29, జులై 2017, శనివారం

Facts behind "Silk Smitha's" sudden demise || Unkown Secrets || V6 news





సిల్క్ స్మిత

వికీపీడియా నుండి
సిల్క్ స్మిత
TeluguFilmActress Silk Smitha.jpg
జన్మ నామంవిజయ లక్ష్మి
జననండిసెంబరు 2, 1960
ఏలూరుఆంధ్రప్రదేశ్
మరణం1996 (వయసు 35)
మద్రాసు
సిల్క్ స్మిత (డిసెంబరు 21960 - సెప్టెంబరు 231996) (ఆంగ్లంSilk Smitha) గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది నటి. ఈమె తెలుగుతమిళంకన్నడంమళయాళం మరియు హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.

పూర్వ రంగం[మూలపాఠ్యాన్ని సవరించు]

విజయలక్ష్మి 1960డిసెంబరు 2 న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది.[1], "స్మిత" అని తెరపేరు ధరించింది.[2] సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది.[3]

సినీ రంగం[మూలపాఠ్యాన్ని సవరించు]

క్రమంగా ఆమె సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200పైగా తెలుగుతమిళమళయాళకన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట. కొందరు సినిమా విలేఖరులు, విమర్శకులు ఆమెను "soft porn" actress గా అభివర్ణించారు.[4] . ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "సీతాకోక చిలుక" (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది.[5] "లయనం" అనే "పెద్దల సినిమా" ఆమెకు చాలా పేరును తెచ్చింది. "రేష్మా కీ జవానీ" అనే పేరుతో దీనిని హిందీలో తీశారు.[6] "వసంత కోకిల" చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది.[7]

మరణం[మూలపాఠ్యాన్ని సవరించు]

సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. 1996సెప్టెంబరు 23 న మద్రాసులోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.[1][8]

సిల్క్ స్మిత నటించిన కొన్ని సినిమాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి