పులి
పులి | |
---|---|
బెంగాల్ పులి (పి. టిగ్రిస్ టిగ్రిస్) | |
పరిరక్షణ స్థితి | |
శాస్త్రీయ వర్గీకరణ | |
రాజ్యం: | ఏనిమేలియా |
విభాగం: | కార్డేటా |
తరగతి: | క్షీరదాలు |
క్రమం: | మాంసాహారులు |
కుటుంబం: | ఫెలిడె |
జాతి: | పేంథెరా |
ప్రజాతి: | పి. టైగ్రిస్ |
ద్వినామీకరణం | |
పేంథెరా టైగ్రిస్ (లిన్నేయస్, 1758) | |
Historical distribution of tigers (pale yellow) and 2006 (green).[2] | |
పర్యాయపదాలు | |
టైగ్రిస్ రెగాలిస్ Gray, 1867 |
పులి (పాన్థెర టైగ్రిస్ )ఫెలిడే కుటుంబానికి చెందినది;పాన్థెరాతరగతికి చెందిన నాలుగు "పెద్ద పిల్లులలో" ఇది ఒకటి.[4] ఎక్కువగా తూర్పు మరియు దక్షిణ ఆసియాలు, మూల స్థానంగా గల పులి అత్యున్నతంగా వేటాడే జీవి మరియు విధి అయిన మాంసాహారి. [5]ల మొత్తం పొడవు మరియు 300 కిలోగ్రాముల (660 పౌండ్ల)బరువు కలిగిన, పెద్దపులి ఉపజాతులు అంతరించిన అతిపెద్ద ఫెలిడ్స్త్ తో పోల్చదగినవి.[6][8] వాటి పరిమాణం మరియు శక్తితో పాటు, తెలుపు నుంచి ఎరుపు-కాషాయ రంగు బొచ్చుతో గాఢమైన నిలువుచారలను కలిగి, తేలికైన లోపలి భాగాలను కలిగి ఉండటం వాటి గుర్తించదగిన లక్షణం. ఎక్కువ సంఖ్యలో ఉపజాతులు కలిగి ఉన్నది బెంగాల్ పులి అయితే అతిపెద్ద ఉపజాతులను కలిగి ఉన్నది సైబీరియన్ పులి.
ఆన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగల పులులు, సైబీరియన్ టైగా ప్రాంతం నుండి, ఆరుబయలు పచ్చిక మైదానాలలో , అయనరేఖాప్రాంత మడ బురద నేలలలో కూడా ఉంటాయి. అవి ప్రాదేశిక మరియు సాధారణంగా ఏకాంత జంతువులు, వాటి ఆహార అవసరాలను తీర్చగల పెద్ద నివాస ప్రాంతాలలో నివసిస్తాయి. దీనితో పాటు, ఇవి భూమి పైనున్న అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశాలకు పరిమితవడం వలన, మానవులకు వాటికీ మధ్య చెప్పుకోదగ్గ పోరాటాలకు దారితీసింది. తొమ్మిది ఆధునిక పులి జాతులలో, మూడు అంతరించిపోగా తక్కిన ఆరూ ప్రమాదంలో ఉన్నవిగావర్గీకరించబడ్డాయి. దీనికి ప్రాథమికకారణాలు నివాస ప్రాంతాలు నాశనమవడం మరియు వాటిని విభజించడం, మరియు వేటాడటం. దక్షిణ మరియు తూర్పు ఆసియా ద్వారా మెసపొటేమియా నుండి కాకసస్ వరకు వ్యాప్తిచెందిన వాటి చారిత్రిక శ్రేణి అతివేగంగా క్షీణించింది. జీవించి ఉన్న అన్ని జాతులూ రక్షితమైనవి అయినప్పటికీ, ఆక్రమణలు, నివాస ప్రాంతాలు నాశనమవడం మరియు సంతానోత్పత్తి మందగించడం వంటివి ఆపదలుగా ఉన్నాయి.
ఏదేమైనా, పులులు ప్రపంచంలో అధికంగా గుర్తించబడి మరియు ప్రజాదరణ పొందిన ఆకర్షణీయమైన గొప్ప జంతుజాలం. అవి ప్రాచీన పురాణాలు మరియు జానపదాలలో ప్రముఖంగా ప్రస్తావించబడ్డాయి, మరియు ఆధునిక చిత్రాలు మరియు సాహిత్యంలో కూడా వర్ణింపబడుతున్నాయి.పులులు అనేక జెండాలు మరియుసైనికుల కోట్లపై, క్రీడాజట్ల చిహ్నాలుగా , అనేక ఆసియా దేశాలజాతీయ జంతువుగా కనబడతాయి.
నామకరణం మరియు ఆవిర్భావం
"టైగర్" అనే పదం గ్రీకు పదమైన "టైగ్రిస్ " నుండి తీసుకొనబడింది, దీనికి పర్షియన్ మూలమైన "బాణం" అనే అర్ధం ఆధారం కావచ్చు, ఇది జంతువు వేగంతో సంబంధం కలిగి ఉండి మరియు టైగ్రిస్ నది పేరు నుండి ఉద్భవించి ఉండవచ్చు.[10][12] అమెరికన్ ఇంగ్లీషులో "టైగ్రెస్" అనే పదం మొదటిసారి 1611 లో రికార్డు చేయబడింది.లిన్నేయస్ తన 18 వ శతాబ్దపు గ్రంథమైన సిస్టమ నాచురేలో వివరించిన అనేక జాతులలో ఈ ఫెలిస్ టైగ్రిస్ ఒకటి.[3][4] దీని శాస్త్రీయ పాన్థెర టైగ్రిస్ , గ్రీకు నుండి ఆవిర్భవించిందని భావించవచ్చు పాన్- ("అన్నీ") మరియు థెరొన్ ("జంతువు"), ఇది జానపద నామము కావచ్చు. ఇది ఆంగ్లంలోనికి ప్రాచీనభాషల నుండి వచ్చినప్పటికీ, పాన్థెర తూర్పు ఆసియా మూలాన్ని కలిగి, "పసుపు జంతువు" లేదా "తెలుపు-పసుపు" అర్ధాన్నిస్తుంది.[5]
అరుదుగా కనిపించేదే అయినప్పటికీ పులులగుంపును [6] (క్రింద చూడుము) 'స్ట్రీక్' లేక 'అమ్బుష్' అంటారు.
శ్రేణి[మూలపాఠ్యాన్ని సవరించు]
చరిత్ర పూర్వంలో పులులు ఆసియాలో , కాకసస్ నుండికాస్పియన్ సముద్రం వరకు, మరియు సైబీరియా మరియు ఇండోనేసియా వరకు విస్తరించాయి. 19 వ శతాబ్దంలో ఈచారల పిల్లులు పశ్చిమ ఆసియా నుండి పూర్తిగా అదృశ్యమయ్యాయి, వాటి శ్రేణిలో మిగిలినవి జనసంచారం లేని ప్రాంతాలకు పరిమితమయ్యాయి.ఈ ప్రాచీన శ్రేణి విభజితమై పశ్చిమాన భారతదేశం నుండి తూర్పున చైనామరియు ఆగ్నేయ ఆసియా వరకు నేడు విస్తరించి ఉన్నాయి. పడమర హద్దు ఆగ్నేయ సైబీరియాలోని "అముర్ నది"కి దగ్గరగా ఉంది. నేడు పులులు నివశిస్తున్న అతిపెద్ద దీవి సుమత్ర. 20 వ శతాబ్దంలో పులులు జావా మరియుబాలి నుండి అదృశ్యమయ్యాయి మరియు బోర్నియోలో నేడు శిలాజ శిధిలాలుగా ఉన్నాయి.
శారీరకలక్షణాలు, వర్గీకరణ మరియు పరిమాణం[మూలపాఠ్యాన్ని సవరించు]
పాన్థెర పాలియోసినేన్సిస్ , అని పిలువబడే పులివంటి పిల్లి శిధిలాలు చైనా మరియు జావాలలో కనుగొన్నారు. ఈజాతి 2 మిలియన్ సంవత్సరాల క్రితం, ప్లేస్టొసీన్ యుగ ఆరంభంలో, ప్రస్తుత పులికంటే చిన్నవిగా ఉండేవి.జావానుండి లభించిన అసలైన పులుల యొక్క ప్రాథమిక శిలాజాలు 1.6 నుండి 1.8 మిలియన్ సంవత్సరాలు పురాతనమైనవి.ప్రాథమిక మరియు మధ్య ప్లీస్తోసీన్ కాలానికి చెందిన విభిన్న శిలాజాలు చైనా, మరియు సుమత్రాలలో నిక్షేపాలుగా కనుగొనబడ్డాయి.ట్రినిల్ టైగర్ (పాన్థెర టైగ్రిస్ ట్రినిలెన్సిస్ )గా పిలువబడే ఉపజాతి 1.2 మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేది, దాని శిలాజాలు జావాలోని ట్రినిల్లో కనుగొనబడ్డాయి.[7]
పూర్వ భౌగోళిక యుగ చివరి భాగంలో పులులు మొదట భారత దేశానికి మరియు పశ్చిమ ఆసియాకి వచ్చాయి, తరువాత బెరింగియా (అమెరికాఖండం కాదు), జపాన్, మరియు సఖలిన్ చేరాయి. జపాన్లో లభించిన శిలాజాలు , స్థానిక పులులు, ప్రస్తుతం జీవించి యున్న ద్వీప ఉపజాతులవలె, ప్రధానభూభాగ పులులకంటే చిన్నవని సూచించాయి.ఇది ప్రకృతిలోని పరిమిత స్థలం( ఇన్సులర్ డ్వార్ఫిజం చూడండి) లేక పరమితంగా లభ్యమయ్యే ఆహారం వలన శరీర ఆకారం ఏర్పడిన లక్షణం అయి ఉండవచ్చు.హోలోసీన్వరకు, పులులు బోర్నియాతో పాటుఫిలిప్పీన్స్లోగల పలవాన్ ద్వీపంలో కూడా నివసించాయి.[8]
శారీరక లక్షణాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
పిల్లులన్నిటిలో గుర్తించదగినవి పులులు (సింహాన్ని మినహాయిస్తే). అవి ఒకరకమైన తుప్పు-ఎరుపు రంగు నుండి గోధుమవర్ణం-తుప్పు రంగు చర్మం, తెలుపు రంగులో మధ్య భాగం మరియు పొత్తికడుపు భాగం కలిగి ముఖం చుట్టూ తెల్లని "అంచు" , మరియు గోధుమ వర్ణం లేక బూడిద రంగు నుండి నిండు నలుపు చారలను కలిగి ఉంటాయి. చారల ఆకృతి మరియు చిక్కదనము ఉపజాతుల మధ్య మారుతూ ఉంటుంది (బొచ్చు యొక్క వెనుక భాగం కూడా, ఉదాహరణకు, సైబీరియన్ పులులు సాధారణంగా మిగిలిన ఉపజాతులకంటే పాలిపోయినట్లుగా ఉంటాయి), కానీ అధిక భాగం పులులు 100 కంటే ఎక్కువ చారలను కలిగి ఉంటాయి. చారల అమరిక ప్రతి జంతువుకూ ప్రత్యేకంగా ఉంటుంది, ఏ విధంగా అయితే వేలిముద్రల ద్వారా మానవులను గుర్తించ గలుగుతామో, అదే విధంగా చారలు పులులను గుర్తించడానికి ఉపయోగపడతాయి.ఏదేమైనా ఈ విధానం గుర్తించడానికి మేలైన పద్ధతి కాదు, ఎందుకంటే అడవిపులి యొక్క చారల అమరికను లెక్కించుట చాలా కష్టం.చారలు ముఖ్యంగా పులులు వేటాడుతున్నప్పుడు,అవి కనిపించకుండా దాగి ఉండడానికి పనికివస్తుంది, పులులను మచ్చల నీడల మధ్య నుండి మరియు వేట కొరకు అడుగులు ఎత్తివేయునపుడు వాటి పరిసరాలలోని పొడవైన గడ్డి నుండి దాచి ఉంచడానికి చారలు సహాయపడతాయి.చారల అమరిక పులి యొక్క చర్మంపై ఉంటుంది మరియు దానిని గొరిగినప్పటికీ, రంగును దాచి ఉంచే అమరిక సంరక్షింపబడుతుంది.ఇతర పెద్ద పిల్లులవలె, పులులకు కూడా చెవుల వెనుకభాగంలో తెల్లమచ్చ ఉంటుంది.
అడవులలో కనిపించే అతి బరువైన పిల్లులనే ప్రత్యేకత కూడా పులులకు ఉంది.[25] సింహాలవలె పులులకు కూడా వాటికంటే శక్తివంతమైన వేటను క్రింద పడేసేందుకు వీలుగా, శక్తివంతమైన కాళ్ళు మరియు భుజాలు ఉంటాయి.బెర్గ్మన్ నియమంలోఊహించిన దాని ప్రకారం, పులుల ఉపజాతుల పరిమాణం వాటిఅక్షాంశానికి అనుపాతంలో పెరుగుతూ ఉంటుంది.ఆ విధంగా, పెద్ద మగ సైబీరియన్ పులులు ( పాన్థెర టైగ్రిస్ అల్టైకా ) "వంపుల మీదుగా " 3.5 మీ మొత్తం పొడవును (3.3 మీ . "between pegs") మరియు 306 కిలోగ్రాముల బరువును కలిగి ఉండి ,[27]జీవించి ఉన్న ఉపజాతులలో అతి చిన్నవైన, ద్వీపాలలో నివసించే పులులైన సుమత్రన్ పులివంటివి కలిగి ఉండే 75-140 కేజీల కంటే ఎక్కవ బరువు ఉంటుంది.[28] అన్ని ఉపజాతులలో ఆడపులులు మగపులుల కంటే చిన్నవిగా ఉంటాయి, మగ మరియు ఆడపులుల పరిమాణం పెద్ద ఉపజాతులలో ఎక్కువగా ఉండి, మగ పులులు ఆడపులుల కంటే 1.7 రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి.[29] దీనికి తోడు, మగ పులుల ముందర పంజా కుదురులు ఆడపులుల కంటే పెద్దవిగా ఉంటాయి.వాటి అడుగు జాడలను బట్టి లింగనిర్ధారణ చేసేందుకు జీవశాస్త్రవేత్తలకు ఈ తేడా ఉపయోగపడుతుంది.[9] పులి కపాలం కూడా సింహం కపాలం వలెనె ఉంటుంది, అయితే ముందు భాగం సాధారణంగా మరీ కృంగి లేక చదునుగా ఉండక, కనుగుంట ప్రాంతం కొద్దిగా పొడవుగా ఉంటుంది.సింహం కపాలం వెడల్పైన ముక్కు రంధ్రాలను కలిగి ఉంటుంది.ఏదేమైనా, రెండుజాతుల కపాలంలో ఉన్న తేడాల వలన, కేవలం క్రింది దవడ నిర్మాణం మాత్రమే జాతిని సూచించుటకు నమ్మతగినది.[10]
ఉపజాతులు[మూలపాఠ్యాన్ని సవరించు]
ఇటీవలి కాలంలో ఎనిమిది పులి ఉపజాతులు ఉన్నప్పటికీ, వాటిలో రెండు అంతరించినాయి. వాటి చారిత్రిక శ్రేణి (నేడు తీవ్రంగా నశించిన) బంగ్లాదేశ్, సైబీరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, చైనా, మరియు ఆగ్నేయ ఆసియా,తో పాటు కొన్ని ఇండోనేషియన్ ద్వీపాలలో విస్తరించాయి. జీవించి యున్న జాతులు వాటి సహజ జనాభా ఆధారంగా, అవరోహణ క్రమంలో క్రింది విధంగా ఉన్నాయి:
- బెంగాల్ పులి లేదా రాయల్ బెంగాల్ పులి (పాన్థెర టైగ్రిస్ టైగ్రిస్ ) ప్రాథమికంగా భారతదేశం మరియు బంగ్లాదేశ్లలో సాధారణంగా కనిపించే పులి యొక్క ఉపజాతి.[33] గడ్డి భూములు, ఉప ఆయనరేఖా మరియు ఆయనరేఖ వర్షారణ్యాలు, పొదఅడవులు, తడి మరియు పొడి ఆకురాల్చు అడవులు మరియు మడఅడవుల వంటి విభిన్న ప్రాంతాలలో ఇది నివసిస్తుంది. అడవులలో నివసించే మగపులి 205 నుండి 227 కేజి (450–500 పౌండ్ల బరువు, సగటు ఆడపులి బరువు 141 కేజి ఉంటాయి.[34] ఏదేమైనా, భారత ఉపఖండంలోని దక్షిణ ప్రాంతంలోని పులుల కంటే ఉత్తర భారత మరియు నేపాల్ బెంగాల్ పులి పెద్దవిగా ఉంటాయి, సగటు మగపులి సుమారు [35].[36] పరిరక్షకులు వీటి జనాభా 2,000, లోపు ఉంటుందని నమ్ముతున్నప్పటికీ [38] భారత ప్రభుత్వం యొక్క నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ వారి నివేదిక ఈ సంఖ్య కేవలం 1,411 అడవి పులుల్ని తేల్చి, (1165–1657 గణాంక దోషాలను లెక్కగడుతూ), గత దశాబ్దంలో 60% క్షీణతను గుర్తించింది.[40] 1972 నుండి రాయల్ బెంగాల్ పులిని రక్షించుటకు భారీస్థాయి వన్యమృగ పరిరక్షణ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ టైగర్ అమలవుతోంది.భారత అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినప్పటికీ ఆక్రమణలపై అదుపులేక పులుల రక్షిత ప్రాంతమైన (సరిస్కా టైగర్ రిజర్వు)ఆక్రమణలకు గురై పులుల జనాభా పూర్తిగా అంతరించి పోయింది.[11]
- ఇండోచైనీస్ టైగర్ (పాన్థెర టైగ్రిస్ కార్బెట్టి ), కర్బెట్ట్స్ పులి, అని కూడా పిలువబడేది కంబోడియా, చైనా, లావోస్ , బర్మా,థాయిలాండ్, మరియు వియత్నాంలలో కనబడుతుంది. ఈ పులులు బెంగాల్ పులులకంటే చిన్నవిగా మరియు ముదురురంగులో ఉంటాయి: మగ పులులు 150–190 కేజి (330–420 పౌండ్ల)ల బరువు కలిగి ఉండగా ఆడపులులు చిన్నవిగా 110–140 కేజి (242–308 పౌండ్ల)ల బరువు కలిగి ఉంటాయి. ఇవి నివాసాలుగా పర్వతప్రాంతాలలోని అడవులను లేదా కొండప్రాంతాలను ఇష్టపడతాయి.ఇండో చైనీస్ పులుల జనాభా 1,200 నుండి 1,800, వరకూ ఉండవచ్చని అంచనా, వీటిలో కొన్ని వందల పులులు మాత్రమే అడవులలో నివసిస్తున్నాయి. జీవించి ఉన్న జనాభా ఆక్రమణల నుండి తీవ్ర హానిని ఎదుర్కుంటోంది,ఆక్రమణల వలన వాటి ప్రధాన ఆహారజాతులైన జింకలు, అడవిపందులు తగ్గిపోవడం, నివాస విభాజీకరణ మరియు సంతానోత్పత్తి వంటి విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చైనా ఔషధాలయాల కోసం వియత్నాంలోని మూడోవంతు పులులు చంపబడ్డాయి.
- మలయన్ టైగర్ (పాన్థెర టైగ్రిస్ జక్సోని ), మలయ ద్వీపకల్పములోని దక్షిణభాగంలో మాత్రమే కనిపిస్తుంది, 2004 వరకు ఇవి వాటి స్వంత ఉపజాతిగా గుర్తింపబడలేదు.యునైటెడ్ స్టేట్స్లోని నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్లో భాగమైన లాబొరేటరీ అఫ్ జేనోమిక్ డైవర్సిటీకి చెందిన లుయో ఎట్ అల్ అధ్యయనం తరువాత మాత్రమే కొత్తవర్గీకరణ మొదలైనది.[12] ఇటీవల లెక్కల ప్రకారం 600–800 వరకు అడవులలో నివసించే జానాభాను కలిగిన ఈ మూడవ అతిపెద్ద పులిజాతి, రాయల్ బెంగాల్ పులి మరియు ఇండోచైనీస్ పులుల తరువాత స్థానంలో ఉంది. ప్రధానభూభాగపు పులి ఉపజాతులన్నిటిలో మలయన్ పులి చిన్నది, మరియు జీవించి యున్న ఉపజాతులలో రెండవ అతిచిన్నది, మగపులులు సగటున 120 కేజిల వరకు మరియు ఆడపులులు 100 కేజిల వరకు బరువును కలిగి ఉంటాయి. మలయన్ పులి మలేషియా యొక్క జాతీయ చిహ్నం, దీనిని సైనికుల కోటుపై మరియుమేబాంక్వంటి మలేషియన్ సంస్థల చిహ్నంగా చూడవచ్చు.
- సుమత్రన్ టైగర్ (పాన్థెర టైగ్రిస్ సుమత్రే ) ఇండోనేషియన్ ద్వీపమైన సుమత్రాలో మాత్రమే కనబడుతుంది, మరియు ఇది తీవ్ర అపాయంలో ఉంది.[13] జీవించి ఉన్న అన్ని పులి ఉపజాతులలో చిన్నది, మగపులులు 100–140 కేజిలు (220–308 పౌండ్ల) మరియు ఆడపులులు 75–110 కేజీలు (154–242 పౌండ్ల)బరువును కలిగి ఉంటాయి.[14] అవి నివసించే ప్రాంతమైన దట్టమైన, చిక్కని సుమత్రా దీవులలోని అడవులకు, చిన్నవిగా ఉండే ఆహారానికీ అనుకూలంగా వాటి శరీర నిర్మాణం కూడా చిన్నదిగా ఉంది.అడవులలో నివసించే జనాభా 400 నుండి 500 మధ్య ఉండవచ్చని అంచనా, ముఖ్యంగా ద్వీపంలోని నేషనల్ పార్క్స్లో చూడవచ్చు. ఇటీవలి జన్యుపరీక్షలు వీటిలో ఒకప్రత్యేకమైన జన్యుముద్రలను కనుగొన్నాయి, ఇవి అంతరించకపోతే[specify] ఒక ప్రత్యేకజాతిగా అభివృద్ధి చెందగలవు.[15] మిగిలిన అన్ని ఉపజాతులకంటే సుమత్రాజాతిని కాపాడటానికి ఎక్కువప్రాధాన్యాన్ని ఇవ్వాలనే సూచనను ఇవి అందించాయి. నివాస నాశనం అనేది జీవించియున్న పులిజాతులకు పెద్ద ఆపదగా ఉండగా,(రక్షిత జాతీయ పార్క్ లలో కూడా చెట్లను నరికివేయడం జరుగుతుంది)1998 మరియు 2000 మధ్యకాలంలో 66 పులులను లేదా సుమారు 20% జనాభాను కాల్చిచంపడం జరిగింది.
- సైబీరియన్ టైగర్ (పాన్థెర టైగ్రిస్ అల్టైకా ), అముర్ ,మంచురియన్ , అల్టిక్ , కొరియన్ లేదా ఉత్తర చైనా పులిగా కూడా పిలువబడుతుంది, ఇది దూర తూర్పు సైబీరియాలోనిఅముర్-ఉస్సురి ప్రాంతంలో ప్రిమోర్స్కి క్రై మరియు ఖబరోవ్స్క్ క్రై భాగాలలో ఇపుడు సురక్షితంగా ఉన్నాయి. ఉపజాతులన్నిటిలో పెద్దదిగా భావించబడే దీని తల మరియు శరీర పొడవు 190–230 సెంమీ (పులి తోక పొడవు 60–110 సెంమీ) మరియు సగటు మగపులి బరువు 227 kilograms (500 lb) ,[16] అముర్ పులి దాని దట్టమైన తోలు మరియు పాలిపోయిన బంగారు మిశ్రమవర్ణం కలిగి తక్కువ చారలతో ఇతర పులులతో విభిన్నంగా ఉంటుంది.ఇప్పటివరకు రికార్డయిన అతి పెద్ద సైబీరియన్ పులి బరువు 384 కేజిలు,[17] కానీ మజాక్ ప్రకారం ఇటువంటి అతిపెద్ద జీవులు విశ్వసనీయ వర్గాల ద్వారా ద్రువీకరింపబడలేదు.[18] అయినప్పటికీ, ఆరునెలల వయసుకలిగిన ఒక సైబీరియన్ పులి, పూర్తిగా పెరిగిన చిరుతపులి అంత పెద్దదిగా ఉంటుంది. గడచిన రెండు లెక్కలలో (1996 మరియు 2005) 450–500 వరకు ఉన్న అముర్ పులులు వాటి జాతిలో కొంతవరకు నిరంతరంగా ఉండి, వాటి శ్రేణిని ప్రపంచంలో ఒకే శాఖగా ఉన్న అతిపెద్ద పులుల జనాభాగా ఉంచుతున్నాయి. 2009 లో జరిగిన జన్యు పరీక్షలలో సైబీరియన్ పులి మరియు పశ్చిమ కాస్పియన్ పులి(ఒకప్పుడు వేరే ఉపజాతిగా భావించబడి 1950 ల చివరిలో అంతమైందని భావించబడింది) [19][20])ఒకే ఉపజాతికి చెందినవని, ఇటీవలి కాలంలో అనగా గడచిన శతాబ్దంలోనే మానవజోక్యం వలన వీటిమధ్య విభజన ఏర్పడిందని తేలింది.[21]
- సౌత్ చైనా టైగర్ (పాన్థెర టైగ్రిస్ అమోఎన్సిస్ ), అమోయ్లేదా జియామెన్ పులిగా కూడా పిలువబడుతుంది, ఇది తీవ్ర ఆపదను ఎదుర్కొటున్న పులి ఉపజాతి మరియు అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న 10 జంతువుల జాబితాలో చేర్చబడింది.[22]మూస:Clarify me పులి ఉపజాతులలో చిన్నదైన దక్షిణ చైనా పులుల పొడవు 2.2–2.6 m (87–102 in)గా మొగ మరియు ఆడ పులులలో ఉంటుంది. మగ పులులబరువు 127 నుండి 177 కేజిల (280–390 పౌండ్లు)మధ్య ఉండగా ఆడపులుల బరువు 100 నుండి 118 కేజిల (220–260 పౌండ్ల) మధ్యఉంటుంది. 1983 నుండి 2007 వరకు ఒక్క దక్షిణ చైనా పులి కూడా కనిపించలేదు.[23] 2007 లో ఒక వ్యవసాయదారుడు ఒక పులిని గుర్తించి ఫోటోగ్రాఫ్లను అధికారులకు సాక్ష్యంగా సమర్పించాడు.[23][24] ఈ ఫొటోగ్రాఫ్లు ప్రశ్నించబడి, చైనీయుల కాలెండరు నుండి కాపీ చేయబడినవిగా మరియు ఫోటోషాపీ చేయబడినవిగా గుర్తించబడ్డాయి, మరియు పులిని "గుర్తించడం" అనే ప్రక్రియ పెద్ద వివాదానికి దారితీసింది.[25][26][27]
1977 లో చైనీస్ ప్రభుత్వం అడవి పులులను చంపడంపై ఒక చట్టాన్ని చేసింది, కానీ ఇది ఈఉపజాతిని కాపాడలేక పోయింది, ఎందుకంటే ఈఉపజాతి అప్పటికే అంతరించిపోయింది.చైనా మొత్తంలో, దక్షిణ చైనాలో 59 పులులు బంధించబడి ఉన్నట్లు తెలుస్తోంది, కానీ ఇవి కేవలం ఆరుజంతువుల నుండే ఉద్భవించాయి.అందువలన, ఈ ఉపజాతిని కాపాడటంలో అవసరమైన జన్యు వైవిధ్యత ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు.ప్రస్తుతం, ఈ పులులను అడవులలో తిరిగి ప్రవేశ పెట్టడానికి సంతానోత్పత్తి ప్రక్రియలు జరుగుతున్నాయి.
అంతరించిన ఉపజాతులు[మూలపాఠ్యాన్ని సవరించు]
- బాలినీస్ టైగర్ (పాన్థెర టైగ్రిస్ బాలికా ) బాలి ద్వీపానికి మాత్రమే పరిమితమై ఉండేది. పులి ఉపజాతులన్నిటిలో ఇది అత్యంత చిన్నది, మగపులులు 90–100 కేజిల బరువును మరియు ఆడపులులు 65–80 కేజిల బరువును కలిగి ఉంటాయి.[18] ఈ పులులు అవి అంతరించిపోయేదాకా వేటాడబడ్డాయి-చివరి బాలినీస్ పులి పశ్చిమ బాలిలోని, సుమ్బార్ కిమ అను ప్రదేశంలో 1937 సెప్టెంబరు 27 లో చంపబడింది; ఇది ఒక మధ్యవయసు ఆడపులి. బాలినీస్ పులి ఎన్నడూ బంధిపబడలేదు. ఈ పులి బాలినీస్ హిందూయిజంలోఇప్పటికీ ముఖ్య పాత్ర వహిస్తోంది.
- జావన్ టైగర్ (పాన్థెర టైగ్రిస్ సొండైకా) ఇండోనేషియన్ ద్వీపమైనజావాకే పరిమితమై ఉండేది. వేటాడటం మరియు నివాస ప్రాంతాల విధ్వంసం వలన ఈ ఉపజాతులు 1980 లలో అంతరించినట్లు కనిపిస్తుంది, కానీ 1950 ల నుండే ఈ ఉపజాతులు అంతరించడం మొదలై ఉండవచ్చు (అప్పుడు 25 కంటే తక్కువ పులులు మాత్రమే అడవులలోఉన్నట్లు భావించబడ్డాయి) 1979 లో చివరిసారి ఈపులిని చూసినట్లుగా నిశ్చయమైనది, కానీ 1990 లలో కూడా అప్పుడప్పుడూ చూసినట్లు చెప్పబడ్డాయి.[28][29]సుమత్రన్ పులి వలె జావన్ పులి కూడా సుమారు అదే పరిమాణం కలిగి ఉపజాతులలోని చిన్నవాటిలో ఒకటిగా ఉంది, మగపులులు 110-141 కేజీల బరువు మరియు ఆడపులులు 75-115 కేజీల బరువును కలిగిఉన్నాయి.[ఆధారం చూపాలి][79]
సంకరములు[మూలపాఠ్యాన్ని సవరించు]
పులులతో సహా పెద్దపిల్లుల మధ్య సంకరములు, 19 వ శతాబ్దంలో, జంతుప్రదర్శనశాలలు వీటిలోని అసాధారణతలను ప్రదర్శించి ఆర్ధిక ప్రయోజనాన్ని పొందాలని ఆశించినపుడు మొదలైనాయి.[30] సింహములనుపులులతో సంకరీకరించి (తరచుగా అముర్ మరియు బెంగాల్ ఉపజాతులు) లైగెర్లు మరియు టైగొన్లనేసంకరములను సృష్టించాలని ప్రయత్నించారు.[31] ఈ సంకరములు జంతుప్రదర్శనశాలల్లో చేయబడ్డాయి, కానీ ప్రస్తుతం జాతులు మరియు ఉపజాతుల పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించడం వలన వీటిని ప్రోత్సహించడం లేదు.చైనాలో ప్రైవేట్ వ్యక్తులచే నిర్వహింపబడే సంస్థలు మరియు జంతుప్రదర్శనశాలల్లో సంకరీకరణ కొనసాగుతోంది.
లైగెర్ అనేది మగసింహానికీ మరియు ఆడపులికీ మధ్య సంతాన సాంకర్యము.[32] సింహముల వంశం అభివృద్ధి-ప్రోత్సాహక జన్యువును అందచేస్తుంది, కానీ ఈవిధమైన అభివృద్ధి-పరచుకొనే జన్యువు ఆడ పులులో లేదు, లైగేర్స్ తమ తల్లితండ్రులిద్దరి కంటే ఎక్కువగా పెరుగుతాయి.ఇవి శారీరక మరియు ప్రవర్తనాపరమైన లక్షణాలను తల్లితండ్రులిరువురి జాతులనుండి పొందుతాయి(గోధుమవర్ణ శరీరంపై మచ్చలు మరియు చారలు) . మగ లైగెర్లు వంధ్యత్వం కలిగిఉండగా, సాధారణంగా ఆడలైగెర్లు సంతానోత్పత్తి సామర్ధ్యాన్నికలిగి ఉంటాయి. 50% మగవి జూలును పొందే అవకాశం ఉన్నప్పటికీ, వాటి జూలు అసలైన సింహం యొక్క జూలులో సగంమాత్రమే ఉంటుంది.ఒక మాదిరి లైగెర్లు 10 నుండి 12 అడుగుల పొడవును కలిగి ఉంటాయి, 800 నుండి 1,000 పౌండ్ల మధ్య లేక అంతకు మించినబరువును కలిగి ఉంటాయి.[32]
కొంత అసాధారణమైన టైగాన్ ఆడసింహానికీ మరియు మగపులికీ సంకరం వలన ఉద్భవించింది.[33]
వర్ణ వైవిధ్యం[మూలపాఠ్యాన్ని సవరించు]
తెల్ల పులులు[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రధాన వ్యాసం: White tiger
సాంకేతికంగా చిన్చిలియ అల్బినిస్టిక్ గా పిలువబడే పద్ధతి తెల్లపులలను ఉత్పరివర్తనం చేయడంలో ప్రాచుర్యం పొందింది,[34]ఇది అడవులలో అరుదుగా కనిపించే జంతువే అయినప్పటికీ, దానికున్న ప్రజాకర్షణ వలన జంతుప్రదర్శనశాలల్లో విస్తృతంగా సంకరీకరించబడింది. తెల్ల పులుల సంకరీకరణం తరచుగా తక్కువ సంతానోత్పత్తికి దారి తీస్తుంది (వాటికి వెనుకకు పోయే లక్షణం ఉండటం వలన). ఈ విషయానికి విరుగుడుగా తెల్ల మరియు కాషాయ రంగు పులులనుజత పరుస్తూ,ఈ ప్రక్రియలో తరచూ ఇతర ఉపజాతులను కలుపుతూ అనేక చర్యలను తీసుకోవడం జరిగింది.ఈ విధమైన స్వజాతి సంకరం తెల్లపులులను కొన్ని శారీరక అవలక్షణాలు, అంగిలి చీలి ఉండటం మరియు స్కలియోసిస్ (వెన్నెముక వంకరగా ఉండటం) వంటి వాటితో జన్మించేటట్లు చేసింది.[35][36] ఇంకా ఇది తెల్లపులులను మెల్లకళ్ళు కలిగిఉండేటట్లు ( స్ట్రాబిస్మస్అనే పరిస్థితిని) చేసింది. సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించే తెల్లపులులు కూడా కాషాయరంగు పులులంత ఎక్కువ కాలం జీవించలేవు.తెల్లపులులను గురించిన సమాచారం 19 వ శతాబ్దం ప్రారంభంనుండే వ్రాయబడింది.[37] తెల్ల పులులలో కనిపించే అరుదైన జన్యువును తల్లితండ్రులు రెండూ కలిగి ఉన్నప్పుడే వాటి జననం జరుగుతుంది; ప్రతి 10,000 పుట్టుకలలో ఒకసారి మాత్రమే ఈ రకమైన జన్యువు ఉంటుందని అంచనా వేయబడింది. తెల్ల పులి ఒక ప్రత్యేక ఉపజాతి కాదు, కేవలం వర్ణ భేదం మాత్రమే; ఎందుకంటే అడవిలో ఉండే తెల్లపులులు కేవలం బెంగాల్ పులులు మాత్రమే [38] (బంధించబడిన తెల్లపులులన్నీ బెంగాల్ పులులలో భాగమే), కారణాలు తెలియనప్పటికీ తెలుపురంగును కలిగించే ఈ జన్యువు బెంగాల్ పులులలో మాత్రమే ఉంటుందని భావించబడుతోంది.[35][39]సాధారణ పులులకంటే ఇవి ఎక్కువ ఆపదను కలిగి ఉన్నాయని భావించడం పొరపాటు కాదు. ఇంకొక పొరపాటు భావన తెల్లపులులు అల్బినోస్ అని భావించడం, కానీ తెల్ల పులుల చారలలో వర్ణకం కనిపిస్తుంది.కేవలం వాటి తెలుపుమిశ్రమం వల్లనేకాక తెల్లపులులు వాటి నీలికళ్ళు మరియు లేతగులాబీ ముక్కు వలనకూడా ప్రత్యేకతను పొందుతున్నాయి.
బంగారు మచ్చల పులి[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రధాన వ్యాసం: Golden tabby
దీనికి తోడు మరియొక మాంద్యత గల జన్యువు వల్ల ఒక అసాధారణ వర్ణ భేదం "బంగారు మచ్చ", కొన్ని సార్లు స్ట్రాబెర్రీగా పిలువబడేది ఏర్పడుతుంది. బంగారు మచ్చ పులులకు లేత బంగారు రంగు ఉన్ని, వివర్ణమైన కాళ్ళు మరియు వెలిసినట్లున్న కాషాయరంగు చారలు ఉంటాయి.సాధారణ ఉన్నికంటే దీని ఉన్ని దట్టంగా ఉంటుంది.[40] చాలా తక్కువ సంఖ్యలో, కేవలం 30 మాత్రమే బంధిత బంగారు మచ్చ పులులు ఉన్నాయి. తెల్లపులులవలె, స్ట్రాబెర్రీ పులులు కూడా బెంగాల్ పులులలో ఒక భాగమే. హెటిరోజైగోస్ పులిగా పిలువబడే కొన్ని బంగారుమచ్చ పులులు, తెల్లపులి జన్యువును కలిగిఉండి, అలాంటి రెండు పులులను జతపరచినపుడు, చారలు లేని తెలుపు కూనలకు జన్మనిస్తాయి.సగటు బెంగాల్ పులి కంటే తెలుపు మరియు బంగారుమచ్చల పులులు రెండూ కూడా పెద్దవిగా ఉంటాయి.
ఇతర వర్ణ భేదాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
"నీలం" లేదా పలక రంగు పులి, మాల్టీస్ పులి, ఎక్కువ భాగం లేదా పూర్తి నల్ల పులుల గురించి రూఢి కాని వార్తలున్నప్పటికీ, ఇవి నిజమని భావిస్తే, అవి ప్రత్యేక జాతులుగా కాక అరుదుగా సంభవించే ఉత్పరివర్తనాలుగా గుర్తించబడతాయి.[34]
జీవశాస్త్రం మరియు ప్రవర్తన[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రాదేశిక ప్రవర్తన[మూలపాఠ్యాన్ని సవరించు]
పులులు సాధారణంగా ఒంటరిగా మరియు ప్రాదేశికంగా ఉండే జంతువులు.పులుల నివాసప్రాంత పరిమాణం వాటి ఆహార సమృద్ధిపై ఆధారపడి ఉంటుంది, మగపులి విషయంలో ఆడపులి లభ్యతపై ఆధారపడి ఉంటుంది.ఆడపులి యొక్క ప్రాదేశికత 20 చదరపు కిలోమీటరుల వరకు ఉండవచ్చు, అయితే మగపులి యొక్క ప్రాదేశికత మరింత ఎక్కువగా ఉండి, 60–100 చదరపు కిమీ.వరకు ఉంటుంది. మగపులుల విస్తృతి అనేక ఆడపులుల విస్త్రుతలతో కలిసిఉంటుంది.
పులుల మధ్య సంబంధాలు చాల సంక్లిష్టంగా ఉంటాయి, మరియు ప్రాదేశిక హక్కులు మరియు ప్రాదేశిక అతిక్రమణలపై పులులకు నిర్దేశిత "నిబంధన" ఏదీ లేనట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు, చాలావరకు పులులు ఒకదానినొకటి తప్పించుకు తిరిగినప్పటికీ, మొగ మరియు ఆడపులులు వేటను పంచుకుంటున్నట్లుగా గమనించబడ్డాయి.ఉదాహరణకు, జార్జి స్ఖల్లెర్, మగపులి తన వేటను రెండు ఆడపులులు మరియు నాలుగు పులిపిల్లలతో పంచుకుంటుండగా గమనించారు. ఆడపులులు సాధారణంగా మగపులులు పిల్లల వద్దకు రావడానికి ఇష్టపడవు, కానీ ఈ ఆడపులులు తమ పిల్లలను మగపులుల నుండి రక్షించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడాన్ని స్ఖల్లెర్ గమనించారు, మగపులులు ఈ పులిపిల్లల తండ్రులని సూచన కావచ్చు.మగసింహాలకి భిన్నంగా, మగపులులు, ఆడపులులని మరియు పిల్లలని ముందుగా వేటని స్వీకరించడానికి అనుమతిస్తాయి. వేట కొరకు తగాదాలు మరియు పోరాటాలు జరిపే సింహాల ప్రవర్తనకు భిన్నంగా, పులులు వేటను పంచుకోవడంలో సాపేక్షంగా స్నేహపూర్వకంగా ఉంటాయి. పరస్పర సంబంధంలేని పులులు కూడా వేటను కలిసి భుజిస్తాయి.క్రింద ఇవ్వబడిన ఉదహరింపు స్టీఫెన్ మిల్స్ యొక్క టైగర్ అనే పుస్తకం లోనిది, దీనిలో ఆయన రంథంభోర్ లో వల్మిక్ థాపర్ మరియు ఫతే సింగ్ రాథోర్ల చే గమనించబడిన దృశ్యాన్ని వివరిస్తున్నారు:[41]
పద్మిని అని పిలువబడే ఒక ఆడపులి 250 కేజీ(550-పౌండ్ల) మగ నిల్గయ్ - ఒక పెద్ద జింకను చంపింది. వారు, అది తన 14 నెలల వయసు కలిగిన మూడు కూనలతో సహా వేట వద్ద సూర్యాస్తమయం తరువాత పది గంటలపాటు గడపటాన్ని గమనించారు.ఈ సమయంలో ఈ కుటుంబంతో రెండు ఆడ పెద్దపులులు మరియు ఒక మగ పెద్దపులి-అన్నీ పద్మిని యొక్క పూర్వపు ఈత సంతానం, మరియు రెండు ఏసంబంధమూ లేని పులులు, ఒకటి ఆడపులి, మరియొక గుర్తించబడని పులి వచ్చి చేరాయి.మూడు గంటలకల్లా వేట చుట్టూ తొమ్మిదికి తక్కువగా పులులు లేవు.
యవ్వనంలోని ఆడ పులులు తమ ప్రాదేశికతను ఏర్పాటు చేసుకొనేటప్పుడు తమ తల్లికి వీలైనంత దగ్గరగా ఏర్పాటు చేసుకొంటాయి.కాలం గడిచేకొద్దీ వాటి ప్రాదేశికతల మధ్య వివక్తత తగ్గిపోతుంది. మగపులులు ఆడప్లుల కంటే ఎక్కువ ప్రదేశంలో సంచరిస్తాయి, మరియు చిన్న వయసులోనే వాటి ప్రదేశాన్ని సమర్ధంగా నిర్వహించు కుంటాయి.ఒక యుక్త వయసులోని మగపులి ఇతరపులుల ఆధీనంలోలేని ప్రదేశాన్ని తనఆధీనంలోకి తీసుకుంటుంది, లేదా దానికి తగిన వయసు వచ్చి శక్తివంత మయ్యే వరకు ఇతర మగపులుల ప్రదేశంలో తాత్కాలికంగా నివసిస్తుంది.వయసు వచ్చిన మొగపులుల అత్యధిక మరణరేటు(30-35% సాలుకు)కి కారణం, యుక్త వయసులోని పులులు తాము జన్మించిన ప్రదేశాన్ని వదిలి, ఇతర పులుల ప్రాంతాన్ని ఆక్రమించడానికి చేసే ప్రయత్నం.[42]
ఒకే ప్రాంతంలోని ఆడపులులు ఇతర ఆడపులులతో ఉండేదానికంటే, మగపులులు ఇతర మగపులుల పట్ల ఎక్కువ అసహనంతో ఉంటాయి.ఏదేమైనా, ఎక్కువభాగం ప్రాదేశిక వివాదాలు తక్షణకలహాల కంటే, పిరికితనం చూపడం వలన పరిష్కరించ బడతాయి. అధీనమైన పులి ఓటమి భంగిమలో పొట్ట కనిపించేటట్లుగా తన వీపుపై పడుకొని, విధేయతను ప్రదర్శించి ఓటమి ఒప్పుకొనే అనేక సంఘటనలు గమనించబడ్డాయి.[43] ఒక మగపులి తన ప్రదేశంలో ఒకసారి ఆధిపత్యం నిరూపించబడిన తరువాత, ఇతర పులులు తన నివాసానికి మరీ దగ్గరగా రానంత వరకు వాటిని సహిస్తాయి.[42] ఒక ఆడపులి గర్భధారణసమయంలో ఉన్నపుడు రెండు మగపులుల మధ్య హింసాత్మక పోరాటాలు సంభవించి దాని ఫలితంగా ఏదో ఒకటి చనిపోవడం జరిగే సంఘటనలు సాపేక్షంగా అరుదుగా జరుగుతూ ఉంటాయి.[42][44]
మగపులులు వృక్షాలపై మల, మూత్ర విసర్జనలు చిమ్మడం ద్వారా, వేగంగా సంచరించడం వలన ఏర్పడే అడుగుజాడల ద్వారా తమ ఆధీనంలోని ప్రదేశాన్ని గుర్తిస్తాయి. ఒక ఆడపులి గర్భధారణ సమయంలో ఉన్నట్లు దాని మూత్ర విసర్జన గుర్తుల వాసనను పసిగట్టిన మగపులులు ఫ్లేహ్మెన్ రెస్పాన్స్గా పిలువబడే ముఖ చిట్లింపుని ప్రదర్శిస్తాయి.
అడవులలో నివసించే పులులను అనేక పద్ధతుల ద్వారా అధ్యయనం చేసారు.గతంలో పులుల జనాభాను వాటికాలిజాడల యొక్క ప్లాస్టర్ పోతలను ఉపయోగించి గణించేవారు. ఇది దోషపూరితమైనదిగా కనుగొనబడినది[45]మరియు దీనికి బదులుగా కెమెరా ట్రాపింగ్ పద్ధతిని ప్రయత్నించారు . వాటి కదలికల నుండి సేకరించిన డిఎన్ఏ పై ఆధారపడిన నూతన పద్ధతులను విశ్లేషించడం జరుగుతోంది. రేడియో కాలరింగ్ కూడా అడవిలో వాటిని గమనించడానికి ఉపయోగించే ఒక ఆధునిక పద్ధతి .
వేటాడుట మరియు ఆహారం[మూలపాఠ్యాన్ని సవరించు]
అడవిలో పులులు ఎక్కువగా పరిమాణంలో పెద్దగా మరియు మధ్యస్తంగా ఉండే జంతువులను ఆహారంగా తీసుకుంటాయి.సాంబార్, గౌర్,జింక,అడవి పంది,నిల్గై మరియు నీటి గేదె,పెంపుడుగేదెలు కూడా ఇండియాలో పులుల యొక్క ప్రీతికరమైన ఆహారం. కొన్నిసార్లు చిరుతలు,కొండచిలువలు,ఎలుగుబంటిమరియుమొసళ్ళను కూడా వేటాడతాయి. సైబేరియాలో ముఖ్యమైన ఆహారం మంచురియన్ వాపితి , అడవి మగపంది,సికా జింక , మూస్, రో డీర్,మరియు కస్తూరి జింక. సుమత్రాలో సాంబార్, ముంట్జాక్, అడవి మగ పంది, మరియు మలయన్ టాపిర్లు ఆహారంగా స్వీకరించ బడతాయి.ముందు చెప్పిన కాస్పియన్ పులుల శ్రేణి ఆహారంలో సైగ అంటీ లోప్, ఒంటెలు,కుకాసియన్ విసెంట్, జడల బర్రె, మరియు అడవి గుర్రాలు ఉన్నాయి. ఇతర వలె ఇవి కూడా అవకాశవాదులు మరియు చిన్న జంతువులైన కోతులు, మగ కోళ్ళు, కుందేళ్ళు, మరియు చేపలను భుజిస్తాయి.
పెద్ద వయసు ఏనుగులు సాధారణ ఆహారంగా స్వీకరించడానికి మరీ పెద్దవి, కానీ పులులు మరియు ఏనుగుల మధ్య కొన్నిసార్లు సంఘర్షణలు తలెత్తుతాయి.పులి ఒక పెద్ద వయసు భారత ఖడ్గ మృగాన్ని చంపిన సంఘటన గమనించబడింది.[46] యువ ఏనుగులు మరియు ఖడ్గమృగాలు అప్పుడప్పుడూ ఆహారంగా స్వీకరించబడతాయి.పులులు కొన్ని సార్లు దేశీయ జంతువులైన కుక్కలు, ఆవులు, గుర్రాలు, మరియు గాడిదలను ఆహారంగా స్వీకరిస్తాయి. కేవలం ఆటకోసం చంపేవిగా కాక వీటిని పశువులను-ఎత్తుకు పోయేవి లేక పశు-హంతకులుగా పిలుస్తారు.[47]
ముసలి పులులు లేదా గాయపడిన పులులు మరియు వాటి సహజ ఆహారాన్ని వేటాడలేనివి, నర-మాంస భక్షకులుగా మారాయి; భారతదేశంలో ఇది అనేకసార్లు పునరావృతమైంది.దీనికి మినహాయింపుగా సుందర్బన్స్లో, అటవీ ఉత్పత్తులకై వెదికే గ్రామస్థులు మరియు మత్స్యకారులను వేటాడి, ఆరోగ్యవంతమైన పులులు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నాయి.[48] పులి అప్పుడప్పుడూ పీచు పదార్ధాన్ని స్వీకరిస్తుంది, దానికి ఇష్టమైనదిస్లో మ్యాచ్ చెట్టు యొక్క పండు.[47]
పులులు సాధారణంగా రాత్రి పూట వేటాడుతాయి.[49]ఇతర పిల్లుల వలె అవి సాధారణంగా ఒంటరిగా వేటాడుతాయి మరియు వాటి ఆహారంపై అకస్మాత్తుగా వేటాడుతాయి, తమ శరీర పరిమాణాన్ని మరియు బలాన్ని ఉపయోగించుకొని పెద్ద జంతువులను పడవేసి ఏకోణం నుంచైనా వాటిని ఆక్రమించుకుంటాయి.వాటికి అధిక బరువు ఉన్నప్పటికీ, పులుల వేగం 49-65 కిలో మీటర్లు గంటకి (35-40 మైళ్ళు గంటకి) చేరగలదు , తక్కువఊపుతో ఈ వేగాన్ని అందుకున్నప్పటికీ, వాటికి సాపేక్షంగా తక్కువ సత్తువ ఉండటం వలన; పులులు తమ ఉనికిని చాటుకునే ముందు వేటకు సాధ్యమైనంత దగ్గరగా వెళతాయి. పులులకు దూకే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది; సమాంతరంగా 10 మీటర్లు దూకిన ఆధారాలు కలవు, దీనిలో సగం దూరం దూకడం అనేది సాధారణ విషయం.ఏదేమైనా, ఇరవై వేటలలో ఒకటి మాత్రమే విజయవంతంగా చంపబడుతుంది.[49]
పెద్ద జంతువులను వేటాడేటపుడు, పులులు వాటి గొంతు కొరకడాన్ని ఇష్టపడతాయి మరియు వాటిని నేలపై పడవేసి తమ ముందు కాళ్ళతో అణచి ఉంచుతాయి. పులి జంతువు గొంతు నొక్కి పట్టుకొని దానిని గొంతు పిసకడం ద్వారా చనిపోయేటట్లు చేస్తుంది.[50] ఈ పద్ధతిలో, ఒక టన్నుకు పైగా బరువుగల గౌర్లు మరియు నీటి గేదెలను, వాటిలో ఆరవవంతుబరువు కలిగిన పులి చంపగలిగింది.[51] చిన్న జంతువుల విషయంలో పులి వాటి మూపునుకొరికి, సాధారణంగా వెన్నుపాము విరిచివేసి, శ్వాస నాళాన్ని పొడిచి, లేక మెడ నాళం లేక తలకు వెళ్ళే ధమనులనుచీల్చి వేస్తుంది.[52] అసాధారణంగా గమనించేదే అయినప్పటికీ, కొన్ని పులులు తమ వేటను పంజాతో దెబ్బ తీయడం ద్వారా చంపడం గమనించబడింది, పెంపుడు పశువుల పుర్రెను పగుల గొట్టుటకు[47] స్లోత్ఎలుగు యొక్క వెనుకభాగాన్ని చీల్చెంత శక్తి కలిగి ఉంటుంది.[53]
1980 లలో "గెంఘిస్" అనే పేరుగల పులి రంథంభోర్ నేషనల్ పార్క్లో లోతైన సరస్సులో వేటాడటం గమనించబడింది,[54] ఈ విధమైన ప్రవర్తన గడచిన 200 సంవత్సరాలలో ఎన్నడూ పరిశీలనలలో గుర్తించబడలేదు.అంతేకాక, 20% వేటలను చంపడం ద్వారా అది అసాధారణంగా విజయవంతమైన పులిగా అనిపిస్తుంది.
సంతానోత్పత్తి[మూలపాఠ్యాన్ని సవరించు]
జత కూడటం సంవత్సరం అంతా ఉండవచ్చు, కానీ సాధారణంగా నవంబరు మరియు ఏప్రిల్ మధ్య ఉంటుంది.[55] ఆడపులి కలయికకు కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటుంది మరియు ఆ సమయంలోనే జత కూడటం తరచుగా జరుగుతుంది. ఇతర పిల్లులవలె శబ్దం చేస్తూ, తరచూ జతకూడతాయి.గర్భధారణ సమయం 16 వారాలు.ఒక ఈతలో సాధారణంగా ఒక్కొక్కటి 1 kilogram (2.2 lb) గల 3-4 కూనలు ఉంటాయి, ఇవి గుడ్డివిగా మరియు నిస్సహాయంగా జన్మిస్తాయి. దట్టమైన ప్రాంతాలు లేదా రాతిపగుళ్ళ వంటి ప్రాంతాలలో వాటిని ఉంచి, ఆడ పులులు వాటిని ఒంటరిగా సాకుతాయి.సాధారణంగా కూనల పెంపకంలో తండ్రి పాత్ర ఏమీ ఉండదు.కొన్ని సందర్భాలలో వాటితో సంబంధంలేని మగపులులు ఆడపులులతో జతకూడటం కొరకు కూనలను చంపివేస్తాయి, ఎందుకంటే ముందు ఈతలో కూనలు చనిపోయినట్లయితే ఆడపులి తరువాతి ఈతకు 5 నెలలలోపు సిద్ధమవుతుంది.[55] మరణాల రేటు పులులలో చాల అధికంగా ఉంటుంది-సగం కంటే ఎక్కువ పులులు రెండు సంవత్సరాల తరువాత బ్రతుకలేవు.[55]
ప్రతి ఈతలో ఒక కూన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది, అది సాధారణంగా మగదై ఉంటుంది లేదా ఏదైనా కావచ్చు.[54] ఈ కూన ఆటలలో సాధారణంగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది మరియు బాగా ఉత్సాహంగా ఉండి, మామూలు కంటే ముందుగా తల్లిని విడిచి పెడుతుంది.8 వారాల వయసులో అవి తమ తల్లిని అనుసరించి బయటికి రావడానికి సిద్ధమవుతాయి, అయితే అవి పెద్దవయ్యేవరకు, తల్లి తన ప్రదేశం అంతా తిరిగేటపుడు దానిని అనుసరించవు.18 నెలల వయసు వచ్చేసరికి కూనలు స్వతంత్రమవుతాయి, కానీ 2–2½ సంవత్సరాల వయసు వచ్చేవరకు అవి తమతల్లిని వదిలిపెట్టవు.ఆడవి 3–4 సంవత్సరాలలో సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి, అయితే మగవి 4–5 సంవత్సరాలకు సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి.[55]
తన జీవిత కాలంలో, ఒక ఆడపులి సుమారుగా సమాన సంఖ్యలో ఆడ మరియు మగ కూనలకు జన్మనిస్తుంది.బంధిత పులులలో సంతానోత్పత్తి బాగా జరుగుతుంది, మరియు యునైటెడ్ స్టేట్స్ లోని బంధిత పులుల జనాభా ప్రపంచంలోని అడవి పులుల జనాభాతో పోటీపడే అవకాశం ఉంది.[56]
మాంసాహార ప్రత్యేకాన్తర్గత సంబంధాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
చిరుతలు, కొండ చిలువలు మరియు మొసళ్ళవంటి అదుపు చేయడం కష్టమైన మాంసాహారులను పులులు అప్పుడప్పుడూ చంపుతాయి, ,[57][58][59] అయితే ఈ మాంసాహారులు ఒకదానినొకటి తప్పించుకొని తిరుగుతాయి. మొసలిచే బంధించబడినపుడు, పులి ఆ ఉభయచరం యొక్క కళ్ళలో పంజాతో దాడి చేస్తుంది.[47] చిరుతలు రోజులోని వేర్వేరు కాలాలలో వేర్వేరు జంతువులను వేటాడటం ద్వారా పులుల నుండి పోటీని తప్పించుకుంటాయి.[46] సరిపడినంత ఆహారం ఉండటం వలన పులులు మరియు చిరుతలు విజయవంతమైన పోటీరహిత సహజీవనాన్ని కొనసాగిస్తాయి, లేక అంతర్-జాతి ఆధిపత్య క్రమం ఉంటుంది, ఇది సవన్నాలలో సాధారణం.[60] రెండు జాతుల ఉనికి ఉన్న ప్రదేశాలలో పులులు తోడేళ్ళ జనాభాను అణచివేస్తాయి.[61][62] ఎక్కువ నష్టం జరగనప్పటికీ, ఆహారం కొరకు జరిగే తగాదాలలో పులులను గాయ పరచి చంపడానికి ప్రయత్నించే అడవి కుక్కల సమూహంగమనించబడింది.[53] సైబీరియన్ పులి మరియు గోధుమ ఎలుగుబంట్లు పోటీదారులు మరియు సాధారణంగా ఎదురుపడవు; ఏదేమైనా, పులులు కొన్నిసార్లు ఎలుగు పిల్లలను మరియు పెద్ద ఎలుగులను కూడా చంపుతాయి. ఎలుగు బంట్లు (ఆసియా లోని నల్ల మరియు గోధుమ రంగు ఎలుగు బంట్లు) రష్యా దూర ప్రాచ్యం లో 5-8% పులి ఆహారంలో భాగంగా ఉంటుంది.[18] గోధుమ రంగు ఎలుగుబంట్లు పులులను చంపిన ఆధారాలు ఉన్నాయి, ఇది ఆత్మరక్షణ కొరకు లేదా వేటపై సంఘర్షణలో కావచ్చు.[10] శేతాకాలం నిద్ర నుండి వచ్చే కొన్ని ఎలుగులు పులుల వేటను దొంగిలించడానికి ప్రయత్నిస్తాయి, అయితే కొన్నిసార్లు పులి తన వేటను రక్షించు కుంటుంది. స్లోత్ ఎలుగుబంట్లు చాలా దూకుడుగా ఉంటాయి మరియు కొన్ని సార్లు చిన్న వయసు పులులను వాటి వేట నుండి తరిమేస్తాయి, అయితే చాల సందర్భాలలో బెంగాల్ పులులు స్లోత్ ఎలుగుబంట్లను వేటాడుతాయి.[18]
నివాసము[మూలపాఠ్యాన్ని సవరించు]
ఒక మాదిరి పులుల ప్రదేశం మూడు ముఖ్యలక్షణాలను కలిగిఉంటుంది: అది ఎల్లపుడు మంచి మరుగును , నీటికి దగ్గరగా ఉండటం మరియు తగినంత ఆహారం కలిగిఉండటం.బెంగాల్ పులులు, అన్ని రకాల అడవులైన తడి, సతత హరిత, అస్సాం మరియు తూర్పుబెంగాల్ల లోని పాక్షిక -సతత హరిత; గంగా డెల్టా లోని మడ అడవులు; నేపాల్ లోనిఆకురాల్చు అడవులు మరియు పశ్చిమ కనుమలలోని ముళ్ళ అడవులలో నివసిస్తాయి.సింహంతో పోల్చినపుడు పులి దట్టమైన అడవులకు ప్రాధాన్యతనిస్తుంది, దానికి అవసరమైన మరుగు కొరకు ఇది ఉపయోగపడుతుంది మరియు ఇది గుంపుగా కాక ఒంటరిగా వేటాడుటకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.పెద్ద పిల్లులలో, కేవలం పులి మరియు చిరుత మాత్రమే బలమైన ఈతగాళ్ళు; పులులు తరచుగా చెరువులలో,సరస్సులలో, మరియు నదులలో స్నానంచేయడం గమనించవచ్చు. ఇతర పిల్లులవలె కాక పులులు నీటి నుండి తప్పించుకోక నీటిని కోరుకుంటాయి.పగటి పూట అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఇవి చల్లదనం కోసం చెరువులను ఆశ్రయించడం గమనించవచ్చు. పులులు శ్రేష్టమైన ఈతతో 4 మైళ్ళ వరకూ ఈదగలుగుతాయిపులులు తరచుగా సరస్సులలో తమ వేటను తీసుకురావడం గమనించవచ్చు.
పరిరక్షక చర్యలు[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రధాన వ్యాసం: Tiger conservation
చర్మం కోసం వేటాడటం మరియు నివాసాలను నాశనం చేయడం వంటి కారణాల వాళ్ళ అడవులలో పులుల జనాభా బాగా తగ్గింది. 20 వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచ వ్యాప్తంగా 100,000 పైగా పులులు ఉండేవని అంచనావేయగా , ప్రస్తుతం 2000 కు పడిపోయింది.[63] కొన్ని అంచనాల ప్రకారం వీటి జనాభా ఇంకా తక్కువగా ఉండి, సంతానోత్పత్తి చేయగల పులుల సంఖ్యా 2,500 కంటే తక్కువగా ఉంటుందని, ఏ ఉపజాతీ కూడా 250 కి మించి సంతానోత్పత్తి చేయగల పులులను కలిగి ఉండలేదని తెలుస్తూంది.[1]
భారతదేశం[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రధాన వ్యాసం: Project Tiger
భారతదేశం ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అడవులలో నివసించే పులుల జనాభాను కలిగి ఉన్న దేశం.[64] వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ప్రకారం, ప్రపంచంలోని 3,500 పులులలో, 1,400 భారతదేశంలోనే ఉన్నాయి.[65] ప్రాజెక్ట్ టైగర్గా పులువబడే ఒక అతి పెద్దసమన్వయ పరిరక్షణ ప్రయత్నం, 1973 లో ఇందిరా గాంధీచేప్రారభించబడి, కొనసాగుతోంది. ఇది ప్రాథమికంగా విజయం సాధించడానికిగాను పూర్తిగా మానవజోక్యం నిషేధించబడిన సునిశితంగా పర్యవేక్షించబడే 25 టైగర్ రిజర్వులను ఏర్పాటుచేయబడినవి. ఈ కార్యక్రమం వలన 1973 లో సుమారు 1,200 గా ఉన్న బెంగాల్ అడవి పులుల జనాభా 1990 ల నాటికి 3,500 కి పెరిగింది.2008 ఫిబ్రవరి 12,లో ప్రకటించిన 2007 పులుల జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలోని అడవి పులుల జనాభా 60% తగ్గి, సుమారు 1,411 గా ఉంది.[66] ఈ జనాభా తరుగుదలకు కారణం అక్రమంగా వేటాడటమేనని రిపోర్టులో పేర్కొనబడింది.[67]
ఈ రిపోర్ట్ విడుదల తరువాత, భారత ప్రభుత్వం $153 మిలియన్లను ప్రాజెక్ట్ టైగర్కు అదనంగా కేటాయించి, వేటగాళ్ళను నియంత్రించేందుకు టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటుచేసి, పులుల విషయంలో వారి జోక్యాన్ని నివారించేందుకు 200,000 మంది గ్రామస్తులకు పునరావాసం కల్పించింది.[68] అదనంగా, ఎనిమిది కొత్త టైగర్ రిజర్వులు భారతదేశంలో ప్రారంభించబడ్డాయి.[69] భారత అధికారులు సరిస్కా టైగర్ రిజర్వులో పులులను తిరిగి ప్రవేశ పెట్టడానికి ఒక ప్రాజెక్ట్ను విజయవంతంగా ప్రారంభించారు.[70] అనధికార వేట నిరోధించడానికి భారత అధికారుల విజయానికి సూచికగా రాన్థంబోర్ నేషనల్ పార్క్ను తరచుగా పేర్కొంటారు.[71]
రష్యా[మూలపాఠ్యాన్ని సవరించు]
1940 లలో కేవలం 40 జంతువులతో సైబీరియన్ పులి ప్రమాదపు అంచులో ఉంది.సోవియట్ యునియన్ప్రభుత్వంలో, అక్రమవేటను సమర్ధవంతంగా నియంత్రించడం మరియు రక్షిత ప్రదేశాలు(జాపోవేడ్నిక్) ఏర్పాటు ద్వారా, ఈ జనాభా కొన్ని వందలకు చేరింది.1990 లలో రష్యా ఆర్ధిక వ్యవస్థ పతనమైనపుడు, స్థానిక వేటగాళ్ళు అంతకు ముందు మూసివేయబడిన లాభదాయకమైన చైనా మార్కెట్లలో ప్రవేశించారు, మరియు అడవుల నరికివేత కూడా ఎక్కువైంది. స్థానిక ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధితో పరిరక్షణా ప్రయత్నాలకు అధిక వనరులు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఆర్ధిక కార్యక్రమాలు పెరగడం అభివృద్ధికి మరియు అడవుల నరికివేతకు దారితీసింది.ఈ జాతిని పరిరక్షించడంలో అతి పెద్ద అవరోధం ప్రతి ఒక్క పులికీ వ్యక్తిగతంగా అవసరమయ్యే విశాలమిన భూభాగం (ఆడపులికి సుమారు 450 కిమీ2 అవసరమవుతుంది).[72]ప్రస్తుత పరిరక్షణ చర్యలు స్థానిక ప్రభుత్వాలు మరియు ఎన్జిఓ ల చే, అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ వైడ్ ఫండ్మరియు వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ ల సహకారంతో నడుపబడుతున్నాయి.[72] పులులచే తోడేళ్ళ సంఖ్య తగ్గింపబడటాన్ని రష్యన్ పర్యావరణ వేత్తలు దూర ప్రాచ్యంలోని వేటగాళ్ళు పెద్ద పిల్లులను వేటాడ కుండా ఉండేటట్లుగా ఒప్పించారు, కారణం వారు ఈ జనాభాను తోడేళ్ళ కంటే తక్కువగా ఉంచగలగడం మరియు దీనివలన వాటి సంఖ్య కూడా పరిమితమైంది.[73] ప్రస్తుతం అడవులలో 400-550 వరకు జంతువులు ఉన్నాయి.
టిబెట్[మూలపాఠ్యాన్ని సవరించు]
టిబెట్లో, పులి మరియు చిరుతపులి చర్మాలు సాంప్రదాయకంగా జరిగే ఉత్సవాలు మరియు దుస్తులలో వాడతారు. 2006 జనవరిలో దలై లామాఅడవి జంతువులను, వాటి ఉత్పత్తులను, లేక వాటి నుండి తయారయ్యే వస్తువులను ఉపయోగించడం, అమ్మడం, కొనడం వంటి వాటికి వ్యతిరేకంగా ఆజ్ఞను ప్రవచించారు. దీని ఫలితంగా పులుల మరియు చిరుతల చర్మాల డిమాండ్ దీర్ఘకాలంలో తగ్గుతుందా అనే విషయం గమనించ వలసిఉంది.[74][75][76]
వన ప్రవేశం[మూలపాఠ్యాన్ని సవరించు]
మొదటి వన ప్రవేశయత్నం భారత పర్యావరణ వేత్త అయిన బిల్లీ అర్జన్ సింగ్ ద్వారా జరిగింది, జంతుప్రదర్శనశాలలో పుట్టిన తారా అనే ఆడపులిని ఆయన సాకి 1978లో దానిని దుధ్వ నేషనల్ పార్క్లో వదిలారు .ఈ సంఘటన తరువాత ఒక ఆడపులి చేత చాలామంది చంపబడటం తదుపరి దానిని చంపటం జరిగింది . ప్రభుత్వాధికారులు ఆ ఆడపులి తారా అని పేర్కొనగా ,సింగ్ మరియు ఇతర పర్యావరణవేత్తలు దానిని తీవ్రంగా ఖండించారు తరువాత , స్థానిక జన్యు పూల్ తారా ప్రవేశం వలన పాడైనదని కనుగొనటం వలన ఈ ప్రక్రియ మరింత అభాసుపాలైంది, దీనికి కారణం తారా ఒక సైబీరియన్ అంశ కలిగిన పులి అని దానిని పెంచిన ట్వై క్రాస్ జూ అధికారులు సరిగా నమోదు చేయకపోవడం వలన దాని వన ప్రవేశ సమయంలో ఆ విషయం తెలియక పోవడం.[77][78][79][80][81][82][83][84][85][86]
సేవ్ చైనాస్ టైగర్స్[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రధాన వ్యాసం: Save China's Tigers
సేవ్ చైనాస్ టైగర్స్ అనే సంస్థ, వైల్డ్ లైఫ్ రిసెర్చ్ సెంటర్ అఫ్ ది స్టేట్ ఫోరేస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ అఫ్ చైనా మరియు ది చైనీస్ టైగర్స్ సౌత్ ఆఫ్రికా ట్రస్ట్ లతో కలసి చైనా పులులను అడవులలో తిరిగి ప్రవేశపెట్టడం పై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.బీజింగ్లో 2002 నవంబరు 26 లో సంతకంచేయబడ్డ ఈ ఒప్పందం ప్రకారం ఒక ప్రయోగాత్మక రిజర్వును ఏర్పాటుచేసి దానిలో దేశీయమైన జంతుజాలంతో పాటు దక్షిణ చైనా పులిని కూడా ప్రవేశపెట్టి చైనాపులిపరిరక్షణ నమూనా ఏర్పాటు చేయాలని నిర్ణయించ బడింది.తీవ్ర ప్రమాదంలో ఉన్న దక్షిణ చైనా పులిని తిరిగి అడవులలో ప్రవేశ పెట్టడానికి కొన్ని బంధిత పులుల్ని దక్షిణ అఫ్రికాకు పంపి వాటిని తిరిగి వాటి వేటకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగేటట్లుగా శిక్షణ నిచ్చి చైనా అడవులలో వదిలి వేయడం సేవ్ చైనాస్ టైగర్స్ యొక్క ఉద్దేశం. అదే సమయంలో చైనాలో ఒక ప్రయోగాత్మక రిజర్వును ప్రారంభించారు, దీనిలో పులులను గుర్తించి చైనా లోని రిజర్వు పూర్తి కాగానే దానిలో వదలి వేయడం జరుగుతుంది.[87] శిక్షణ పొందిన పులుల పిల్లలు చైనాలోని ప్రయోగాత్మక రిజర్వులో వదిలివేయ బడతాయి, అసలు పులులు మాత్రం దక్షిణ ఆఫ్రికా లోనే సంతానోత్పత్తి కొనసాగిస్తాయి.[88]
ఈ ప్రక్రియకు దక్షిణ ఆఫ్రికాను ఎన్నుకొనుటకు కారణం ఆ దేశంలో దీనికి అవసరమైన నైపుణ్యం మరియు వనరులు, భూమి మరియు దక్షిణ చైనా పులుల ఆటకు సదుపాయాలు ఉండటం. ఈ ప్రాజెక్ట్ లోని దక్షిణ చైనా పులులువిజయవంతంగా అడవులలో తిరిగి ప్రవేశ పెట్టబడి, వేటాడుతూ వాటంతట అవే మనగల్గుతున్నాయి.[87] తిరిగి ప్రవేశపెట్టబడిన ఈ పులులు సంతానోత్పత్తి చేయడం మరియు వాటికి 5 పిల్లలు కలగడమే గాక ఈ రెండవ తరం పిల్లలు తమ మనుగడకు అవసరమైన నైపుణ్యాలను తల్లుల నుండి విజయవంతంగా పొందగలగడం ఈ ప్రాజెక్ట్ సాధించిన మరో విజయం.[89]
మానవులతో సంబంధాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
Tiger as prey[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రధాన వ్యాసం: Tiger hunting
పులి అనేది ఆసియాలోని ఐదు పెద్ద ఆట జంతువులలో ఒకటి. పందొమ్మిది మరియు ఇరవయ్యవ శతాబ్దాల ప్రథమభాగంలో పులి వేట భారీ స్థాయిలో సాగింది, భారత వలస రాజ్యంలో ఆంగ్లేయులచే మరియు స్వాతంత్ర్యానికి పూర్వం మహారాజులు మరియు అప్పటి సంస్థానాల ఉన్నత వర్గీయులచే ఒక ఆటగా గుర్తించబడి అభిమానించబడింది.కొందరు వేటగాళ్ళు పులులను కాలినడకన వేటాడేవారు; కొందరు మంచల పై కూర్చుని మేకను లేదా గేదెను ఆహారంగా వ్రేలాడ తీసేవారు; కొదరు ఏనుగు పైనుండి వేటాడేవారు.[90] కొన్ని సందర్భాలలో గ్రామస్థులు డప్పు వాయిస్తూ జంతువులను వధించే స్థలానికి తరిమేవారు. పులుల చర్మం వొలుచుటకు విస్తృతమైన సూచనలు లభించాయి మరియు పులుల చర్మం తయారీలో ప్రత్యేకత కలిగిన జంతువుల ఆకారం తయారు చేసే కళాకారులు ఉండేవారు.
నర-భక్షక పులులు[మూలపాఠ్యాన్ని సవరించు]
ప్రధాన వ్యాసం: Man-eating tigers
మానవులు పులులకు సాధారణంగా ఆహారం కానప్పటికీ, ఇతర పిల్లుల కంటే అవి ఎక్కువ మంది మానవులను చంపాయి, ప్రత్యేకించి వాటి నివాసాలపై జనాభా పెరుగుదల, అడవుల నరికివేత మరియు వ్యవసాయం వంటి కారణాల వలన వత్తిడి కలిగినపుడు.చాలా వరకూ నర భక్షక పులులు వయసు మీరినవి మరియు పండ్లు లేనివి, వాటి అసలైన ఆహారాన్ని వేటాడలేకపోవడం చేత మనిషి మాంస రుచి మరిగినవి.[91] దాదాపు అన్ని నరభక్షక పులులు త్వరగా బంధించబడ్డాయి, చంపబడ్డాయి లేదా విషపూరితం చేయబడ్డాయి.నర-భక్షక చిరుతల వలె కాక, ఎంతో అలవాటైన నర-భక్షక పులులు మానవ ఆవాసాల లోనికి ప్రవేశించక, సాధారణంగా గ్రామ శివార్ల లోనే ఉంటాయి.[92] ఏదేమైనా అప్పుడప్పుడూ గ్రామాలపై దాడి చేస్తాయి.[93] భారతదేశం మరియు బంగ్లాదేశ్ లలో, ప్రత్యేకించి కుమావున్, గర్హ్వాల్ మరియు మడ బురద నేలలైనబెంగాల్లోని సుందర్బన్లలో ఇవి సమస్యగా ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఆరోగ్యవంతమైన పులులు కూడా మానవులను వేటాడుతున్నాయి.వాతావరణ మార్పుల వలన నివాసాలను త్వరగా కోల్పోవడంతో, సుందర్బన్లలో పులుల దాడులు పెరిగాయి.[94]
సాంప్రదాయ ఆసియా ఔషధం[మూలపాఠ్యాన్ని సవరించు]
చాలా మంది చైనీయులు పులి యొక్క వివిధ భాగాలకు ఔషధ విలువలు ఉన్నాయని ఇంకా నొప్పి నివారణకు, కామోద్దీపనకుకుడా ఉపయోగ పడతాయని నమ్ముతారు.[95] వీటిని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవు. పులుల శరీర భాగాలను ఔషధాలలో ఉన్యోగించడం చైనాలో నిషేధించ బడింది, పులుల అక్రమ వేటతో సంబంధం కలిగిన కొన్ని నేరాలకు ప్రభుత్వం మరణ శిక్ష విధించేలా చట్టాలు చేసింది.ఇంతేకాక, పులుల శరీర భాగాలతో ఏ వర్తకమైనాకన్వెన్షన్ ఆన్ ఇంటర్ నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేన్జెర్డ్ స్పెసీస్ అఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా క్రింద నేరముగా పరిగణింప బడుతూ ,1993 నుండి చైనాలోఅంతర్గతంగా ఈ వ్యాపారంపై నిషేధం విధించారు. ఐనా దేశంలో చాలాసంఖ్యలోపులుల క్షేత్రాలులాభాపేక్షతతో పిల్లుల సంతానోత్పత్తిలో ప్రత్యేకతను సాధించాయి ఒక అంచనా ప్రకారం ఈ క్షేత్రాలలో 4,000 నుండి 5,000 మధ్య సంఖ్యలో పాక్షికంగా మచ్చిక చేయబడిన సంతానోత్పత్తి చేయగల బంధిత జంతువులు ఈ రోజుకి ఉన్నాయి .[96][97]
పెంపుడు జంతువులుగా[మూలపాఠ్యాన్ని సవరించు]
అసోసియేషన్ అఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ అంచనా ప్రకారం 12,000 పులులు యుఎస్ఎ లో వ్యక్తిగతంగా పెంచబడుతున్నాయి, ఇదిప్రపంచం మొత్తంలోని అడవిపులుల జనాభా కంటే ఎక్కువ.[98] ఒక్క టెక్సాస్ నగరంలోనే 4,000 పులులు ఉన్నాయని నమ్ముతున్నారు.[98]
అమెరికాలో అధిక పులుల జనాభాకు చట్టం కూడా ఒక కారణం కావచ్చు. కేవలం పందొమ్మిది రాష్ట్రాలు మాత్రమే వ్యక్తిగతంగా పులులను కలిగి ఉండటాన్ని నిషేధించాయి, పదిహేను రాష్ట్రాలలో కేవలం లైసెన్సు ఉంటే సరిపోతుంది, మరియు పదహారు రాష్ట్రాలలో అసలు చట్టాలే లేవు.[98]
అమెరికన్ జంతుప్రదర్శన శాలలు మరియు సర్కస్లలో చేపట్టిన సంతానోత్పత్తి చర్యలు విజయవంతమై, 1980 మరియు 1990 లలో అధికంగా ఉన్న కూనల వలన ఈ జంతువుల ధర బాగా తగ్గింది.[98] ఎస్పిసిఎ అంచనా ప్రకారం ఒక్క హౌస్టన్ ప్రాంతంలోనే వ్యక్తిగత యాజమాన్యంలో 500 సింహాలు, పులులు మరియు ఇతర పెద్ద పిల్లులు ఉన్నాయి.[98]
1983 లోని చిత్రం స్కార్ ఫేస్లో, కథానాయకుడైన, టోనీ మోన్టన, అమెరికన్ డ్రీం అయిన అన్ని బాహ్య జంతువులను పొందాలనుకుంటాడు, ఈ పాత్ర ఉద్దేశంలో తన ఆస్తిలో పులి కూడా చేరి ఉండాలను కుంటాడు.
సాంస్కృతిక వర్ణాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
తూర్పు ఆసియాలో జంతువుల రాజుగా సింహం స్థానాన్ని పులి ఆక్రమించింది,[99] ఇది రాజసాన్ని, నిర్భాయత్వాన్ని మరియు ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది.[100] దాని నుదిటిపై "రాజు" అనే అర్ధాన్నిచ్చే చైనీస్ అక్షరమైన 王ని పోలిన గుర్తు ఉంటుంది, ;కనుక, చైనా మరియు కొరియాకు చెందినా అనేక కార్టూన్లలో పులుల నుదిటిపై ఆ గుర్తు చిత్రించబడి ఉంటుంది.[ఆధారం చూపాలి]
చైనా పురాణాలు మరియు సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యతను కలిగిన టైగర్చైనీస్ రాశి చక్రం లోని పన్నెండు జంతువులలో ఒకటి. అనేక చైనీస్ కళలుమరియు మార్షల్ ఆర్ట్స్ లో, పులి భూమిని ప్రతిబింబిస్తూ చైనీస్ డ్రాగన్తోసమానమైన శత్రువుగా చిత్రీకరించబడింది- రెండూ వరుసగా భౌతికత్వాన్ని మరియు ఆత్మని వర్ణిస్తాయి.నిజానికి, దక్షిణ చైనా మార్షల్ ఆర్ట్ అయిన హంగ్ గా పులి మరియు కొంగల కదలికలపై ఆధారపడి ఉంటుంది.సామ్రాజ్యవాద చైనాలో, పులి సాధారణంగా అత్యున్నత సైనికాధికారి అయిన జనరల్ (లేక నేటి రక్షణ సెక్రటరీ)కి చిహ్నంగా ఉండేది ,[100] చక్రవర్తి మరియు సామ్రాజ్ఞిడ్రాగన్ మరియు ఫోనిక్స్, లచే వరుసగా సూచించబడతారు. తెల్ల పులిచైనీయుల నక్షత్ర సముదాయంలోని (మూస:Zh-cp) నాలుగు గుర్తులలోఒకటి.కొన్నిసార్లు ఇది పశ్చిమ తెల్ల పులిగా పిలువబడుతుంది (西方白虎), మరియు ఇది పశ్చిమాన్ని మరియు ఆకురాలు కాలాన్ని సూచిస్తుంది.[100]
బుద్ధిజంలో మూడు స్పృహలేని జంతువులలో ఇద కూడా ఒకటి, పులి కోపాన్ని కోతి అత్యాశను మరియు లేడి ప్రేమరాహిత్యాన్ని సూచిస్తాయి. [236]
టుంగుసిక్ ప్రజలు సైబీరియన్ పులిని దాదాపు దేవతగా భావించేవారు మరియు దానిని "తాత" లేదా "ముదుసలి "గా సూచించేవారు.ఉడెగేమరియు నానై దానిని "అంబ"అని పిలిచేవారు. మంచు ప్రజలు సైబీరియన్ పులిని హు లిన్, రాజుగా భావించేవారు.[9]
దేవి-పార్వతి యొక్క అంశ అయిన దుర్గ , హిందువులచే విస్తృతంగా ఆరాధించబడే పదిచేతులు కలిగి, ఆడపులిని (లేదా ఆడసింహాన్ని అధిరోహించే యుద్ధ దేవత. దక్షిణ భారతదేశంలో పూజింపబడే అయ్యప్ప వాహనం కూడా పులే.[101]
ఆసియా జానపదాలలో ఆకార మార్పిడిలో పులి రూపం లోకి మారే వ్యక్తితోడేలు రూపంలో మారే వ్యక్తి కి బదులుగా వస్తాడు;[102] భారత దేశంలో వారు చెడ్డ మాంత్రికులు కాగా ఇండోనేసియా మరియు మలేషియా లలో కొంత సాధు స్వభావం కలవారు.[103]
పులి సాహిత్యంలో ఒక విషయంగా ఉంటూ ఉంది; రుడ్యార్డ్ కిప్లింగ్, తన ది జంగిల్ బుక్ లో , మరియు విల్లియం బ్లేక్, తన సాంగ్స్ అఫ్ ఎక్స్పీరియెన్స్ లో , పులిని అలజడి సృష్టించే మరియు భయంకర జంతువుగా చిత్రించారు. The జంగిల్ బుక్ లో, పులి, షేర్ ఖాన్, కథానాయకుడైన, మోగ్లి యొక్క జిత్తుల మారి శత్రువు. మిగిలిన చిత్రణలు కొంత మృదు స్వభావం కలిగినవి: ఎ. ఎ. మిల్నేయొక్క విన్నీ-ది-ఫూ కథలలో టిగ్గెర్ అనే పులి, ముద్దుగా మరియు ఇష్టపూర్వకంగా ఉంటుంది. మాన్ బుకర్ ప్రైజ్ గెలుపొందిన నవల "లైఫ్ అఫ్ ఫై,"లో ముఖ్య పాత్రధారి అయిన, ఫై పటేల్, పసిఫిక్ మహాసముద్రంలో ధ్వంసమైన ఓడ నుండి బ్రతికిన ఏకైక మానవుడు, బ్రతికి బయట పడిన మరొక జీవి : ఒక పెద్ద బెంగాల్ టైగర్తో స్నేహం చేస్తాడు.. ప్రసిద్ధి చెందిన హాస్య కథ కాల్విన్ అండ్ హోబ్బ్స్ లో కాల్విన్ మరియు అతని కూర్చబడిన పులి, హోబ్బ్స్ ముఖ్య పాత్రధారులు. "టోనీ ది టైగర్" అనే పులి ప్రసిద్ధమైన ధాన్యపుఫ్రోస్టెడ్ ఫ్లేక్స్ యొక్క కవరుపై కూడా ఉంటుంది ( "ఫ్రోస్టీస్" అనే పేరుతో కూడా మార్కెట్ చేయబడ్డాయి).
బంగ్లాదేశ్, నేపాల్, భారత దేశంల జాతీయ జంతువు పులి [104] (బెంగాల్ పులి)[105] మరియు మలేషియా(మలయన్ పులి), ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా (సైబీరియన్ పులి).
ప్రపంచం ఇష్టపడే జంతువు[మూలపాఠ్యాన్ని సవరించు]
అనిమల్ ప్లానెట్చే నిర్వహించబడిన ఒక సర్వేలో, కొద్దిగా తేడాతో కుక్కను ఓడించి, పులి, ప్రపంచం ఇష్టపడే జంతువుగా నిలిచింది. 73 దేశాలకు చెందిన 50,000 మంది ప్రేక్షకులు ఈ సర్వేలో పాల్గొన్నారు.పులులు 21% వోట్లను, కుక్కలు 20%, డాల్ఫిన్లు 13%, గుర్రాలు 10%, సింహాలు 9%, పాములు 8%, వాటిననుసరించిఏనుగులు, చింపాంజీలు, ఒరాంగ్ఉటాన్లు మరియు వేల్ లు తరువాతి స్థానాలను సంపాదించాయి.[106][107][108][109]
అనిమల్ ప్లానెట్ తో ఈ జాబితా విషయంలో పనిచేసిన జంతు ప్రవర్తన అధ్యయన వేత్త కాండీ డి'సా ఈ విధంగా అన్నారు: "బయటకు గంభీరంగాను మరియు అధికారికంగా కనిపిస్తూ, కానీ అంతరంగంలో గొప్ప మనసు మరియు విచక్షణ కలిగిఉన్నపులితో మనం పోల్చుకోవచ్చు. ".[106]
వరల్డ్ వైల్డ్లైఫ్ ఫెడరేషన్ కన్సర్వేషన్ ఛారిటీ యొక్క అంతర్జాతీయ జాతుల అధికారి అయిన కెల్లుం రాంకిన్, ఫలితం ఆశాజనకంగా ఉంది అని వ్యాఖ్యానించారు. "ప్రజలు పులులను వారికి ఇష్టమైన జంతువుగా ఎన్నుకున్నారంటే దాని అర్ధం , వారు దాని ప్రాముఖ్యాన్ని మరియు దానిని పరిరక్షించవలసిన ఆవశ్యకతను గుర్తించారు" అని అన్నారు.[106]
పులుల లెక్కింపు[మూలపాఠ్యాన్ని సవరించు]
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కొత్త విధానాన్ని ఆవిష్కరించింది పులుల మలం (వ్యర్థం) పైపొరను సేకరించి డీఎస్‌ఏ పరీక్షల ద్వారా వాటి సంఖ్యను లెక్కించడమే కొత్త పద్ధతి. ఈ పరీక్షల ద్వారా ఆ వ్యర్థం అసలు పులిదా? మరేదైనా జంతువుదా? అదీ ఆడపులిదా? మగ పులిదా? అన్నదీ తెలిసిపోతుంది. ఏ రెండు పులుల డీఎన్‌ఏ ఒకలా ఉండదు.పాత విధానంలో పాదముద్రలే: ఇప్పటి వరకు పులుల గణన పాద ముద్రలు (పగ్ మార్క్స్), అవి సంచరించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ విధానం కష్టంతో కూడుకున్నది. కచ్చితత్వపు శాతం తక్కువే. పాదముద్రలు నమోదు కావాలంటే నేల చిత్తడిగా ఉండాలి. వర్షం కురిస్తే అవి చెరిగిపోతాయి. కెమెరాల విషయానికి వస్తే, వాటి ముందు నుంచి పులులు వెళ్లాలి. అవి పెద్దవై ఉండాలి. కెమెరాలను ఎత్తులో ఏర్పాటు చేయటం ద్వారా చిన్న చిన్న వాటిని గుర్తించటం సాధ్యం కాదు.* డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింట్ల ద్వారా అయితే కచ్చితమైన వివరాలను సేకరించవచ్చని సీసీఎంబీ పరిశోధనలు స్పష్టం చేశాయి
ప్రదర్శన
- Tiger cooling off at Bandhavghar.jpg
- Tiger at Bannarghetta National Park.jpg
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి