1, జులై 2017, శనివారం

Pagidipati Devaiah /పగిడిపాటి దేవయ్య


మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు డాక్టర్ పగిడిపాటి దేవయ్య చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.


డాక్టర్ పగిడిపాటి దేవయ్య చరిత్ర గురించి...

డాక్టర్ పగిడిపాటి దేవయ్య ఎన్నారై బీజేపీ, టీడీపీ పొత్తుతో 2015. వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగిన ఉమ్మడి బీజేపీ అభ్యర్థి.

జననం, చదువు

పగిడిపాటి దేవయ్య వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో MBBS పూర్తి చేశారు. తర్వాత అమెరికాలో PG ఫెలోషిప్ పూర్తిచేసిన దేవయ్య భారతదేశం గర్వించదగ్గ వైద్యుడిగా ఎదిగారు.

ఎన్నారై,సేవ

35 సంవత్సరాలు అమెరికాలో ఉన్నపటికీ అమెరికా పౌరసత్వం తీసుకోలేదు ఆయన. పేదలకు సేవా చేయాలనే ఉద్దేశంతో మదర్ థెరిసా హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది పేద వాళ్ళకు అండగా నిలిచారు.

రాజకీయాల్లో

దేవయ్య ప్రస్థానం అందరికీ ఆదర్శం. ఆయన ఎంతో కష్టపడి చదువుకుని డాక్టర్ గా, అంతర్జాతీయ స్థాయి వ్యాపార వేత్తగా ఎదిగిన క్రమం ఈ తరానికి ఆదర్శం. తనలా ఇప్పటి తరం కష్టాలు పడరాదన్న ఉద్దేశంతో ప్రజలకు సేవచేసుకునే మార్గంగా రాజకీయాలను ఎంచుకుని ప్రజా సేవ కోసం సొంత జిల్లాకు వచ్చారు. ఎన్నారైలను పెట్టుబడిదారులుగా అంతా చూస్తున్న సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టి.. పెట్టుబడులకు మించి అభివృద్ధి సాధన కోసం ఆయన కంకణం కట్టుకున్నారు. అలాంటి సేవా తత్పరుడిని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఆయన విజయంతో వరంగల్ కూ విజయం సాధించిపెట్టాలని తలచింది. దేవయ్య గెలిస్తే ఆయన్ను కేంద్ర మంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించింది. దేవయ్య తరఫున . కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి హన్స్ రాజ్ గంగారం దేవయ్య తరఫున వరంగల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.

సమర్థులు

అమెరికాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కంపెనీల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న సంస్థకు అధిపతి అయిన దేవయ్య అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో అత్యంత సమర్థులు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే హైదరాబాద్వరంగల్ లలో కంపెనీలు పెట్టి ఉద్యోగావకాశాలు కల్పించి వరంగల్ యువతకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పింఛారు.

ప్రచారంలో ఎన్నారైలు

దేవయ్య తరఫున ప్రచారంలో ఎన్నారైలు పాల్గొంటున్నారు. ఓహియోకు చెందిన శ్రీనివాస్ కొంపల్లి, న్యూజెర్సీ వాసులు విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, కాలిఫోర్నియాకు చెందిన భరత్ గోలి, కృష్ణ ఊటుకూరు, అట్లాంటాకు చెందిన హరు పులిజాల, న్యూజెర్సీ నుంచి వచ్చిన ప్రదీప్ చాడ, సంతోష్ రెడ్డి ఎస్, నరేశ్ తుళ్లూరు, న్యూయార్క్కు చెందిన రాజేందర్ పోరెడ్డి, ఓహియోకు చెందిన రమేశ్ మధు, బోస్టన్ వాసి శ్రీకుమార్, వర్జీనియాకు చెందిన అరుణ్ కంచెర్ల, టెక్సాస్ వాసి లక్ష్మణ్ కాపర్తి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ నియోజకవర్గమంతా ఉన్నత స్థానాలకు ఎదిగి విదేశాల్లో ఉన్నా… తిరిగొచ్చి ఇక్కడ సొంత ప్రాంతం, సొంత జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న దేవయ్యకు ప్రచారంలో అడుగడుగునా ఆదరణ లభించింది. ఎన్నారైలు అంటే ఎక్కడో ఉండి స్వదేశంలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడమే కాదు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలన్న తన ఉద్దేశాన్ని దేవయ్య బలంగా వినిపించారు.

ఎంపీగా ఓటమి

2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో వరంగల్లు (ఎస్.సి) వరంగల్ నుండి ప్రస్తుత 16వ లోక్ సభకు పసునూరి దయాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కి 6,15, 403 ఓట్లూ రాగ. కాంగ్రేస్కు సర్వే సత్యనారాయణకు 1, 56, 315 ఓట్లూ వచ్చినవి . భారతీయ జనతా పార్టీ డా|| పగిడిపాటి దేవయ్యకు 1,30, 178 ఓట్లూ వచ్చినవి, కాగా విజయం సాధించిన లోక్‌సభ సభ్యుడు పసునూటి ఓట్లూ 4,59,092 భారీ మేజారిటీ నమోదు అయ్యింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి