10, జులై 2017, సోమవారం

Tippusulthan/టిప్పూ సుల్తాన్

టిప్పు సుల్తాన్

వికీపీడియా 


Tipu Sultan
ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್
ٹیپو سلطان
పాదుషా
నసీబ్ అద్-దౌలా
ఫతెహ్ అలీ ఖాన్ బహాదుర్
Tipu Sultan BL.jpg
సుల్తాన్ of మైసూరు
పరిపాలనా కాలం29 December 1750 – 4 May 1799
పట్టాభిషేకం{{{Coronation}}}
ముందువారుహైదర్ అలీ
Krishnaraja Wodeyar III
పూర్తి పేరు
Fath Ali Khan
తండ్రిహైదర్ అలీ
తల్లిఫాతిమా ఫఖ్రున్నిసా
జననం10 డిసెంబరు 1750[1]
దేవనహళ్లిBangalore, కర్నాటక
మరణంమే 41799 (వయసు 48)
శ్రీరంగపట్నం, కర్ణాటక
ఖననంశ్రీరంగపట్న , కర్నాటక
12°24′36″N 76°42′50″E
మతంఇస్లాం
టిప్పూ సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు - سلطان فتح علی ٹیپو ), మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం (నవంబర్ 201750దేవనహళ్ళి – మే 41799శ్రీరంగపట్నం), హైదర్ అలీ అతని రెండవ భార్యఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది..బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందముతో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు. మూడవ మైసూరు యుద్ధం మరియు నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, 1799న శ్రీరంగపట్నను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.


బాల్యం

టిప్పూ సుల్తాను కోలారు జిల్లా దేవనహళ్ళిలో జన్మించాడు. ఇది బెంగళూరుకు 45 మైళ్ళ దూరంలో ఉంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు నవాబ్ మొయినుద్దీన్ కుమార్తె. అతను 1750 నవంబరు 20 లో జన్మించాడు.

సైనిక బాధ్యత మొదలు

టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద యుద్ధవిద్యలు అభ్యసించెను. 1766 లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి మొదటి మైసూరు యుద్ధంలో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో ఆశ్వికదళానికి సారథ్యం వహించాడు. 1775 - 1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.

రాకెట్ల ఉపయోగం

ఇంగ్లీషు వారిపై రాకెట్లను ప్రయోగించిన టిప్పు సుల్తాన్ రాకెట్ బ్రిగేడ్
1792, లో లోహపు కవచాలు గల రాకెట్లను (తగ్రఖ్) టిప్పూ సుల్తాన్ తన సైనికాదళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాలలో ప్రముఖమైన మైసూరు యుద్ధాలలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు. వీటి గురించి తెలుసుకొన్న బ్రిటిష్ వారు, తరువాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.

చివరి దశ

మైసూర్: పతన దశ, 1792–1799
1789లో బ్రిటీష్‌వారి మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్‌ను స్వాధీనం చేసునేందుకు టిప్పు విఫలయత్నం చేశారు, ఈ పరాజయాన్ని టిప్పు సుల్తాన్ జీర్ణించుకోలేకపోయారు, అతి పరిమిత సంఖ్యలో ఉన్న ప్రత్యర్థి సైన్యం నుంచి ఎదురైన కాల్పులతో టిప్పు సైన్యం భయభ్రాంతులకు గురైంది, దీని ఫలితంగా మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలో బ్రిటీష్‌వారికి విజయాలు దక్కాయి, వారికి కోయంబత్తూరు జిల్లా స్వాధీనమైంది, అయితే టిప్పు ప్రతిదాడిలో వారు స్వాధీనం చేసుకున్న అనేక భూభాగాలను కోల్పోయారు. 1792లో వాయువ్యం నుంచి దాడి చేసిన మరాఠాలు మరియు ఈశాన్యంవైపు నుంచి దాడికి సైన్యాన్ని పంపిన నైజాం సాయంతో లార్డ్ కార్న్‌వాలిస్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం విజయవంతంగా శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకుంది, దీంతో టిప్పు సుల్తాన్ పరాజయం పాలైయ్యారు, ఆపై శ్రీరంగపట్నం ఒప్పందం కుదిరింది. మైసూర్ రాజ్యంలో సగ భాగాన్ని మిత్రరాజ్యాలకు పంచిపెట్టారు, ఆయన ఇద్దరు కుమారులను విడిపించేందుకు ధనం చెల్లించాల్సి వచ్చింది.
ఈ కాలంలోనే బ్రిటీషర్లు మైసూర్ రాజ్యభాగాలను విభజించి మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధానంగా తమిళ (దక్షిణ) భాగాలు, నిజాం నవాబుకి ఉత్తరాన ఉన్న తెలుగు ప్రాంతాలు బళ్ళారికడపఅనంతపురంకర్నూలు వంటివి పంచారు (ఐతే అత్యంత కొద్ది కాలంలోనే 1800లో టిప్పు సుల్తాన్ ముప్పు తొలగిపోయేసరికి నిజాం సైనిక ఖర్చుల బాకీలు పేరుచెప్పి మళ్ళీ ఈ భాగాన్నంతా తిరిగి బ్రిటీషర్లే స్వాధీనం చేసేసుకున్నారు) [4]
అయినప్పటికీ అధైర్యపడని టిప్పు సుల్తాన్ తన ఆర్థిక మరియు సైనిక శక్తిని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. విప్లవ మార్పులకు లోనైన ఫ్రాన్స్ఆఫ్ఘనిస్తాన్ అమీర్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు అరేబియా నుంచి మద్దతు పొందేందుకు రహస్యంగా ప్రయత్నించారు. ఇదిలా ఉంటే, ఫ్రెంచ్‌వారి ప్రమేయం కోసం చేసిన ఈ ప్రయత్నాలు బ్రిటీష్‌వారికి త్వరగానే తెలిసిపోయాయి, మరాఠాలు మరియు నిజాం మద్దతుతో బ్రిటీష్‌వారు ఆ సమయంలో ఈజిప్టులో ఫ్రెంచ్‌వారితో యుద్ధం చేస్తున్నారు. 1799లో జరిగిన నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించారు, దీంతో మైసూర్ రాజ్యం యొక్క స్వాతంత్ర్యానికి పూర్తిగా తెరపడింది.

ఇతర విశేషాలు

టిప్పు సుల్తాన్ సైన్యంలో రాకెట్ తగ్రఖ్ప్రయోగించే ఓ సైనికుడు.
మైసూరు బెబ్బులి టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన ఖడ్గం పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని ఆర్కాట్ నవాబ్కు బహూకరించాడు. అటునుండి అది లండన్ చేరింది. 2004లో జరిగిన వేలంలో భారతీయ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్య దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ 1799 లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగింది.

టిప్పు సుల్తాన్ కాలపు ముఖ్య ప్రదేశాలు

  • టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం
  • టిప్పు సుల్తాన్ వేసవి విడిది దరియా దౌలత్
  • టిప్పు సుల్తాన్ స్వేచ్ఛావృక్షం నాటిన ప్రదేశం శ్రీరంగపట్టణం
  • టిప్పు సుల్తాన్ తో శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకున్నది కార్న్ వాలీస్.

ఇవీ చూడండి

Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి