4, జులై 2017, మంగళవారం

Chandulal Ajmira

అజ్మీరా చందులాల్

వికీపీడియా నుండి
అజ్మీరా చందులాల్
ములుగు శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గంవరంగల్ లోకసభ నియోజకవర్గం
చందులాల్
వ్యక్తిగత వివరాలు
జననం17 ఆగష్టు 1954 (వయస్సు: 62  సంవత్సరాలు)
జగ్గన్నపేట్ ములుగు వరంగల్జిల్లా
మతంహిందూ మతము
అజ్మీరా చందులాల్ వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయనాయకుడు మరియు ప్రస్తుత తెలంగాణ పర్యాటక శాఖ మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అతను ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభలో కూడా సీనీయర్ మెంబరు.

జీవిత విశేషాలు

చందులాల్ 1954 ఆగస్టు 17లో వరంగల్ జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట్ గ్రామంలో జన్మించాడు. శారదతో వివాహం జరిగింది, వారికి ఒక కుమార్తె ముగ్గురు కుమారులు.

రాజకీయ జీవితం

1981-1985 జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 - 1989 లో MLA విజయం సాధించి నాలుగు సంవత్సరాలకే AP శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.1994 -1996 2వ సారీ MLAగా విజయం సాధించి,1996 లో 11వ లోకసభ సభ్యులుగా గిరిజన ఓట్లూ అధికంగా ఉన్న వరంగల్ లోకసభ నియోజకవర్గం సభ్యులుగా నియోజకవర్గం నుండి నారా చంద్రబాబునాయుడు చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్నరామసహాయం సురెందర్ రెడ్డి పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు...,1998 లో MP 12వ లోకసభ సభ్యులుగా MP 2 సార్లునుండి తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు. తిరిగి శాసనసభ్యునిగా 2014 3వ సారీ MLA గా అసెంబ్లీలో ములుగు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి గెలుపొందారు.

పదవులు

1981-85 జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ ములుగు మండలం జిల్లా . వరంగల్, ఆంధ్ర ప్రదేశ్.
1985-89 శాసన సభ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ (ముడు సార్లు) 1994-96, 2014 -
1986-88 చైర్మన్ 1994-96 షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంక్షేమ కమిటీ
1989 మంత్రి, గిరిజన సంక్షేమం, ఆంధ్ర ప్రదేశ్
1994-96 తెలుగుదేశం పార్టీ పోలిటిభ్యురో సభ్యుడు. 11 వ లోక్ సభకు ఎన్నికయ్యారు
1996 లేబర్ అండ్ వెల్ఫేర్ సభ్యుడు
1998 12 వ లోకసభ సభ్యులు 2 సారీ తిరిగి ఎన్నిక
1998-99 హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద లేబర్ అండ్ వెల్ఫేర్ లో సభ్యుడు,పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్మెంట్ స్కీమ్ కమిటీ సభ్యులు,సంప్రదింపుల కమిటీ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ.
1999-2001 S.T. సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ
2001-2003 డైరెక్టర్ ట్రికోర్, న్యూఢిల్లీ
2003-2005 ట్రికోర్ చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్
2005 తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు
2006 పోలిటిభ్యురో సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి
2014 శాసన సభ సభ్యుడు, ములుగు శాసనసభ నియోజకవర్గం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం పర్యాటక మరియు సాంస్కృతిక, గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్నారు.

యం.యల్.ఎ గా ఓటమి

తెలుగుదేశం పార్టీ 1982 లో ఎన్.టి.రామారావు పార్టీ స్థాపించిన సమయంలో జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఉన్న చందులాల్ వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. 1983 ఎన్నికలలో యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసీ ఓటమిచెందారు. పోరిక జగన్ నాయక్ గెలిచారు. ఇదే జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ 1985 లో గెలిచారు. చందులాల్ 1989 ఎన్నికలలో మళ్లీ జగన్ నాయక్ చేతిలో ఓటమిచెందారు 1989 తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్.టి.రామారావుయం.యల్.సీ చేసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 1994 లో జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు.1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు.

బై ఎలక్షన్లు

బై ఎన్నికలు ఇతని జీవితంతో ఆడుకున్నాయి.లోకసభ సభ్యునిగా గెలిచిన 2 సార్లు బై ఎన్నికలు వచ్చాయి 1994 లో శాసనసభ్యునిగా విజయం సాధించిన పదవి కాలం ఇంకా మూడుఎండ్లు ఉండగానే 1996 లో నారా చంద్రబాబునాయుడు చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్నరామసహాయం సురెందర్ రెడ్డి పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు... బై ఎలక్షన్లు, 1996 బై ఎలక్షన్లు, 1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు. ఎన్నో పదవు వివిధ దశల్లో నిర్వహించిన చందులాల్ 2005 టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు...

టీఆర్ ఎస్ లో చేరారు

అజ్మీరా చందులాల్ తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చి 2005 కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చూడండి

 తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా     
Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి