31, జులై 2017, సోమవారం

Ashoka/అశోకుడు

అశోకుడు

వికీపీడియా నుండి

అశోక చక్రవర్తి (హిందీ: अशोक) (Ashoka The Great); (క్రీ.పూ.304క్రీ.పూ.232) (రాచరిక ముకుటము: "దేవానాంపియ పియదస్సీ'" అనగా "దేవతల ప్రీతిపాత్రుడు మరియు చూపులకు అందమైనవాడు")
క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది.
ప్రసిద్ధ ఇంగ్లీషు రచయిత హెచ్ జి వెల్స్ తన ఔట్‌లైన్ ఆఫ్ హిస్టరీ పుస్తకంలో అశోకుడి గురించి ఇలా రాసాడు: "వేలాది రాజులు, మహారాజులు, చక్రవర్తులు, సామ్రాట్టులూ వగైరాలతో క్రిక్కిరిసిపోయిన చరిత్ర పుటల్లో అశోకుడి పేరు ఒక తార లాగా తళుకులీనుతూంటుంది."

చారిత్రక మూలాలు

అశోకుడి గురించిన చాలా సమాచారం ప్రధానంగా కొద్దిపాటి బౌద్ధమతానికి సంబంధించిన మూలాల నుంచి లభ్యమైనదే. ప్రత్యేకించి 2వ శతాబ్దంలో సంస్కృతంలో రాయబడిన అశోకవదనం, మరియు పాళీ భాషలో రాయబడినదీప వంశం, మహావంశం అనే శ్రీలంకకు చెందిన గ్రంథాలలో ఇప్పుటి వరకు అశోకుని గురించి తెలిసిన సమాచారం అందుబాటులో ఉంది. మిగతా సమాచారం అశోకుడు రాయించిన శాసనాల నుండి లభ్యమవుతున్నది.

అశోకుని జననము

మౌర్య సామ్రాజ్యంలోని వెండి నాణాలు. క్రీ.పూ. 3వ శతాబ్దం
అశోకుని తల్లి సుభద్ర లేక సుభద్రాంగి.వృత్తాంత '''శాంతిసామ్రాట్టు ''' ద్వితీయ తృతీయ కాండముల కలదు. నేపాళ బౌద్దవాజ్మయ చరిత్రమున అశోకుని తల్లి వృత్తాంతము ఈ రీతిగా కలదు:పాటలీపుత్రమును బిందుసారుడు పరిపాలన చేయుచున్న కాలమున ఒక పేదబ్రాహ్మణుడు భిక్షాటన చేయుచూ జీవించుచుండెను. అతనికి ఒక్కర్తి కూతురు. ఆమె చక్కని చుక్క.ఒకనాడా బాలిక ఆడుకొనుచుండగా సోదెగత్తె ఒకతివచ్చి, ఆపిల్లను చూచి నీవురాజును పెండ్లాడి రాణివి కాగలవు అందును. ఏదో వేళాకోళముగా భావించి ఆబాలిక ఊరుకుండును. కానీ అప్పుడే వీధిలోకి వెళ్ళి తిరిగివచ్చిన తండ్రి చెవిని యామాటలు పడినవి. చోదికత్తె చెప్పిన మాటలు చోద్యాలు కావు. నిజమై ఉండును అని భావించి ఆతని మనస్సులో మెదిలెను.ఆమెకు యవ్వనము రాగానే తండ్రి రాజుగారి అంతఃపురానికి ఆమెను తోడ్కొని వెళ్ళినాడు.ఆసమయములో రాణీగారికీ కొంతమంది అనుచరులు కావలసి ఉండెను.వెంటనే ఆమెను తన సహచర వర్గములో ఒకర్తెగా తీసికొన్నారు.తండ్రి ఇంటికి వచ్చినాడు.
అంతః పురములో స్త్రీలమధ్యలో ఉన్నప్పటికీ ఆమె అందము, చందము అందరును అసూయ కల్పించెను. ఆమెను ఏరీతిగా నైననూ రాజుగారి దృష్టి పధములోనుండి తప్పించుటకు ప్రయత్నించినారు.ఆమెకు హీనమైన పనులను వినియోగించెడివారు.వానిని ఆమె యోర్పుతో నిర్వహించెడిది. మృగచర్మములపై రోమములను నిర్మూలించు పని నిచ్చినారు. అదియు ఆమె చేసినది. ఆపై ఆమెకు అంతః పురములో కల కొజ్జాలకు మంగలి పని చేయమని పురమాయించినారు. ఇంతలో ఒకరోజు రాజుగారి ఖాసా మంగలి రాలేదు. రాజుగారు అత్యవసరముగా కార్యము మీద ఆవశ్యకముగా వెళ్ళవలసి ఉండెడిది. ఇంకా మంగలి రాలేదేమి? అని రాజుగారు చికాకు పడుచున్నప్పుడు ఒక పరిచారిక వచ్చి మంగలి పని వచ్చిన ఒక దాసి అంతః పురమున కలదు అని మనవి చేసినది. రాజు గారామెను రమ్మనినారు.ఆమె భయపడుచు వచ్చి భయపడుచు నమస్కరించినది, కాని రాజుగారి ప్రసన్న గంభీరమైన మొహమును చూడగానే ఆమె భయము పోయినదట. రాజు గారు ఆమెను చూచి మొగవారు చేయు పని నీవు చేయగలవా అని ప్రశ్నించిరి. అవసరాన్ని బట్టి ఆవిద్య నేర్చుకోవాలిసి వచ్చినది ప్రభూ!!! రాము అనుగ్రహిస్తే నేర్పి చూపుతాను అను ఆమె ప్రత్యుత్తరమిచ్చింది. సరే అన్నారు రాజుగారు. క్షారము చేయడము ప్రారంభించు సరికి రాజుగారికి కొంచెము నిద్రవచ్చినది. ఆనిద్రకు ఏమాత్రమూ భంగము కలుగకుండా ఆమె పని ముగించినది. చంద్రబింబమువలె ముఖము ప్రకాశించినది. అటుపై రాజుగారు చాలా సంతోషించి కావలసినది కోరుకోమన్నారు. తప్పక ఇత్తునని మాట ఇచ్చిరట. ఆమె రాజుగారినే భర్తగా కోరినది. నీవి హీనజాతిస్త్రీవి నేనెట్లా పెండ్లాడుదును అని రాజుగారు చెప్పినారు.నేను బ్రాహ్మణజాతి స్త్రీని అని జరిగిన కధ యంతయూ యేకరువు పెట్టినది. అప్పుడు రాజుగారు ఆమెను దేవేరిగా అంగీకరించిరట. ఆమెకు పుట్టినవాడే అశోక చక్రవర్తి యట. ఈ రెండు కధలు The Nepalese Buddistic Literature అని గ్రంధమున తెలుపబడినవి. ఈ గ్రంధము క్రీ.శ.1882 లో అచ్చూయినది.

మరణం, వారసత్వం

అశోకుడు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అశోకుడు మరణించిన తరువాత మౌర్య వంశం సుమారు యాభై సంవత్సరాల వరకు అలాగే ఉంది. అశోకుడికి చాలా మంది భార్యాపిల్లలు ఉండేవారు అయితే వారి సంఖ్య, పేర్లు మొదలగునవి కాలగర్భంలో కలిసిపోయాయి. మహీంద్రడు, సంఘమిత్ర అనే కవలలు ఆయన నాలుగవ భార్యయైన దేవికి ఉజ్జయినీ నగరంలో జన్మించారు. వీరిని బౌద్ధమత వ్యాప్తికై అశోకుడే ప్రపంచ దేశాటనకు పంపించి వేశాడు. వీరు శ్రీలంకకు వెళ్ళి అక్కడి రాజును, రాణిని మరియు ప్రజలను బౌద్ధమతంలోకి మార్చారు. కాబట్టి వీరు కచ్చితంగా అశోకుడు తర్వాత రాజ్యపాలన చేపట్టి ఉండకపోవచ్చు.

ఇంతకు ముందు ఉన్నవారు:
బిందుసారుడు
మౌర్య చక్రవర్తి
272BC—232BC
తరువాత వచ్చినవారు:
దశరథుడు
మౌర్య వంశపు కాలం
చక్రవర్తిరాజ్యకాల ఆరంభంపరిసమాప్తి
చంద్రగుప్త మౌర్యుడుక్రీ.పూ. 322క్రీ.పూ. 298
బిందుసారుడుక్రీ.పూ. 297క్రీ.పూ. 272
అశోకుడుక్రీ.పూ. 273క్రీ.పూ. 232
దశరథుడుక్రీ.పూ. 232క్రీ.పూ. 224
సంప్రాతిక్రీ.పూ. 224క్రీ.పూ. 215
శాలిసూకక్రీ.పూ. 215క్రీ.పూ. 202
దేవవర్మన్క్రీ.పూ. 202క్రీ.పూ. 195
శతధన్వాన్క్రీ.పూ. 195క్రీ.పూ. 187
బృహద్రథుడుక్రీ.పూ. 187క్రీ.పూ. 185

బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి