరులుగా పరిగణించబడుతున్నారని వారిలో వారు భావిస్తున్నారు., దేశీయ వెల్ ఫేర్ విధానం అయిన హుకూ విధానం వారికి అనుకూలంగా లేకపోవడం ఇందుకు కారణం.[205][206] ఆస్తి హక్కులు కూడా తరచుగా పేలవంగా సంరక్షించబడుతుంటాయి. [205] అలాగే పన్ను విధానం బీద పౌరులను బాధిస్తూ ఉంది.[206]2000 తరువాత పలు గ్రామీణ పన్నులు తగ్గించబడడం మరియు రద్దుచేయబడడం జరిగింది. అంతేకాక గ్రామీణ ప్రజలకు అదనపు సేవలు అందించబడుతున్నాయి.[207][208] పలు విదేశీప్రభుత్వాలు మరియు విదేశీ పత్రికా ఏజెంసీలు మరియు ఎన్.జి.ఒలు తరచుగా చైనా మానవహక్కుల ఉల్లంఘన అతిక్రమణ గురించి విమర్శిస్తున్నారు. విచారణ లేకుండా అడ్డగించడం మరియు బలవంతపు గర్భస్రావం వంటి పౌరహక్కుల ఉల్లంఘన [209] బలవంతపు అంగీకారాం, పౌరహక్కుల కట్టుబాట్లు మరియు హింస.[150][210] మరియు మరణశిక్ష వంటివి కూడా విమర్శించబడుతూ ఉన్నాయి. [211][212] ప్రజాభిప్రాయ ప్రకటనలను (1989 తైనాన్మెన్ ప్రొటెస్ట్) మరియు వివరణలను అణిచివేత మూలంగా సాంఘిక అస్థిరతకు దారితీస్తుంది.1992 ఫాలన్ గాంగ్ బహిరంగంగా నేర్పించబడింది. దీనికి 70మిలియన్ల అభ్యాసకులు ఉన్నారు. [213] ఫాలన్ గాంగ్ మీద నిషేధం అమలుచేసిన సమయంలో మూకుమ్మడి ఖైదు, చెరశాల మరణాలు, నిర్భంధ న్యాయవిచారణ మరియు హింస వంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.[214][215] చైనా రాజ్యంగం టిబెట్ మరియు క్సింజియాంగ్ లలో నిర్వహించిన బృహత్తర మూకుమ్మడి అణిచివేత మరియు పౌరహక్కుల ధిక్కారం, పోలీస్ దౌర్జన్యం, మతపరమైన అణచివేత విమర్శలకు కారణం అయింది.[216][217] చైనీస్ ప్రభుత్వం విదేశీవిమర్శలకు ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఉపాధి సౌకర్యం మరియు ఆర్థికాభివృద్ధి ఇతర విధాలైన ఆర్థికాభివృద్ధికి అవసరమని చైనా విదేశీవిమర్శలకు సమాధానం ఇస్తూ ఉంది. ఇతర విధాలైన పౌరహక్కులు ప్రస్తుత ఆర్థికాభివృద్ధికి దారితీసిందని చైనా అభిప్రాయపడుతుంది.[218] 1970 నుండి చైనీయుల జీవనస్థాయి అభివృద్ధి, అక్షరాస్యతాభివృద్ధి మరియు ప్రజల ఆయుఃప్రమాణం అధికం కావడం తమ అనుసరిస్తున్న విధానాలకు కలిగిన సత్ఫలితం అన్నది చైనా భావన. అలాగే వర్క్ స్పేస్ రక్షణాభివృద్ధి మరియు (నిరంతర బీభత్సానికి కారణం ఔతున్న యంగ్‌త్జె నది వరదలు) ప్రకృతి వైపరిఒత్యాలతో పోరాటం విజయవంతంగా సాగుతున్నాయి. [218][219][220]కొంతమంది రాజకీయవాదులు ప్రజాస్వామ్యానికి బహిరంగంగా మద్దతు తెలియజేస్తున్నారు. మిలిన నాయకులు సంప్రదాయవాదాన్ని సమర్ధిస్తూ ఉన్నారు. [221] 2013 కొన్ని ప్రధాన సంస్కరణ ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం ఒకే- బిడ్డ విధానం మరియు అత్యధికంగా విమర్శలకు అవకాశం కలిగించిన " రీ ఎజ్యుకేషన్ త్రూ లేబర్ " ప్రోగ్రాం సడలించింది.[106] అయినప్పటికీ మానవహక్కుల వాదులు సంస్కరణలు అలంకారప్రాయమైనవని గమనించారు.[214] 2000 మరియు 2010 ప్రాంరంభంలో చైనా ప్రభుత్వం ఎన్.జి.వొల సమస్యలకు పరిష్కారం సూచించింది.[222]
సైన్యం
2.3 మిలియన్ క్రియాశీల సేనలతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఎ) నాయకత్వంలో ప్రపంచంలో అతిపెద్ద నిలబడి సైనిక శక్తిగా నిలిచింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సైన్యాన్ని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (చైనా పీపుల్స్ రిపబ్లిక్) (సిఎంసి) నియంత్రిస్తుంది.[223] పి.ఎల్.ఎలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్ (పి.ఎల్.ఎ.జి.ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (ఎం.ఎ.పి), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పి.ఎల్.ఎ.ఎ.ఎఫ్ ) మరియు క్షిపణి వ్యూహాత్మక అణుశక్తి క్షిఫణి, రెండవ ఆర్టిలరీ కార్ప్స్ (చైనా) మొదలైన విభాగాలను కలిగి ఉంది. చైనీస్ ప్రభుత్వ గణాంకాలను అనుసరించి 2014 చైనా సైనిక బడ్జెట్ వ్యయం ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్‌గా గుర్తించబడుతుంది. 2014 సంయుక్త చైనా సైనిక బడ్జెట్ 132 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. [24] అయితే, అనేక అధికారిక వర్గాలు - ఎస్.ఐ.పి.ఆర్. మరియు యు.ఎస్. రక్షణ కార్యాలయ కార్యదర్శి సహా - చైనా అధికారిక బడ్జెట్ కంటే వ్యయంచేసేది అధికంగా ఉంటుందని వాదిస్తున్నారు.[24][224] గుర్తించబడిన అణ్వాయుధాలు కలిగియున్న దేశంగా చైనా ప్రాతీయ సైనిక శక్తి మరియు శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన దేశంగా గుర్తించబడుతుంది.[225] 2013 నివేదికలను అనుసరించి యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెంస్ ", చైనాలో 50-75 అణ్వయుధాలు మరియు అసంఖ్యాకంగా షార్ట్- రేంజ్- బల్లిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయని భావిస్తున్నారు.[23] యు.ఎన్ సెక్యూరిటీ కౌంసిల్ శాశ్వతసభ్యత్వం కలిగి ఉన్న ఇతర నాలుగు దేశాలతో పోల్చితే చైనా సైనికశక్తి సామర్ధ్యాలు పరిమితమైనవని భావిస్తున్నారు.[226] చైనా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ లియోనింగ్ 2012 నుండి సేవలు అందించడం మొదలు పెట్టింది.[227][228][229] చైనాలో గణనీయమైన సబ్మెరీన్లు (జలాంతర్గాములు) ఉన్నాయి. వీటిలో అణు జలాంతర్గామి, అణు దాడి జలాంతర్గామి మరియు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఉన్నాయి.[230] చైనా అదనంగా సముద్రతీరం వెంట ఉన్న దేశాలతో సైనిక సంబంధాలను కలిగి ఉంది.[231]
ఇటీవల దశాబ్దాల్లో చైనా తన వైమానిక దళాన్ని ఆధునీకరణ చేయడంలో గణనీయమైన ప్రగతి సాధించింది. వంటి రష్యన్ నుండి సుఖోయ్ సు -30 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడం, అలాగే తన స్వంత ఆధునిక యుద్ధ విమానాలతయారీ వంటి ప్రగతిని సాధించింది. చైనాలో ప్రధానంగా చెంగ్డూ జె-10, చెంగ్డూ జె-20 మరియు షేన్యంగ్ జె-11, షేన్యంగ్ జె-15, జె-16 మరియు షేన్యంగ్ జె-31 మొదలైన యుద్ధవిమానాలను తయారుచేస్తుంది.[227][232]చైనా అదనంగా మానవరహిత యుద్ధ వాయువాహనాలు మరియు దేశీయమైన స్టీల్త్ విమానం ఇంకా అనేక అభివృద్ధి పనులు చేయడంలోనిమగ్నమై ఉంది.[233][234][235] ప్రాంతీయ బెదిరింపులను ఎదుర్కొనడానికి ఎయిర్ మరియు సీ డెనియల్ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది.[236][237] చైనా పదాతిదళాలను అధినీకరణ చేసింది. సోవియట్ యూనియన్ వద్ద కొనుగోలుచేసిన కాలావతి చెందిన మెయిన్ బాటిల్ టాంక్‌లను మార్చింది. టైప్ 99 ట్యాంకులు రూపకల్పన చేయడం మరియు సి3 మరియు సి4 యుద్ధభూములను అభివృద్ధిచేసింది.[238] అదనంగా చైనా అసంఖ్యాకంగా అధునిక మిస్సైల్ [239][240] మరియు 2007 చైనీస్ యాంటీ - శాటిలైట్ మిస్సైల్ [241] క్రూసీ మిస్సైల్స్[242] మరియు అణ్వాయుధాలు కలిగిన జలాంతర్గామి కలిగి ఉంది.[243] స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ డేటా అనుసరించి చైనా 2010-2014 మద్య ఆయుధాలను విక్రయిస్తున్న దేశాలలో అంతర్జాతీయంగా మూడవ స్థానంలో ఉంది.2005-2009 నుండి ఆయుధాల విక్రయంలో చైనా 143% అభివృద్ధి సాధించింది.[244]
ఆర్ధికం
2014 నాటికి, చైనా అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదికలను అనుసరించి చైనా నామినల్ జి.డి.పి సుమారుగా 10,380 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " నివేదికలను అనుసరించి నామినల్ జి.డి.పి పరంగా చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగివుంది.[12]కొనుగోలు శక్తి తుల్యత (పి.పి.పి) పరిగణనలోకి తీసుకుంటే, చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. 2014లో చైనా కోనుగోలు శక్తి జి.డి.పి. (పి.పి.పి. జి.డి.పి.) 17,617 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు.[12] 2013 లో చైనా తలసరి కోనుగోలు శక్తి జి.డి.పి (పి.పి.పి. జి.డి.పి). 12.880 అమెరికన్ డాలర్లు. తలసరి నామమాత్ర జి.డి.పి. 7.589 అమెరికన్ డాలర్లు ఉంది. రెండు సందర్భాలు తలసరి ప్రపంచ జిడిపి ర్యాంకింగ్స్ శాతం పరంగా చైనా (ఐ.ఎం.ఎఫ్. జాబితాలో 183 దేశాలలో) వెనుక అభివృద్ధి చెందుతూ ఉన్న ఎనభై దేశాలు ఉన్నాయి.[247]
ఆర్ధిక చరిత్ర మరియు అభివృద్ధి
1949 - 1949 వరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సోవియట్ యూనియన్ శైలిలో కేంద్ర ప్రణాళికాబద్ధ ఆర్థికవ్యవస్థ విధానం అనుసరించింది. 1976లో మావో మరణించిన తరువాత సాంస్కృతిక విప్లవం ముగింపుకు వచ్చిన ఫలితంగా చైనాలో డెంగ్ క్సియోపింగ్ మరియు సరికొత్త చైనా నాయకత్వం ఆరంభం అయింది. తరువాత చైనాలో ఒన్- పార్టీ పాలనలో ఆర్థిక సంస్కరణలు మరియు మార్కెట్ ఓరియంటెడ్ మిక్స్డ్ ఎకానమీ చేపట్టబడ్డాయి. సంఘటిత వ్యవసాయం స్థానంలో వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చేయబడ్డాయి. విదేశీవాణిజ్యానికి కొత్తగా ప్రాధాన్యత ఇవ్వబడడం వలన ప్రత్యేక ఎకనమిక్ జోన్స్ (సెజ్) సృష్టించబడ్డాయి. బలహీనమైన ప్రభుత్వ- కార్పొరేషంస్ (ఎస్.ఒ.సి) పునర్నిర్మించబడ్డాయి. నష్టాలలో ఉన్న సంస్థలు మూసివేయబడ్డాయి. ఫలితంగా మూకుమ్మడిగా ఉద్యోగాలు రద్దయ్యాయి. ఆధునికచైనాలో ప్రైవేట్ యాజమాన్యం మరియు మార్కెట్ ఆధారిత ఆర్థికం అభివృద్ధి చేయబడ్డాయి. [248] ఆధునిక చైనా కాపిటలిజంలో పెను మార్పులు సంభవించాయి.[249][250] చైనా ప్రభుత్వం ఇప్పటికీ వ్యూహాత్మక విద్యుత్తు ఉత్పత్తి బృహత్తర పరిశ్రమల నిర్వహణ స్వయంగా చేస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా అధికంగా ప్రాముఖ్యత ఇవ్వబడింది. 2008లో 30 మిలియన్ల ప్రైవేట్ వ్యాపారాలు నమోదుచేయబడ్డాయి.
1978 నుండి చైనాలో ఆర్థిక స్వాతంర్యం ఆరంభం అయింది. చైనా ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది.[255] చైనా తరువాత పెట్టుబడి- ఎగుమతి ప్రధాన్యత కలిగిన అభివృద్ధి దిశలో పయనించడం ఆరంభించింది.[256] ఐ.ఎం.ఎఫ్. నివేదికలు అనుసరించి 2001-2010 మద్య చైనా వార్షిక జి.డి.పి. అభివృద్ధి 10.5%. 2007-2011 చైనా ఆర్థికాభివృద్ధి జి-7 దేశాలన్నింటి ఆర్థికాభివృద్ధికి సమానంగా ఉంది.[257] జి-3 నివేదికలు అనుసరించి 2011ఫిబ్రవరిలో సిటీగ్రూప్ చైనా జి-3 గ్రూప్ అభివృద్ధి శాతంలో చైనా ఉన్నత స్థానంలో ఉందని ప్రకటించింది.[258] అధికమైన ఉత్పత్తి మరియు తక్కువైన శ్రామిక వేతనాలు మరియు మంచి మౌలికసదుపాయాలు చైనాను ఉత్పత్తిలో అంతర్జాతీయ ఆధిపత్యం కలిగిన దేశంగా నిలిపింది. [259] 2010లో చైనా ప్రపంచంలో అత్యధికంగా విద్యుత్తును ఉపయోగిస్తున్న దేశంగా గుతించబడింది.[260] బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి 70% విద్యుత్తు అవసరాలను తీరుస్తుంది. 2013లో చైనా చమురు దిగుమతిలో యు.ఎస్‌ను అధిగమించింది.[261][262] 2010లో చైనా ఆర్థికాభివృద్ధి శాతం క్షీణించడం ఆరంభం అయింది. దేశీయ ఋణసంబంధిత సమస్యలు అంతర్జాతీయ అవసరాలకు తగినంత చైనా ఎగుమతులను బలహీనపరుస్తుంది. [263][264][265] చైనా ఈ - కామర్స్ పరిశ్రమ ఈయు మరియు యు.ఎస్ కంటే చాలా నిదానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 2009 నుండి ఇందులో గణనీయమైన మార్పులు సంభవించాయి. క్రెడిట్ సుయిస్సే నివేదికలను అనుసరించి ఆన్‌లైన్ బదీలీల మొత్తం విలువ 2008 నుండి గణనీయంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. 2008 లో 3 ట్రిలియన్లుగా ఉన్న ధన బదిలీలు2012 నాటికి 660 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. చైనా ఆన్‌లై చెల్లింపుల మార్కెట్‌ను అలి పే, టెన్ ప్లే మరియు చైనా యూనియన్ ప్లే సంస్థలు అధిగమించాయి.[266]
China in the global economy
చైనా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " సభ్యత్వం మరియు ప్రపంచపు అతిపెద్ద వ్యాపారశక్తి కలిగి ఉంది. 2012 చైనా అంతర్జాతీయ వ్యాపారం మొత్తం విలువ 3.87 ట్రిలియన్లు. [22] 2010లో చైనా విదేశీమారకం విలువ 2.85 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. మునుపటి సంవత్సరం కంటే ఇది 18.7% అధికం. [267][268] 2012లో చైనా విదేశీపెట్టుబడులలో అధికంగా పెట్టబడిన దేశాలలో చైనా ప్రథమస్థానంలో ఉంది. చైనాలో విదేశీ పెట్టుబడి విలువ 253 బిలియన్ల అమెరికన్ డాలర్లు. [269] చైనా విదేశాలలో కూడా పెట్టుబడి చేస్తుంది. 2012లో చైనా విదేశాలలో 62.4 బిలియన్ల పెట్టుబడి చేసింది.[269] అలాగే చైనా పలు విదేశీసంస్థలను కొనుగోలుచేసింది. [270] 2009లో చైనా 1.6 ట్రిలియన్ల యు.ఎస్ షేర్లను కలిగి ఉందని అంచనా.[271] యు.ఎస్ పబ్లిక్ డెబ్ట్ అధికంగా పొందిన దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనా వద్ద ఉన్న యు.ఎస్. ట్రెషరీ బాండ్ల విలువ 1.6 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు.[272][273] చైనా ఎక్స్చేంజ్ పతనం ఇతర ప్రధాన ఆర్థికవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.[183][274][275]అధిక మొత్తంలో వస్తూత్పత్తిచేయడం విమర్శలకు గురౌతుంది.[276][277] 2007లో చైనాలో మెకింసి సంస్థ మొత్తం ఋణం 7.4 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు, 2014లో 28.2 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. ఇది చైనా జి.డి.పి కంటే 228% అధికం. జి-20 దేశాల మొత్తం జి.డి.పి కంటే 1% అధికం.[278]
Graph comparing the 2014 nominal GDPs of major economies in US$ billions, according to IMF data[279] |
చైనా గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో 29వ స్థానంలో ఉంది.[280]" ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ " 179 దేశాల జాబితాలో చైనా 136వ స్థానంలో ఉంది.[281]
2014లో ప్రపంచ లార్జెస్ట్ కార్పొరేషంస్ " ఫార్చ్యూంస్ గ్లోబల్ 500 " జాబితాలో 95 చైనా సంస్థలు ఉన్నాయి. ఇందులో యు.ఎస్ కూటమి ఆదాయం 5.8 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. [282] అదే సంవత్సరం ఫోర్బ్స్ నివేదికలో ప్రపంచంలోని 10 బృహత్తర సంస్థలలో 5 చైనాదేశానికి చెందినవి. ఇందులో ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒకటి. [283]
తరగతి మరియు ఆదాయ సమానతలు
2012 నాటికి చైనాలో మద్యతరగతి ప్రజలు (10,000 - 60,000 అమెరికన్ డాలర్ల వార్షిక ఆదాయం పొందేవార్) 300 మిలియన్లు ఉన్నారు. [284] హురున్ నివేదిక అనుసరించి అమెరికన్ డాలర్ల బిలియనీర్లు 2009లో 130 మంది ఉండగా 2012 నాటికి ఈ సంఖ్య 251కి చేరుకుంది. ఇది చైనాను బిలియనీర్ల సంఖ్యాపరంగా చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.[285][286] 2012లో చైనా దేశీయ రిటెయిల్ మార్కెట్ విలువ 20 ట్రిలియన్ల యుయాన్లు ఉంది. [287] 2013 గణాంకాలను అనుసరించి దేశీయ రిటెయిల్ మార్కెట్ విలువ 12% అభివృద్ధిచెందింది. [288]దేశీయ విలాస వస్తువుల మార్కెట్ విలువ విస్తారంగా గ్లోబల్ షేర్‌లో 27.5% ఉంది. [289] సమీపకాలంలో చైనా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి దేశంలో ధనాభావానికి దారితీస్తూ.[290][291] ప్రభుత్వం చొరవతీసుకుని క్రమబద్ధీకరణ చేయడానికి దారితీసింది.[292] చైనాలో ఆర్థిక అసమానతలు అత్యధికంగా ఉన్నాయి.[293] అది గత కొన్ని సంవత్సరాలుగా మరింత అభివృద్ధి చెందింది.[294] 2012లో చైనా గిని కోయెఫీషియంట్ 0.474. [295]
చైనా ద్రవ్యం విధానం అంతర్జాతీయం
2008లో అంతర్జాతీయంగా సంభవించిన ఆర్థికసంక్షోభం తరువాత చైనా తాము ఆమెరికన్ డాలర్ మీద ఆధారపడిన విషయం మరియు అంతర్జాతీయ ద్రవ్యవిధానం లోని బలహీనతలు గ్రహించింది.[296] 2009లో చైనా డిం సం బాండులను ప్రవేశపెట్టిన తరువాత ఆర్.ఎం.బి. అంతర్జాతీయం చేయడం వేగవంతం చేయబడడమే కాక సరిహద్దులను దాటి మార్కెట్ విస్తరుంచబడింది. ఆర్.ఎం.బి పైలట్ ప్రాజెక్ట్ ద్వారా పరిష్కారం సూచించిన తరువాత ఆర్.ఎం.బి లిక్విడిటీ పూల్స్ స్థాపించడానికి మార్గం సులువైంది. [297][298]2010 నవంబరులో రష్యా చైనాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ద్రవ్యాన్ని ఉపయోగించడం ఆరంభించింది. [299] తరువాత దీనిని జపాన్,[300]ఆస్ట్రేలియా,[301] సింగపూర్,[302] యునైటెడ్ కింగ్డం, [303] మరియు కెనడాలు అనుసరించాయి.[304] చైనా ద్రవ్యాన్ని అంతర్జాతీయం చేసిన కారణంగా 2013 నాటికి ప్రపంచపు ద్రవ్య వాణిజ్యంలో చైనా 8వ స్థానానికి చేరుకుంది.[305]
శాస్త్రీయం మరియు సాంకేతికం
చరిత్రాత్మకం
మింగ్ రాజవంశం వరకు చైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచానికి నాయకత్వం వహించింది. కాగితం తయారీ, తూర్పు ఆసియాలో ముద్రణ, దిక్సూచి, మరియు తుపాకిమందు (నాలుగు గొప్ప నూతన ఆవిష్కరంణలలో ఒకటి) వంటి ప్రాచీన చైనీస్ పురాతన ఆవిష్కరణలు తరువాత ఆసియా మరియు ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందాయి. చైనీస్ గణిత శాస్త్రజ్ఞులు మొట్టమొదటగా ప్రతికూల సంఖ్యలు ఉపయోగించారు. .[306][307] అయినప్పటికీ 17 వ శతాబ్దం నాటికి పాశ్చాత్య ప్రపంచదేశాలు శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధిలో చైనాను అధిగమించాయి.[308] ఈ గ్రేట్ డైవర్జెన్స్ కారణాల విషయంలో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయి.[309] 19 వ శతాబ్ధంలో పశ్చిమ దేశాలలో జరిగిన యుద్ధాలలో అపజయాలు పునరావృతం అయిన తరువాత చైనా సంస్కర్తలు స్వీయ సంఘటిత శక్తిని అభివృద్ధిచేసే ఉద్యమంలో భాగంగా ఆధునిక శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధికి మఖ్యత్వం ఇచ్చారు. కమ్యూనిస్టులు 1949 లో అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రీయ మరియు సాంకేతికాభివృద్ధి ప్రయత్నాలకు సోవియట్ యూనియన్ విధానాలు ఆధారంగా కొనసాగించారు. శాస్త్రీయ పరిశోధనలు కేంద్రం ప్రణాళికల ఆధారంగా నిర్వహించబడుతున్నాయి.[310] 1976 లో మావో మరణానంతరం శాస్త్రీయ మరియు సాంకేతిక పరిశోధనలు నాలుగు ఆధునీకరణలలో ఒకటిగా చేర్చబడ్డాయి.[311] అంతేకాక సోవియట్-ప్రేరిత విద్యా వ్యవస్థ క్రమంగా సరిదిద్దబడింది. [312]
Modern era
సాంస్కృతిక విప్లవం ముగింపు తరువాత చైనా శాస్త్రీయ పరిశోధనల కొరకు గణనీయమైన పెట్టుబడి చేసింది.[313]2012లో చైనా శాస్త్రీయ పరిశోధనలు మరియు అభివృద్ధి కొరకు 163 బిలియన్లు వ్యయం చేసింది.[314] శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధి చైనా ఆర్థిక మరియు రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమని చైనా విశ్వసించడం ఇందుకు కారణం. సాంకేతిక జాతీయత జాతికి గర్వకారణమని కొన్ని మార్లు వర్ణిస్తూ ఉంటారు.[315]అయినప్పటికీ చైనా బేసిక్ మరియు సైంటిఫిక్ పరిశోధనలు సాంకేతికరంగంలో యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్లకంటే వెనుకబడి ఉంది.[313][316] చైనాలో పుట్టిన శాస్త్రీయపరిశోధకులు ఒకసారి భౌతికశాస్త్రంలో " నోబుల్ బహుమతి " అందుకున్నారు. చైనా శాస్త్రీయపరిశోధకులు పాశ్చాత్యదేశాలలో చేసిన పరిశోధనల కొరకు నోబుల్ బహుమతి అందుకున్నారు.త్సంగ్- డియో - లీ,[317] చెన్ నింగ్ యంగ్ [317] డానియల్ సి త్సుయి చైనాలో జన్మించి భౌతికశాస్త్రంలో నాలుగుమార్లు నోబుల్ బహుమతి అందుకున్నారు. మరియు ఒకసారి రసాయనశాస్త్రంలో నోబుల్ బహుమతి అందుకున్నారు. వీరందరూ శాస్త్రీయపరిశోధకులు పాశ్చాత్యదేశాలలో చేసిన పరిశోధనల కొరకు నోబుల్ బహుమతి అందుకున్నారు. [318] చార్లెస్ కె.కయో [319] యుయాన్ టీ లీ [320]}} కూడా వీరిలో ఉన్నారు.
చైనా స్టెం ఫీల్డ్, గణితం మరియు ఇంజనీరింగ్ విభాగాలలో తమ విద్యావిధానంలో వేగవంతమైన అభివృద్ధి సాధించింది. 2009లో చైనా 10,000 మంది పి.హెచ్.డి ఇంజనీరింగ్ పట్టభద్రులను, 5 లక్షల మంది బి.ఎస్.సి పట్టభద్రులను తయారు చేసి ఇతరదేశాలలో ఉన్నతస్థానంలో నిలిచింది.[321] చైనా విద్యాసంబంధిత పుస్తకాలను (శాస్త్రీయపరిశోధనా పత్రాలు) ప్రచురించడంలో చైనా ప్రపంచంలో రెండవస్థానంలో ఉంది. 2010లోచైనా 121,500 శాస్త్రీయపరిశోధనా పత్రాలు ప్రచురించబడగా వీటిలో 5,200 శాస్త్రీయపరిశోధనా పత్రాలు ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. [322] హుయావీ మరియు లెనోవో వంటి చైనా సాంకేతిక సంస్థలు టెలీ కమ్యూనికేషంస్ మరియు పర్సనల్ కంప్యూటింగ్‌లో ప్రపంచ ప్రముఖ సంస్థలుగా గుర్తించబడుతున్నాయి.[323][324][325] చైనా సూపర్ కంప్యూటర్లు స్థిరంగా టి.ఒ.పి 500 (ప్రంపంచంలో అత్యధిక శక్తివంతమైనవి) గా పరిగణించబడుతున్నాయి.[326][327] చైనా అదనంగా పారిశ్రామిక రొబోట్లను గణనీయంగా ఉపయోగిస్తున్న దేశంగా గుర్తించబడుతుంది. 2008-2011 మద్య కాలంలో మల్టీ రోల్ రొబోటులను చైనా సంస్థలలో ఉపయోగించడం 136% అధికరించింది.[328] చైనా అంతరిక్ష కార్యక్రమాలు ప్రపంచ క్రియాశీలక కార్యక్రమాలలో ఒకటిగా ఉండి చైనా జాతీయఘనతకు ప్రధాన ఆధారంగా ఉంది. [329][330] 1970లో చైనా తన మొదటి శాటిలైటు డాంగ్ ఫాంగ్ హాంగ్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టి స్వతంత్రంగా అంతరిక్షంలో శాటిలైటును ప్రవేశపెట్టిన ఐదవ దేశంగా ప్రత్యేకత సంతరించుకుంది. [331] 2013లో చైనా విజయవంతంగా చంద్రుని వద్దకు చాంఘె 3 ప్రోబ్ మరియు యుతురోవర్‌ను పంపింది. 2003లో చైనా స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపి మానవులను అంతరిక్షంలోకి పంపిన మూడవదేశంగా నిలిచింది. యాంగ్ లివీతో షెంఖౌ 5ను, 2015 10 మంది చైనీయులు అంతరిక్షానికి పంపబడ్డారు. వీరిలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. 2011లో చైనా మొదటి అంతరిక్ష స్థావరం తియాంగంగ్ -1 అంతరిక్షంలో ప్రవేశపెట్టబడింది.[332] 2013లో చైనా విజయవంతంగా చాంఘె 3 ప్రోబ్ మరియు యుతురోవర్‌ను పంపింది. 2017 నాటికి చైనా ల్యూనార్ శ్యాంపిల్స్ సేకరించాలని యోచిస్తుంది.[333]
Infrastructure
టెలికమ్యూనికేషన్
చైనా మొబైల్ ఫోన్లు అధికంగా ఉపయోగిస్తున్న (2012 నాటికి 1 బిలియన్ సెల్ ఫోన్‌ల కంటే అధికం)దేశాలజాబితాలో చైనా ఒకటి.[334] అంతర్జాలం అధికంగా ఉపయోగిస్తున్న దేశాలలో చైనా ఒకటి. [335]2013 నాటికి 591 మిలియన్ల అంతర్జాల వినియోగదారులు ఉన్నారు. జనసఖ్యలో 44%.[336] 2013 నివేదికలు జతీయ సరాసరి అంతర్జాల ఉపయోగం 3.14 ఎం.బి. [337] 2013 గణాంకాలను అనుసరించి చైనా ప్రపంచంలో అంతర్జాలం అనుసంధానం చేయబడిన డివైసెస్‌లో 24% కలిగి ఉంది.[338] ప్రపంచంలో రెండు పెద్ద బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు చైనా టెలికాం మరియు చైనా యునికాం 20% ప్రపంచ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు సేవలు అందిస్తున్నాయి. చైనా యునికాం 40 మిలియన్ కంటే అధికమైన చందారాలకు సేవలు అందిస్తుండగా చైనా టెలికాం ఒంటరిగా 50 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు సేవలు అందిస్తుంది.[339] ప్రధానంగా హుయావీ మరియు జ్తె వంటి అనేక చైనీస్ టెలికమ్యూనికేషన్స్ సంస్థలు చైనా సైనిక రహస్యాలపై నిఘాచేస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.[340] చైనా తన స్వంత ఉపగ్రహ మార్గనిర్దేశనం (శాటిలైట్ నేవిగేషన్) వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. చైనాకు చెందిన బియిడు శాటిలైట్ నేవిగేషన్ సంస్థ 2012 నుండి ఆసియాలో వాణిజ్య సేవలు అందించడం ప్రారంభించింది.[341] 2020 నాటికి ఇది ప్రంపచదేశాలకు సేవలు అందించాలని ప్రయత్నిస్తుంది.[342]
Transport
రహదార్లు[మూలపాఠ్యాన్ని సవరించు]
1990 నుండి చైనా జాతీయరహదారి నెట్‌వర్క్ " చైనా జాతీయ రహదారి నెట్‌వర్క్ " మరియు ఎక్స్ప్రెస్ వే ఆఫ్ చైనా " ల ద్వారా గణినీయంగా విస్తరించబడింది. 2011లో చైనా రహదారుల పొడవు 85000 కి.మీ లకు చేరింది. చైనా రోడ్డు నెట్వర్క్ చైనాను ప్రపంచంలో అతిపొడవైన రోడ్డు నెట్‌వర్క్ కలిగిన దేశాల జాబితాలో చేర్చింది. [343] 1991లో యంగ్త్జె నదిమీద ఆరు వంతనలు మాత్రమే నిర్మితమై ఉన్నాయి. ఇవి చైనాను దక్షిణ మరియు ఉత్తర చైనాలుగా విడదీస్తుంది. 2014 అక్టోబరు నాటికి యంగ్తె నది మీద 81 వంతెనలు మరియు టన్నెల్స్ (కనుమలు) నిర్మించబడ్డాయి.చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌ను కలిగి ఉంది. ఆటో ఉత్పత్తి మరియు తయారీలో చైనా యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించింది. 2009లోచైనా ఆటో విక్రయాలు 13.6 మిలియన్లకు చేరుకుంది. [344] అలాగే 2020 నాటికిది 40 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.[345] చైనా రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి కారణంగా ట్రాఫిక్ విపత్తులు గణనీయంగా పెరిగాయి.[346] ట్రాఫిక్ చట్టాలు బలహీనంగా ఉన్నందున 2011లో మాత్రమే 62,000 చైనీయులు రోడ్డు విపత్తులలో మరణించారు. [347] నగరప్రాంతాలలో ప్రజలు ఆటో వాహనాలను ఉపయోగాన్ని తగ్గించడానికి ప్రయాణానికి సాధారణంగా బైసైకిళ్ళను వాడుతుంటారు. 2012 నాటికి చైనాలోని బైసైకిల్స్ సంఖ్య 470 మిలియన్లు.[348]
రైలు మార్గం
చైనా రైల్వే సంబంధిత చైనా రైల్వే కార్పొరేషన్ రైలు ప్రాయాణీకుల మద్య ప్రపంచంలో అత్యంత రద్దీ అయినదిగా గుర్తించబడుతుంది. చైనాలో మూడు మాసాల రైలు ప్రయాణీకుల సంఖ్య 2006ప్రంపంచ ప్రయాణీకులలో 6% ఉండగా ప్రస్తుతం ప్రంపంచ రైలుప్రయాణీకులలో 25% ఉందని అంచనా.[349][350] 2013గణాంకాలను అనుసరించి చైనాలో 103144 రైల్వేలు ఉన్నాయని అంచనా. As of 2013, the country had 103,144 km (64,091 mi) of railways, the ప్రపంచంలోమూడవ పొడవైన రైలుమార్గం.[351] అన్ని ప్రాంతాలు మరియు భూభాగాలు రైలు మార్గంతో అనుసంధానించబడింది. చైనా కొత్తసంవత్సరం రోజున దేశవ్యాప్తంగా విస్తారంగా ప్రయాణిస్తుంటారు. [350] 2013లో చైనా రైల్వేలు 2.106 బిలియన్ల పాసింజర్ ట్రిప్పులు నిర్వహిస్తూ, పాజింజర్ రైళ్ళు 1,059.56 కి.మీ ప్రయాణించాయి. అలాగే 3.967 బిలియన్ టన్నుల సరుకును బదిలీ చేసింది. కార్గోలు 2,917.4 కి.మీ ప్రయాణించాయి.[351]
హైస్పీడ్ రైళ్ళు
చైనా హైస్పీడ్ రైళ్ళు (హెచ్.ఎస్.ఆర్) విధానం 2000 లోనే మొదలైయ్యాయి. అలాగే 11028 కి.మీ పొడవైన రైలు మార్గం నిర్మించబడింది. చైనా హైస్పీడ్ రైలు మార్గం ప్రంపంచంలో పొడవైనదిగా భావించబడుతుంది.[352] చైనా హైస్పీడ్ నెట్‌వర్క్‌లో బీజింగ్-గ్వంగ్స్యూ-షెన్జెన్-హాంకాంగ్ హై-స్పీడ్ రైల్వే ( హెచ్.ఎస్.ఆర్ ప్రపంచంలో ఒకే పొడవైన రైలుమర్గంగా గుర్తించబడుతుంది) మరియు బీజింగ్ - షంఘై హైస్పీడ్ రైల్వే (బీజింగ్-షాంఘై దురిత రైల్వే) భాగంగా ఉన్నాయి. చైనాలో ప్రపంచంలోని పొడవైన రైలువంతెనలు మూడు ఉన్నాయి.[353] 2020 నాటికి హెచ్.ఎస్.ఆర్ ట్రాక్ నెట్‌వర్క్ పొడవు 16000 కి.మీ చేరుకుంటుందని భావిస్తున్నారు.[354] షాంఘై మాగ్లేవ్ ట్రైన్ గంటకు 431కి.మీ ప్రయాణిస్తూ ప్రంపంచంలో అతివేగమైన రైలుగా గుర్తించబడుతుంది.[355]
2014 గణాంకాలను అనుసరించి " చైనా అర్బన్ రైల్ ట్రాంసిస్ట్ "లో2020 నాటికి మరొక డజన్ రైళ్ళు చేర్చబడతాయి అని అంవనా.[356]
మెట్రో రైళ్ళు[మూలపాఠ్యాన్ని సవరించు]
షంఘై మెట్రో, బీజింగ్ సబ్వే, గౌంగ్‌ఝౌ మెట్రో, హాంగ్ కాంగ్ ఎం.టి.ఆర్ మరియు షెన్‌జెన్ మెట్రో రైళ్ళు చైనా మెట్రో రైళ్ళ జాబితాలో ఉన్నాయి.
వాయుమార్గం
2012 గణాంకాలను అనుసరించి చైనాలో 82 కమర్షియల్ విమానాశ్రయాలు ఉన్నాయి. 2015 నాటికి అదనంగా 82 సరికొత్త విమానాశ్రయాలు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించబడింది.2013 గణాంకాలను అనుసరించి ప్రంపంచంలో నిర్మాణదశలో ఉన్న విమానాశ్రయాలలో మూడవ వంతు చైనాలో ఉన్నాయి.[357] 2011లో 1,910 గా ఉన్న చైనా విమానాల సంఖ్య 2031 నాటికి 5,980కి చేరుకుంటుందని అంచనా. [357] పౌర విమానయానంలో వేగవంతమైన విస్తరణ, ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాలలో చైనా లోని అతిపెద్ద విమానాశ్రయాలు కూడా చేర్చబడ్డాయి. 2013 లో, బీజింగ్ లోని కేపిటల్ విమానాశ్రయం (ఇది 2002 లో 26 ఉంది) ప్రయాణీకుల రద్దీ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది.2010 నుండి, హాంగ్ కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు షంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రపంచంలోని సరుకు రవాణా విమానాశ్రయాలలో మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి.
చైనా యొక్క గగనతలం 80% సైన్య ఉపయోగానికి పరిమితం, మరియు ఆసియాలో నాణ్యతలేని సేవలు అందిస్తున్న 10 విమానాశ్రయాలలో 8 విమానయాన సంస్థలు చైనాలో ఉన్నాయి. చైనా విమానాశ్రాలలో జరుగుతున్న జాప్యాలే ఇందుకు కారణం.[358]
జలమార్గాలు
చైనాలోని 2,000 పైగా నది మరియు సముద్ర ఓడరేవులలో విదేశీ షిప్పింగ్ కొరకు తెరవబడినవి 130 . 2012 లో, షాంఘై, హాంగ్ కాంగ్, షెన్జెన్, నింగ్బో-సూషన్, గ్వాంగ్ఝౌ, క్వింగ్డయో, టియాంజిన్ నౌకాశ్రయాలు, డేలియన్ కంటైనర్ ట్రాఫిక్ మరియు సరకు రవాణాలో ప్రపంచంలోనే అగ్ర స్థానాల్లో నిలిచాయి.[359]
Demographics
2010లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరవ గణాంకాలను అనుసరించి చైనా జనసంఖ్య 1,370,536,875 ఉంటుందని అంచనా. వీరిలో 14 సంవత్సరాలకు తక్కువ వయసున్నవారి శాతం 16.60%, 15-59 మధ్య వయస్కుల శాతం 70.40% మరియు 60 సంవత్సరాల పైబడిన వయసున్నవారి శాతం 13.26%. [360] 2013 జనసంఖ్యాభివృద్ధి శాతం 0.4%.[361]పశ్చిమ దేశాల ప్రమాణాలు అనుసరించి 1978 నుండి చైనాలో జరుగుతూన్న వేగవంతమైన ఆర్థికాభివృద్ధి మిలియన్లకొద్దీ ప్రజలను పేదరికం నుండి వెలుపలకు తీసుకువచ్చిందని భావిస్తున్నారు. ప్రస్తుతం 10% ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని అంచనా (1978 ముందు 64%). 2007 నాటికి చైనాలోని నగరప్రాంతాలలో నిరుద్యోగం 4% నికి చేరుకుటుందనిని అంచనా వేయబడింది.[362][363][364] 1.3 బిలియనులుగా ఉన్న చైనా జనసంఖ్య మరియు క్షీణించి పోతున్న సహజవనరులు చైనా అధికంగా ఆందోళన చెందుతూ ఉంది. 1979 నుండి చైనా జసంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.[365]అందుకొరకు కఠినమైన ఒక బిడ్డ మాత్రమే విధానం అనుసరిస్తుంది. 2013కు ముందు ఒక కుటుంబాబినికి ఒకే బిడ్డ అనే విధానంలో కొన్ని స్థానిక సముదాయాలకు మినహాయింపు మరియు గ్రామీణ ప్రాంతాలలో కొంత సడలింపు ఉండేది. 2013 తరువాత ఒకే బిడ్డ విధానాన్ని సడలించి ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలు మరియు సింగిల్ పేరంట్ (విడిగా ఉండే జంటలలోతల్లి లేక తండ్రి) కు ఒకే బిడ్డ విధానం ప్రవేశపెట్టబడింది.[366] చైనా కుటుంబనియంత్రణ మంత్రి 2008లో ఒకే బిడ్డ విధానం 2020 వరకు ఉండాలని సూచించాడు.[367] ఒకే బిడ్డ విధానానికి గ్రామీణ కుటుంబాలలో వ్యతిరేకత ఉంది. వ్యవసాయ శ్రామికుల అవసరం మరియు మగపిల్లలకు సంప్రదాయంలో ఉండే ముఖ్యత్వం ఇందుకు ఒక కారణంగా ఉంది. అందువలన గణాంకాల సమయంలో కుటుంబాలు నిజం మరుగుపరుస్తూ ఉండేవారు. [368] 2010 గణాంకాలను అనుసరించి టోటల్ ఫర్టిలిటీ శాతం 1.4% ఉంది. [369]
మగపిల్లలకు సంప్రదాయలో ఉండే ముఖ్యత్వం కారణంగా సమాజంలో స్త్రీ:పురుష నిష్పతీలో సమతుల్యత దెబ్బతిన్నది..[370][371] 2010 గణాంకాలను అనుసరించి యువతీ:యువకుల నిష్పత్తి 100:118.06 ఉంది.,[372] ఇది సాధారణంగా ఉండే 100:105 గా ఉండే స్త్రీ పురుష నిష్పత్తిని అధిగమించింది.[373]2010 గణాంకాలు అనుసరించి మొత్తం జనసంఖ్యలో పురుషులు 51:27 % ఉన్నారని తెలియజేస్తున్నాయి.[372][372]
సమూహాలు
చైనా అధికారికంగా 56 స్థానిక సముదాయాలను గుర్తించింది. వారిలో హాన్ చైనీయుల సమూహం సంఖ్యాపరంగా ప్రథమస్థానంలో ఉన్నదని భావిస్తున్నారు. వీరు మొత్తం చైనాజనసంఖ్యలో 91.51% ఉన్నారని భావిస్తున్నారు.[10] హాన్ చైనీయులు ప్రపంచంలో అతిపెద్ద సప్రదాయసముదాయంగా అంచనావేయబడింది.[374][375] 2010 గణాంకాలను అనుసరించి స్థానిక మైనారిటీ సముదాయాలకు చెందినవారి శాతం 8.49%.[10] 2000 గణాంకాలను అనుసరించి హాన్ చైనీయుల సంఖ్య 66,537,177 (మొత్తం జనసంఖ్యలో 5.74%). మిగిలిన స్థానిక ప్రజల సంఖ్య 7,362,627 (6.92%).[10] 2010 గణాంకాలను అనుసరించి చైనాలో నివసిస్తున్న మొత్తం జనసంఖ్య 593,832. వీరిలో అత్యధికులు దక్షిణకొరియాకు చెందినవారి సంఖ్య 120,750, యునైటెడ్ స్టేట్స్ ప్రజలసంఖ్య 71,493 మరియుజపాన్ ప్రజలసంఖ్య 66,159.[376]
Languages
చైనాలో 292 సజీవభాషలు ఉన్నాయి.[377] సాధారణంగా చైనాలో సినో- టిబెటన్ కుటుంబానికి చెందిన సింధిక్ భాష అధికంగా వాడుకలో ఉంది. అందులోని మాండరిన్ భాషను 70% మంది ప్రజలకు వాడుకభాషగా ఉంది.[378] అదనంగా వూ చైనీస్ (షంగైనీతో చేర్చినది), యూఏ (కాంటనెసెతో చేర్చినది) మరియు తైషనెసె, మిన్ చైనీస్ (హొకియన్ మరియు తెయోచ్యు), క్సియాంగ్, గాన్ చైనీస్ మరియు హక్కా చైనీస్ భాషలు వాడుకలో ఉన్నాయి. టిబెటో - బర్మన్, ప్రామాణిక టిబెట్, క్వియాంగ్, నక్సి మరియు మరియు ఈ భాషలు టిబెటన్ మైదానంలో వాడుకభాషలుగా ఉన్నాయి. ఆగ్నేయచైనాలో తాయ్- కడై కుటుంబానికి చెందిన ఝుయాంగ్, డాంగ్ మరియు సుయీ, హ్మాంగ్ మియన్ కుటుంబానికి చెందిన హ్మోంజిక్ (మియో),మియెనిక్ (యాఒ) మరియు ఆస్ట్రోయేసియాటిక్ కుటుంబానికి చెందిన వా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈశాన్యచైనాలో మంగోలియన్ మరియు ఉయుఘూర్, కళక్, క్యర్గిజ్, సాలర్ మరియు సెటర్న్ యుగూర్ మొదలైన పలు టర్కిక్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఉత్తర కొరియన్ సరిహద్దులో కొరియన్ భాష వాడుకలో ఉంది. ప్రధాన చైనాలో సరికో, ఇండో యురేపియన్ కుటుంబానికి చెందిన తక్సిక్, తైవానీ భాషలు, ఆస్ట్రోనేషియన్ భాషలు వాడుకలో ఉన్నాయి.[379] చైనా ప్రామాణిక భాష మాండరిన్ బీజింగ్ యాసతో బీజింగ్‌లో వాడుకలో ఉంది.[380]
లిపి
వేలాది సంవత్సరాల నుండి సింటిక్ భాషలు వ్రాయడానికి చైనా లిపి వాడబడుతూ ఉంది. 1956లో ప్రభుత్వం సరళీకృతం చేయబడిన లిపిని ప్రవేశపెట్టింది. ఇది పురాతనకాల చైనా ప్రధాన భూమిలో వాడుకలో ఉన్న ఉండేది. టిబెటన్ అక్షరాలకు బ్రాహిక్ లిపి ఆధారంగా ఉంటుంది. మంగోలియన్ మరియు మంచు భాషలు రెండూ పురాతన ఉయఘూరు భాష లిపి నుండి జనించాయి. ఆధునికమైన ప్రామాణికమైన ఝుయాంగ్ వ్రాయడానికి లాటిన్ లిపి ఉపయోగించబడుతుంది.
నగరీకరణ
సమీప దశాబ్ధాలలో చైనా అధికంగా నగరీకరణ చేయబడింది. 1990 నగ్రప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలశాతం 20%2014 నాటికి 50% నికి చేరుకుంది. [381][382] 2030 నాటికి చైనా నగరప్రాంత నివాసితుల సంఖ్య 1 బిలియన్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. [381][382] 2012 గణాంకాలను అనుసరించి చైనాలో 262 మిలియన్ల వలస శ్రామికులు నగరాలలో నివసిస్తున్నారని అంచనా. అధికంగా గ్రామీణ శ్రామికులు నగరాలలో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.[383] చైనాలో 1 మిలియన్ జనసంఖ్య కలిగిన 160 నగరాలు ఉన్నాయి. [384] వీటిలో 10 మిలియన్ల అధికమైన జనసంఖ్య కలిగిన 7 మహానగరాలు ఉన్నాయి. అవి వరుసగా చాంగ్క్విక్, షంఘై, బీజింగ్, గుయాంగ్ఝౌ, తియాంజిన్, షెంజెన్ మరియు వుహాన్.[385][386][387] 2025 దేశంలో మిలియన్ జనసంఖ్య కలిగిన 221 నగరాలు ఉంటాయని భావిస్తున్నారు.[381] క్రింద టేబుల్‌లో 2010 గణాంకాలను అనుసరించిన నగరాల జాబితా ఉంది. [3] ఇది నగరనిర్వహణ పరిమితిలో నివసిస్తున్న నివాసితుల సంఖ్య మాత్రమే. ఇది కాక నగరాలలో నివసిస్తున్న వలస శ్రామికుల సంఖ్యను చేర్చి గణించడంలో అయోమయం నెలకొంటున్నది.[388] క్రింద ఇచ్చిన సంఖ్య దీర్ఘకాలంగా నగరాలలో నివసిస్తున్న వారిసంఖ్య మాత్రమే.
విద్య
1986 నుండి చైనాలో నిర్భంధ ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య అమలులో ఉంది. గత 9 సంవత్సరాల నుండి తొలగించబడింది.[390] 2010లో 82.5% విద్యార్థులు మూడుసంవత్సరాల సెకండరీ విద్యను కొనసాగిస్తున్నారు. .[391]2010లో నిర్వహించిన చైనా " జాతీయ విశ్వవిద్యాలయం " ప్రవేశపరీక్షకు హాజరైన విద్యార్థులు 27% ఉన్నతవిద్యకు అర్హత సాధించారు. [392] సెకండరీ మరియు టెర్రిటరీ స్థాయి నుండి ఒకేషనల్ విద్య అందుబాటులో ఉంది.[393] 2006 ఫిబ్రవరి నుండి ప్రభుత్వం పూర్తిగా 9 సంవత్సరాల ఉచితవిద్యను ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు ఉచిత రుసుముతో అందించింది.[394]2003లో వార్షికంగా విద్యాభివృద్ధికి 50బిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయం చేయబడగా 2011 నాటికి విద్య కొరకు ప్రభుత్వం 250 బిలియన్ల అమెరికన్ డాలర్లకంటే అధికంగా వ్యయం చేసింది.[395] అయినప్పటికీ విద్యకొరకు చేయబడప్డుతున్న వ్యయంలో అసమానతలు ఉన్నాయి. 2010లోవార్షికంగా సెకండరీ స్కూల్ కొరకు బీజింగ్‌లో ఒక్కొక్క విద్యార్థికి 20,023 యుయానులు వ్యయం చేయబడగా, గుయిఝౌలో ఒక్కొక్క విద్యార్థికి 3,204 యుయానులు వ్యయం చేయబడ్డాయి.[396] చైనాలో ఉచిత విద్య ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయి వరకు 6-15 సంవత్సరాల వరకు అందించబడుతుంది. 2011లో 81.4% చైనీయులు సెకండరీ విద్యను పూర్తిచేసారు.[397] 2007 నాటికి చైనాలో 396,567 ప్రాథమిక, 94,116 మాధ్యమిక మరియు 2,236 హైయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి.[398]2010 గణాంకాలను అనుసరించి చైనాలో 94% అక్షాశ్యులు ఉన్నారు. [399] 1950లో 20% ప్రజలు మాత్రమే అక్షరాశ్యులుగా ఉన్నారు. [400] 2009లో షంఘై లోని విద్యార్థులు గణితం, సైన్సు మరియు లిటరసీలో అంతర్జాతీయంగా ఉన్నత ఫలితాలు సాధించారు. " ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ " 15 సంవత్సరాల విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహించింది. [401]
ఆరోగ్యం
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ ప్రాంతీయ హెల్త్ బ్యూరోతో కలిసి చైనీయుల ఆరోగ్యావసరాలను పర్యవేక్షింస్తుంది. [402] 1950లో " పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ " చైనీస్ ఆరోగ్య విధానం రూపొందించింది. ఆ సమయంలో, కమ్యూనిస్టు పార్టీ పారిశుద్ధ్యం, పరిశుభ్రత అభివృద్ధి, చికిత్స మరియు అనేక వ్యాధులు నిరోధించడం లక్ష్యంగా " పేట్రియాటిక్ హెల్త్ కంపాజిన్ " (దేశభక్తిపూర్వక ఆరోగ్యం ప్రచారం) పేరిట ప్రారంభించారం ప్రారంభించింది. గతంలో చైనాలో ఉధృతంగా ఉన్న కలరా, టైఫాయిడ్ మరియు స్కార్లెట్ ఫీవర్ మొదలైన వ్యాధులు ప్రచారం ద్వారా దాదాపు నిర్మూలించవచ్చు అని భావించారు. 1978 లో "డెంగ్ జియావోపింగ్ " ఏర్పరచిన ఆర్థిక సంస్కరణల తరువాత మంచి పోషణ కారణంగ చైనీస్ ప్రజా ఆరోగ్యం వేగంగా మెరుగైంది. గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ఉచిత ప్రజారోగ్య సేవలు క్రమంగా అదృశ్యమయ్యాయి. ప్రైవేటీకరణ మరియు నాణ్యమైన ఆరోగ్యసేవలతో చైనా ఆరోగ్యసంరక్షణ అభివృద్ధి చెందింది. 2009 లో ప్రభుత్వం 124 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో 3-సంవత్సరాల బృహత్తర ప్రణాళిక ద్వారా ఆరోగ్యసంరక్షణ సదుపాయం అందించడం ప్రారంభించింది.[403] 2011 నాటికి 95% చైనా ప్రజలు బేసిక్ హెల్త్ ఇసూరెంస్ సౌకర్యం పొదారు.[404] 2011లో చైనా ప్రంపంచంలో అత్యధికంగా ఔషధాలు సరఫరాచేస్తున్న దేశాలలో మూడవ స్థానానికి చేరుకుంటుందని అంచనా వేయబడింది.[405]2012గణాంకాలు అనుసరించి చైనీయుల ఆయుఃపరిమాణం 75 సంవత్సారాలు. [406] శిశుమరణాలు 1000 మందికి 12.[407] 1950 నుండి చైనీయుల ఆరోగ్యం మరియు ఆయుఃపరిమాణంలో అభివృద్ధి చెందింది.[408] అలాగే 1950లోశిశుమరణాల సంఖ్య 1000 మందికి 300 ఉండగా 2001 నాటికి 1000 మందికి 33కి చేరుకుంది.[409]}}అభివృద్ధి కారణంగా పోషకాహార లోపం 33.1% నుండి 2010 నాటికి 9.9% తగ్గించబడింది. [410] ఆరోగ్యసంరక్షణలో అభివృద్ధి మరియు ఆధునిక వైద్య సదుపాయాల అందుబాటుతో చైనా వాయు కాలుష్యం కారణంగా శ్వాససంబంధిత సమస్యలు మొదలైన పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాది.[411] చైనాలో మిలియన్ల కొద్దీ ప్రజలకు పొగాకు సంబధిత పొగత్రాగే అలవాటు ఉంది.ఇది కూడా శ్వాసవ్యాధులకు ఒక కారణంగా ఉంటుంది. [412] నగరప్రాంత యువతలో ఊబకాయం అధికం ఔతుంది.[413][414] సమీపకాలంగా చైనాలో అధికజనసంఖ్య మరియు జనసాంధ్రత అధికంగా ఉన్న నగరాలలో తీవ్రమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. 2003లో సార్స్ వ్యాధి వ్యాపించడం వీటిలో ఒకటి.అది ఇప్పటికీ చైనాలో ఆరోగ్యసమ్యగా ఉంది.[415] 2010లో చైనాలో వాయుకాలుష్యం కారణంగా 1.2 మిలియన్ ప్రిమెచ్యూర్ మరణాలు సంభవించాయి. [416]
మతం
సహస్రాబ్ధి కంటే ముందు నుండి చైనా సంస్కృతి మీద పలుమతాల ప్రభావం ఉంది. కంఫ్యూషియనిజం (ఇది మతంగా పరిగణించడంలో వివాదాలు ఉన్నాయి), [418]}} బుద్ధిజం మరియు తాయిజం చారిత్రకంగా చైనీయుల సంస్కృతిలో ముఖ్యపాత్రవహించాయి.[419][420] ఈ మూడు మతాలలోని అంశాలు జనపదాల ప్రజాల జీవితంలో చొచ్చుకుపోయాయి. [421] చైనా రాజ్యాంగంలో మతస్వాతంత్ర్యం ఉంది. అయినప్పటికీ మతసంబంధిత సంస్థలకు అనుమతి లభించడం కష్టం.[210][422] గణాంకపరంగా చైనా ప్రజలలో అధికంగా వ్యాపించిన మతం తాయిజం మరియు షెన్ అరాధన (శక్తిని ఇచ్చే దైవం) ప్రధానమైనవి.[423] ప్రబల విశ్వాసాలలో కల్ట్ (సముద్రదేవత) ఒకటి.[424][425] యాన్ హంగ్ జిసుని భక్తులలో హౌంగ్డి ఒకరు.[424][426] గౌండి (యుద్ధం మరియు వ్యాపారదేవత) కైషెన్ (సంపద మరియు సంపన్నత ఇచ్చే దేవత) హెనన్ లోని బౌద్ధాలయం ప్రజలలో ప్రాబల్యత కలిగి ఉన్నాయి. 2010 జరిపిన అభిప్రాయ సేకరణలో 47% చైనీయులు తమను నాస్థికులుగా అంగీకరించారు.[427] పరిశోధకులు చైనాలో మతాలమద్య కచ్చితమైన హద్దులు లేవని అభిప్రాయం వెలువరించారు. ప్రత్యేకంగా ప్రాంతీయ ప్రజలు అనుసరించే విధానంలో బుద్ధిజానికి మరియు తాయిజానికి వ్యత్యాసం తక్కువగా ఉంది.[419]
మతపరమైన గణాంకాలను అనుసరించి చైనాలో 30-80% ప్రజలు ఫోల్క్ రిలీజియన్ మరియు తాయిజాన్ని అనుసరిస్తున్నారని అంచనా. 10-16% బుద్ధిజం, 2-4% క్రైస్తవ మతం మరియు 1-2% ముస్లిములు ఉన్నారు. హాన్ ప్రజలు ప్రాంతీయ మతవిధానాన్ని అనుసరిస్తున్నారు. చైనాలో అల్పసంఖ్యాక స్థానికులు ఉన్నారు. వివిధ మతాలకు చెందిన స్థానిక ప్రజలు 2-3% ఉన్నారు. బుద్ధిజీవులలో కంఫ్యూషియనిజం మతంగా పరిగణించబడితుంది. స్థానిక ప్రజలలో టిబెటన్ బుద్ధిజం, ఇస్లాం హుయీ మరియు మతాలు అనుసరించపడుతున్నాయి
సైన్యం
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సైన్యాన్ని నిర్వహిస్తుంది. దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (ప్రజా స్వాతంత్ర్య సైన్యం) అని పిలుస్తారు. దీనిలో నావికా దళం, వాయు దళం ఉన్నాయి.2005లో దీని బడ్జటు సుమారుగా మూడువేల కోట్ల డాలర్లు (పదిహేను వేల కోట్ల రూపాయలు ?)కానీ ఈ బడ్జటు విదేశీ ఆయుధాలు, ఇతర పరిశోధనల ఖర్చు కాకుండా! విమర్శకులు ఈ బడ్జటును ఇంకా చాలా ఎక్కువగా చెపుతారు. ఇటీవలి రాండ్ (RAND) అను సంస్థ ప్రకారం ఈ ఖర్చు రెండు రెట్లు ఎక్కువ! ఇది అమెరికా సంయుక్త రాష్టాల నాలుగు వందల బిలియన్ డాలర్ల తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలుస్తుంది. దీనికి చక్కని అణు ఆయుధాలు, ఇతర ప్రధాన ఆయుధాలు ఉన్నప్పటికీ, బలహీనమైన నావికాదళం, విమాన వాహక నౌకలు, వైమానిక దళంలోని పాత విమానాల వల్ల, తక్కువ శిక్షణా సమయం వల్ల దీనిని ప్రపంచపు సూపర్ పవరుగా గుర్తించరు, కానీ ఓ ప్రాంతీయ శక్తిగా మంచి గుర్తింపు ఉంది.
- భారత్‌కు పాక్ కంటే చైనానుంచే ఎక్కువ ప్రమాదముందని భారత వాయుసేనాధిపతి హోమీమేజర్ అభిప్రాయపడ్డారు. భారత్-చైనాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నది.ఈనాడు 24.5.2009.
- మన దేశంలో జంతువుల పేర్లతో రాశులున్నట్లు, చైనాలో 12 సంవత్సరాలకు జంతువుల పేర్లతో పిలుస్తారు. అవి మూషికం, వృషభం, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడిపుంజు, కుక్క మరియు పంది. వీరికి 1972, 1984, 1996, 2008 మూషిక నామ సంవత్సరాలు. ఫిబ్రవరి 7 నుండి చైనా కాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలౌతుంది.
చైనా వారి ఆవిష్కరణలు
- క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల క్రితమే హ్యాన్ చక్రవర్తి కాలంలో కలపగుజ్జు నుంచి పేపరస్ పేరుతో కాగితం తయారీని కనిపెట్టారు.[27]
- మొట్టమొదటిసారి ముద్రణాయంత్రం తయారు చేసింది చైనా వారే. దీనికి 'ఉడ్‌బ్లాక్ ప్రింటింగ్' అని పేరుపెట్టారు. 220వ సంవత్సరంలో రూపొందించిన ఈ యంత్రం ఆధారంగానే ప్రింటింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది.
- ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్)ని చైనీయులు 1044 లోనే కనుగొన్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల్ని కూడా దీని ద్వారానే గుర్తించారు.
- తొమ్మిదో శతాబ్దంలో కనిపెట్టిన గన్‌పౌడర్ ఆధారంగానే టపాసులు (బాణాసంచా) పుట్టుకొచ్చాయి.
- ప్రపంచం చీనాంబరాలుగా చెప్పుకునే పట్టు వస్త్రాలను క్రీస్తుకు పూర్వం 3630 సంవత్సరాల క్రితమే చైనా అల్లింది. ప్రపంచ వాణిజ్యంలో పై చేయి సాధించింది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఇద్దరు యూరోపియన్లు సన్యాసుల వేషంలో చైనా వెళ్ళి చేతి కర్రల్లో పట్టుపురుగులను తీసుకొచ్చేవరకూ ఆ రహస్యం ప్రపంచానికి తెలియనేలేదు.
- ఇప్పటికి 3000 ఏళ్ళ క్రితమే ఓ చైనా రాజు తన కోటను చుట్టుముట్టిన సైనికులు ఎంత దూరంలో ఉన్నారో కనుగొనడానికి తొలి గాలిపటాన్ని ఎగరేశాడనే కథ ఉంది.
- రోజూ పళ్ళు తోముకునే అలవాటును నేర్పించింది చైనావాళ్ళే అని చెప్పవచ్చు. 1400లోనే వాళ్ళు టూత్‌బ్రెష్‌తో తోముకున్నారు!
- ఐస్‌క్రీం పుట్టింది కూడా ఇక్కడే. క్రీస్తు పూర్వం 2000 నాడే పాలతో కలిపిన బియ్యాన్ని మంచులో ఉంచి తినేవారు
- తేదీలు, ముహూర్తాలు చూస్తే క్యాలెండర్‌ని కూడా క్రీ.పూ. 2600 ల్లోనే రూపొందించారు.
- చైనీయులు క్రీస్తుకు వందేళ్ళ క్రితమే టీ తయారీని కనిపెట్టి, క్రీస్తుశకం 200 ఏళ్ళకల్లా ప్రజల్లోకి టీ ఒక పానీయంగా ప్రాచుర్యం లోనికి తెచ్చారు.
- ముడుచుకునే గొడుగును పరిచయం చేసింది కూడా చైనీయులే. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకే ఇత్తడి ఊసలతో ఇలాంటి గొడుగు చేశారు.
- ఇంకా చెప్పాలంటే పరిశ్రమల్లో ఉపయోగపడే
బ్లాస్ట్‌ఫర్నేస్,
బోర్‌హోల్‌డ్రిల్లింగ్,
ఫోర్క్‌లు,
ఇండియన్ ఇంక్,
దశలవారీగా ప్రయాణించే రాకెట్లు,
రెస్టారెంట్లో మెనూ పద్ధతి,
భూకంపాలను కనిపెట్టే సీస్మోమీటర్,
టాయ్‌లెట్‌పేపర్,
పిస్టన్‌పంప్,
క్యాస్ట్‌ఐరన్,
సస్పెన్షన్ బ్రిడ్జి,
ఇంధనాలుగా బొగ్గు,
సహజవాయువులను వాడే ప్రక్రియ
ఇలాంటివెన్నింటికో తొలి రూపాలు చైనాలో రూపుదిద్దుకున్నాయి.
సంస్కృతి
పురాతనకాలం నుండి చైనీయుల సంస్కృతి మీద కంఫ్యూషియనిజం మరియు సంప్రదాయవాద సిద్ధాంతాల ప్రభావం ఉంది. రాజవంశపాలనలో హాన్ రాజవంశ ఆధారిత పాలకులు సాంఘికాభివృద్ధి కొరకు కృషిచేసారు.[429] చైనీయులసాహిత్యం చైనాసంస్కృతిలో చైనా దస్తూరీ, సంప్రదాయ చైనీయకవిత్వం మరియు చైనా చిత్రలేఖనం మొదలైన చైనాకళారూపాలు చైనానాటకం మరియు నృత్యం కంటే ఉత్తమమైనవిగా భావించబడుతున్నాయి. చైనాసంస్కృతికి దీర్ఘమైన చరిత్ర మరియు అంతర్గత జాతీయదృక్కోణం ఉన్నాయి.[26] Examinations and a culture of merit remain greatly valued in China today.[430] పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరంభకాల నాయకులు సంప్రదాయరాజకుటుంబ వారసత్వానికి చెందినవారై ఉన్నారు. అయినప్పటికీ " మే ఫోర్త్ ఉద్యమం " స్ఫూర్తి మరియు సంస్కరణా సంకల్పప్రభావం కలిగి ఉన్నారు. వారు గ్రామీణ పదవీకాల ప్రమాణం, లింగవివక్ష మరియు కఫ్యూషియ విధానవిద్య, కుటుంబవ్యవస్థ మరియు వినయవిధేయతలు కలిగిన సంస్కృతి మొదలైన చైనాసంస్కృతి కలుపుకుంటూ మార్పులను కోరుకున్నారు. 1949లో స్థాపించబడిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజరికచరిత్ర సంబంధితమై ఉంది. అయినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ చైనాసంప్రదాయాలను త్రోసివేస్తూ అవతరించింది. 1960లో తలెత్తిన సాంస్కృతిక విప్లవ ఉద్యమం కూడా అందులో ఒకటి. కమ్యూనిజం భూస్వామ్య విధాన అవశేషాలను తొలగించే ప్రయత్నం చేసింది. చైనా సంప్రదాయక నీతి, కంఫ్యూషియనిజ సంస్కృతి, కళలు, సాహిత్యం మరియు పెకింగ్ ఒపేరా వంటి కళాప్రదర్శనలు కలగలిసిన చైనాసంస్కృతిని ప్రభుత్వవిధాలు కదిలించాయి. [431] చైనా సంస్కృతిలో గుర్తించతగిన మార్పులు సంభవించాయి. విదేశీ మాధ్యం మీద అత్యధికంగా నిషేధాలు విధించబడ్డాయి.[432] ప్రస్తుత చైనా ప్రభుత్వం నుండి చైనా సంప్రదాయ చౌనా సంస్కృతికి చెందిన పలు విధానాలకు అనుమతి లభిస్తుంది. సంస్కృతిక విప్లవానికి ముగింపు పలకడం చైనాజాతీయత అధికరించడం కారణంగా చైనా కళలు, సాహిత్యం, సంగీతం, చలనచిత్రాలు, ఫ్యాషన్ మరియు నిర్మాణకళకు తిరుగి దృఢమైన పునరుజ్జీవనం లభించింది.[433][434] అలాగే చైనా జానపదకళలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది.[435] చైనా పర్యాటకరంగం కూడా అభివృద్ధిని సాధించింది. చైనా పర్యాటకరంగానికి ప్రపంచపర్యాటక గమ్యాలలో మూడస్థానం లభించింది. [436] 2010లో 55.7 మిలియన్ల పర్యాటకులు చైనాను సందర్శించినట్లు అంచనా.[437] దేశీయపర్యాటకులు కూడా అత్యధికంగా పర్యటిస్తూ చైనా పర్యాటకరంగాన్ని పరిపుష్టం చేస్తున్నారు. 2012లో శలవు దినాలలో పర్యటించిన పర్యాటకుల సంఖ్య 740 మిలియన్లు ఉంటుందని అంచనా.[438]
సాహిత్యం
చైనీయుల సాహిత్యానికి ఝౌ రాజవంశం మూలమై ఉంది.[439]రచనలు చైనీయుల సంప్రదాయం ప్రతిబింబించి ఉంటాయి. రచనలలో విస్తారమైన ఆలోచనలు మరియు చైనీయ సంప్రదాయానికి చెందిన ప్రజగాథలు ఉంటాయి. చైనా కేలండర్, చైనా సైనిక రచనలు, చైనా జ్యోతిషం, చైనా మూలికలు, చైనా భౌగోళికం మరియు పలు ఇతర విషయాలు ఉన్నాయి.[440]ఆరంభకాల రచనలలో ఐ చింగ్ మరియు షూజింగ్ ఫోర్ బుక్స్ మరియు ఫైవ్ క్లాసికల్స్‌లో ఉన్నాయి. [441] తాంగ్ రాజవంశం పాలనలో సంప్రదాయ సాహిత్యం మరియు చైనా సంప్రదాయ సాహిత్యం అభివృద్ధిచేయబడ్డాయి. లీ బై మరియు దూ ఫూ రచనలు కాల్పనికం మరియు వాస్తవికానికి అద్దం పట్టయి.[442] చైనా చరిత్ర షిజితో మొదలైంది. చైనా చారిత్రక సంప్రదాయం " ట్వెంటీ ఫోర్ హిస్టరీస్ "లో ప్రతిబింబిస్తుంది. అది చైనా జానపదాలు మరియు పురాణాల ఆధారితంగా రచించబడింది.[443] " ఫోర్ గ్రేట్ క్లాసికల్ నావెల్స్ " లో మింగ్ రాజవంశ కాలానికి చెందిన పౌరులు, చైనీయుల సంస్కృతిక ప్రతిబింబించే కాల్పనిక సాహిత్యం, చారిత్రక, దేవుళ్ళు దేవతల రచనలు ఉంటాయి. వీటిలో " వాటర్ మార్జిన్", " రోమాంస్ ఆఫ్ త్రీ కింగ్డంస్, జర్నీ టు ది వెస్ట్ మరియు డ్రీం ఆఫ్ ది రెడ్ చాంబర్ ఉన్నాయి. [444] జిన్ యాంగ్ గురించిన కాల్పానిక సాహిత్యం " వుక్సియా " .[445] తూర్పు ఆసియాకు చెందిన ఆసక్తికరమైన సాహిత్యంగా దీనికి ప్రత్యేకత ఉంది. [446] క్వింగ్ సామ్రాజ్యం ముగింపు తరువాత ఆరంభం అయిన " కొత్త సంస్కృతిక విప్లవం " కొత్తశకం మొదలైంది. తరువాత సాధారణ చైనీయుల కొరకు వ్యవహారిక భాషలో సరికొత్త రచనలు వెలువడ్డాయి. హ్యూ షిన్ మరియు ల్యూ క్సన్ ఆధునిక సాహిత్యప్రక్రియలో గుర్తింపు పొందారు.[447] వివిధ సాహిత్యప్రక్రియలలో మిస్టీ పొయిట్రీ, సంస్కృతిక విప్లవం తరువాత ప్రారంభం అయిన స్కార్ సాహిత్యం మరియు క్సన్ జన్ ఉద్యమం మాజిక్ రియలిజంతో ప్రభావితం అయ్యాయి. [448] క్సన్ జన్ సాహిత్య రచయిత మో యాన్ 2012లో నోబుల్ బహుమతి గెలుచుకున్నాడు.[449]
ఆహారసంస్కృతి
చైనీయుల ఆహారసంస్కృతి వైవిధ్యంగా ఉంటుంది. వీటిలో సిచుయాన్, కాంటోనెస్, జైంగ్సు, షండాంగ్, ఫ్యూజియన్, హ్యునాన్, అంహుయి మరియు ఝెజియాంగ్ విధానాలు ప్రబలమైనవి.
[451] ఇవి అన్నీ తరగడం, వేడిచేయడం,వర్ణాలను చేర్చడం మరియు సువాసనలను చేర్చడం వంటి ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. [452] చైనీయుల ఆహారసంస్కృతిలో విస్తారమైన వంటసామాగ్రి ఉపయోగించబడుతుంది. వీటిని తయారు చేయడానికి పలు నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.[453] చైనీయుల వైద్యవిధానాలలో చైనీయులు ఆహారవిధానం కూడా భాగమై ఉంటుంది.[454] దక్షిణచైనాలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉండగా, ఉత్తర చైనాలో గోధుమలతో చేసిన బ్రెడ్ ప్రధాన ఆహారంగా ఉంది. ఆధునిక కాలానికి ముందు చైనీయులు సాధారణంగా ధాన్యం మరియు కూరగాయలను ఆహారంలో అధికంగా ఉపయోగిస్తారు. ప్రత్యేక విందులో మాసం కూడా ఉంటుంది. మాంసకృత్తులు అధికంగా కలిగిన ఆహారం అయిన సోయాబీంస్ ఆధారిత తొఫు మరియు సోయామిల్క్ వంటి వాటిని కూడా చైనీయులు అధికంగా ఆహారంలో తీసుకుంటారు.[455] ప్రస్తుతం చైనాలో పోర్క్ మాంసం ప్రజలలో అధిక ప్రాచుర్యం కలిగి ఉంది. దేశంలో వాడబడుతున్న మొత్తం మాంసాహారంలో నాగువ భాగం పోర్క్ ఉండడం విశేషం. .[456] అదనంగా చైనాలో బౌద్ధ ఆహారవిధానం మరియు చైనా ఇస్లామిక్ ఆహారవిధానం కూడా ఉన్నాయి..[457] దక్షిణ చైనీయుల ఆహారంలో సముద్రతీరం ఉన్నందున మరియు మైల్డర్ వాతావరణం కారణంగా సముద్రజల ఆహారం విస్తారంగా లభిస్తున్నందున సముద్రజల ఆహారం (సీ ఫుడ్) మరియు కూరగాయలు అధికంగా చోటుచేసుకుంటాయి. పొడిగా ఉండే ఉత్తరచైనాలో గోధుమ ఆహారం అధికంగా తీసుకుంటారు.చైనా ఆహారవిధానంలో హాంగ్ కాంగ్ విధానం, అమెరికన్ చైనా ఆహారవిధానం విదేశాలలో ప్రాచుర్యం పొందాయి.
క్రీడలు
ప్రపంచంలోని అతిపురాతన క్రీడా సంప్రదాయం కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనా ఆరంభకాల రాజరికవ్యవస్థలలో ఒకటైన వెస్టర్న్ ఝౌ రాజరిక వ్యవస్థ కాలం నుండి విలువిద్య మరియు కుజు (దాదాపు ఫుట్‌బాల్ సంబంధిత క్రీడ) అభ్యసించబడుతున్నాయి.[458][459]1994లో ఆసియాలో అత్యధికంగా గుర్తించబడుతున్న " చైనీస్ సూపర్ లీగ్ " స్థాపించబడింది. అది . [460] ప్రాబల్యత కలిగిన ఇతర క్రీడలలో చైనీస్ మార్షల్ ఆర్ట్స్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటెన్, స్విమ్మింగ్ మరియు స్నూకర్ ప్రధానమైనవి. బోర్డ్ క్రీడలలో గో (వెయిక్వి), క్సియాంక్వి, మహ్జాంగ్ మరియు చదరంగం మొదలైన క్రీడలకు ప్రాధాన్యత ఉంది.[461] చైనాలో ఫిజికల్ ఫిట్‌నెస్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీటిలో క్విక్ జాంగ్ మరియు తాయ్ చి చుయాన్ వంటి ఉదయకాల వ్యాయామాలు ప్రధానమైనవి. [462] and commercial gyms and fitness clubs gaining popularity in the country.[463]చైనాలో ప్రస్తుతం బాస్కెట్ బాల్‌కు అభిమానులు అధికంగా ఉన్నారు. [464] " ది చైనీస్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ " మరియు అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అత్యధికంగా చైనాప్రజల అభిమానపాత్రంగా ఉన్నాయి. ప్రాంతీయ చైనా క్రీడాకారులలో యాంగ్ మింగ్ మరియు యీ జైన్లియన్ ప్రాధాన్యత కలిగి ఉన్నారు.[465] అదనంగా చైనాలో సైక్లింగ్ చేసేవారు అధికంగా ఉన్నారు. 2012 గణాంకాలను అనుసరించి చైనాలో 470 మిలియన్ల సైకిలిస్టులు ఉన్నారని భావిస్తున్నారు. [348] చైనాలో డ్రాగన్ బోటు రేసింగ్, మంగోలియన్ మల్లయుద్ధం మరియు గుర్రపు పందాలు మొదలైన పలు సంప్రదాయక్రీడలకు కూడా ప్రజాదరణ అధికంగా ఉంది. [466]1932 నుండి చైనా క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో కూడా అధికంగా పాల్గొంటున్నారు. 1952లో చైనా క్రీడాకారులు సమ్మర్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు. 2008 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలకు చైనా ఆతిథ్యం ఇచ్చింది. అందులో చైనా క్రీడాకారులు 51 స్వర్ణపతకాలు సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. [467] 2012 సమ్మర్ పారాలింపిక్స్ క్రీడలలో చైనా క్రీడాకారులు 95 స్వర్ణపతకాలతో 231 పతకాలను సాధించారు.[468][469] చైనా 2011లో గాంగ్డంగ్ లోని షెంఝెన్‌లో " 2011 సమ్మర్ యూనివర్శబుల్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. చైనా లోని తైజన్‌లో " 2013 ఈస్ట్ ఆసియన్ గేంస్ " కు ఆతిథ్యం ఇచ్చింది. 2014 లో చైనా నాంజింగ్‌లో " సమ్మర్ యూత్ ఒలిపిక్స్ " కు ఆతిథ్యం ఇచ్చింది.
మతం
క్రీ.పూ.217లో 12మంది బౌద్దభిక్షువులు చైనా చేరుకున్నారు. క్రీస్తు శకం ఆరంభమైన నాటి నుంచీ యూఎచీ, బాక్ట్రియను, సాగ్డియను మొదలైన పలువురు మధ్య ఆసియా జాతుల వారు చైనాలో బౌద్ధమత విస్తృతికి ప్రయత్నం చేసింది. క్రీ.శ.67లో కశ్యపమతంగుడైన ఇద్దరు భారతీయ భిక్షువులు చైనా వెళ్ళి మింగ్ టి అనే చైనా చక్రవర్తి ఆదరణ గౌరవాలు పొందారు. వారు బౌద్ధ గ్రంథాలను అనువదించి, ఆరాధనలు నెలకొల్పి మతాల ప్రచారం చేసేవారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి