1, జులై 2017, శనివారం

Desapathi Srinivas/దేశపతి శ్రీనివాస్

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు దేశపతి శ్రీనివాస్ చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

దేశపతి శ్రీనివాస్ చరిత్ర ...



దేశపతి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. ఆయన కరీంనగర్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యులు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.

బాల్యం, కుటుంబం

కీర్తిశేషులు స్వర్గీయ దేశపతి బాలసరస్వతి, గోపాలకృష్ణ శర్మ గార్ల తనయుడు శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు. వృత్తి రీత్యా ఉపాద్యాయుడు, ప్రవృత్తి రీత్యా ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన కవి గాయకుడు, మరియు వక్త దేశపతి శ్రీనివాస శర్మ. పేదరికంలో పుట్టి, స్వయం ప్రకాశవంతుడై. నటుడిగా, వక్తగా, వాగ్గేయకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి, తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ప్రత్యేక కళారూపాలతో జనవాహినులను ఉడికించి, ఉరికించి మైమరించిన దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రముఖపాత్ర నిర్వహించారు.

జీవిత విశెషాలు

ఆయన తెలంగాణ రాష్ట్రం గజ్వేలు దగ్గర మునిగడప గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, మంచి కవి. గోపాలకృష్ణ గారు మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు.ఆయనకు తెలుగు సంస్కృతంఇంగ్లీషుఉర్దూ భాషల్లో నైపుణ్యం ఉంది. వారి తాతగారు (మాతామహులు) గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు 'పుష్పబాణ విలాసం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ రామేశ్వర శర్మగారు వారు నవ్యకళాసమితి అనే ఒక నాటక సమితిని యేర్పాటు చేసి, నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం శ్రీనివాస్ పై పడింది.

వృత్తి

ఆయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.

మంచి వక్త

తెలంగాణా ఉద్యమంలో తన ప్రత్యేకత తెలంగాణా చరిత్ర ఉపాన్యసం మాట్లాడుతు ఆయా సందర్బోచితంగా పాటను సరి జోడి చేసేవిధానం అందరిని ఆకటుకునేవిధానం ప్రయోగం అతన్ని మంచి వక్తగా పేరు వచ్చింది

రచయిత

"నాగేటి సాల్లాల నా తెలంగాణ" పాట పాడి, అబినయించి క్యాసెట్ విడుదలతో ఉద్యమంలో మంచి పేరు సంపాదించుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి