విషయ సూచిక
Warangal Srinivas బొడ్డు శ్రీనివాస్ | |
---|---|
మాతృభాషలో పేరు | వరంగల్ శ్రీనివాస్ |
నివాసం |
India ఇండియా పిన్: సెల్: |
జాతీయత | భారతీయుడు |
మతం | హిందూ |
తల్లిదండ్రులు | బొడ్డు నర్సయ్య, లింగమ్మ |
బాల్యం
కమ్యూనిస్ట్ వామపక్ష భావజాలం
అతని అమ్మ, మా మేనత్తలు కూడా జానపదాలను చక్కగా ఆలపించేవారు. దుక్కి దున్నేటప్పుడూ నారు పోసేటప్పుడూ వడ్లు దంచేటప్పుడూ తిరగలి తిప్పేటప్పుడూ జోల పాడేటప్పుడూ.. ఇలా పని జరుగుతున్న ప్రతి చోటా ఊళ్లో పాటలు వినే వాడు. అలాంటి వాతావరణంలో పెరిగానడు. పాట వినడమే కాదు, వాళ్లతో పాటు చిన్నప్పట్నుంచే గొంతు కలిపేవాడు. అలా పాట అనేది అతని జీవితంలో భాగం అయిపోయింది. అతని ఏడోతరగతిలోనే సొంతంగా పాట రాశాడు. రాసిన తొలిపాటకే ప్రథమ బహుమతి వచ్చింది. అప్పట్నుంచి అతని రచనా ప్రస్థానం మొదలైంది. పల్లె జానపదాల బాణీలను తీసుకొని ప్రస్తుత సమస్యలపై సొంతంగా పాటలు రాసేవాడు. అలా 93 అణగారిన జాతులపై పాటలు రాశాడు. కమ్యూనిస్ట్, మావోయిస్ట్, సోషలిస్ట్... ప్రజాకళాకారుడు అయ్యాడు.
ఇతర భాషల్లో పాటలు రాశారు
తెలుగు, బెంగాలీ, అస్సామీ, ఒరియా, లంబాడీ, కోయ, గొండు భాషల్లో ఎన్నో పాటలు రాయడమే కాదు, సొంతంగా పాడేవాడు కూడా[2]...
సినీ గీతరచయిగా
సినీ రచయితగా తొలి అడుగు వేసింది దాసరి నారాయణ రావు గారి చిత్రం ద్వారానే. ‘అడవి చుక్క’ చిత్రంలో ‘తయ్యుందత్తై.. తయ్యుందత్తై అతడు రాసిన తొలి పాట. అదే సినిమాలో అతడు రాసిన ‘ఎవరు అన్నారమ్మ మేమూ... గరీబోళ్లనీ’ పాటైతే పెద్ద హిట్. అలాగే దాసరిగారి ‘చిన్నా’ చిత్రంలో అతడు రాసిన ‘గువ్వా గువ్వా ఎగిరేటి గువ్వా ఏడికే సిరిసిరి మువ్వా’ పాట విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్.నారాయణమూర్తి కూడా అతడు ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చలో అసెంబ్లీ, వేగుచుక్కలు, ఊరు మనదిరా, అడవిబిడ్డలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, అమ్మమీద ఒట్టు చిత్రాలతోపాటు ‘నిర్భయభారతం’ చిత్రానికి కూడా పాటలు రాశాడు. ఇందులో అడవిబిడ్డలు, వీరతెలంగాణ చిత్రాల్లో నటించాడు కూడా. ఎర్ర సినిమాలే కాక, ఫూల్స్, ఆయుధం, ఈ వయసులో, రెండేళ్ల తర్వాత, రఘుపతి లాంటి వాణిజ్య చిత్రాలక్కూడా పాటలు రాశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి