30, జులై 2017, ఆదివారం

Papikondalu/పాపికొండలు

పాపి కొండలు

వికీపీడియా నుండి
(పాపికొండలు నుండి దారిమార్పు చెందింది)
పాపికొండల వద్ద గోదావరి
పాపికొండల మధ్య గోదావరి
పాపికొండల వద్ద సూర్యాస్తమయం
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరితూర్పు గోదావరి జిల్లాల నడుమ, మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా లను ఆనుకొని ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది.
పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతంఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.
పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి.
పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
రాజమండ్రి నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం.
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంకన్నాపురంపోలవరంశింగన్నపల్లివాడపల్లిఛీడూరుమీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది.
పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరంరాజమండ్రికూనవరంపేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది.
సీతారామయ్యగారి మనవరాలుఅంజిగోదావరిగోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.

ప్రత్యేకత[మూలపాఠ్యాన్ని సవరించు]

చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది. ఖమ్మం జిల్లాలోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహారాష్టల్రోని నాసిక్‌ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు[1].

యాత్రసాగేదిలా[మూలపాఠ్యాన్ని సవరించు]

ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి. పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవతామూర్తులను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతె్తైన రెండు పర్వతాలు వాలిసుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.

పాపి కొండల యాత్ర చేస్తే[మూలపాఠ్యాన్ని సవరించు]

చుట్టూ ఎత్తయిన కొండలు .. చిక్కని అడవులు... మధ్యలో గోదారమ్మ ఒడిలో మెలికలు తిరుగుతూ జల విహారం చేస్తే... 'చూసే కనులకు మనసుంటే ... ఎటు చూసిన అందమే... ' అన్న పాట గుర్తుకొస్తుంది.పాపి కొండల మధ్య నుంచి లాంచిల్లో ప్రయాణం ఓ అద్భుత అనుభూతి. ఉదయం వెళ్తే సాయంత్రానికి రాజమండ్రి నగరానికి చేరుకోవచ్చు.

ఝటాయువు గురుతులు[మూలపాఠ్యాన్ని సవరించు]

వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.

పాపికొండల్లో[మూలపాఠ్యాన్ని సవరించు]

మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎత్తయిన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు. పర్యాటక శాఖ ఈ పేరంటాలపల్లి, పాపికొండల యాత్రకు మరింత అభివృద్ధి చేసి పర్యాటకం ప్యాకేజీ ప్రకటిస్తే యాత్రికులు మరింతగా వచ్చే అవకాశం ఉంది.

భద్రాచలం పరమ పుణ్య గోదావరీ తీర దామం. అక్కడికి భక్తులు రోజూ  వేల మంది వస్తుంటారు. అక్కడికి వచ్చే వారందరికి ఒకటే బావం . అలౌకిక ఆద్యాత్మిక బావం. దండకారణ్య పచ్చని ప్రకృతి ఒడిలో విలసిల్లిన భద్రాచల  క్షేత్రం  భక్తులకు ఆద్యాత్మికతో కూడిన ఆహ్లాద బావనలు కల్గించడంతో పునీతమవుతుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న "పర్ణ శాల" గోదావరీ ఒడ్డున ఉండటమే కాక, అకడి సహజ ప్రక్రుతి అందాలతో భక్త గణానికి ఆద్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. రామాయణ కాలంలో రాములు వారు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం గడిపిన ప్రాంతంగా ఈ  ప్రాంతం యావత్ ప్రపంచం లోనే ఒక విశిష్ట ఆద్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతుంది.

    భద్రాచలం ఆంద్ర ప్రదేశ్   లోని ఖమ్మం జిల్లా లో ఉంది. ఈ  ప్రాంతం ఏజెన్సి ప్రాంతం. ఇక్కడి గిరిజన సంస్క్రుతి నేపద్యం కూడా ఈ  క్షేత్రానికి  ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇక్కడ నుండి కూనవరం వరకు రోడ్డు  మార్గం , అక్కడి నుండి   గోదావరి నది లో బోట్ ప్రయాణం ద్వారా ఖమ్మం జిల్లలోని పేరంటాల పల్లి వెళ్లి అక్కడి అందమైన  పాపి కొండల ను , చుట్టు పక్కల ఆద్యాత్మిక , ప్రక్రుతి ద్రుశ్యాలను చూస్తూ ప్రతి ఒక్కరూ పులకించి పోతారు. అకడనుండి రాజమండ్రికి కూడా  బోట్ ప్రయాణం ద్వారా వెళ్ళ వచ్చు. ఈ  ప్రాంతం లోని  సహజ ప్రక్రుతి వనరులు, ఇతిహాస కాలం నాటి నేపద్యంతో కూడిన ఆద్యాత్మిక క్షేత్రాల సందర్శన ఖచ్చితం గా అటు భక్తులకే కాక , ప్రక్రుతి ప్రేమికుల ను విశేషంగా ఆకర్షిసితుంది. కానీ అటువంటి "పాపి కొండల యాత్రలను" తమ స్వార్ద ప్రయోజనాల కోసం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన కొంత మంది ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు "పాప కొండల యాత్రలు" గా మార్చారు.

  ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక "ఇండియన్ ఎక్స్ప్రేస్స్ " వారి కదనం మేరకు రాజమండ్రి లోని కొంత మంది ప్రైవేట్ టూరిజం ఆపరేటర్లు ఒక జట్టు గా ఏర్పడి "రంకు టూరిజం " నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వీరు విటులను " పాపి కొండలు  యాత్ర" , భద్రాచలం యాత్ర పేరుతో  పాపి కొండలు రాజమండ్రి మద్య ఉన్న  ఇసుక తిన్నెల మీదకు చేర్చి ,అకడ వేసిన "వెదురు గుడిసెల్లో " ఈ  పాపపు వ్యాపారం నిర్వహిస్తున్నారట! విటులకు కావాల్సిన అమ్మాయిలను "పెద్దాపురం, రాజమండ్రి, వైజాగ్ " ప్రాంతాల నుండి రప్పించి  ఈ  వ్యాపారం   రాజమండ్రి కూడా  చారిత్రకంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న ప్రాంతం.

                                               

     
  జై రామా                              జై జై భద్రాచల రామా                            జై రామా

  నేను పైన తెలిపిన ఇండియన్ ఎక్సప్రీస్ కదనం కొరకు ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడగలరు http://newindianexpress.com/states/andhra_pradesh/Papi-hills-going-the-sex-tourism-way/2013/06/17/article1638570.ece

Papi hills going the sex tourism way?

By SS Chary | ENS  |   Published: 17th June 2013 08:27 AM  |  
Last Updated: 17th June 2013 10:06 AM  |   
Of late, the Rajahmundry-Papikondalu cruise in river Godavari has turned into a sinful affair what with unscrupulous private boat operators offering sleazy packages to sex-starved tourists much to the chagrin of nature lovers who detest the very idea having such anti-socials for company on board.
This trend is largely attributed to the lack of proper surveillance on the part of officials of the irrigation and forest departments. But for their soft-peddling, it is extremely difficult for unauthorised boats and launches to ferry tourists to the serene Papi Hills.
Unauthorised boat operators are said to be making fast buck cashing in on lewd tourists. Private launches have virtually turned into mobile brothels.
On a tip off, the police conducted raids and seized two launches in which prostitution was being organised. The police inspected a launch Jalasri and took 16 women and eight men into custody. The police identified that the youth belong to Maharashtra and the girls hail from Peddapuram, Rajahmundry and Visakhapatnam.
It is learnt that some people are booking the launches or boats by paying higher amounts. The bamboo huts located on the sand dunes between Rajahmundry and Papi Hills have also turned into hubs of sex trade.
Meanwhile, boat operators are not following the security norms. Many a time, the boats get bogged down in the middle of the river creating panic among the tourists. As per rules, the boat operators should provide life jackets besides being equipped with fire extinguishers and 60 to 70 HP engines. The boats should also have 8 mm safety iron plate at the bottom and girders around it.
As if this is is not enough, the operators are overloading 150 to 200 tourists as against the permitted 100 passengers.
Along with the Andhra Pradesh Tourism Development Corporation (APTDC), private organisations such as Anand Tourism, Nandini, Sai Maruthi, Punnami, Sitara Jalasri and Godavari Vihari are operating launches to Papi Hills.
Though boats are banned from being operated when the government issues the first flood warning, some private operators are paying no attention to it endangering the lives of tourists.
Meanwhile, the Irrigation Department, which issues licences to launches, is not verifying the fitness of boats.
Prabhakargoud Nomula

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి