ఇందిరా గాంధీ
వికీపీడియా నుండి
ఇందిరా గాంధీ | |
పదవిలో 14 జనవరి 1980 – 31 అక్టోబరు 1984 | |
రాష్ట్రపతి | నీలం సంజీవరెడ్డి జ్ఞానీ జైల్ సింగ్ |
---|---|
మునుపు | చౌధరి చరణ్ సింగ్ |
తరువాత | రాజీవ్ గాంధీ |
పదవిలో 24 జనవరి 1966 – 24 మార్చి 1977 | |
రాష్ట్రపతి | సర్వేపల్లి రాధాకృష్ణన్ డా.జాకిర్ హుసేన్ వి.వి.గిరి ఫకృద్దీన్ అలీ అహ్మద్ |
మునుపు | గుల్జారీలాల్ నందా |
తరువాత | మొరార్జీ దేశాయ్ |
పదవిలో 9 మార్చి 1984 – 31 అక్టోబరు 1984 | |
మునుపు | పి.వి.నరసింహారావు |
తరువాత | రాజీవ్ గాంధీ |
పదవిలో 22 ఆగస్టు 1967 – 14 మార్చి 1969 | |
మునుపు | Mahommedali Currim Chagla |
తరువాత | Dinesh Singh |
పదవిలో 26 జూన్ 1970 – 29 ఏప్రిల్ 1971 | |
మునుపు | మొరార్జీ దేశాయ్ |
తరువాత | Yashwantrao Chavan |
పదవిలో 1959 | |
మునుపు | U N Dhebar |
తరువాత | నీలం సంజీవరెడ్డి |
పదవిలో 1978–1984 | |
మునుపు | Dev Kant Baruah |
తరువాత | రాజీవ్ గాంధీ |
జననం | 19 నవంబరు 1917 అలహాబాదు, సమైక్య ఆస్థానములు, బ్రిటీషు ఇండియా |
మరణం | అక్టోబరు 31, 1984(వయసు 66) న్యూ ఢిల్లీ, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
భార్య/భర్త | ఫిరోజ్ గాంధీ |
సంతానం | రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ |
మతం | హిందూమతము-ఆది ధర్మం |
సంతకం | ఇందిరా గాంధీ's signature |
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी) (Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాస్ట్రపతిచేత ఎన్నిక చేయబడింది. లాల్ బహదుర్ శాస్త్రిగారి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.[1].ఉన్నత రాజకీయ కుటుంబంలో సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు ఉత్తర ప్రదేశ్) లోని మొఘల్ సరాయ్లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది.
భారతదేశ ప్రప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. 1917 -11-19న అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తల్లి కమలామనెహ్రూ, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. బాల చరఖా సంఘాన్ని స్థాపించింది.
- 1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది.తరువాత ఇందిరాగాంధీగా మారింది.
- 1944-8-20న రాజీవ్ గాంధీ, 1946-12-14న సంజయ్ గాంధీలకు జన్మనిచ్చింది.
- 1955లో కాంగ్రెసులో చేరింది.
- 1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది.
- 1966-01-10న ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనది.
- 1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
- 1967-03-13న కాంగ్రెసుపార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది.
తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
- 1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది.
- 1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
- గరీబీ హటావో అనే నినాదంతో దేశప్రజలని ఉత్తేజపరిచింది.
- 1971లో పాకిస్తానుతో యుద్ధం జరగగా, ఓడించింది.
- 1971లోబంగ్లాదేశంని ఏర్పరిచింది.
- 1973 మేలో సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది.
- ఈమె హయంలో రాజస్థానలోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది.
- 1975-04-19న తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది.
- సిక్కిలను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాల రద్దు చేసింది.
- 1975-06-25న దేశంలో అత్యవసరపరిస్థితి విధించింది.
- 1980-01-14న 4వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
- ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్తరూపు సంతరించుకుంది.
- 1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది.
- సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా.
బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్ గా ప్రసిద్ధిగాంచింది.
- ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
- 1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను.
ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
- 1953లో ఈమె సేవలకు అమెరికా వారిచే మదర్స్ అవార్డ్,
- 1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్,
- 1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టె అవార్డులు వరించాయి.
- 1967, 1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు, మిక్కిలి అభిమాని పాత్రురాలైన నాయకురాలుగా, ఎన్నుకున్నారు.
అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచప్రజల అభిమానాన్ని పొందింది. అక్టోబరు 31న ఈమె నర్థంతిని జాతీయసమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.
విషయ సూచిక
[దాచు]బాల్యం[మూలపాఠ్యాన్ని సవరించు]
1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా జన్మించిన ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి. తాత మోతీలాల్ నెహ్రూ కూడా అలహాబాదులో పేరుపొందిన బారిష్టరే కాకుండా జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు. ఇందిర బాల్యం అలహాబాదు లోనే గడిచింది. తండ్రి ప్రధానమంత్రి అయ్యాక ఢిల్లీకి నివాసం మారింది. 18 సంవత్సరాల వయస్సులోనే ఇందిర వానర సేనను నడిపి ఉద్యమాలలో అనుభవం సంపాదించింది. ఆ సమయంలోనే 1936లో తల్లి కమలా నెహ్రూను కోల్పోయింది. 1938 లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించింది.
యవ్వనం[మూలపాఠ్యాన్ని సవరించు]
ఇందిర ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివింది. ఇంగ్లండు లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.[2]. ఆ తర్వాత లండన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ ఫిరోజ్ గాంధీతో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది. తన తండ్రికి ఇష్టం లేకున్ననూ మహాత్మా గాంధీనిఒప్పించడంతో 1942లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టు అయి జైలుకు వెళ్ళి 1943 మే 13 న విడుదలైంది.[3]. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా ఇన్స్యూరెన్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేయవలసి వచ్చింది.
రాజకీయాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
తండ్రికి చేదోడు, వాదోడుగా ఉన్న ఇందిర చిన్న వయస్సులోనే రాజకీయ అనుభవం సంపాదించింది. 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. 1960 సెప్టెంబర్ 8న ఫిరోజ్ గాంధీ మరణించాడు. 1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ మరణించడంతో ఇందిర జీవితంలో విషాదం ఏర్పడింది. తండ్రి మరణానంతరం ఇందిర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
ప్రధానమంత్రిగా[మూలపాఠ్యాన్ని సవరించు]
లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవి నిర్వహించాడు. అతని నుంచి 1966 జనవరి 24నఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించింది. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్నిచేపట్టలేదు.
ఇందిర ప్రధానమంత్రి అయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఏమంత సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో మొరార్జీ దేశాయ్ లాంటి వారు అసమ్మతివాదులుగా తమ గళాన్ని వినిపించారు. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి కామరాజ్ మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఇందిరను మూగ బొమ్మ (గూంగీ గుడియా) గా అభివర్ణించాడు. అయితే అది సరైనది కాదని ఇందిర తదనంతరం తన చర్యల ద్వారా నిరూపించింది.
మొరార్జీ దేశాయ్ ని సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి మరియు కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా 1967ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. చివరికి 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సోషలిస్టుల సహాయంతో అలాగే రెండేళ్ళు పరిపాలించింది.
ఇందిర 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో రాజభరణాల రద్దు, 1966లో [[రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖ్రాన్లో అణుపాటవ పరీక్ష చేసి అమెరికా కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన పునాది పడింది.
1971లో అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు 1975లో తీర్పు ఇవ్వడంతో (ప్రభుత్వ ఉద్యోగి యశ్ పాల్ శర్మను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నందుకు) ఆ వత్తిడిని తట్టుకోలేక 1975 జూన్ 25న అత్యవసర పరిస్థితి విధించి, అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను జైలుపాలు చేసింది. 1977లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగుపెట్టింది. ఆ తర్వాత 1980మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో పర్యాయం ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టింది. ఆమె స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది.
1984లో స్వర్ణదేవాలయంలో సైనికులను పంపి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి సిక్కు నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. 1984 అక్టోబర్ 31న eme తన స్వంత అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైపోయింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66 ఏట నిజం అయ్యాయి. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద గురుద్వారాలో ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్ లతోపాటు కుట్రదారుడు కేహార్‌సింగ్ లకు అమర వీరుల సరసన చోటుకల్పించడం నిరసనలకు కారణమైంది. వీరిని 'షహీద్ భాయ్'లుగా అభివర్ణిస్తూ రూపొందించిన చిత్రపటాలను సిక్కు మతవిశ్వాసాల కోసం ప్రాణాలు విడిచిన వారి పటాల పక్కనే ప్రచురించారు. ఈ పరిణామంతో ఆక్‌లాండ్‌లోని సిక్కు మతస్థుల్లో విభజన ఏర్పడింది. ఇతర వర్గాల ప్రజలూ హతాశులయ్యారు. (ఈనాడు 14.2.2010)
సంతానం / వారసులు[మూలపాఠ్యాన్ని సవరించు]
ఇందిరా గాంధీకి ఇద్దరు కుమారులు - రాజీవ్ గాంధీ (1944 - 1991), సంజయ్ గాంధీ (1946 - 1980) . సంజయ్ గాంధీని రాజకీయాలలో తెచ్చి, అత్యవసర పరిస్థితి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సంజయ్ ని తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దాలన్న సమయంలో విమాన ప్రమాదంలో మరణించాడు[ఈ సమయ౦. ఆ తర్వాత 1981 ఫిబ్రవరిలో పైలట్ ఉద్యోగాన్ని వదలి రాజీవ్ గాంధీ రాజకీయాలలో ప్రవేశించాడు. ఇందిర హత్య అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టి అత్యంత పిన్న వయస్సులో ఆ పదవిని చేపట్టిన రికార్డు సృష్టించాడు. అయితే బోఫోర్స్ కేసులో ఇరుక్కొని ఎన్నికలలో ఓటమిపాలైనాడు. 1991 మేలో శ్రీపెరంబుదూర్లోఎన్నికల ప్రచారం సమయంలో తమిళ ఈలం మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పార్టీ ఆద్యక్ష పదవిలో ఉంటూ 2004 లోక్‌సభ ఎన్నికలలో యూ.పి.ఏ.కూటమితో కల్సి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమారై ప్రియాంకలు కూడా రాజకీయాలలో ప్రవేశించారు.
సంజయ్ గాంధీ భార్య మేనక గాంధీ సంజయ్ మరణం తర్వాత ఇంటి నుంచి గెంటివేయబడింది. వేరు కుంపటి పెట్టి సంజయ్ విచార్ మంచ్ పార్టీ పెట్టిననూ మంచి ఆదరణ పొందలేదు. సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యుడు.
రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పార్టీ ఆద్యక్ష పదవిలో ఉంటూ 2004 లోక్‌సభ ఎన్నికలలో యూ.పి.ఏ.కూటమితో కల్సి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమారై ప్రియాంకలు కూడా రాజకీయాలలో ప్రవేశించారు.
సంజయ్ గాంధీ భార్య మేనక గాంధీ సంజయ్ మరణం తర్వాత ఇంటి నుంచి గెంటివేయబడింది. వేరు కుంపటి పెట్టి సంజయ్ విచార్ మంచ్ పార్టీ పెట్టిననూ మంచి ఆదరణ పొందలేదు. సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యుడు.
బిరుదులు[మూలపాఠ్యాన్ని సవరించు]
- 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు భారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది.
- 1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి లభించింది
అభినందనలు[మూలపాఠ్యాన్ని సవరించు]
- 1971 లో బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా సాధించిన సందర్భంలో నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి ఆమెను దుర్గామాతగా కీర్తించాడు.[4]
విమర్శలు[మూలపాఠ్యాన్ని సవరించు]
ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
- 1938 : భారత జాతీయ కాంగ్రేసులో ప్రవేశం
- 1955 : కాంగ్రేస్ పార్టీ కార్యాచరణ సంఘంలో ప్రవేశం
- 1959 : భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షురాలిగా ఎన్నిక
- 1966 : భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన వారిలో ఇందిరా గాంధీ మొట్టమొదటి మహిళ
- 1966 : రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది.
- 1966-1977 1980-1984 : జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రి పదవి చేపట్టి రెండో స్థానంలో నిల్చింది.
- 1969 : ఇందిరా కాంగ్రెస్ పార్టీ స్థాపన
- 1971 : తూర్పు పాకిస్తాన్‌ను పాకిస్తాన్ నుండి విడదీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసింది.
- 1971 : భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ కూడా ఇందిరా గాంధీ.
- 1975: అత్యవసర పరిస్థితి విధింపు
- 1977 : ఎన్నికలలో ఓడిపోయిన మొట్టమొదట భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.
- 1980 : కొద్ది కాలం విరామం తర్వాత మళ్ళీ భారత ప్రధానమంత్రి పదవి చేపట్టిన వారిలో మొట్టమొదటి వ్యక్తి.
- 1983: అలీన దేశాల సదస్సును ఢిల్లీలో నిర్వహించింది.
- 1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ చర్యకు ఆదేశం
- 1984 : హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి కూడా ఇందిరా గాంధీ.
- అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.
- Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి