ఊట్ల స్వర్ణ
వికీపీడియా నుండి
ఊట్ల స్వర్ణ ప్రముఖ ప్రజా గాయని. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
ఊట్ల స్వర్ణ | |
---|---|
జననం | ఎలబాక గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా |
వృత్తి | ఉద్యమ గీత గాయని |
మతం | హిందూ |
విషయ సూచిక
[దాచు]జీవిత విశేషాలు
కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని ఎలబాక గ్రామంలో జన్మించింది. ఈమె చిన్నతనమంతా తన అక్క ప్రగతిశీల మహిళా సంఘం నేత అయిన జ్యోతి ఇంటిలో గడిచింది. అక్కడే స్వర్ణకు పాటతో తొలి పరిచయం యేర్పడింది. అరుణోదయ కళాకారులతో కలసి జ్యోతి పాటలు పాడుతుంటే స్వర్ణ కూడా గొంతు కలిపేది. అయితే అప్పుడు నేర్చుకున్నవన్ని కూడా చైతన్య గీతాలే కావడం విశేషం. మా టీవీ లో ప్రసారమైన వన్స్‌మోర్ ఫ్లీజ్‌లో పాడే అవకాశం వస్తే అక్కడ కూడా అమ్మ చూడమ్మా బైలెల్లినాదో గోదారమ్మా...గంగమ్మ తైల్లె బైలెల్లినాదో గోదారమ్మా అంటూ చైతన్య గీతమే పాడారు. ఆ చైతన్య గీతాలే ఆమెను గాయకురాలిగా వేదికలెక్కేలా చేశాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతచారి ఆత్మబలిదానం తనను కలచివేసిందని చెప్పే స్వర్ణ తెలంగాణ వచ్చేదాకా ఉద్యమ పాటలు తప్ప మరే పాటలు పాడనని నిర్ణయించుకుంది. అన్నట్లుగానే మాట మీద నిలబడింది. తెలంగాణ సమరనాదం, తెలంగాణ రగడా, ఉద్యమాల ఉస్మానియా పేర్లతో స్వయంగా పాటల సీడీలను కూడా రూపొందించింది.
బహుమతులు - పురస్కారాలు
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
యూట్యూబ్‌లో
'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో- బంగారు తల్లివే ఉయ్యాలో... మా ఇంటి ముంగిట్లో ఉయ్యాలో' అంటూ... యుట్యూబ్ లో వినిపించే గొంతు స్వర్ణదే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి