మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు ముద్రగడ పద్మనాభం చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.
Mudragada Padhamnabham/ముద్రగడ పద్మనాభం చరిత్ర గురించి.
ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు గతం లో కాంగ్రెస్ , తెలుగు దేశం పార్టీ లకు పనిచేసి , 2014 నుండి ఏ పార్టీ లోనూ చేరకుండా పార్టీ రహితం గా తను పుట్టిన కాపు కులం కోసం , దాని అభ్యున్నతి కోసం పాటు పడుతున్న నాయకుడు , ఈయన తూర్పు గోదావరి జిల్లా కు చెందినా రాజకీయనాయకుడు.
జీవిత విశేషాలు
తండ్రి వారసత్వం
ముద్రగడ తండ్రి - వీరరాఘవరావు కూడా ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు. - ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నిరుపేద దళితులే వెంటఉండి గ్రామాలలోకి తీసుకుని వెళ్లేవారు. ఆయన జీవిత కాలమంతా నిరుపేదలకు ఏదో ఓ మేరకు ఉపశమనం కలిగించడం కోసమే కృషి చేశారు. కాపు కుల భుజకీర్తులను ఆయన తగిలించుకోలేదు.
రాజకీయ ప్రస్థానం
భారత రాష్ట్రపతిగా చరితార్థులైన నీలం సంజీవరెడ్డి గారికి అత్యంత అభిమానపాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం పాలుకావడంతో నీలం వారి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. ఆవిధంగా మొదలైన ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం 37 ఏళ్ల తరువాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎటువైపు ప్రయాణిస్తున్నదో ఆయన అభిమానులకు సైతం అర్థం కావడం లేదు. ఈ ముప్పయి ఏడు సంవత్సరాలలో మూడుసార్లు శాసనసభ్యుడిగా... ఒకసారి ఎంపీగా... రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
మొండితనం
తాను రాజకీయాలను వృత్తిగా స్వీకరించి. సామాన్య ప్రజల క్షేమము కోసము ఎవరిని లెక్క చెయ్యకుండా , ప్రజా క్షేమమే తన ఊపిరిగా బతుకుతున్న వ్యక్తి ముద్రగడ పద్భానాభం గారు . ఈయన ఎవరికీ తెలియని ఓ విలక్షణ ‘ముద్రగడ పద్మనాభం మావాడు’ అని ఏ రాజకీయపార్టీ కూడా చెప్పుకోలేని పరిస్థితి. పోనీ ‘నాది ఫలానా పార్టీ’ అని ముద్రగడ సైతం చెప్పుకోలేని స్థితి. .ఆయన ఒక ఏక వ్యక్తి సైన్యం.
కాపు వర్గంలో
1988లో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తరకంచి పోలీసులు లోపల వేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం స్టేషనకు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషనలోకి రానివ్వలేదు. దాంతో స్టేషన ముందు బైఠాయించారు. టెంట్లు వేశారు.5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనబడలేదు. 5వ రోజు సాయంత్రం ‘ఆమరణ దీక్ష’ ప్రకటించారు. దీనితో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తరకంచి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఒక అడుగు వెనక్కివేసి ఉత్తరకంచి పోలీసులు అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించారు. లేకపోతే ఓ పదిమందికి తక్కువ కాకుండా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయే వారు. ఎన.టి.రామారావు అంతటి మొండి ఘటం వెనక్కి తగ్గేలా పద్మనాభం వ్యవహరించారంటూ రాష్ట్రవ్యాప్తంగా కాపు వర్గంలో పద్మనాభం పేరు మోగిపోయింది. అప్పటి వరకు ఆ ప్రాంతపు బీసీలు, దళితుల ఆరాధ్య దైవంగా ఉన్న ముద్రగడ చూపు. స్వకులం వైపు మళ్లింది. ఆ సభలకు.. సమావేశాలకు వెళ్లడం.. ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో నియోజకవర్గం ఆయన చేతుల్లోంచి జారిపోయింది. ఇక అక్కడి నుంచి నేల విడిచి సాము చేసే రాజకీయాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు. 1994లో పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రి. పద్మనాభంలోని నిజాయితీ, మొండితనం, గమనించి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో (జీవో నం. 30) జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. తరువాత డివిజన బెంచ సమర్థించింది. అది ఆ తరువాత చంద్రబాబు ముక్యమంత్రిగా ఉన్న కాలములో ఏమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాని జాడ లేదు, ఆ విదముగా కాపు రిజర్వేషన్ ఫైల్ ను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంది తొక్కిపెట్టి, దానికి కాల హరణం చేసి, అమలుకు నోచుకోకుండా చేసారు .
ఓటమి
1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనైనారు. మరి ప్రత్తిపాడు నియోజకవర్గంలో దళితుల, బీసీల ఓటర్లు ఎక్కువ కదా! ప్రత్తిపాడు నుంచి జన్మలో పోటీచేయనని ప్రకటించారు. 2009లో వై.ఎస్. ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేశారు.తను నమ్ముకున్న జాతి తనకు వోటు వెయ్యకుండా ఆయనను వెన్నుపోటు పొడవడం వలన ఆయనకు ఫలితం దక్కలేదు. 2014 వచ్చే సరికి ఆయనకు ఏ పార్టీ నుండి ఆహ్వానము రాలేదు. దానితో ఇండిపెండెంట్‌గా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మరలా నమ్మిన కాపు కులము వెన్నుపోటు పొడవడము వలన ఆయన ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభం గారును కొంతమంది కాపు సోదరులు, దిక్కుమొక్కు లేకుండా ఉన్న కుల సంక్షేమముకు ఆయన మించిన నాయకుడు లేడు అన్న వాస్తవాన్ని గమనించి ఆయనలోని కులము కోసము అయన పడుతున్న తపన చూసి, ‘కాపు ఉద్యమం’ను ముందుకు తీసుకుని వెళ్ళమని కోరిన మీదట పుట్టిన జాతి ఋణము తీర్చుకొనుటకు, ఆయన మరలా ఉద్యమమును భుజాలకు ఎత్తుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న లెక్కచెయ్యని దీరత్వము కలవాడు .
కాపు ఉద్యమం
2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభను సభలా కాకుండా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి.కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్బనాభం గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న TDP ప్రభుత్వ విధానాలు, తన జాతిని తొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలను గమనించి ఒక్కసారిగా రూటు మార్చారు. ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చినవారిని రోడ్లు - రైళ్ల రోకోలకు పిలుపు ఇచ్చారు . దీంతో సభకు వచ్చినవారంతా రోడ్లు - రైళ్ల రోకోలకు అక్కడి నుంచి బయలుదేరారు. కాపులను బీసీల్లో చేర్చేవరకు తమ ఉద్యమం ఆగదని చెప్పిన ఆయన అందుకు అవసరమైన జీవోలు ఇచ్చేవరకు రాస్తారోకో - రైళ్ల రోకోలు చే్ద్దామని పిలుపునిచ్చారు. అయితే... బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది ఆయన హైవేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి బయలుదేరారు. అంతే చాలా విధ్వంసం జరిగింది. సీనియర్ నేత అయిన ముద్రగడ ఇలా అకస్మాత్తుగా కార్యాచరణకు దిగడం బాగానే ఉన్నది, కాని యువకులు ఎక్కువగా ఉన్న కాపులలో ఆవేశము అందోళనగా మారి విధ్వంసానికి దారితీసింది.
Prabhakargoud Nomula నోముల ప్రభాకర్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి