2, జులై 2017, ఆదివారం

Bhudevi/ఊటుకూరు భూదేవి/

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు ఊటుకూరు భూదేవి చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.



ఊటుకూరు భూదేవి చైతన్య గీతాల తెలుగు భాషా సంస్కృతి ప్రచారంలో గాయని.

ఊటుకూరు భూదేవి చరిత్ర ...






బాల్యం, విద్యాభ్యాసం, వివాహం

చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో అంకిశెట్టిపాలెం అనే పల్లెటూర్లో జన్మించింది ఊటుకూరు భూదేవి. తండ్రి వెంకటరమణ, తల్లి లక్ష్మమ్మ. పదవ తరగతి వరకు కాళహస్తి లోని సంక్షేమ హాస్టల్లో చదువుకున్నారు.
తరచూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్న క్రమంలో ఒకసారి తిరుపతిలో కచ్చేరి చేస్తున్నప్పుడు అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టరు ఇ.వి.సుబ్బారావు భూదేవి పాట విని అభినందించి తిరుపతి సంగీత కళాశాలలో చేర్పించడం ఆమె గాయనిగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో సహాయపడింది.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు సహాయ సహకారాలతో పాటు బబ్బెళ్ళపాటి గోపాల కృష్ణ సాయి ఆమెను మానస పుత్రికగా స్వీకరించి గాయనిగా మంచి ప్రోత్సాహాన్నందించారు. భర్త సతీష్ కూడా రిథమ్స్, పాడ్స్ వాద్య కళాకారుడే కావడంతో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు.

సంగీతాభ్యాసం

తండ్రి వెంకటరమణ ప్రజా గాయకుడవడం చేత చిన్నతనం నుంచే పాటలయందు ఆసక్తినేర్పరుచుకుంది. తన 8 వ ఏట నుంచే పాటలు పాడడం ప్రారంభించింది. తండ్రి వల్లనే తనకు పాటల పట్ల ఆసక్తి కలిగిందని చెబుతారు భూదేవి. పాఠశాలలో చదువుతూనే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులు సంపాదించుకున్నారు. అప్పటి నుంచే ఎప్పటికైనా మంచి గాయనిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని స్థిరనిర్ణయానికొచ్చింది. తిరుపతి సంగీత కళాశాలలో సంగీతాభ్యాసం. తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతాన్ని ప్రముఖ గాయకులు డా..చిత్తరంజన్ గారి వద్ద రెండేళ్ళపాటు అభ్యాసం చేసారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సర్టిఫికేట్ కోర్సు చేశారు. హైదరాబాద్ లోని టీచర్ లావణ్య లత వద్ద సంగీతాభ్యాసం చేసారు.

కళామైత్రి సంస్థ

కళామైత్రి సంస్థను స్థాపించి తెలుగు భాషా సంస్కృతి ప్రచారంలో భాగంగా శతకామృతవర్షిణి పేరిట నాటి కవులు రచించిన పలు శతకాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని గొంతెత్తి ఆమె తన పాటల ద్వారా అనేక ప్రదర్శనలిచ్చి తద్వారా తన వంతుగా తెలుగుతల్లికి నీరాజనాలర్పిస్తున్నారు.

తెలుగు వికాసం కోసం పాటలు

జన హృదయాలలో నుండే పాటలు పుడతాయంటారు. వరకట్న దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతుండడం స్వయంగా చూసి స్పందించి పాటల రూపంలో వాటిని జనబాహుళ్యానికి పరిచయం చేశారు. రెడ్డప్ప వ్రాసిన గీతం ఆమెకు దొరకడం ఒక అదృష్టమంటారు భూదేవి. ఎందుకంటే .. ఆ పాట పాడిన ప్రతీచోటా ఎందరో ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని తనకు, తన పాటకు మద్దత్తిచ్చారు.. ఆ పాట ఇలా సాగుతుంది. "తాళి కట్టిన వాడు మగవాడు, తాగుడెందుకు మరిగినాడు కాసు తెచ్చే మొనగాడు, మత్తులోన మునిగినాడు"
జన చైతన్య గీతాలకు ఎంతటి స్పందన లభిస్తుందో ఈ పాట ద్వారానే ఆమెకు తెలిస్తొచ్చింది. గాంధీ పీస్ సెంటర్ వారి ఆధ్వర్యంలో రెండేళ్ళ పాటు చిత్తూరు అంతటా అన్ని గ్రామాల్లోను అనేక ప్రజా చైతన్య గీతాలను పాడుతూ గాయనిగా తన పయనానికి పునాదులు వేసుకున్నారు. ప్రజా నాట్య మండలి "తెలుగు వెలుగులు" ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చారు. ఇలా మూడేళ్ళు గడిచిన తర్వాత నుండి ఏ పాట పాడినా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండేవి మాత్రమే పాడాలని నిశ్చయించుకున్నారు భూదేవి. కమ్మనైన తెలుగు భాష కలనైనా మరవొద్దు అని కవి ఎలమర్తి రమణయ్య వ్రాసిన పాటను తన స్వరంలో ఆలపిస్తూ తెలుగు భాష గొప్పదనాన్ని లాలనగా పరిచయం చేస్తుంటారు భూదేవి.
17 ఏళ్ళుగా పాడుతున్నా ఏరోజూ తన పాటలకు వెలకట్టుకోకుండా కేవలం జనం కోసం, ఆకలిని కడుపులో పెట్టుకుని కూడా సంతోషంగా పాడడం నేర్చుకున్నారు భూదేవి.
అధికార భాషా సంఘం పాలనా వ్యవహారలలో భాగంగా తెలుగు భాషాభివృద్ధిలో భాగంగా అచ్చమైన తెలుగుపాటల నుడికారంలో భూదేవి గ్రామగ్రామాన, రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలలో ఎన్నో ప్రజా హిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ రచయితలు దాశరథి, శ్రీ శ్రీ తదితర రచయితల పాటల ద్వారా తెలుగు భాషా పరివ్యాప్తికి తనవంతు కృషిని అందిస్తూ వస్తున్నారు. బద్దెళ్ళపాడు గ్రామ సర్పంచి, సంఘ సేవకులు శ్రీ సాయి సూచనతో గాంధీ మహాత్ముని గురించి పాటలు పాడడం ప్రారంభించారు. బాపూజీ చెప్పిన 18 సూత్రాల్నే పాటలుగా ప్రచారం చేస్తూ ఒక " బాపు పాట " అనే సీ.డీని స్వరపరిచారు.
                       
                                                         Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్.

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి